సందర్భాలు అలంకరించుకొని రావు

శ్రీ వల్లభ గణపతయే నమః
శ్రీ అంకాళ పరమేశ్వరీ నమః
ఓం గురువే శరణం

అయ్యర్ మలై మహిమ

ప్రపంచంలో అత్యంత మహామేరువు లాంటి స్వయంభు లింగమూర్తి శ్రీ అరుణాచలేశ్వరుడే. ఆ స్వయంభుమూర్తి ప్రపంచ ప్రజల కోరికలను తీర్చేందుకు, వారిని ఆధ్యాత్మిక పరంగా సమున్నతస్థితికి చేర్చేందుకు పలు భాగాలుగా విడివడి పలు ప్రాంతాలలో పలు నామ రూపాలలో అవతరించారు.

అలాంటి స్వయంభు మూర్తులలో అత్యంత ప్రాధాన్యత కలిగినది తిరుచ్చి సమీపంలో వేంచేసిన శ్రీ రత్నగిరీశ్వరులు కొలువై వున్న అయ్యర్‌ పర్వత క్షేత్రం.

మన గురువరేణ్యులైన శ్రీలశ్రీ వెంకటరామ స్వామివారు, మన గురువుల గురునాధుడు శివ గురుమంగళ గంధర్వులైన శ్రీలశ్రీ ఇడియాప్ప సిద్ధ స్వాముల వద్ద గురుకుల వాసం చేస్తున్నప్పుడు శ్రీ రత్నగిరీశ్వరుల మహిమలను తెలుసుకునే మహదవకాశం పొందారు.

ఆ మహిమల బాంఢాగారంలో కొన్నింటిని ఆధ్యాత్మిక భక్తులందరు తెలుసుకునే విధంగా శ్రీఅరుణాచలేశ్వరుని కృపాకటాక్షములతో సమర్పిస్తున్నాం.

బ్రహ్మదేవుల శాపవిమోచనం

భూమ్యాకాశాల నంటుతూ నిటారుగా నిలిచిన ఆ పరమేశ్వరుడి ఆద్యంతాలను కనుగొనడంలో ఓటమిపాలయ్యారు. అయితే బ్రహ్మదేవుడు తన ఓటమిని అంగీకరించలేక తాను ఆ పరమేశ్వరుడి జటాజూటాన్ని దర్శించినట్లు అసత్యమాడారు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని ఆ మహాశివుడి వద్ద శరణుజొచ్చి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం పొందాలని అనుకున్నారు.

శ్రీ అరుణాచల పర్వతంలోని ఆది అరుణాచల పర్వతంగా భాసిస్తున్న ప్రాంతంలో (ప్రస్తుతం అడి అన్నామలై అని పిలుస్తున్నారు.) శివలింగం ప్రతిష్ఠించి పలుకాలాలపాటు ఆరాధించసాగారు. తను చేసిన తప్పిదానికి చింతించి పరమేశ్వరుడిని ప్రార్థించసాగారు. ఈ ఆరాధనలు బ్రహ్మదేవుడికి సంతృప్తిని కలిగించలేదు. కనుక అరుణాచల పర్వతాన్ని ప్రదక్షిణ చేసి ప్రాయశ్చిత్తం పొందటానికి ప్రయత్నించారు. పలు యుగాలపాటు గిరిప్రదక్షిణ చేసిన మీద ఓ శుభదినాన పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'ఓ చతుర్ముఖా! అయ్యర్‌ పర్వత క్షేత్రానికి వెళ్లు! ఆ చోట అరుణాచల గిరిప్రదక్షిణకుగాను నీకు ప్రాయశ్చితం కలిగిస్తాను! నీ వలన ఐయర్‌ పర్వతం రత్నగిరి మహిమలు మహత్యాలు లోకమంతటా విస్తరిస్తాయి' అని అశరీరిగా పలికారు.

పరమేశ్వరుడి మాటలకు సంతసించిన బ్రహ్మదేవుడు ఐయర్‌ పర్వత క్షేత్రాన్ని చేరుకున్నారు. రత్నగిరిలో (అయ్యర్‌ పర్వతం) ప్రస్తుతమున్నట్లుగా ఆ కాలంలో కొండపైకి ఎక్కడానికి మెట్లు ఉండేవి కావు. చాలా శ్రమపడి కొండపైకి చేరుకుని అక్కడ కొలువుదీరినట్టి పంచ మహాసిద్ధపరుషులను దర్శించి వారి అపారమైన ఆశీస్సులను అందుకున్నారు.

పరమేశ్వరుడి వద్ద అసత్యమాడి, తాను పొందిన శాపాన్ని వివరించి, ఆ శాపవిమోచనానికి తగిన పరిహార ఉపాయమేదో తెలుపమని వేడుకున్నారు.

పంచ మహా సిద్ధులు ఎవరు?

అయ్యర్‌ పర్వతశిఖరంపైన గల పుష్కరిణిలో ఈ పంచ మహాసిద్ధులు అనే అద్భుత సిద్ధపురుషులు వసిస్తున్నారు.

1. పంచముఖ సురేశ్వర సిద్ధుడు
2. చతుర్ముఖ సురేశ్వర సిద్ధుడు
3. త్రిపలాధర సురేశ్వర సిద్ధుడు
4. స్కంత పదుమ ఫలాది సిద్ధుడు
5. త్రిమధుర నీట్రు మునీశ్వర సిద్ధుడు
ప్రపంచంలోని ప్రజలందరి సంక్షేమం కోసం సదా సర్వకాలమూ శ్రీరత్నగిరీశ్వరుడి వద్ద ప్రార్థిస్తుండే ఈ పంచ మహా సిద్ధుల దర్శన భాగ్యానికి నోచుకునే స్థాయిలో కలియుగంలోని ప్రజలు పవిత్రమైన మనస్సు, దేహశుద్ది, మానసికి స్థితిని కలిగి ఉండటం లేదు. అయినా ఈ ఉత్తములైన సిద్ధ పురుషులు వసించే కొలను తీర్థపు జలాలను శిరస్సుపై, దేహంపై చల్లుకోవటంతోపాటు ఆ జలాలను సేవిస్తే ఎన్నో జన్మల కర్మ ఫలితాలనుండి బయటపడగలం. కనుక అత్యంత పవితమ్రైన ఈ కొలనులో తమ పాదాలను మోపకుండా తీర్థపు జలాలను వినియోగించుకోవాలి. ఇంతటి మహత్తు కలిగిన ఈ తీర్థపు జలాలతో రత్నగిరీశ్వరునికి అమ్మవారికి అభిషేకం చేయడం అరుదైన భాగ్యం.

ఈ పంచ మహా సిద్ధపురుషులకు గురువుగా ఉన్న ఆరుముగ సురేశ్వర సిద్ధుడు కూడా సిద్ధ పురుషులే. సంపూర్ణమైన స్వచ్చతతో, మానవాళికి అందని తపఃశక్తిని కలిగినవారే ఆరుముగ సురేశ్వర సిద్ధులు.

పిడుగును భరించే సిద్ధులు

పన్నెండేళ్లకోమారు దేవేంద్రుడు శ్రీ రత్నగిరీశ్వరునికి పిడుగుల ద్వారా ప్రత్యేక పూజలు నిర్వహించటం ఆనవాయితీ. ఓ పిడుగు పడితేనే కోటానుకోట్ల వృక్షాలు, వనాలు ఓ క్షణంలో కాలి బూడిదవుతాయి. అలాంటి శక్తివంతమైన పిడుగులను సైతం ఎదుర్కొనగల శక్తిని కలిగి ఉన్నవారంటే ఆ సిద్ధపురుషుని శక్తి సామర్థ్యాలను మనం లెక్కగట్టగలమా?

పిడుగును ఎందుకు భరించాలి?

ప్రజలు చేసే తప్పిదాల వల్ల సామాన్యమైన, కఠోరమైన పాపాలకు గురవుతుంటారు. కఠోరమైన పాపాలకు శిక్ష కూడా కఠినంగానే ఉంటుంది కదా? ఆ శిక్షను భరించగల శక్తి పామరులైన ప్రజలకు ఉండవనే దీర్ఘదృష్టితోనే ఆరుముగ సురేశ్వర సిద్ధులు ఆ పాపాలన్నింటినీ తానే భరిస్తుంటారు. దేవేంద్రుడు శ్రీరత్నగిరీశ్వరుడికి పిడుగులతో చేసే పూజలను భగవంతుడిని అనుమతిని పొంది తన దేహంలో వాటిని చేర్చుకుని ప్రజల పాపాలను మెరుపు జ్వాలలతో భస్మం చేస్తుంటారు. ఆహా ఎంతటి త్యాగశీలమిది!

సిద్ధుల వల్ల ప్రసరించే కరుణాకటాక్షాలు మానవు మేధస్సుకు అందనివి. తల్లి కరుణకంటే వెయ్యిరెట్లు అధికమైనది. ఇంతటి మహత్తుకలిగిన సిద్ధపురుషులను సేవించడానికే బ్రహ్మదేవులు ఈ క్షేత్రానికి విచ్చేశారు.

పంచ మహా సిద్ధులు శ్రీరత్నగిరీశ్వరుడి అద్భుతాలను బ్రహ్మదేవుడికి సవివరంగా తెలియజేశారు. రత్నగిరిలో కార్తీక దీపాలను వెలిగించటం వల్ల కలిగే మహత్తును గురించి వివరించారు. ఆ జ్యోతులే సకల పాపాలను హరిస్తాయని బ్రహ్మదేవుడు గ్రహించారు.

పంచ మహాసిద్ధులు నుడివినట్లు బ్రహ్మదేవుడు రత్నగిరిలో (అయ్యర్‌మలై)లో దీపం వెలిగించి శ్రీరత్నగిరీశ్వరుడిని నియమనిష్టలతో సేవించటంతో శాపవిమోచనం పొంది సకల సౌభాగ్యాలను పొంది తన స్వస్థలానికి చేరుకున్నారు.

బ్రహ్మదేవుడి తర్వాత ఎందరో మహారాజులు సిద్ధులు సూచించిన రీతిలో తమ గురుదేవుల అనుగ్రహం పొంది దీపపూజలను నిర్వహించి తమ రాజ్యాలలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా ప్రార్థనలు సల్పిన పవిత్ర క్షేత్రమిది.

రాజులు అంతరించిన తర్వాత రత్నగిరిలో అఖండ దీపం వెలిగించే ఆచారం కనుమరుగైంది. మానవ సేవే మహేశ్వరుడి సేవ అని భావించి అద్భుతమైన సేవలను అందించే శ్రీగురు మంగళ గంధర్వులు శ్రీలశ్రీ వెంకటరామ స్వాములు ప్రజల సహాయ సహకారాలతో యువ నామ సంవత్సరం 1995లో అయ్యర్‌మలైగా కీర్తింపబడే రత్నగిరిపై పంచమహాసిద్ధులు రూపొందించిన విధంగా మహాదీపాన్ని వెలిగించారు.

శ్రీగురుమంగళ గంధర్వుల ఆదేశానుసారం శ్రీలశ్రీ లోభామాతా అగస్త్య ఆశ్రమ నిర్వాహకులు యువనామ సంవత్సరంలో ప్రజల సహకారంతో కార్తీక దీపాన్ని వెలగించి శ్రీరత్నగిరీశుడి కరుణాకటాక్షాలు సర్వజనావళికి అందించారు.

భారీ పరిమాణంతో కూడిన కొబ్బరెను ఆ కొండపైకి ఎక్కించి అందులో స్వచ్ఛమైన నేతిని, నువ్వుల నూనెను, కొబ్బరి నూనెను పోసి సుమారు ఐదు రోజులపాటు దీపం వెలిగేలా తగు సన్నాహాలు చేపట్టారు. అయ్యర్‌మలై సమీపవాసులే కాక పరిసర గ్రామాలలో ఉన్న ప్రజలంతా ఆ మహాదీపాన్ని తిలకించి పునీతులయ్యారు.

1995లో ప్రారంభమైన అయ్యర్‌ మలై కార్తీక మహాదీపోత్సవం ఆ భోళాశంకరుడి అపారమైన కరుణచేత, గురువులు అనుగ్రహం చేత ప్రతియేటా నిరాటంకంగా నిర్వహించబడుతున్నాయి. పాఠకులందరూ తప్పకుండా కార్తీక దీపం రోజున అయ్యర్‌మలైకి వెళ్లి తమకు తోచిన రీతిలో సాయమందించి సేవలందించి శ్రీరత్నగిరీశ్వరుడి ఆశీస్సులందుకోమని అభ్యర్థిస్తున్నాము.

పలు యుగాలకు మునుపు శ్రీరత్నగిరీశ్వరుడి ద్వారా బ్రహ్మదేవుడు పొందిన కృపాకటాక్షాలను ఈ కలియుగంలోనూ సర్వ మానవాళికి అందిస్తున్న శ్రీ గురుమంగళ గంధర్వులవారికి కృతజ్ఞతలు తెలుపుకోవటం మాటలతో వర్ణింపశక్యమా?

రత్న గిరి ఆవిర్భావం

పరమేశ్వరుడి నివాసస్థలమైన కైలాసంలో 'నడిమికొండ' అనే పర్వత ప్రాంతమున్నది. ఆ పర్వతంపై ఎందరో మహర్షులు తపమాచరించి ఆ కైలాసానికి మరింత శోభను చేకూర్చారు. అంతటి విశిష్టమైన 'నడిమికొండ'ను భూలోకవాసుల దరికి చేర్చి వారిని పవిత్రులనుగా చేయాలని ఆ మహర్షులు సంకల్పించారు. ఆ మహర్షుల సత్సంకల్పాన్ని యెరింగిన మహేశ్వరుడు అనుమతినిచ్చారు. ఆ మేరకు భూలోకాన అనువైన స్థలాన్ని ఎంపిక చేయమంటూ మహర్షులను పురమాయించారు.

ఈ భూలోకంలో తలంచినంత మాత్రానే కార్యసిద్ధిని అందించగల క్షేత్రాలెన్నో ఉన్నాయి. ఒక్కో క్షేత్రంలో ఒక్కో విధమైన కార్యసిద్ధి కలుగుతాయి. ప్రస్తుతం రత్నగిరి ఉన్న ప్రాంతాన్ని కార్యసిద్ధిని అందించే క్షేత్రంగా మహర్షులు ఎంపిక చేసి, ఆ విషయాన్ని మహేశ్వరుడికి తెలియజేశారు.

అంతటితో ఆగకుండా దేవలోకంలో 'రత్నపు శిలలు' అనే అత్యద్భుతమైన శిలలు ఉన్నాయి. ఆ రత్నపు శిలలనే ఆ జంగమయ్య తమ కాలి బొటనవేళ్లలో ఆభరణాలుగా ధరించి ఉన్నారు. రత్నపు శిలలతో తయారైన ఆ కాలి కడియాన్ని కూడా భూలోక వాసుల దరిచేర్చమని వేడుకున్నారు మహర్షులు.

లోక సంక్షేమార్థం హాలాహలాన్ని సైతం ఆరగించిన నీలకంఠుడు కదా! మహర్షులు కోరికను మన్నించకుండా ఉంటాడా? మహర్షుల మాటను మన్నించిన మహాశివుడు అద్భుతమైన ఆ కడియాన్ని విసరివేయగా, ఇదివరకే వారు ఎంపిక చేసిన స్థలంలో పడింది. భూలోకంలో పడిన ఆ అద్భుత కడియంపైనే 'నడిమికొండ' నిర్మించమంటూ ఆదేశించారు.

కైలాసం పుడమి మీదికి వస్తే భూదేవి దానిని భరించగలదా? కనుకనే ఆ నడిమికొండ బరువును మహర్షులు తమ తపఃశక్తుల చేత పూర్తిగా తగ్గించి తేలికైన పర్వతంగా మార్చి భూలోకానికి తీసుకువచ్చి శివుడి రత్నశిలా కడియంపై అమర్చారు.

తదుపరి నడిమికొండపై ఓ శివలింగాన్ని ప్రతిష్టించాలనుకున్నారు. అయితే నడిమికొండను అమర్చిన మరుక్షణమే మహేశ్వరుడి కడియం ఆ పర్వతాన్ని అధిగమించేంతటి ఎత్తుకు ఎదిగి పోయి స్వయంభు లింగంగా, స్వయంభు మూర్తిగా శ్రీరత్నగిరీశ్వరుడిగా అవతరించింది. దేవతలు పూలవర్షాలు కురిపించారు. అండ చరాచరములలో ఉన్న మహర్షులు, రుషులు, దేవాది దేవతలంతా రత్నగిరీశ్వరుడిని దర్శించి ఆనందభాష్పాలు రాల్చారు.

అయ్యర్‌మలైలో రత్నగిరి లింగమూర్తి పదునుదేలిన లింగాకారంలో అవతరించారు. భూమి నుండి ఆ పర్వతాన్ని చీల్చుకునే బయల్పడేందుకు అనువుగా కొసదేలిన ఆకారంతో ఉన్నారు. రత్నమంటే అమూల్యం కదా. అలాంటప్పుడే దేవలోకంలోనే లభించగల రత్నపు శిలలతో తయారైన కడియమే ఈ క్షేత్రంలో మహాశివుడిగా ఆవిర్భవించాడు. కోటానుకోట్ల రత్నాల వలన కలిగే శుభాలెన్నింటినో అందించగలిగే బాణలింగంగా రత్నగిరి మహేశ్వరుడు దర్శనమిస్తున్నారు.

సిద్ధులకు మాత్రమే తెలిసిన ఆ రత్నపు శిలల రహస్యాలను కలియుగవాసులకు సైతం ఎరుకపరిచే అరుదైన సేవలను అందిస్తున్నారు శ్రీలశ్రీ వెంకటరామ స్వామిగా ఉన్న గురు మంగళ గంధర్వులు.

రత్నగిరీశ్వరుల దర్శన మహిమ

అమూల్యమైన రత్నపు శిలలతో తయారైన శివలింగంగా రత్నగిరి మహేశ్వరుడు కొలువుదీరి ఉండటంతో అంతటి అమూల్యమైన రత్నములన్నింటిని ఒకే చోట దర్శించిన మహద్భాగ్యాన్ని పొందగలము. భూలోకవాసుల కళ్లకు రత్నగిరి ఓ శిలా పర్వతంగానే అగుపడినా, సిద్ధులకు, మహాపురుషులకు, ఋషులకు రత్నగిరిని దర్శించే సమయంలో ఆ రత్నగిరి నుండి కళ్లుజిగేల్‌ మనిపించే రీతిలో రత్నపు కాంతులు విరజిమ్ముతుంటాయి. ఆ కాంతులే మహాశివుడిని దర్శించేవారిపై ప్రసరించి వారిలో దైవీకమైన ఆధ్యాత్మిక భావాలను కలిగించి మహోన్నత స్థితికి తీసుకెళతాయి.

రాజలింగం

రత్నగిరిలోని లింగమూర్తి 'రాజలింగం' అని పిలుస్తుంటారు. సామాన్యుడు రత్నగిరీశుడిని దర్శిస్తే చాలు మహాశివుడి కరుణాకటాక్షముల ద్వారా రాజవైభోగాలను పొందగలుగుతారు. మరి రాజులు దర్శిస్తే రాజాధిరాజులవుతారు. చిన్న పదవులు కలిగినవారు పదోన్నతులు పొందుతారు. పెద్దపదవులలో ఉన్నవారు సైతం కీర్తి ప్రతిష్టలను పొందుతారు. సాధారణ సన్న్యాసి సాధుపుంగవుడిగా మారుతారు. సామాన్య వైద్యుడు వైద్యనిపుణుడిగా మారుతారు. సామాన్య వ్యాపారి కూడా వాణిజ్య ప్రముఖుడవుతారు. సాధారణ రైతు సైతం పెత్తందారుడవుతారు.

మరి అలాంటప్పుడు రాజలింగాన్ని దర్శించే చోరుడు గజదొంగగా మారుతాడా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. సాదాసీదా దొంగ నుండి గజదొంగ వరకు ఈ మహేశ్వరుడిని దర్శించుకుంటే చోరవృత్తికి స్వస్తి చెప్పి మంచివారుగా మనగలుగుతారు. ఇంతటి మహోన్నత శక్తిని మనమెక్కడ చూడగలం?

రత్నగిరి భూలోకానికి రాక మునుపు భూమిపై రత్నాలు ఉండేవి కావు. అన్ని రకాలయిన రత్నాలూ ఈ రత్నగిరీశుడి నుండే పుట్టాయి. కనుకనే దోషపూరితమైన రత్నాలు ధరించటం వల్ల కష్టాలపాలయ్యే ప్రజలంతా రత్నగిరీశ్వరుడిని దర్శించి దోషపరిహారాలను పొందవచ్చు. దోషమున్న రత్నాలను రత్నగిరీశుడి పాదాల చెంత ఉంచి అభిషేక ఆరాధానలు చేసి, ఆలయ ప్రదక్షిణ చేసి పూజిస్తే రత్న దోషాలన్నీ పటాపంచలవుతాయి.

రత్నాల వ్యాపారులకు అనువైన పుణ్యక్షేత్రమే రత్నగిరి క్షేత్రం! నియమనిష్టలతో ఈ మహేశ్వరుడిని ప్రదక్షిణం చేసి పూజిస్తే తమ వ్యాపారాలలో ఉన్నతస్థితికి చేరుకోగలుగుతారు.

వృత్తి వ్యాపారాలలో, పదవులలో ఉన్నత స్థితిని పొందాలనుకునే అందరికీ వరాలను అందించే వర దేవతగా రత్నగిరీశ్వరుడు కొలువై ఉన్నారు.

గిరి ప్రదక్షిణ మహిమ

రత్నగిరి ప్రదక్షిణకు అనువైన దినాలు :
1. పంగుణి ఉత్తిరం
2. తైపూసం
3. మహాశివరాత్రి
4. కార్తీక దీపం
5. (అ) త్రయోదశి
(ఆ) కార్తీక సోమవారాలు
(ఇ) తిరువాదిరై నక్షత్రం
(ఈ) మార్గశిర మాసం (తిరువెంబావైని కీర్తిస్తూ గిరి ప్రదక్షిణ చేయడం శుభప్రదం)
(ఉ) భక్తుల జన్మనక్షత్రపు దినాలు
(ఊ) పితృదేవతల పుణ్య తిథులు
6. కొందరి జాతకాల్లో సూర్యుడు నీచస్థితిలోనో లేక తక్కిన పాప గ్రహాల ప్రభావితులై ఉంటే సూర్యదోషాలు కలుగుతాయి. అలాంటి కష్టాల నుండి బయటపడేందుకు ఆదివారాలలో ఈ గిరి ప్రరదక్షిణ చేసి పరిహారం పొందవచ్చు
7. సూర్యుడు ప్రతి రాశిలో ప్రవేశించే రోజులు
ఇవి కాకుండా వ్యక్తిగత కార్యసిద్ధికి కోసం గిరి ప్రదక్షిణలు చేసే పద్ధతులు, అద్భుతమైన రోజులు కూడా ఉన్నాయి. ఈ పద్ధతులను గురించి వారి గురువుల ద్వారా తెలుసుకోవచ్చు.

క్షేత్ర మహాత్మ్యం - చంద్ర భగవానుడు

ఈ దివ్యక్షేత్రంలో చంద్రభగవానుడు సూర్యభగవానుడికి ధీటైన సమానస్థాయిలో ఉంటున్నారు. ఇంతటి అరుదైన స్థితిని మరేక్షేత్రంలోనూ చూడలేము. సాధారణంగా ఏకపత్నీ సమేతుడిగా దర్శనమిచ్చే చంద్రభగవానుడు ఈ చోట తిరుఓణం, తిరు ఆదిరై అనే ఇద్దరు దేవేరుల సమేతుడై అనుగ్రహ మూర్తిగా కనువిందుచేస్తుంటారు. శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రమే తిరుఓణం (శ్రవణ నక్షత్రం), ఇక మహాశివుడికి ప్రీతికరమైన నక్షత్రం తిరువాదిరై. ఇలా అనన్య అద్భుతమైన ఇద్దరు దేవేరుల సమేతుడై చంద్రభగవానుడు భక్తులను అనుగ్రహిస్తున్నారు.

శరభేశ్వరులు, నరసింహుడు, ఉగ్రహ ప్రత్యంకరులు, మాలినీ, శూలినీ, కాళి వంటి ఉగ్రమూర్తులు ఉపాసకులు పూజా నియతులలో ఉత్తమ స్థితిని పొందగలుగుతారు. తిరు ఓణం, తిరువాదిరై దేవేరుల సమేతుడైన కొలువైన చంద్రభగవానుడిని దర్శించి శాంతి పూజా ఫలితాలను సైతం పొందవచ్చు.

సోమనాధుడు

రత్నగిరీశుడి అనుగ్రహ ఆదేశానుసారం ప్రతిష్ఠ చేయబడిన ప్రతిష్ఠామూర్తి సోమనాధుడు. భవిష్యత్‌లో చంద్రగ్రహ దోషాలు అధికమవుతాయని భావించిన చంద్రభగవానుడు కలియుగ వాసులందరికీ శుభాలను అందించేందుకు రత్నగిరిలో సోమనాధుడిని ప్రతిష్ఠించి ఆరాధించి తేజోశక్తిని, అన్ని రకాల సిద్దులను పొందగలిగారు.

ప్రస్తుతం ఈ స్థలం నిరాదరణకు గురియైనా, సిద్ధులు తరచూ వాసం చేసే పుణ్యస్థలంగా కీర్తింపబడుతోంది. సిద్ధ మహాపురుషులు ఈ స్థలంలో సంచరిస్తూ కలియుగవాసుల కష్టాలను తీరుస్తున్నారు.

పూజా విధానాలు

ఈ క్షేత్రంలో రత్నగిరీశుడు కరుణామూర్తిగా, అతితీక్షణ్య మూర్తిగా భాసిల్లుతున్నారు. అడగక ముందే అన్ని సౌభాగ్యాలను అందించే కరుణాసముద్రుడాయన! ఇంతటి విశిష్టతలు కలిగిన ఆ మహేశ్వరుడిని ఎలా పూజించాలి? సిద్ధపురుషులు రూపొందించిన పూజా విధానాలను పరిశీలిద్దాం.

1. రత్నగిరిలో సుమారు 1200 నుండి 1500 దాకా దేవాసురులు మెట్లపై సూక్ష్మరూపంలో ఆశీనులై భక్తులను అనుగ్రహిస్తున్నారు. రత్నగిరిలో ఈ దైవాసురుల అనుగ్రహం పొందాలంటే భక్తులు ఏదైనా దైవనామాన్ని (శివాయనమః, మహాదేవా, రామా, మురుగా -వంటివి) వల్లిస్తూ ఒక్కో మెటుపై నెమ్మదిగా కాలిడి పైకి వెళ్లాలి. ఏదైనా ఓ మెట్టుపై కాలిడక పోయినా ఆ మెట్టుపైని దైవాసురుడి అనుగ్రహం పొందలేకపోతారు.

2. ప్రతి మెట్టుపైనా ముగ్గులు వేయాలి. వీలయితే పసుపు, కుంకుమ, పుష్పాలతో అర్చిస్తూ వెళ్ళటం శుభప్రదం.

రత్నగిరిపైని 1500 మెట్లలో మూడు మెట్లు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నవి. ఆ మూడు మెట్లు గురించి తెలుసుకుందాం:

(అ) ఎన్నో తలంపులు కలిగినవాడే మానవుడు. తలంపులు, ఆలోచనలు లేని మానవుడే లేడు. ఆ తలంపులు మంచివై లేదా చెడువై ఉంటాయి. సంచలనమైనవిగాను ఉండవచ్చు. ఎల్లవేళలా ఇలాంటి తలంపులు కలిగినవాడే మానవుడు. 'ఇలాంటి మానవుడు తనపై పాదం మోపి అధిరోహిస్తున్నప్పుడు అతడిలోని సంచలనమైన తలంపులను రూపుమాపి కరుణించటమే తన ప్రధాన కర్తవ్యం'గా భావించి మహా తపస్సు చేస్తున్న 'ఫల్గుణ చిత్రాసురుడు' అనే దైవాసురుడు ఓ మెట్టుపై కొలువుదీరి ఉన్నారు.

(ఆ) మానవుడి తలంపులలో ఏవి చెడ్డవి ఏవి మంచివి అని ఇతమిత్థంగా తేల్చుకోలేడు. ఏ తలంపు మంచిదని భావించి దానిని ఆచరిస్తాడో భవిష్యత్తులో దాని ద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటాడు. కనుకనే మంచిచెడులు తెలుసుకోలేని మనిషి తనపై పాదం మోపినపుడు అతడికి అనువైన మంచి తలంపులను అందించటమే తన కర్తవ్యమని వలత్రాయ పులిచంద్రసురుడు అనే దైవాసురుడు ఈ మెట్లలోనే కొలువై ఉన్నాడు.

(ఇ) మానవుడంటేనే తలంపులు కలిగినవాడే. అవి మంచివిగానో చెడ్డవిగానో ఉండవచ్చు. వాటివల్ల కలిగే ఇడుములను అతడు అనుభవించాల్సిందే మరి! వీటికి భగవంతుడు బాధ్యత వహించడు. మానవుడు ప్రస్తుతమున్న దుస్థితికి చింతించి ప్రయోజనం లేదు. పుట్టిన ప్రతి మనిషికీ మరణం తప్పదు. అందరూ ఆత్మలోకానికి సాగిపోవాల్సినవారే! కనుక ఈ మెట్టుపై కాలుమోపినవారందరికీ వారి మరణానంతరం ఆత్మశాంతి కలిగించగల వరాన్ని మహేశ్వరుడి ద్వారా పొంది కల్పాంతరాయ బహుదాసురుడు అనే దైవాసురుడూ ఇక్కడే కొలువై ఉన్నారు.

మెట్లపై దీపారాధన

ప్రతి మెట్టుపైనా దీపం వెలిగిస్తే కలిగే ఫలితాలు అపారం.

ఈ దీపారాధనకు అనువైన దినాలు :
1. దీపావళి
2. కార్తీక దీపం
1500 మెట్లన్నింటిపైనా దీపాలు వెలిగించలేనివారు వారి శక్త్యానుసారం కొన్ని మెట్లపైన దీపాలు వెలిగించి రత్నగిరీశుడి కరుణాకటాక్షాలను పొందవచ్చు.
మెట్ల దీపారాధన ఫలితాలు :
నియమనిష్టమైన దీపారాధన వల్ల
1. విడిపోయిన కుటుంబాలు ఏకమవుతాయి
2. విడిపోయినా దంపతులు కలిసి కాపురం చేస్తారు.
3. తనకు అందవలసిన ఆస్తులు తప్పకుండా పొందగలుగుతారు.
4. కార్యాలయాల్లో న్యాయసమ్మతంగా రావాల్సిన నగదు వచ్చి తీరుతుంది.
5. కార్తీక దీపం రోజున కొండపై దీపాలు వెలిగించేందుకు నెయ్యి, నూనె, వత్తులు తమ శక్త్యానుసారం అందించటం లేదా శారీరకపరమైన సేవలను అందించటం వల్ల రత్నగిరి సమస్తం దీపాల వెలుగులుతో నింపితే రత్నగిరీశుడు వీరందరికీ తన కరుణాకటాక్షాలను తప్పకుండా ప్రసాదిస్తాడు. పంచ మహా సిద్ధపురుషుల అనుగ్రహము, బ్రహ్మదేవుడి అనుగ్రహమూ పొందటం తథ్యం!
ఈ క్షేత్రంలో కార్తీక మహాదీపోత్సవాలను తిలకించేందుకు తరలివచ్చే నిరుపేదలకు అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం, పంగుణి ఉత్తిరం, మహా శివరాత్రి వంటి విశేష దినాలలో రత్నగిరిని ప్రదక్షిణం చేసే భక్తులకు అన్న ప్రసాదాలు, చల్లటి మజ్జిగ, పానకాలతో దాహశాంతిని కలిగిస్తే సకల సౌభాగ్యాలు పొందగలుగుతారు.

అయ్యర్ మలై గిరి ప్రదక్షిణ పద్దతి

అరుదైన మానవజన్మనెత్తిన మనమంతా ఓ క్షణాన్ని కూడా వృథా చేయకుండా భగవంతుడి సేవపైనే దృష్టి సారించాలి. మానవుడు భగవంతుడి కోసం, పరుల సంక్షేమం కోసం జీవించిన దినాలే వాస్తవమైన జీవన దినాలుగా పరిగణించబడుతాయి. తక్కిన రోజులన్నీ నిరుపయోగమైన కాలమే అవుతుంది.

అయ్యర్‌మలైని నియమనిష్టలతో గిరిప్రదక్షిణ చేసే కలియుగ మానవులందరినీ కరుణించే మహాసిద్ధపురుషుల ఆరాధనా పద్ధతులను పరిశీలిద్దాం

క్షీర ప్రదాత వినాయకుడు

అయ్యర్‌మలై గిరి ప్రదక్షిణను ప్రారంభించటానికి ముందుగా క్షీరప్రదాయకుడైన వినాయకుడిని దర్శించాలి. పర్వతం దిగువ మండపంలో కొలువుదీరినవారే క్షీర ప్రియుడైన వినాయకుడు. ఆయనను దర్శించి, కర్పూర హారతి, ఆవు నేతితో దీపం వెలిగించి ఆరాధించాలి. ఆ సన్నిధిలో కర్పూరపు కాగితాలను గానీ, వెలిగించి ఆర్పిపారవేసిన అగ్గిపుల్లలను, కొబ్బరి నారలను వంటి చెత్తాచెదారాలను పూర్తిగా తొలగించి శుభ్రపరచి ఆరాధించటమే అత్యుత్తమమైన ఆరాధన పద్ధతి అవుతుంది. అపారశక్తులు కలిగిన ఈ విఘ్న నాయకుడిని దర్శిస్తే సత్సంపదలు కలుగుతాయి.

క్షీరప్రదాతగా ఉన్న వినాయకుడు ఈ అయ్యర్‌మలై అవతరించిన సంఘటన కూడా అద్భుత చరిత్రే!

'లాల్‌' అంటే ఎరుపు వర్ణమని అర్థం. 'లాల్‌గుడి' అంటే ఎర్రతామర పుష్పాలు విరబూసిన దివ్య దేవామృతాన్ని సేవించు' అని అర్థం. అంతటి అమృతాన్ని తాను సేవించేందుకుగాను తన మాతృమూర్తి ప్రవర్థ శ్రీమతి అమ్మవారిని (పర్వతవర్థనిని) ప్రార్థించాడు వినాయకుడు.

ఆ వినాయకుడు ప్రార్థించిన స్థలమెక్కడో తెలుసా? అదే తిరుచ్చి సమీపంలో ఉన్న లాల్గుడి స్థలం!

లాల్గుడిలో కొలువైన శ్రీమతి అంబికాదేవి వినాయకుడి కోరికను మన్నించి 'కుమారా! జ్ఞానామృతం పొందాలంటే అమృతమయుడైన అమృతవర్షిణి నాదం మీటే దక్షిణామూర్తి అనుగ్రహం అవసరం. నాదంతో మీ తండ్రిగారైన మహాశివుడిని సంతోషపరచాలి' అంటూ అమృతాన్ని పొందే మార్గాన్ని అమ్మవారు తెలియపరిచారు.

మహాశివుడిని తన్మయమొనర్చటానికి అద్భుతమైన వీణ కావాలి కదా! ఆ వీణ కోసం అన్వేషించాడు వినాయకుడు. సుదీర్ఘ ప్రయత్నాల అనంతరం ఆయన అద్భుతమైన వీణను సంపాదించి అద్భుతమైన కీర్తనలను ఆలాపించాడు ఆ మహాగణపతి.

గణపతి గానామృతానికి ముగ్ధుడైన పరమేశ్వరుడు వీణా సమేత దక్షిణామూర్తి రూపంలో జ్ఞానామృతాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు.

'నాయనా! గణపతీ! నీకు జ్ఞానామృతాన్ని సమర్పిస్తున్నాను. రత్నగిరి క్షేత్రానికి వెల్లి ఆ జ్ఞానక్షీరాన్ని పొందు నాయనా!' అంటూ లాల్గుడి ఈశ్వరుడు ఆదేశించాడు. తండ్రిగారి ఆదేశానుసారం వినాయకుడు జ్ఞాన క్షీరాన్ని తీసుకుని రత్నగరి పర్వతపు దిగువ ప్రాంతాన్ని చేరుకున్నాడు.

ఆ సమయంలోనే వినాయకుడు జ్ఞాన క్షీరాన్ని సేవించబోతున్నాడని దేవతులు, రుషులు, మునీశ్వరులు, మహాపురుషులు తమ జ్ఞాననేత్రాల ద్వారా తెలుసుకుని ఆ దేవామృతంలో కొన్ని చుక్కలనైనా పొందాలని ఆరాటపడ్డారు. తమ స్వస్వరూపాలలో వెళితే ఆ జ్ఞాన క్షీరాన్ని పొందలేమని అనుకున్న వీరందరూ చిన్నారుల రూపాలను ధరించి రత్నగిరిలో అడుగుపెట్టిన వినాయకుడిని చుట్టుముట్టారు.

క్షీరాన్ని అందించే వినాయకుడు

తన చుట్టూ పసివారు చుట్టుముట్టడంతో వినాయకుడు ఉద్దేశపూర్వకంగా ఆ జ్ఞాన క్షీరం కింద ఒలికే విధంగా తడబడుతూ నోటిలో పోసుకున్నారు. పసిపిల్లల రూపంలో ఉన్న దేవతలు, రుషులు 'పాలను నాకివ్వు నాకివ్వు' అంటూ ఏడ్వసాగారు. వినాయకుడి నోటి నుండి జారిపడుతున్న పాలచుక్కలను తాగారు. వినాయకుడు కూడా 'పసిపిల్లలు కదా పాలను తాగిపోనీలే' అని వారిని అడ్డుకోలేదు.

ఆనాటి నుండి రత్నగిరి వినాయకుడిని 'క్షీరపద్రాత వినాయకుడు' అని పిలుస్తున్నారు.

ఈ క్షేత్రంలోని వినాయకుడికి పాలాభిషేకం చేసి ఆ పాలను నిరుపేద పిల్లలకు దానంగా ఇవ్వటం ఆనవాయితీగా మారింది.

ఈ క్షీరాన్ని దానం చేయడం వల్ల

1. పిల్లల ఆయురారోగ్యాలు అధికమవుతాయి.

2. సంపూర్ణ ఆరోగ్యం కలిగిన సంతానం ప్రాప్తిస్తుంది.

3. పిల్లల దేహారోగ్యం మెరుగవుతుంది. మానసికంగా వికసిస్తారు.

4. మానసిక రోగంతో బాధపడే చిన్నారులు రోగ విముక్తి పొందుతారు.

క్షీర ప్రదాత వినాయకుడు జ్ఞాన క్షీరాన్ని తాను తాగటమే కాకుండా చిన్న పిల్లలందరికీ ఆ క్షీరామృతాన్ని అందించి వారికి జ్ఞానమార్గాన్ని నిర్దేశించారు. ఇంతటి అద్భుత కరుణామూర్తి దివ్యదర్శనం ద్వారా మనకు పరమోన్నత స్థితిని ప్రాప్తింపజేస్తుందనటం అతిశయోక్తి కాదు!

జ్ఞానక్షీరాన్ని సేవించిన మీదట వినాయకుడు తన అద్భుత వీణానాదంతో గానంతో మహేశ్వరుడిని ఆనందింపజేశాడు కదా. కనుకనే ఇక్కడి క్షీర ప్రదాత వినాయకుడిని దర్శించటానికి ముందుగా అక్కడి వీణా దక్షిణామూర్తిని దర్శిస్తే అపారమైన సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ వీణా దక్షిణామూర్తిని లాల్గుడి సప్తఋషీశ్వరుల ఆలయంలో చూడవచ్చు

క్షీర ప్రదాత వినాయకుడి లీలావిశేషాలు..

భద్రజలుడనే మిరియాల వ్యాపారి, ఆనంద అయ్యన్‌ అనే మిరపవ్యాపారి, చిత్ర విజయన్‌ అనే చింతపండు వ్యాపారి, సంబ్రన్‌ అనే నూనె వ్యాపారి, కాలవిధన్‌ అనే బెల్లపు వ్యాపారి, దాన విజయన్‌ అనే ధాన్యపు వ్యాపారి, శిఖామణి అనే నవధాన్యాల వ్యాపారి, మాసిలామణి అనే స్వర్ణ నవరత్నాల వ్యాపారి, తమ కుటుంబాల సమేతంగా గుర్రపు బగ్గీలలో, ఎడ్లబండ్లలో వ్యాపార వస్తువులతో పుదుచ్చేరి నుండి చోళదేశానికి పయనమై వెళుతున్నారు.

ఈ విషయాన్ని మారవర్ముడు అనే దోపిడీ ముఠా నాయకుడు తెలుసుకున్నారు. ఆ వ్యాపారుల సంపదను అంతా కొల్లగొట్టేందుకు వందమంది దొంగలను వెంటబెట్టుకుని మారణాయుధాలతో గుర్రాలపై వెళ్లి రత్నగిరి వద్ద మాటువేశారు. అప్పటికే రత్నగిరిని చేరుకున్న ఆ వ్యాపారులంతా తమ బండ్లను నిలిపి, ఆ రాత్రికి అక్కడే బసచేసేందుకు గుడారాలను వేసుకుని విశ్రమించారు. ఆ చోటుకు ఓ బాలుడి రూపంలో చేరుకున్నాడు క్షీర ప్రదాతయైన వినాయకుడు. ఆ గుడారాలలో ఉన్న వ్యాపారులు తమ పిల్లల కోసం బంగారు, వెండి గిన్నెలలో పాలను నింపి ఉంచారు. ఆ సమయంలో బాలుడి రూపంలో వెళ్లిన వినాయకుడు 'పాలను ఇస్తే పాతకం రాకుండా కాపాడతా... పాలను ఇస్తే పాతకం రాకుండా ఆదుకుంటా' అంటూ ప్రతి గూడారం వద్దా నిలిచి కేకలు వేశాడు.

శ్రీ వీణాదక్షిణా మూర్తి
లాల్గుడి తిరుచ్చి

గుడారంలోపల ఉన్న తల్లులు ఆ గిన్నెలలోని పాలను తమ పిల్లలకు పాలను అందిస్తుండగా బయట కేకలు పెడుతున్న బాలుడికి పాలను ఇస్తే తాము పాలను తాగుదామని పట్టుబట్టారు. 'ముందు ఈ పాలను మీరు తాగండి. మిగిలిన పాలను ఆ బాలుడికి ఇస్తామ'ని ఆ తల్లులు చెప్పినా పసిపిల్లలు మాటవినలేదు. గుడారం వెలుపల తిరుగుతున్న బాలుడికి తమ కన్నా ముందుగా పాలను ఇవ్వాల్సిందేనని మంకుపట్టు పట్టారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ తల్లులంతా కలిసి బాలుడి రూపంలో ఉన్న వినాయకుడి వద్దకు వెళ్లి 'నాయనా నీకు పాలను ఇస్తున్నాం. పాలను తాగిన తర్వాత మా పిల్లలను కూడా పాలను తాగమని చెప్పు' అని తెలిపారు. అందుకు ఆ బాలుడు ఓ షరతు పెట్టాడు. ఆ నిబంధన ఏమిటంటే తాను తృప్తిపడేంత వరకు సరిపడా పాలను ఇవ్వాలని, అప్పుడే వారి పిల్లలచేత పాలను తాగిస్తానన్నాడు వినాయకుడు. ఆ తల్లులు ఈ బుడతడు ఎంత పాలను తాగుతాడు వీలయితే ఐదారు గిన్నెల పాలను మించి తాగలేడు కదా! ఒక వేళ పాల కొరత ఏర్పడితే గుడారాల వద్దే పశుగణాలు ఉన్నాయి కదా అని స్థిరమనస్కులయ్యారు. ఆ మహాతల్లులంతా వినాయకుడి నిబంధనను అంగీకరించారు.

తల్లులందరినీ వరుసగా నిలవమన్నాడు బాలుడి రూపంలో ఉన్న వినాయకుడు. 'ఇచ్చిన మాట తప్పరు కదా?' అని ప్రతి తల్లిని ప్రశ్నించాడు. అందరూ సరేనన్నారు. ఇక గుడారాలలోని పిల్లలందరూ ఆ బాలుడి వెనుకనే బారులు తీరారు. ఆ బాలుడు మరో షరతు విధించాడు. అదేమిటంటే 'తనకు పాలను ఇవ్వడానికి అక్కడున్న మగవారంతా అంగీకరించాలి' అన్నదే ఆ నిబంధన. పిల్లలంతా పట్టుబట్టడంతో వారి తండ్రులంతా ఎట్టకేలకు సమ్మతించారు. 'తొలుత బంగారు గిన్నెలలో ఉన్న పాలను ఇవ్వండి' అంటూ అడిగాడు బాలుడు.

పిల్లలందరూ తమ వద్దనున్న బంగారు గిన్నెలలోని పాలను చూపి తాగమని ఆ బాలుడికి చెప్పారు. ఆ బుడతడైన వినాయకుడిని పట్టరాని సంతోషం కలిగింది. పిల్లల తల్లిదండుల్రను గిన్నెలలో ఆపలను పోసి ఇవ్వమన్నాడు ఆ బాలుడు. ఆ పాల గిన్నెలను పిల్లలంతా కలిసి బాలుడి రూపంలో ఉన్న వినాయకుడికి ఇచ్చారు. వినాయకుడు గిన్నెలలోని పాలను తాగటం ప్రారంభించాడు. బిందెల నిండుగా పోసి వుంచిన పాలన్నీ ఖాళీ అవుతున్నాయి. చుక్క మిగల్చకుండా పాలను తాగేశాడు. ఆ వ్యాపారులు, చిన్న పిల్లలు, వారి తల్లులు ఆశ్చర్యపోయాడు. ఆ బుడతడేమిటి ఇన్ని పాలను గుటుక్కున తాగేయడమేమిటి అని విస్తుపోయారు. ఆ బాలుడు కడుపునిండా బిందెలకొద్దీ పాలను తాగిన తర్వాత అందరికీ కడుపారా పాలను తాగినంత తృప్తి కలిగింది. అప్పుడే అనుకున్నారు ఈ బాలుడు సామాన్యుడు కాడని. ఆసక్తి పట్టలేక అడిగారు 'నాయనా నీ పేరేమిటి? ఎక్కడి నుండి వచ్చావు' అని అడిగారు.

అందుకా బాలుడు 'నేనా రత్నగిరీశ్వరుడి భక్తుడిని' అంటూ సమాధానమిచ్చాడు. వ్యాపారులందరికీ అప్పటికి గుర్తుకు వచ్చింది తామింకా రత్నగిరీశుడిని దర్శించలేదని! రత్నగిరి ఏ దిక్కున ఉందో చూపమని బాలుడిని అడిగారు. 'ఇదిగో ఆ పైనున్నదే రత్నగిరి. రండి అందరమూ అక్కడికే వెళదాం' అంటూ అందరినీ వెంటబెట్టుకుని ఆ బాలుడు ముందుకు సాగాడు. వందల సంఖ్యలో వాహనాలను, గుర్రాలను, ఎడ్లను, వ్యాపార సామగ్రిని వెంట బెట్టుకుని అందరూ ఆ పర్వతపు దిగువ భాగాన్ని చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతంలో మాటవేసిన గజదొంగ మారవర్ముడు క్షణం ఆలస్యం చేయకుండా తన సహచరులందరితో దారిలో అడ్డుకున్నారు.'మీవద్ద నున్న విలువైన వస్తువలనంతా ఇవ్వండి' అంటూ గదమాయించాడు ఆ గజదొంగ. వ్యాపారులంతా భయంతో వణకిపోయారు. ఏం చేయాలో తోచక బాలుడి రూపంలో ఉన్న వినాయకుడికేసి చూశారు.

ఆ బాలుడు గజదొంగ మారవర్ముడితో 'నీ వల్ల వీలయితే ఈ వస్తువలనంతా దోచుకెళ్లు చూద్దాం' అన్నాడు. ఆ బాలుడి వైపు హేళనగా చూసిన గజదొంగ మారవర్ముడు వంద గుర్రాలపై ఉన్న దొంగలు కిందకు దిగేందుకు ప్రయత్నించారు. ఆశ్చర్యం! ఆ దొంగలంతా గుర్రాలపై నుండి కిందకు దిగలేక వాటిపైనే స్థాణువులై కదలక మెదలక కూర్చుండి పోయారు.

శ్రీ క్షీరప్రదాత వినాయకుడు

వినాయకుడు ఆ వ్యాపారులతో 'మీకేం భయం లేదు. కొండపైకి వెళ్లండి. అంతకు ముందు కొండదిగువనే ఉన్న 'క్షీర ప్రదాన వినాయకుడిని దర్శించుకోండి. ఆయన మీ కష్టాలన్ని తీరుస్తాడు' అన్నాడు. వ్యాపారులంతా క్షీర ప్రదాత వినాయకుడి సన్నిధికి చేరుకున్నారు. ఆ వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత తామంతా ఆపదల నుండి గట్టెక్కి రక్షణగా ఉన్నామనే భావన కలిగింది. అప్పటికే వారికి విపరీతమైన ఆకలి, దాహం కలిగాయి. ఇక వ్యాపారులను దోచుకునేందుకు వచ్చి గుర్రాలపై నుండి కిందకు దిగలేని గజదొంగలతో భయంతో అక్కడి నుండి పారిపోయారు.

ఇక ఆకలిదప్పులతో అలమటిస్తున్న వ్యాపారులను బాలుడి రూపంలో ఉన్న వినాయకుడు పలుకరిస్తూ 'అందరూ ఆ క్షీర ప్రదాతయైన వినాయకుడిని మనసారా వేడుకోండి. మీకు అన్ని ప్రాప్తిస్తాయి' అన్నాడు. వ్యాపారులంతా ఆర్తితో వినాయకుడిని ప్రార్థించారు. అద్భుతం... ఆ వినాయకుడి తొండముల నుండి చిక్కిటి పాలు ధారగా కారసాగింది. ఆ పాలను వ్యాపారులు, వారి భార్యలు బిందెలలో సేకరించారు. గిన్నెలలో పోసుకుని ఆబగా తాగారు. ఆ పాలు దేవామృతాన్ని తలపించే విధంగా తీయగా, రుచిగా ఉండటంతో వారంతా ఆశ్చర్యపోయారు. ఆ లోపున ఆ బాలుడు వినాయకుడి సన్నిధిలోపలకు వెళ్లి వ్యాపారులంతా చూస్తుండగానే అంతర్థానమయ్యాడు. అప్పుటికి వ్యాపారులకు అసలు విషయం తెలిసింది. తమను కాపాడేందుకు బాలుడి రూపంలో వచ్చింది ఎవరో కాదు సాక్షాత్తు వినాయకుడని తెలుసుకున్నారు. ఆనందంతో పరవశించి పోయారు.

క్షీర ప్రదాత వినాయకుడికి పాల అభిషేకం చేసి, ఆ పాలను పేదలకు దానం చేస్తే...

1. కోల్పోయిన సకల సంపదలు తిరిగి లభిసాతాయి

2. వస్తువులు చోరీకి గురికాకుండా ఉంటాయి.

3. ధారపోయిన వస్తువులన్నీ లభిస్తాయి.

4. కనిపిం చకుండా పోయినా వారంతా తిరిగి వస్తారు. భగవంతుడి కరుణాకటాక్షాలు మెండుగా లభిస్తాయి.

శ్రీ కరుప్పన్న స్వామి దర్శనం

అయ్యర్‌మలై గిరిప్రదక్షిణలో మరో ఘట్టంగా క్షీర ప్రదాత వినాయకుడిని దర్శించిన మీదట కొండ దిగువనే ఉన్న కరుప్పన్న స్వామిని దర్శించాలి. రత్నగిరిని కంటికి రెప్పలా కాపాడేది ఈ స్వామివారే! ఈ స్వామివారికి చెరకు రసాన్ని నైవేద్యంగా సమర్పించి 'స్వామీ! రత్నగిరిని ప్రదక్షిణ చేసే నాకు మార్గదర్శిగా ఉంటూ కాపాడు' అంటూ ప్రార్థించాలి.

చెరకు రస నైవేద్యం ఎందుకు?

రత్నగిరిపై అపారమైన భక్తి ప్రపత్తులు కలిగిన 'నంబినాధన్‌' అనే స్వర్ణకారుడొకరు ఉండేవారు. ఆయన తాను రూపొందించే స్వర్ణ ఆభరణాలన్నింటినీ కరుప్పన్న స్వామి పాదాల చెంత పూజించి వాటిని ఎవరెవరికి ఇవ్వాలో వారికి అందజేసేవారు.

ఓ సారి ఓ పెద్ద వ్యాపారి భారీగా నగలను తయారు చేసివ్వమని నంబినాధన్‌కు తెలిపారు. ఆ విధంగానే నంబినాధన్‌ నగలను తయారు చేసి వాటిని కరుప్పన్న స్వామివారి పాదాల చెంత సమర్పించి పూజించి వాటిని ఆ ధనవంతుడికిచ్చారు. ఆ నగలను సరిచూసుకున్న ఆ ధనవంతుడు వాటిలో కొన్ని నగలు తగ్గినట్లు కనుగొన్నాడు. నంబినాధన్‌ తాను మాట ప్రకారం అన్ని నగలను తయారు చేసి ఇచ్చానని తెలిపాడు.

ఆ ధనవంతుడు నంబినాధన్‌ను దండించడానికిగాను రాజు వద్దకు తీసుకెళ్లాడు. రాజు ఇరువురి వద్దా విచారణ జరిపాడు. నంబినాధన్‌తో 'నువ్వా నగలను దొంగిలించలేదనటానికి ఎవరైనా సాక్షులు ఉన్నారా?' రాజు ప్రశ్నించాడు. నంబినాధన్‌ తడుముకోకుండా 'ఆ కరుప్పన్న స్వామివారే తనకు సాక్షి' అని బదులిచ్చాడు. రాజుగారు బిగ్గరగా నవ్వుతూ 'నీవా నగలను దొంగిలించలేదనటానికి కరుప్పన్న స్వామివారే సాక్షి అంటే నీకోసం ఆ స్వామివారు ఇక్కడకు వచ్చి సాక్ష్యం చెప్పనవసరం లేదు. కనీసం ఈ బంగారు గిన్నెను చెరకు రసంతో నింపమని చెప్పు చూద్దాం! అదే జరిగితే ఆ స్వామివారే సాక్ష్యం చెప్పినట్లు భావించి నిన్ను నిర్దోషిగా విడిచిపెడతాం' అన్నారు.

ఆ స్వర్ణకారుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే తన మనస్సులోనే కరుప్పన్నస్వామివారి తలచుకుని 'కరుప్పన్న స్వామీ! రాజుగారు నిన్ను సాక్షిగా రాజ దర్బారుకు పిలుస్తారేమోనని భయపడుతున్నాను. నేను పిలిస్తే నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు. అయితే రాజుగారు నీకు అమర్యాదలు చేస్తాడని అయోమయంలో పడ్డాను. ఇప్పుడవన్నీ అక్కరలేకుండా పోయింది. నేను నిర్దోషినని రుజువు పరచేందుకు రాజుగారి చేతిలోని బంగారు గిన్నెలో చెరకు రసాన్ని నింపి కాపాడు స్వామీ' అని భక్తి ప్రపత్తులతో వేడుకున్నాడు.

మరుక్షణమే ఆ బంగారు గిన్నెలో చెరకు రసంతో నిండిపొంగి పొరలింది. అందరూ కరుప్పన్నస్వామివారి అపార కరుణాకటాక్షాలను తిలకించి తన్మయత్వం చెందారు. రాజుగారు కరుప్పన్నస్వామివారిపై నంబినాధన్‌కున్న అపార భక్తి విశ్వాసాలను మెచ్చుకున్నారు.

శ్రీకరుప్పన్నస్వామి వారి దర్శన ఫలితాలు:

ఏ తప్పుచేయనివారు తమకు ఎదురయ్యే ఆరోపణలనుండి విముక్తి పొందటానికి కరుప్పన్నస్వామివారికి చెరకు రసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే చాలు కష్టాలనుండి గట్టెక్కుతారు. రత్నగిరిని ప్రదక్షిణం చేసే భక్తజనులందరికీ అహోరాత్రులు కంటికి రెప్పలా కరుప్పన్న స్వామివారు కాపాడుతుంటారు. కనుకనే గిరి ప్రదక్షిణ చేయదలచుకున్న భక్తులంతా ముందుగా కరుప్పన్నస్వామివారికి చెరకు రసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజించి ప్రదక్షిణను ప్రారంభించడం శుభదాయకమవుతుంది.

గిరి ప్రదక్షిణ ప్రారంభించగానే నేరుగా ఆలయ పుష్కరిణికి వెళ్లాలి. అక్కడ మెట్లపై ఒక్కో దిక్కుకు రెండు చొప్పున 16 దీపాలను వెలిగించిన మీదట రత్నగిరీశుడిని దర్శించి పూజించాలి. ఈ దర్శనాన్నే 'నెమలి పించ ముఖ దర్శనం' అని అంటారు.

నెమలి పించ ముఖ దర్శనం

శ్రీరామచంద్రుడికి రథసారథిగా సేవలందించినవడు సుమంతుడు. ఈయన దశరథమహారాజుకు మంత్రిగాను సేవలందించాడు. దశరథుడు 60,000 యేళ్లపాటు అయోధ్యను పరిపాలించాడు. ఆయనకంటే ముందు కృతయుగంలో జన్మించిన సుమంతుడు శ్రీరాముడు పాలించిన కాలంలో 99,999 యేళ్లపాటు జీవించాడు. లక్ష సంవత్సరాల ఆయష్సు తీరటానికి ముందే యమదూతలు సుమంతుడి ప్రాణాలను హరించారు. సుమంతుడిని జాతకాన్ని పరిశీలంచగా అతడి ఆయుష్షు లక్ష సంవత్సరాలని తేలింది. అయితే ఆయుష్షు తీరటానికి తొమ్మిది రోజులకు ముందే యమదూతలు అతడి ప్రాణాలను హరించడం ఘోరతప్పిదం కదా!

ఈ సంగతి తెలుసుకుని శ్రీరామచంద్రులవారు ఆగహ్రోదరులయ్యారు. రామరాజ్యంలో ఇలాంటి తప్పిదం జరుగకూడదు కదా! తక్షణమే శ్రీరామచంద్రుడు యమలోకానికి వెళ్లి యమధర్మరాజుతో సంగతి తెలిపారు. 'ఆహా శ్రీరామచందుడ్రే తనను ప్రాధేయపడేందుకు వచ్చాడు కదా' అని యముడు గర్వపడ్డాడు. 'తాను చేసింది న్యాయమే'నని వాదించాడు యముడు.

శ్రీరాముడు సూర్యభగవానుడి వద్దకు వెళ్లి యముడి వాదనను తెలిపాడు సూర్యుడు ఆగమేఘాలపై యమలోకం చేరుకుని యముడు తన తప్పును సరిదిద్దుకోకపోతే శనీశ్వరుడితో కలిసి తాము యమలోకం దండెత్తుతామని, అదే జరిగితే తమ తపోబలంతో మరో యమధర్మరాజును రూపొందించి పాలనను అతడికి అప్పగిస్తానని' హెచ్చరించాడు.

దీనితో యముడి గర్వం అణగింది. తన తప్పును సవరించుకున్నారు. భూలోకంలో సుమంతుడు ప్రాణాలతో తిరిగి లేచాడు. అందరూ ఆనందించారు.

ఆయుష్షు తీరకమునుపే ప్రాణం పోవడానికి గల కారణాలను అడిగారు. సుమంతుడు బదులిస్తూ 'నిత్యం భగవంతుడి తలంపుతోనే గడుపుతుండిన నేను కొంతకాలంపాటు భగవంతుడిపై నమ్మకంలేనివారితో గడిపాను. కనుకనే ఆయుష్షు తగ్గింది' అన్నాడు.

'తగ్గిన ఆయుష్షు మళ్లీ ప్రాప్తించడానికి కారణమేమిటి?' అని ప్రజలడిగారు. 'రత్నగిరీశుడిని దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణమూ చేసి అక్కడి తీర్థకొలను మెట్లపై దీపాలను వెలిగించి స్వామివారి నెమలి పించ ముఖ దర్శనం చేసుకున్నాను. ఆ కారణంగా తగ్గిన ఆయుష్షు తనకు మళ్లీ తిరిగొచ్చింది' అని సుమంతుడు సమాధానమిచ్చాడు.

కనుక నియమనిష్టలతో నెమలి పించముఖ దర్శనం చేసుకుంటే

1. భగవంతుడి అవిశ్వాసపరుల సహవాసం లేకుండా, కాలం వృథా కాకుండా ఉంటుంది.

2. భగవశ్చింతన లేక, భగవద్‌సేవలు చేయకుండా, మానవుల సేవకు దూరంగా ఉండటం వల్ల కలిగే పాపాలు హరించుకుపోయి ప్రాయశ్చిత్తం లభిస్తుంది.

3. దీర్ఘ ఆయుష్షు ప్రాప్తిస్తుంది.

4. ఆయుష్షు ఉన్నంత వరకూ భగవద్‌ చింతనతో మానవసేవ చేయడానికి వీలు కలుగుతుంది.

ఈ రత్నగిరీశుడి నెమలి పించ ముఖ దర్శనం భక్తులందరికీ వర ప్రసాదమే కదా!

గిరి ప్రదక్షిణలో తదుపరి మనకు ఎదురయ్యేది బలశాలిని నంది! రత్నగిరి ఆలయ ప్రధాన మంటపానికి ఎదురుగా కాస్త కుడివైపున రత్నగిరీశుడికి అభిముఖంగా కొలువై ఉంది. ఘోర తపస్సుల ప్రభావంతో ఆ నందీశ్వరుడు ఈచోట స్థిరనివాసానికి ఆ శివుడి అనుగ్రహం సంపాదించుకున్నాడు. ఈ నందీశ్వరుడు అనుగ్రహమూర్తిగా ఉన్నారు. ఈ నందిదేవుడికి తైలతాపడం చేసి ధూపదీప ఆరాధనలు చేస్తే శుభఫలితాలను పొందగలం. ఈ బలశాలిని నందీశ్వరుని శిరస్సు వెనుకనుండి రత్నగిరీశుడిని దర్శనం చేసుకుంటే అది 'ఇష్టలింగ మూర్తి రత్నగిరీశ్వర ముఖ దర్శనం' అవుతుంది.

ఇష్టలింగ మూర్తి రత్నగిరీశ్వర ముఖ దర్శనం

పదహారేళ్ల పాటు భువిలో నివసించే వరం పొంది జన్మించాడు మార్కండేయుడు. అతడి ఆయుష్షు తీరటానికి కొన్ని క్షణాల ముందు యమపాశంతో యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. మార్కండేయుడికి తన ప్రాణంపై మమకారాలు ఏవీ లేవు. అయితే మహేశుడిని విడిచిపెట్టడానికి అతడి మనస్సు అంగీకరించలేదు. శివలింగాన్ని గాఢంగా కౌగలించుకున్నాడు. యమధర్మరాజు మార్కండేయుడిపై యమపాశాన్ని విసరగా అది పొరపాటున శివలింగంపై పడింది. ఆ క్షణమే శివలింగం నుండి బయల్పడిన మహాశివుడు యమధర్మరాజును కాలితో తన్నారు. యముడి దండం పత్తాలేకుండా పోయింది. 'ధర్మరాజా' అనే పదవిని కోల్పోయాడు. తన తప్పును తెలుసుకుని క్షోభించి ప్రాయశ్చిత్తం తెలుపమని మహేశ్వరుడిని వేడుకున్నాడు. రత్నగిరిని ప్రదక్షిణం చేసి బలశాలినీ నందిశ్వీరుడి దర్శనం చేసుకోమని చెబుతాడు శివుడు. మహేశ్వరుడి ఆదేశానుసారం యమధర్మరాజు రత్నగిరీశుడిని ప్రదక్షిణ చేశారు. బలశాలినీ నందీశ్వరుడికి తైలతాపడం చేసి ప్రార్థించాడు. మహాశివుడు దర్శనమిచ్చి యమధర్మరాజుకు యమదండాన్ని అందించి మళ్లీ యమలోకపు అధిపతిగా మళ్లీ అధిష్టించేందుకు వీలుకల్పించారు.

ఇష్టలింగ మూర్తి రత్నగిరీశ్వర ముఖ దర్శన ఫలితాలు :

నియమనిష్టలతో కూడిన ఈ దర్శనం వల్ల

1. కోల్పోయిన ఉద్యోగాలు మళ్లీ లభిస్తాయి

2. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి

3. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధిని సాధించగలుగుతారు

4. వైద్యవృత్తిని చేస్తున్నవారి తమ విభాగాలలో నైపుణ్యతను పొందగలుగుతారు. వీలయినంత వరకు ఉచిత వైద్యసేవలు చేస్తే మరీ మంచిది. దీనితో వైద్యులకు ఎదురయ్యే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. కుటుంబ సంక్షేమం పెరుగుతుంది.

5. రత్నగిరీశ్వరుడిని కులదైవంగా కలిగిన కుటుంబీకులంతా విడిపోయినట్లయితే, ఈ దర్శనం వల్ల అందరూ మళ్లీ ఏకమై సుఖంగా జీవించగలుగుతారు.

6. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు క్షేమంగా స్వదేశానికి తిరిగివచ్చేందుకు, విదేశాల్లో ఉన్నంత కాలం ప్రశాంతంగా ఉండేందుకు ఈ దర్శనం ద్వారా వీలుకలుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవారి కోసం వారి బంధువులో, స్నేహితులో ఈ దర్శనం చేసి పూజించవచ్చు

7. తల్లిదండ్రులు పెట్టిన పేరును ఎట్టి పరిస్థితులలోనూ మార్చకూడదు. అలా చేస్తే జీవితంలో కష్టాలు ఎదుర్కొంటారు. ఉదాహరణకు ప్రపంచాన్నే గడగడలాడించిన చక్రవర్తి నెపోలియన్‌ బోనపార్ట్‌ తన పేరుకు 'e' అనే అక్షరాన్ని కలుపుకుని తన పేరును NAPOLEAN BONAPARTE గా మార్చుకున్నాడు. దాని ఫలితంగా వచ్చిన వాటర్లూ యుద్ధంలో ఘోరపరాజితుడై అవమానాలపాలయ్యాడు. ఇలా పేరును మార్చుకున్నవారు, పేరు నిడివిని తగ్గించుకున్నవారు రత్నగిరిని ప్రదక్షిణం చేసి బలశాలిని నందీశ్వరుడిని దర్శించుకుని ప్రాయశ్చిత్తం పొందవచ్చు.

8. తమ తప్పిదాల ద్వారా పదవులు కోల్పోయినవారికి అద్భుత ఫలితాలను అందించే అద్భుత దర్శనమిది. అందరూ ఈ దర్శనం చేసుకుని కోల్పోయిన పదవులను మళ్లీ పొంది రత్నగిరీశుడి కరుణా కటాక్షాలను పొందవచ్చు.

నవరంగా ధునిలింగ దర్శనం

ఇష్టలింగ మూర్తి రత్నగిరీశుడి ముఖ దర్శనం దాటుకుని పైకి వెళితే నవరంగ ధునిలింగ దర్శనం లభిస్తుంది.

తారకాసురుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురు రాక్షసులు మహేశ్వరుడి కోసం ఘోర తపమాచరించారు. అన్నపానీయాలను మానుకుని ఎండవానలను సైతం పట్టించుకోకుండా ఆ ముగ్గురు రాక్షసులు చేస్తున ఘోర తపస్పును చూసి దేవతలంతా భీతిల్లారు. అందరూ దేవ గురువైన బృహస్పతిని ఆశ్రయించారు.

బృహస్పతి వారిని సమాధానపరచి 'ఇంద్రుడితో సహా దేవతలందరూఈ అసురుల ఘోరతపస్సు ఎలాంటి కష్టాలను కలిగించదు. అయితే బ్రహ్మదేవుడే కాస్త జాగ్రత్తగా ఉండాలి' అని తెలిపారు. అదేమిటి?

అసురుల తపస్సు ఫలించినట్లయితే సృష్టికారకుడైన బ్రహ్మదేవుడు వరాలను ఇవ్వక తప్పదు. కనుక వరాలిచ్చే సమయంలో ఆయన కాస్త జాగ్రత్త యోచించి వ్యవహరిస్తే దేవతలను ఆపదల నుండి కాపాడగలరంటూ అరుదైన ఉపాయాన్ని తెలియజేశారు.

దేవతలు చాలా సంతోషపడ్డారు. బ్రహ్మదేవుడు బృహస్పతి తనపై మోపిన బాధ్యతను గుర్తుంచుకుని మహాశివుడి అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తూ కీర్తనలతో పొగడుతూ ఆరాధించారు. మహేశుడు సంతోషించి 'బ్రహ్మదేవుడా చింతించవద్దు. ఘోరతపస్సును చేస్తున్న ఆ ముగ్గురు అసురులను సంతృప్తి పరచడానికి, దేవతలకు ఇతరులకు ఎలాంటి కష్టాలు రాని విధంగా రీతిలో తగు తరుణోపాయాన్ని అందించగలిగేది భూలోకంలోని అయ్యర్‌మలై గిరి ప్రదక్షిణే' అని చెబుతూ రత్నగిరీశుడి మహిమలను వివరించారు.

బ్రహ్మదేవుడు ఆ రీతిలోనే భోగీశ్వరుడిగా ఉన్న రత్నగిరీశుడిని, రత్నగిరి పర్వతాన్ని ప్రదక్షిణ చేశారు. పలుమార్లు ధ్యానిస్తూ అయ్యర్‌ మలైని ప్రదక్షిణ చేశారు.

తప్పిదాలతో కూడిన దురాశలను మార్చి అనువైన ఆశలను పెంపొందించడానికి, నెరవేర్చడానికి శక్యం గాని కార్యం కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించకుండా ఉండే విధంగా అనువైన సులభసాధ్యమైన మార్గాన్ని అందించేదే అత్యుత్తమమైన గిరి ప్రదక్షిణే అయ్యర్‌ మలై గిరి ప్రదక్షిణమని బ్రహ్మదేవుడు నొక్కి వక్కాణించారు.

ఓ రోజు... బ్రహ్మదేవుడి ఎదుట శాలిహోత్ర మునులు ప్రత్యక్షమయ్యారు. 'బ్రహ్మదేవా! నీకు వందనాలు. అసురుల కఠోర తపస్సు వల్ల కలుగనున్న విపరీతమైన కష్టాలనుండి లోకాన్ని కాపాడేందుకు చేపడుతున్న ప్రయత్నం చాలా సంతోషదాయకమైనది. ఆ ముగ్గురు అసురులు మహేశ్వరుడి చేత సంహరింపబడతారు. అయితే దేవతలు ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఆయుధాలను అసురులపై ప్రయోగించి వారిని అంతమొందించే విధంగా ప్రయత్నించాలి' అని తెలిపారు.

ముగ్గురు అసురులు మరణంలేని జీవితాలను ప్రసాదించమని కోరనున్నారని జ్ఞానదృష్టిద్వారా తెలుసుకున్న బ్రహ్మదేవుడు ఆ ఇక్కట్ల నుండి ఎలా బయటపడాలా అని దీర్ఘాలోచనలో పడ్డారు. శాలిహోత్ర ముని కూడా 'ఆ అసురులు ముగ్గురూ ఇనుము, వెండి, బంగారుతో తయారైన ప్రహరీలు కలిగిన కోటలను పొందుతారు. ఆ మూడు పురాలను వెయ్యేళకు ఒకమారు తమకిష్టమైన ప్రదేశానికి తరలించుకెళ్లగల సామర్థ్యాన్ని కూడా పొందుతారు. ఆ ముప్పురాలు ఏకమై మహాశివుడు ప్రయోగించే ఒకే ఒక ఆయుధంతోనే సంహరించగలుగుతారు కాని మరెవ్వరికీ వారిని చంపడానికి వీలుకాదు' అని వరమిచ్చి బ్రహ్మదేవుడు తన స్వస్థలానికి తిరిగి వెళ్లవచ్చు'నని చెబుతారు.

శాలి హోత్ర మునులు చెప్పిన విధంగా బ్రహ్మదేవుడు ఆ ముగ్గురు అసురులకు వరాలను ఇవ్వడం, అసురులు ఆ వరం వల్ల తమ ప్రాణాలకు ఎన్నడూ ముప్పువాటిల్లదని, మరణం లేని జీవితం గడుపబోతున్నామని సంతోషపడ్డారు.

శాలి హోత్ర మునుల అనుజ్ఞ మేరకు బ్రహ్మదేవుడు కూడా నవరంగ ధుని లింగమూర్తిని దర్శించి దేవతలకు శుభాలు కలుగాలని ప్రార్థించారు.

నవరంగ ధుని లింగ ఫలితాలు :

మానవుడికి ఏర్పడుతున్న పలు కష్టాలకు కారణం దురాశలు, స్థాయికి మించిన కోరికలు, తన అర్హతకు మించిన విషయాలపై మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేసి ఓటమి పాలవుతుండటమే.

కనుక రత్నగిరీశ్వరుడిని ప్రతి నిత్యం ప్రదక్షిణ చేసి నవరంగా ధుని లింగ దర్శనం చేయాలి.

1. దురాశలు, స్థాయికి మించి ఆశపడటాలను నివారించి సక్రమమైన ఆశలపై దృష్టి మరలుతుంది.

2. తమ అర్హతకు మించిన విషయాలు ఏమిటో అవగాహన పొంది వాటిలో మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేయకుండా నివారిస్తుంది.

గురువారం, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర దినాలలో రత్నగిరీశ్వరుడిని ప్రదక్షిణ చేసి నిమ్మపులుసు అన్నం దానం చేసి ఈ దర్శనం పొందితే సత్ఫలితాలను పొందగలం.

అష్టోత్తర లింగ ముఖ దర్శనం

నవరంగా నుని లింగ దర్శనం తర్వాత గిరి ప్రదరక్షిణలో మనకు అగుపడేది అష్టోత్తర లింగ ముఖ దర్శనం. భక్తులు గుంపులుగా నిలిచి శ్రీరత్నగిరీశ్వరుడిని దర్శించినట్లే కనిపించే వందలాది సంఖ్యలో శిలల్ని చూడవచ్చు. వాస్తవానికి ఉన్నతస్థితిని పొందిన సిద్ధులు సమూహమే ఆ రాళ్లు రప్పల ఆకారంలో కనిపిస్తాయి.

ఇక్కడ నుండి మనం అయ్యర్‌ మలైని దర్శిస్తే అది 108 మునిలింగ దర్శనమని పేరొందుతుంది.

దానగుణం ఉంటే పురుషుడు అందగాడవుతాడు. ఇక ధర్మగుణం కలిగి ఉంటే ఆ పురుషుడి సౌందర్యం పెరుగుతుంది.

అయితే ప్రస్తుతం దేహం బలం పొందినవారు, మాంసపు ముద్దల్లా ఉన్నవారినే 'అందమైన పురుషుడు' అని పిలిచే దుర్భాగ్యంలో ఉన్నాము.

త్యాగం కోసం తనను అర్పించుకున్నప్పుడే మానవుడు భగవత్‌ స్థాయికి చేరుకుంటాడు. దైవీక స్థితికి చేరుకున్న ఉత్తములనే 'ఋషులు' అని పెద్దలు చెబుతుంటారు. అటువంటి ఉత్తమ ఋషులలో ఒకరే 'మతంగ' మహర్షి.

ఆ మహర్షి వాక్‌ ప్రతిభలలో విద్యాజ్ఞానంలో ఉన్నతస్థాయికి చేరాలనే తలంపుతో బ్రహ్మదేవుడి అనుగ్రహం కోసం తపస్సు చేశారు. ఆ ఋషి తపస్సును మెచ్చిన బ్రహ్మదేవుడు మతంగ మహర్షికి దర్శనమిచ్చి 'మీ తపస్సును మెచ్చాను. నువ్వడిగే వరాన్ని ప్రసాదిస్తాను కోరుకో మహర్షీ' అన్నారు. మతంగ మహర్షి 'బ్రహ్మదేవుడా! విద్యలో, ఎలాంటి ఉన్నత విద్యలోను, అన్నింటికంటే మించి బ్రహ్మజ్ఞానంలోను ఉన్నతస్థితికి చేరుకునేలా వరమివ్వండి ప్రభూ' అని వేడుకున్నాడు.

బ్రహ్మదేవుడు 'ఋషివర్యా! మీరు వాటిని పొందాలంటే ఉచ్చిష్ట మాతంగి దేవిని ఉపాసించాలి. అయితే ఉచ్చిష్ట మాతంగి దేవిని ఉపాసించాలంటే శ్రీఅయ్యర్మలై మహేశుడిని, శ్రీరత్నగిరీశ్వరుడి అనుగ్రహం పొందాలి. కనుక శ్రీ అయ్యర్‌మలైని గిరి ప్రదక్షిణ చేయండి' అని తెలిపి, గిరి ప్రదక్షిణ నియమాలను బ్రహ్మదేవుడు వివరించారు.

మతంగ మహర్షి కూడా బ్రహ్మదేవుడు చెప్పినట్లుగానే బుధవారాల్లో ఉపవాసముంటూ శ్రీ అయ్యర్‌మలైని ముప్పూటలా గిరి ప్రదక్షిణం చేస్తారు. అయ్యర్‌మలై సమీపంలోనే ఓ ఆశ్రమం నిర్మించుకుని అందరికీ ఉచితంగా విద్యను బోధించేవారు. భగవంతుడి లీలా విశేషాలను 108,1008 సంఖ్య చొప్పున భగవన్నామాలను కీర్తించడం, ధ్యానించడం వల్ల జ్ఞాననేత్రాలను తెరిపిస్తాయంటూ ప్రజలకు బోధించేవారు.

ఇలా అందరికీ ఉచితంగా విద్యను బోధిస్తూనే ఉచ్చిష్ట మాతంగి దేవిని విడువకుండా ఉపాసిస్తూ శ్రీఅయ్యర్‌ మలైని గిరి ప్రదక్షిణ చేసేవారు. అలా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడే 'అష్టోత్తర ముఖలింగ దర్శనం' ద్వారా ఉచ్చిష్ట మాతంగి దేవిని దర్శించి అపారజ్ఞానం పొందారు.

అష్టోత్తర లింగ ముఖ దర్శన ఫలితాలు :

బుధవారం రోజున ఉపవాసం ఉండి శ్రీఅయ్యర్‌మలైని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అంటూ ముప్పూటలా గిరి ప్రదక్షిణ చేసి అష్టోత్తర లింగ ముఖ దర్శనం చేస్తే

1. విద్యాసంబంధిత విషయాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు.

2. బి.ఇ., యం.బి.బి.ఎస్‌., బి.యల్‌. వంటి ఉన్నతమైన కోర్సులలో సులువుగా పట్టాలను పొందగలుగుతారు.

3. మందబుద్ధి కలిగిన చిన్న పిల్లలు, మానసిక వికాసం లేని పిల్లలు (మెంటల్లీ రిటార్డడ్‌ చిల్డ్రన్‌) బాగుపడతారు.

4. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ శాఖలకు చెందిన అధ్యాపకులు తమ విభాగాలలో ఉన్నత స్థితిని పొందుతారు.

ఉపవాసం చేయలేని భక్తులు తులసి తీర్థం, కాస్త బెల్లం కలిపిన పాయసం సేవించి గిరి ప్రదక్షిణ చేయవచ్చును.

పులిహోర దానం చేస్తే మరింతగా దర్శన ఫలితాలను పొందుతారు.

ఏకమూర్తి లింగ ముఖ దర్శనం

గిరి ప్రదక్షిణ మార్గంలో తదుపరి మనం తిలకించబోతున్నది ఏకమూర్తి లింగ దర్శనం. 108, 1008 నామాల సంకీర్తన ద్వారా మన వశమయ్యే మహేశ్వరుడు ఒకే నామాన్ని నిర్విరామంగా, ఏక మనస్సుతో జపించినా చాలు ఆనంద పరవశులవుతాడని తెలిపేదే ఏకమూర్తి లింగ దర్శనం. సిద్ధులు మహేశ్వరుడిని అర్థ ప్రాణాయామంతో అపారప్రేమతో మహేశ్వరుడితో మమేకమవుతారు.

తిరునావుక్కరసర్‌ నాయనార్‌ కూడా 'అర్థ ప్రాణాయామంతో అర్థనారీశ్వరుడి ఆశ్రయం లభిస్తుంది' అని తెలిపారు. సిద్ధులు ప్రాణాయామం సందర్భంలో శ్వాసను అరఘడియపాటు పీల్చి, అరఘడియపాటు అదుపుచేసి, అరఘడియపాటు శ్వాసను వదలి దైవానుగ్రహం పొంది ప్రజలతో మమేకమై జీవించి వారికి ఆదర్శమార్గాలను బోధించి చివరకు ఆ భగవంతుడి పాదాల వద్ద ఆశ్రయం పొందుతారు.

సిద్ధులు ప్రాణయామం ఎందుకు అరఘడియలో కట్టడి చేస్తారు? అదే సంపూర్ణంగా చేస్తే వారి దేహం భగవంతుడిలో లీనమైపోగలదు. కనుక వారు అరఘడియ శ్వాసకే పరిమితమైపోతారు.

ఇలా సవ్యమైన ప్రాణాయామం ద్వారా, సంధ్యావందనం (మూడు వేళలా) ద్వారా చిరంజీవిగా వరం పొందినవారే మార్కండేయ మహర్షి. పలుయుగాలుగా భూలోకమంతటా సంచరిస్తూనే ఉన్నారు. ఆయనను శరణుజొచ్చారు దుష్యంతుడి కుమారుడైన భరతుడు. దీనికి గల కారణమేమిటి?

భరత చక్రవర్తి చాలా కాలం వరకూ సంతాన భాగ్యానికి నోచుకోలేదు. పలు యాగాలు, పూజలు, దానధర్మాదులు చేసినా సంతానం లభించలేదు. దానితో విరక్తి చెందారు. చివరకు తన కులగురువు వద్దకెళ్లి తరుణోపాయం చెప్పమన్నారు. మార్కండేయ మహర్షిని దర్శించి సంతాన వరం పొందమని ఆ గురువు సలహా ఇస్తారు. భరతుడు తీవ్ర అన్వేషణల తర్వాత మార్కండేయ మహర్షిని ఆశ్రయించాడు. భరతుడి అపార గురుసేవలకు ముగ్ధుడైన మార్కండేయ మహర్షి 'భరతా! చింతించవద్దు. సంతాన భాగ్యం కలిగేందుకు ఉత్తమమైన మార్గం ఒకటుంది. నీ కొరతను తీర్చి సంతాన భాగ్యం కల్పించే శక్తి రత్నగిరీశుడికే ఉంది. నువ్వా రత్నగిరికి వెళ్లి నియమనిష్టలతో గిరిప్రదక్షిణం చేస్తే చాలును' అని సలహా ఇస్తారు.

మార్కండేయ మహర్షి ఆదేశానుసారం భరతుడు శ్రీఅయ్యర్‌మలైకి వెళ్లి మహేశ్వరుడిని దర్శించి గిరి ప్రదక్షిణం చేశారు. కొంతకాలం పాటు గిరిప్రదక్షిణం చేసి ఆ మహర్షి చెప్పినరీతిలో దానధర్మాలు చేశారు. చివరకు ఆ భోళా శంకరుడు సంతసించి రత్నగిరీశ్వరుడు ఏకమూర్తి లింగదర్శనంతో అశరీరిగా వచ్చి 'భరతుడా! నీ అద్బుత ఆరాధానలు నన్నెంతగానో సంతసింపజేశాయి. నీవు కోరుకున్నట్లే సంతాన భాగ్యం కలుగుతుంది. నీకు జన్మించే పుత్రుడికి 'సుమతి' అని నామకరణం చేయుము. ఆ పుత్రుడు భవిష్యత్‌లో 'బుద్ధుడి'గా కీర్తి పొందుతాడు. పలు యోగపద్ధతులను అందించే విశ్వగురువవుతాడు' అని చెబుతారు. అలాంటి ఉత్తమగురువైన 'బుద్ధుడు' అవతరించిన క్షేత్రమే శ్రీఅయ్యర్‌మలై.

ఏకమూర్తి లింగ దర్శన ఫలితాలు !

1 సంతాన భాగ్యం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది

2. బాలారిష్ట దోషం కలిగిన పిల్లల తలిదండ్రులు ఈ చోట గిరి ప్రదక్షిణ చేస్తే పిల్లల ఆయురారోగ్యాలు పెరుగుతాయి. సంధ్యాకాల జనన బాలారిష్ట దోషాలు తొలగేందుకు ఉత్తమ ఆరాధనే శ్రీఅయ్యర్‌మలై గిరి ప్రదక్షిణ

3. వాసియోగం, హఠయోగం, యోగాసనాలలో ఉన్నత స్థితిని చేరుకోగలము

4. ఉన్నతమైన చదువులు చదివి అధ్యాపకులు, ఆచార్యులు, ప్రిన్సిపల్‌, డైరెక్టర్‌, డీన్‌, హెడ్‌ ఆఫ్‌ ద డిపార్ట్‌మెంట్‌, వైస్‌ ఛాన్స్‌లర్‌ వంటి ఉన్నత పదవులు పొందవచ్చు.

5. సంధ్యావందన పద్ధతులను మరచినవారు, సక్రమంగా ఆచరించలేనివారు ఈ దర్శనంతో నూతనోత్సాహం పొందుతారు.

పేద పిల్లలకు పాలను దానం చేస్తే దర్శన ఫలితాలు త్వరగా లభిస్తాయి.

కోటాకార లింగ ముఖ దర్శనం

సంగీత కళాకారులకు వర ప్రసాదం ఈ కోటాకార లింగ ముఖ దర్శనం.

షడ్జమం, మధ్యమం, గాంధారం అనే సంగీతపు రాగాలు షడ్జమాక్రమం, మధ్యమాక్రమం, గాంధారాక్రమం స్థానాలలో పుడుతున్నాయి. ఆ మూడు క్రమాలూ స్త్రీ ఆకారం ధరించి శ్రీఅయ్యర్‌మలై ఈశ్వరుడైన శ్రీరత్నగిరీశ్వరుడిని ప్రదక్షిణ చేశారు. ఈ ముగ్గురు మహిళలు కొమ్ము పసుపుతో 'శ్రీమ్‌' అని నామాన్ని జపిస్తూ గిరి ప్రదక్షిణ చేసి ముత్తయిదువలకు వాటిని దానం చేసేవారు.

రాగ దేవతల గిరి ప్రదక్షిణం ఎందుకు?

కీర్తనలు, దైవస్తుతులను రాగంతో ఆలాపాన చేసేటప్పుడు, వాద్య సంగీతములనందించేప్పుడు శుభ ప్రకంపనలు (పాజిటివ్‌ వైబ్రేషన్స్‌) వ్యాపించి పవిత్రమవుతాయి. పవిత్రమన స్థలంలోనే భగవంతుడూ కొలువుదీరుతాడు. మంచి తలంపులు, మంచి కార్యాలు జనించి అంతటా శుభాలే కలుగుతాయి. మంచి కార్యాలు అధికమై అంతటా శాంతి కలుగుతుంది.

ఈ ఉన్నతమైన ప్రశాంత పరిస్థితిని కలిగించే భగవంతుడినే ఆరాధిస్తూ రాగదేవతలు గిరి ప్రదక్షిణ చేశారు. రాగదేవతల త్యాగపూరిత ఆరాధనలకు ముగ్ధుడైన ముక్కంటి వారిని పరాశక్తి దేవి కంఠంలో మూడు 'హంసపూర్ణ రేఖలు'గా మారాలని వరమిచ్చాడు.

కోటాకార లింగ ముఖ దర్శన ఫలితాలు:

రాగదేవతలు కోటాకార లింగ ముఖ దర్శనం చేసుకున్నందువల్లే అంబిక కంఠంలో రేఖలుగా మారటంతో నేడు శ్రీఅయ్యర్‌మలైని నియమనిష్టలతో గిరి ప్రదక్షిణ చేసి పసుపు కొమ్ములపై 'శ్రీమ్‌' అనే మంత్రం చెక్కి, శ్రీ లక్ష్మీదేవి, గాయత్రీ, శ్రీ అంకాళ పరమేశ్వరి కీర్తినలు స్తుతించి సుమంగళి స్త్రీలకు దానం చేసి వలయాకార లింగ ముఖ దర్శనం శుభదాయకం.

1. సంగీత, సాహిత్య నాటక, వాద్య రంగాలలో సమున్నత స్థితిని పొందగలం.

2. ఆస్తమా, బ్రోన్‌చిలిట్స్‌ (పడిశం), ట్రాన్సిల్స్‌ (గొంతు నాళిక వాపు) వంటి శ్వాసకోస సమస్యల నుండి విముక్తి పొందగలం.

3. నత్తి వంటి సమస్యలు నయమవుతాయి.

4. ఆడస్వరం కలిగిన మగవారు, మగస్వరం కలిగిన ఆడవారు తమ స్వరలోపాల నుండి బయటపడతారు.

ముప్పురి లింగ ముఖ దర్శనం

గిరి ప్రదక్షిణలో తదుపరి మనం చూడబోయేది ముప్పురి లింగ ముఖ దర్శనం. బ్రహ్మాన్ని అవగాన చేసుకుంటే ఆత్మ ఐక్యమవుతుంది.

ఆత్మ ఐక్యం అంటే ఏమిటి?

బ్రహ్మం, ఆత్మ ఒక్కటే అనే స్థితిని తెలుసుకోవడమే ఆత్మ ఐక్యం. దీనిని పొందటానికి జ్ఞానమే సులువైన ఉపాయం.

ఈ జ్ఞానాన్ని పొందటానికి గల మార్గమేమిటి?

మనలో కుండలినీ అనే అద్భుత శక్తి ఉంది. అందరిలోను ఉన్న ఈ శక్తిని ప్రేరేపిస్తే మూలాధారం నుండి స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞా, సహస్రారం వంటి స్థాయిలకు చేరుకునేందుకు సాయపడే దేవియే శ్రీ నకులేశ్వరి.

శ్రీనకులేశ్వరీ దేవి అనుగ్రహం పొందటానికి కొంగణవర్‌ అనే సిద్ధుడు, సిద్ధకులనాయకుడైన అగస్త్యముని ఆశ్రయించారు. శ్రీనకులేశ్వరి దేవి దర్శన భాగ్యాన్ని పొందే మార్గాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఎల్లవేళలా మహాశివుడిని మనస్సులో సిద్ధింపజేసుకునేవారే సిద్ధులని చెబుతున్నాం. 'ప్రేమే శివం' అనే తత్త్వంలో లీనమైనవారే సిద్ధులు. ఇంతటి సిద్ధిని పొందినవారే కొంగణవుడు కుండలినీ శక్తిని ప్రేరేపించి పొందనున్న జ్ఞానమేమిటి?

శివోహమ్‌ను మించిన జ్ఞానం ఉందా? ప్రేమే శివం దీనికి మించిన తత్త్వమేదైనా ఉందా?

అయినా రాబోవు కాలంలో కుండలినీ శక్తిని మహత్యాన్ని తెలుసుకోలేని ప్రజలకు ఓ మంచి మార్గాన్ని చూపాలనే కొంగణ సిద్దుడు అగస్త్యముని ఆదేశం ప్రకారం శ్రీఅయ్యర్‌మలై గిరి ప్రదక్షిణం చేశారు. ముప్పురి లింగ ముఖ దర్శన మహిమతో శ్రీనకులేశ్వరీ దేవి అనుగ్రహమూ పొందారు.

ముప్పురి లింగ ముఖ దర్శన ఫలితాలు :

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు వేళలా శ్రీరత్నగిరీశ్వరుడిని ప్రదక్షిణచేసి ముఖ్యంగా గురువారం ముప్పురి లింగ ముఖ దర్శనం చేస్తే

1. సకల ప్రాణులను సమంగా భావించే ఉన్నత జ్ఞానం పొందగలం.

2. జాతి, మత, కుల విభేదాల వల్ల ఇతరులకు కలిగే కష్టాలు తొలగుతాయి.

3. కుండలినీ యోగాన్ని సక్రమంగా ఆచరించనందువల్ల కలిగే దేహ ఉష్ణ బాధలనుండి ఉపశమనం పొందగలం.

4. ఆయుర్వేద, నాటు వైద్య, సిద్ధ వైద్యులు తమ వృత్తులలో అభివృద్ధి చెందుతారు.

గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అవ్వయారు సూక్తిదాయక గీతం 'సీతకలబ శెంతామరై...' అనే వినాయకుడి కీర్తనను పాడితే శుభఫలితాలను పొందగలం. పేద విద్యార్థులకు చందనాది తైలాలు, పొన్నాగన్ని తైలం, గోరింటాకు తైలం వంటివి దానం చేస్తే ఆ శుభఫలితాలు త్వరగా పొందగలం.

సితాపాశ శీర్ముఖ ముఖ దర్శనం

గిరి ప్రదక్షిణంలో తదుపరి మనం చూడబోయేది గిరి ప్రదక్షిణ మార్గంలోని ఉసిల వృక్షం సమీపం నుండి శ్రీరత్నగిరీశుడిని దర్శనం చేసే సి తాపాశ శీర్ముఖ లింగ ముఖ దర్శనం.

'పనియే దైవం' అని అందరికీ తెలిసిన నానుడి. ఆ నానుడి ప్రకారం భగవద్‌ చింతన లేకుండా పని చేయడమే ప్రధానంగా భావిస్తున్నారు. అయితే భగవద్‌ చింతన కలిగి పనిచేయి, బాధ్యతలను మరచిని భగవంతుని మరువవొద్దు అనేదే పెద్దల వాక్కు. భగవద్‌ చింతనలో భక్తుడు తన బాధ్యతలను విస్మరించినా భగవంతుడే ఆ భక్తుడిని కాపాడతాడని మన పూర్వీకులు చెప్పారు. విజయాలయ చోళుడి చరిత్ర ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది.

మహా భక్తుడైన విజయాలయ చోళుడు అనే రాజు వీర పురుషుడు. మహాశివుడిపై అపారభక్తిని కలిగి ఉండేవాడు. భగవంతుడిపై ప్రేమానురాగాలు అధికమై రాజకీయ వ్యవహారాలను మరచి కొంతకాలం ఆధ్యాత్మికతపైనే దృష్టిసారించాడు. ఆ కారణంగా పలు ఇక్కట్లను ఎదుర్కోవలసి వచ్చింది. విజయాలయ చోళుడి పరిస్థితిని పసిగట్టిన శత్రువులు ఆ సందర్భాన్ని తమకు సాధకంగా మార్చుకోవాలనుకున్నారు. నలువైపులా దండెత్తి అతడి రాజ్యాన్ని కబళించాలని కుట్ర పన్నారు. ఆ సమయంలో విజయాలయ చోళుడి రాజమహలుకు సుందర జయదేవ మహర్షి అనే సిద్ధపురుషుడు వేంచేశారు. రాజు ఆ మహర్షిని సాదరంగా స్వాగతించాడు. అన్ని ఉపచారాలు చేసి సంతోషపరిచాడు. సుందర జయదేవుడు భవిష్యత్‌లో శత్రువుల వలన రానున్న ఆపదలను తెలిపి వాటిని నిరోధించే ఉపాయాలను తెలిపారు. ఆ సిద్ధుడి ఆదేశానుసారం విజయాలయ చోళుడు శ్రీరత్నగిరి క్షేత్రానికి వెళ్లి గిరి ప్రదక్షిణం చేశారు. పలు కాలం గిరి ప్రదక్షిణ చేస్తూ ఓ నిర్ణీత స్థలంలో నిలిచి పర్వత శిఖరాన్ని దర్శించి నమస్కరించాడు. అక్కడి నుండి ఓ అశరీర వాణి వినపడింది. 'తంజావూరు బృహదీశ్వరాలయంలో నిశుంభ సూధని దేవికి సిద్ధులు సూచించిన పద్ధతులలో ఆలయాన్ని నిర్మించి ఆరాధిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. నీవిప్పుడు చూసినది సితాపాశ శీర్ముఖ లింగ దర్శనం. ఈ దర్శనం వల్ల నిశుంభ సూధని దేవి నీకు సాయపడుతుంది' అని ఆ అశరీరవాణి పలికింది.

విజయాలయ చోళుడు చాలా సంతోషించి సిద్ధుల సాయంతో నిశుంభ సూధని దేవికి తంజావూరు మహాలయంలో ఓ ఆలయం నిర్మించి ఆ అమ్మవారిని ఆరాధించసాగాడు. దీనితో శత్రువుల కుట్రలన్నీ తొలగిపోయాయి. విజయాలయ చోళుడి కీర్తి పెరిగింది.

విజయాలయ చోళుడు దేవికి సిద్ధులు తెలిపిన రీతిలో నిర్మించిన ఆలయం తంజావూరు బృహదీశ్వరాలయంలో ఇప్పటికీ ఉంది. ఆ దేవికి రాహుకాల పూజలు చేయడం చాలా మంచిది.

గురువారాలలో రాహుకాల సమయంలో (1-30 నుండి 3-00 వరకు) నిశుంభ సూధని దేవికి పూజలు చేస్తే శుభఫలితాలు కలుగుతాయి. మహిళలు అనువైన సమయంలో పుష్పవతులవుతారు. వివాహ ఆటంకాలను గర్భసమయంలో కలిగే సమస్యలను నిశుంభ దేవి తొలగిస్తుంది. నిమ్మపులుసు అన్నం, పసుపు రంగు వస్త్రం, మాంగల్య దానాలు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి

సితాపాశ శీర్ముఖ లింగముఖ దర్శన ఫలితాలు :

శ్రీరత్నగిరీశుడిని ప్రదక్షిణం చేసి సి తాపాశ శీర్ముఖ లింగ ముఖ దర్శనం చేసినట్లయితే

1. కను దిష్టి, చేతబడి, శూన్యం వంటి ఆపదలు తొలగుతాయి.

2. ఇంటిలో వస్తువులు చోరీకి గురికావడం, తరచూ వస్తువులు కిందపడి పగిలిపోవడం, కాలిపోవడం వంటి సంఘటనలు జరుగుకుండా నిరోధిస్తుంది.

3. కారణరహితంగా మనపైన మోపే అపవాదులు, ఆరోపణలు తొలగుతాయి.

మంగళవారాల్లో స్కంధషష్టి కవచం, శ్రీపాంబన్‌ స్వామివారు అందించిన పగనివారణ కవచాలను పఠిస్తూ గిరి ప్రదక్షిణ చేసినట్లయితే శుభఫలితాలు పొందవచ్చు. చిన్న పిల్లలకు పాలులో తేనె కలిపి దానం చేస్తే మరింతగా మంచి ఫలితాలు లభిస్తాయి.

వరాలనిచ్చే తొడుముఖ దర్శనం

పాండ్యనాడును సర్వేశ్వరుడైన సోమసుందర పెరుమాళ్‌ తన సతీమణి మీనాక్షిదేవి సమేతుడై సుపరిపాలన చేసేవారు. ఆ భగవానుడు సామాన్య మానవుడిలాగే ఉంటున్నారు. ఇక మీనాక్షిదేవి తల్లిగారైన కాంచనల మాల మనస్సులో ఏదో వెలితి చోటుచేసుకుంది. అదేమిటి?

తన కుమార్తె మీనాక్షి కడుపు పండలేదేమిటా అన్నదే ఆ దిగులు. భక్తుల కోరికలను తీర్చేవాడే కదా భగవంతుడు!

సోమసుందరం అనేపేరుతో మానవరూపం ధరించిన మహేశుడు మానవుడిలాగే సంతాన భాగ్యం కోసం మహాపురుషులను, సిద్ధులను ఆశ్రయించాడు.

సర్వం తెలిసిన ఆ మహేశుడు ఏమీ తెలియనివాడిలా నటనమాడుతుండటాన్ని చూసిన సిద్ధులు 'మహానుభావా! మీకు తెలియనిదంటూ ఏమీ లేదు! అయినా ఏదో ఒక కారణం కోసం ఈ లీలను నడిపిస్తున్నారు. కనుక మేము కూడా తగు పరిహారం చెబుతాము. మాకోసం, ఈ లోక సంక్షేమార్థం ఆ పరిహారమొనర్చండి. శ్రీఅయ్యర్‌మలై అనే శ్రీరత్నగిరీశ్వరుడు కొలువైన క్షేత్రమొకటుంది. ఆ కొండను సతీసమేతంగా ప్రదక్షిణ చేయండి. ఆ సమయంలోనే వరమ్‌ ఈయుమ్‌ తోడ్ముఖ లింగ దర్శనమై ప్రదక్షిణను పూర్తి చేయండి చాలును' అని తరుణోపాయం చెప్పారు. సోమసుందర పెరుమాళ్‌ సతీసమేతంగా శ్రీఅయ్యర్‌మలైని దర్శించి, గిరి ప్రదక్షిణ చేశారు. స్వామివారి అనుగ్రహమూ పొందారు. మీనాక్షి దేవి గర్భం దాల్చింది. సోమసుందర పెరుమాళ్‌కు పట్టరాని సంతోషం కలిగింది.

పదినెలల తర్వాత మీనాక్షి దేవి అత్యద్భుతమైన బాలకుడు మురుగన్‌కు జన్మనిచ్చింది. ఆ బాలమురుగన్‌కు 'ఉగ్ర పెరువళుది' అని మహేశ్వరుడు నామకరణం చేశారు. ఉగ్రపెరువళుది పాండ్యనాడుకు పలురకాల కీర్తి ప్రతిష్టను కలిగించి దైవభక్తితో జీవిస్తుండేవాడు.

పార్వతిదేవి, సరస్వతీ దేవి మహేశ్వరుడి దర్శనం కోసం కాలిడిన పవిత్ర క్షేత్రమే శ్రీఅయ్యర్‌మలై. త్రిమూర్తులు, దేవతలు అందరూ దర్శన భాగ్యం పొందిన పరాశక్తి పాదాలు మోపిన స్థలం కూడా ఇదే.

ఈ పుణ్యభూమిలో వారి పాదాలు మోపేందుకు మన పూర్వీకులూ, మనమూ ఎంతటి పుణ్యం చేసుకున్నామో కదా! మానవుడిగా మనగలిగేంత దాకా శ్రీరత్నగిరీశ్వరుడిని సేవించి తరించెదము గాక!

వరాలనిచ్చే తొడ్ముఖ లింగ దర్శన ఫలితాలు :

1. ఉత్తమ సంతాన భాగ్యం కలుగుతుంది.

2. పసిబిడ్డలకు బాలారిష్టాలు తొలగుతాయి. భయ స్వభావం తొలగి ధైర్యవంతులవుతారు

3. శస్త్రచికిత్సలు లేకుండానే సుఖ ప్రసవాలు జరుగుతాయి.

4. అత్త, ఆడపడచులవల్ల కలిగే కష్టాలు తొలగుతాయి. సోమవారాల్లో గిరిప్రదక్షిణ చేస్తే వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి.

5. పసిపిల్లలకు దురలవాట్లకు దూరమవుతారు.

తొమ్మిది గజాల చీరను, లోపలి వస్త్రాలను దానం చేసి గిరి ప్రదక్షిణ చేస్తే శుభఫలితాలు లభిస్తాయి.

పూరివలర్ లింగ ముఖ దర్శనం

పరాశక్తి పార్వతీ దేవి పాద కడియం నుండె చిందిన నవరత్నాలు మహేశ్వరుడి తేజోశక్తి కారణంగా ఆయా రత్నాల వెలుగులు కాంతివంతమై నవగ్రహాలు ఆవిర్భవించాయి. నవరత్నాలు వాటి గుణాలకు తగినట్లుగా తొమ్మిదిమంది వీరులు జన్మించారు.

ఆ దేవి యొక్క ఎరుపు మణి రక్తవాసిని నుండి అద్భుతమైన అమర పరక్రామ వీరభాహు దేవుడు ఆవిర్భవించాడు. నవశక్తులు ఇలా లక్షల సంఖ్యలలో వీరులను జనింపజేసి వారిని వీరభాహువు నాయకత్వంలో పనిచేయమని పరమేశ్వరుడు ఆదేశించారు.

రక్త వల్లి వీరపుత్రుడైన వీరాభాహు దేవుడు తన తల్లిని కలుసుకుని 'అమ్మా! నా తొలి కర్తవ్యమేమిటో వివరించండి' అని అడిగాడు. రక్తవల్లి సమాధానం చెబుతూ 'కుమారా తొలుత నీవు ఉత్తమమైన వరాలను పొందాలి. కనుక రత్నాలలో మేటి రత్నమైన శ్రీరత్నగిరీశ్వరుడిని గిరి ప్రదక్షిణం చేసి అనుగ్రహం పొందు' అని ఆజ్ఞాపించింది. అమ్మవారి ఆదేశానుసారం వీరభాహుడు శ్రీఅయ్యర్‌మలై చేరుకుని గిరి ప్రదక్షిణ చేయసాగాడు.

అలా గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓ ముఖ్యమైన చోట తిరువటాభోగి పర్వత శిఖరాన్ని చూశాడు. ఆ దర్శనమే పూరివలర్‌ లింగ ముఖ దర్శనం. ఆ దర్శనంలోనే ఓ అద్భుత జ్యోతిని తిలకించాడు. ఆ జ్యోతి దర్శనంలో అతడిలో దురాశా భావాలను తొలగించే వరాన్ని పొందాడు. పూరివలర్‌ లింగ ముఖ దర్శనమే కాకుండా మరిన్ని రకాల దర్శనాలను పొంది పలు వరాలను పొందాడు.

పేరాశను తొలగించండి!

ఓ సమయాన నారదుడు అభీష్టసిద్ధి కోసం వసంత యాగం నిర్వహించాడు. ఆ యాగంలో కొన్ని తప్పిదాలు చోటుచేసుకుని యాగం నుండి ఓ పెద్ద మేక రాక్షసగుణం, అందరికీ కష్టాలను కలిగించే విధంగా జనించింది. ఆ మేకకు 'కాలక కుంభుడు' అని పేరు. కాలక కుంభుడు పెడుతున్న బాధలు తాళలేక దేవతలు మురుగభగవానుడిని ఆశ్రయించారు. మురుగభగవానుడు కాలక కుంభుడి జననం గురించి తెలిపారు. యాగ సమయంలో అధికంగా ఆస్తులు సంపాదించాలనే పేరాశ ఆహూతి సమర్పించినందువల్లే ఈ మేషం జనించిందన్నారు. పేరాశకు మారురూపమైన ఆ మేకను అణచడం ఎవరి వల్లా సాధ్యం కాదు. వీరబహుడి వల్లే సాధ్యం. కనుక ఆ వీరబాహును వేడుకోమని సూచించారు.

శ్రీఅయ్యర్‌మలైలో పూరివలర్‌ లింగముఖ దర్శన భాగ్యం పొందినవాడు వీరబాహుడొక్కడే. అతడికే దురాశను దునుమాడే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని మురుగభగవానుడు తెలిపారు. దేవతలంతా ఆమేరకు వీరబాహును కలిశారు. దేవతల ప్రార్థన మేరకు వీరబాహుడు ఆ మేకను అణచి మురుగ భగవానుడికి వాహనంగా ఇచ్చాడు.

పూరివలర్‌ లింగ ముఖ దర్శన ఫలితాలు :

మానవులందరికీ ఆశ కలుగటం సహజమే. న్యాయమైన ఆశలు కలిగి ఉండటం మంచిదే. పేరాశలే మానవుడిని దుఃఖ సముద్రంలో పడవేస్తాయి. పూరివలర్‌ లింగ ముఖ దర్శనం వలన,

1. అపరిమితమైన ఆస్తులు కలిగివున్నవారిలో దాన గుణాన్ని కలిగిస్తుంది.

2. ధారపోయిన బిడ్డలు లభ్యమవుతారు.

3. విడిపోయిన భార్యాభర్తలు ఒక్కటై కాపురం చేస్తారు.

4. ఐ.ఏ.ఎస్‌, ఐ.పి.ఎస్‌. అధికారులు, సైన్యాధిపతులు వంటి ఉన్నతాధికారుల పదవికి ముప్పు రాకుండా కాపాడుతుంది.

5. భగవంతుడికి తలనీలాలు సమర్పించలేకపోయినవారికి ప్రాయశ్చిత్తం ఏర్పడుతుంది.

సాధ్యమైనంత వరకూ దేవని మొక్కులను నెరవేర్చితే కష్టాలన్నీ గట్టెక్కుతాయి.

ఆర్జవ సేవా లింగ ముఖ దర్శనం

పరాశక్తి అంశంగా భూలోకంలో పరాంకుశపురం అనే ఊరిలో ఓ ఉత్తమురాలు జనించింది. పరాంకుశంపురం నేడు ఓరగడం అని పిలువబడుతోంది. తిరుక్కళుకుండ్రం సమీపాన ఉంది. శక్తి అనుగ్రహం పొందిన ఆ మహిళ త్యాగశీలురాలు. ఉత్తమగుణాలూ అధికంగా కలిగి ఉండటంతో ఆమెను 'కుళింది' అని పిలువబడ్డారు.

కుళింది భర్త ఓ వ్యాపారి. బాగా సంపాదించాడు. ఆ సంపాదనతో సంతృప్తిపడక ఇంకా ఇంకా సంపాదించాలనుకున్నారు. అయితే కుళింది భగవదారాధనపైనే దృష్టిసారించి, భర్త సంపాదనను ఖర్చుపెట్టి 32 రకాల దానాలను చేసింది. ఈ దాన ధర్మాల వల్ల వ్యాపారంలో అధిక లాభాలు వచ్చాయి. ఆదాయమూ పెరిగింది.

తన భార్య చేస్తున్న 32 రకాల దానాల వల్లే తన వ్యాపారం అభివృద్ధి చెందుతున్నదని తెలుసుకోలేకపోయిన ఆ వ్యాపారి తన సామర్థ్యం వల్లే ఆదాయం అధికమైంది అపోహపడ్డాడు. గర్వం తలకెక్కింది. గర్వభంగమై వ్యాపారం దెబ్బతిన్నది.

వ్యాపారంలో నష్టపోయి ఊరు చేరుకున్నారు. 'ఊరిలో ధనం ఉంది కనుక ఈ నష్టం వల్ల తనకు ఎలాంటి బాధ వుండదు అని అనుకున్నారు. కానీ అప్పటికే కుళింది దాన ధర్మాలకు ఇంటి ఖజానాను ఖాళీ చేసిందని తెలుసుకుని వ్యాపారి దిగ్భాంతి చెందాడు. నష్టమొస్తే కష్టమొస్తుంది. కష్టమొస్తే కోపం కలుగుతుంది. ఆ కోపాన్ని భార్యపై ప్రదర్శించాడు. దానధర్మాలకు ఖర్చుపెట్టిన సొమ్మంతా తీసుకొచ్చి తనకివ్వాలని, అప్పటి వరకూ ఇంటిని విడిచి వెళ్లి పొమ్మని తరిమికొట్టాడు.

మగువలకు పతియే దైవం. ఆ పతి తనను ఇంటి నుండి తరిమికొడితే ఎలా బ్రతకాలి. కుళింది బాధపడింది. 'ధర్మం చేస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది' అని చెబుతారు కదా అదే ఇక్కడ నిజమైంది. కుళింది ఎదుట కమలముని అనే ఉత్తమ సిద్ధుడు ప్రత్యక్షమయ్యాడు. కుళింది ఆ సిద్ధుడి పాదాలకు మొక్కింది. కమలముని కుళిందిని ఓదార్చి 'అమ్మా నీకో తరుణోపాయం చెబుతాను విను! శ్రీ అయ్యర్‌మలైకి వెళ్లి గిరి ప్రదక్షిణ చేసి రత్నగిరీశుడిని దర్శనం చేసుకుంటే నీ భర్తకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అతడిలో పేరాశకూడా తొలగిపోతుంది' అని తెలిపారు.

కుళింది ఆ మునీశ్వరుడి ఆదేశానుసారం శ్రీఅయ్యర్‌మలై వెళ్లి నెలల తరబడి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ముప్పూటలా గిరి ప్రదక్షిణ చేసి ఆ ఈశ్వరాలయ మెట్లపై కూర్చుని 'శ్రీరత్నగిరీశ్వరా! కాపాడు తండ్రీ!' అంటూ ప్రార్థించింది. సుదీర్ఘ ప్రార్థనల అనంతరం ఓ రోజు ఆర్జవ సేవా లింగ ముఖ దర్శన లభించింది. ఆ దర్శనంలోనే మహాజ్యోతి ఆవిర్భవించి శ్రీఅయ్యర్‌మలై లింగాకారంలో దర్శనమిచ్చింది. 'కుళింది దేవీ! నీకు సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయి, రఘునాధ పుష్కరిణి వద్ద వరదాయినిగా కొలువవుతావు' అంటూ అశరీరవాణి పలికింది.

కుళింది భర్తకు సకల సంపదలు ప్రాప్తించాయి. అతడి జ్ఞాన నేత్రాలూ తెరచుకున్నాయి. కుళింది దేవి ఆచూకీ కోసం అన్ని చోట్లా వెదికాడు. చివరకు శ్రీఅయ్యర్‌మలై చేరుకుని కుళింది 'కుళింది అమ్మవారు'గా ఆ చోట వెలసి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. పరాంకుశపురం రఘునాధ పుష్కరిణి వద్ద కుళింది దేవి అమ్మవారుగా వేంచేసి ఉండటం కనిపించింది.

ఆ భర్త కంట కన్నీరు ఏరులైపారింది. శోకపూరితమైన ఆనందం కనిపించింది. రత్నగిరీశ్వరుడి లీలా విశేషాలు ఎవరికి ఎరుక?

కనుక వృత్తిలో, వ్యాపారంలో కష్టము నష్టమూ కలిగితే భార్యను తప్పుబట్టకండి. శ్రీఅయ్యర్‌మలై మహేశుడైన శ్రీరత్నగిరీవ్వరుడిని ప్రదక్షిణ చేసి ప్రార్థించండి.

(చెంగల్పట్టు జిల్లా తిరుక్కళుకుండ్రం నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఓరగడం కోదండరమాలయం ఉంది. మూలవర్లు : శ్రీరఘునాధ పెరుమాళ్‌, శ్రీరాముడు వీరాసనం కొలువైన క్షేత్రమిది)

మోక్ష నిర్ణయ మూర్తి లింగ ముఖ దర్శనం

కిష్కింధ అనే చోటు దట్టమైన అటవీ ప్రాంతం. అక్కడ అద్భుతమైన వనమూలికలు, సరస్సులు, తటాకాలు, సువాసనలు వెదజల్లే పూలవనాలు ఉన్నాయి. దేవలోకంలోనూ చూడలేని అద్భుతాలు ఉన్న స్థలమది. ఆ ప్రాంతాన్ని చేజిక్కుంచుకోవాలని దేవతలు, అసురులు ఆరాటపడ్డారు.

భూలోకంలోని ఆ పర్వత ప్రాంతం అక్కడ నివసిస్తున్నవారికే స్వంతమని పరమేశ్వరుడు తెలుపటంతో దేవతలు ఆ స్థలం వీడి వెళ్లారు. అసురులు ఆ చోటును ఆక్రమించుకోవాలనుకున్నారు. ఈ సంగతిని దేవతలు బ్రహ్మదేవుడు ఆగహ్రించి నేతాగ్న్రి పుట్టించి కిష్కింధ అనే పర్వతంపై ప్రసరింపజేశాడు. ఆ అగ్నిజ్వాలల తాకిడిని అసురులు తట్టుకోలేక పరుగులు తీశారు. ఆ కిష్కింధ పర్వతంపై ధనుర్బాణ సిద్ధుల కులానికి చెందిన వానరాలు అధికంగా ఉండేవి. ఆ వానరాలను కాపాడేందుకు బ్రహ్మదేవుడు ఓ వానరాన్ని సృష్టించాడు. ఆ వానరుడి పేరు రిషన్‌.

రిషుడు ఆ వానరాలను చూసి ఆశ్చర్యపోయాడు. 'బ్రహ్మదేవా! ఈ వానరాలన్నీ బాణంలా వేగంగా పైకీ కిందకు దూసుకెళుతున్నాయి. వాటిని అణచి పరిపాలించేందుకు తగ్గ అద్భుత వరాలను ప్రసాదించండి' అని బ్రహ్మదేవుడిని వేడుకున్నారు.

'ధనుర్భాణ సిద్ద కులానికి చెందిన ఈ వానరాలను అణచి పరిపాలన చేయాలంటే శ్రీఅయ్యర్‌మలై వెళ్లి, శ్రీరత్నగిరీశ్వరుడిని ప్రదక్షిణ చేసి అనుగ్రహం పొందు!' అని బ్రహ్మ దేవుడు ఆశీర్వదించాడు.

రిషుడు ఆ ప్రకారం ముప్పూటలా శ్రీఅయ్యర్‌మలై శ్రీరత్నగిరీశ్వరుడిని ప్రదక్షిణ చేశాడు. ఆ విధంగా గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మోక్ష నిర్ణాయహ మూర్తి లింగ దర్శనం లభించింది. ఆ సందర్భంగా సుడిగాలి జనించి అందులో నుండి జ్యోతి దర్శనమూ లభించింది.

ఆ సమయంలో అశరీరవాణి 'రిషుడా! పలుకోటి వానరాలను కట్టడి చేసే పాలించే సామర్థ్యం నీకు లభించింది. ఇక నిశ్చింతగా కిష్కింధకు వెళ్లు' అని పలికింది. అలా రత్నగిరీశ్వరుడి అనుగ్రహం వల్ల ఆ రిషుడికి కలిగిన పుత్రులే వాలిసుగ్రీవులు.

మోక్ష నిర్ణాయహ మూర్తి లింగ దర్శన ఫలితాలు!

శ్రీఅయ్యర్‌మలైని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి నాలుగు వేళలాల గిరిప్రదక్షిణ చేయడం వల్ల

1. ఐ.ఏ.ఎస్‌, ఐ.పి.ఎస్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్స్‌ ఉన్నత పదవులలో ఉన్నవారు, నాయకులు, సైన్యాధ్యక్షులు, లేబర్‌ ఆఫీసర్స్‌, కార్మిక సంఘాల వారు శుభ ఫలితాలు పొందుతారు.

2. రిషుడితోపాటు గిరిప్రదక్షిణకు వచ్చిన వానరాలు ఇంకా ఈ పర్వతంపై సంచరిస్తుండటం విశేషం. దైవ దర్శనానికి వచ్చే భక్తులు ఆ వానరాలకు ఎలాంటి హాని చేయకుండా వాటికి ఆహారం అందింస్తే దుష్టశక్తుల బాధలు తొలగి రక్షణ పొందగలరు.

3. శాశ్వతమైన ఉద్యోగం, వ్యాపారం పొందలేనివారికి మంచి జరుగుతుంది.

న్యాయ సుదర్లింగ దర్శనం

గణేశలోకంలో గణపతి సిద్ధి, బుద్ధి సమేతంగా కొలువై ఉన్నారు. ఆయన చుట్టూ గణపతి అనుగ్రహం పొందిన సిద్ధులు సమూహం ఉంది. గజరక్ష సిద్ధుడు, తుంబికై పెరు మునీశ్వరుడు, దడియలంకార గణ మునీశ్వరుడు వంటి మహా సిద్ధులు గణపతి దేవుని స్తుతిస్తున్నారు. అంతటి సంతోషదాయక సమయంలో నారదముని వేంచేశారు. నారదుడు గణపతికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించాడు.

గణపతి 'నారదా! తమ రాక సంతోషదాయకం' అని స్వాగతించారు. నారదుడు 'స్వామీ! మీ పిల్లలను దర్శించాలని ఆరాటపడుతున్నాను' అని చెప్పాడు.

'వారిక్కడే మీ ఎదుట ఆటలాడుకుంటూ ఉన్నారే' అని చెప్పాడు గణపతి. నారదుడు ఆశ్చర్యంతో 'స్వామీ వారిని నేను చూడలేకపోయానే! ఎక్కడున్నారు?' అని ప్రశ్నించి అటూ ఇటూ చూశాడు.

గణపతి చిరునవ్వుతో తన పిల్లలున్న ప్రాంతాన్ని చూపాడు. అప్పుడే నారదుడు వారిని చూడగలిగాడు.

గణపతి సంతతిని దేవ ఋషి నారదుడివల్లే చూడలేకపోయారంటే వారంతటి శక్తిమంతులో మనకు అర్థమవుతున్నది కదా! దీనిని బట్టి మనకు తెలిసేదేమిటంటే దైవానుగ్రహం ఉన్నప్పటికీ మనం చూడలేని అద్భుతాలెన్నో ఉన్నాయని అర్థమవుతుంది.

గణపతి నారదుడితో 'నారదా! నీ కలహం నా పిల్లలతో ప్రారంభించదలిచావా?' అని అడిగాడు. నారదుడు గణపతి పలుమార్లు నమస్కరించి 'ప్రభూ! మీకు తెలియనిది ఏమీ లేదు కదా' అని చిరునవ్వు నవ్వాడు.

గణపతి 'సరే నువ్వనుకున్నట్టే నీ కలహాన్ని నిర్విఘ్నంగా ఆరంభించు' అని చెప్పారు. గణపతి పిల్లలు నారదుడిని చూసి 'స్వామి మాకు మంచి కథలు చెప్పండి' అని అడిగారు. నారదుడు అంగీకరించి ఆ చిన్నారులను తన వెంట తీసుకెళ్లాడు.

గణపతి పిల్లల పేర్లు లోకానికి తెలియాలి కదా. కనుక నారదుడు అడిగాడు ' మీ పేర్లేమిటి?' అని. పెద్దవాడు తన పేరు 'లాభన్‌' అని, చిన్నవాడు 'లక్షణ్‌' అని తెలిపాడు. అప్పుడే నారదుడు తన కలహాన్ని ప్రారంభించదలిచాడు.

'అవును! మీరొక విషయం తెలుసుకోవాలి. భూలోకంలో యమున అనే నది ప్రవహిస్తోంది. ఆ నదిలో పరుగులు తీసేవాడు యమున అవుతాడు. అతడు తన సోదరుడైన యమధర్మరాజును పిలిచి కార్తీమాసం శుక్లపక్ష ద్వితీయ దినాన విందును ఏర్పాటు చేసి రక్షాబంధన కంకణాన్ని చేతిలో కట్టి నమస్కరించాడు. సంతోషపడిన యమధర్మరాజు 'ఈ రోజు ఎవరైనా సహోదరిలు తమ అన్నలను, తమ్ములను ఇంటికి పిలిచి విందారగింపజేసి ఈ కంకణాన్ని కట్టినట్లయితే యముడైన తాను వారికి బాధలు కలిగించను' అని చెప్పారు అని నారదుడంటాడు.

'మరి మీకు అలాంటి కంకణాన్ని కట్టేందుకు మీకంటూ తోడబుట్టిన అక్కలు గానీ చెల్లెళ్లు గానీ లేరే! ' అని నారదుడు వారిలో కలత పుట్టించాడు. తను వచ్చిన పని పూర్తయ్యిందన్న సంతోషంతో నారదుడు గణపతి వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. గణపతి పిల్లలు 'మనకు తోడుబుట్టిన అక్కలు, చెల్లెళ్లు లేరు కదా పద మన తండ్రిగారిని అడుగుదాం' అంటూ ఇద్దరూ గణపతి దగ్గరకు వెళ్లారు. 'తండ్రీ! మాకొక చెల్లెలు కావాలి. తక్షణమే చెల్లెల్ని పుట్టించండి' అని అడిగారు

ఆహా నారదుడు చిచ్చు పెట్టి వెళ్ళాడు కదా అని గణపది దీర్ఘాలోచనలో పడిపోయాడు. పిల్లలేమో పట్టు విడువలేదు. గణపతి తన పిల్లలతో 'సరే! మీరనుకున్నటుగానే చెల్లెలు కావాలంటే మీకొక ఉపయా చెబుతాను వినండి. మీరిరువురూ భోలోకం వెళ్లి శ్రీఅయ్యర్‌మలైని భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేసి శ్రీరత్నగిరీశ్వరుడిని ప్రార్థిస్తూ తపస్సు చేసి ప్రార్థిస్తే మహేశుడు మార్గం చూపుతాడు' అని తెలిపారు.

గణపతి లోకం నుండి లాభలక్షణ్‌లు తమ పరివారంతో భూలోకం వెళ్ళి శ్రీఅయ్యర్‌మలై చేరుకుని గిరి ప్రదక్షిణ చేయసాగారు. అలా గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు 'న్యాయ సుదర్లింగ దర్శనం కలిగింది. అప్పుడు ఆ పర్వతశిఖరంపై నుండి అశరీరవాణి వినిపించింది. 'మీ కోరికను తీర్చగలిగినవాడు ఆదిమూల గణపతియే'నని పలికింది.

లాభన్‌, లక్షణ్‌ మిక్కిలి సంతోషంతో శ్రీఅయ్యర్‌మలై ఈశ్వరుడికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి ఆ పర్వతం చుట్టూ పలు తటాకాలు నిర్మించి గణపతి లోకాన్ని చేరుకున్నారు. ఈ చిన్నారుల తేజస్సు నుండి మహాగణపతి ఓ జ్యోతిని సృష్టించి తనలో ఐక్యపరచుకుని తన దేహం నుండి 'న్యాయ సుధర్జ్యోతి' వెలికి తీసి బుద్ధి అనే తన సతీమణిలో ఆ జ్యోతిని చేర్చి 'సంతోషి' అనే ఆడశిశువును జన్మింపజేశాడు.

లాభన్‌, లక్షణ్‌లు తమ సోదరి సంతోషి ద్వారా రక్షాబంధన కంకణాలు కట్టుకుని ఆనంద పరవశులయ్యారు. ఇక అప్పటి నుండి మానవులు సంతోషి మాతను పూజించసాగారు. కనుక అందరూ సంతోషకరమైన జీవనానికి శ్రీఅయ్యర్‌మలై గిరి ప్రదక్షిణ చేయాలని గణపతి దేవుడే ఆదేశించడం అద్భుతమే మరి!

ఇప్పటి దాకా వెలువడని సంతోషి మాత చరిత్రను లోకానికి అందించిన శ్రీలశ్రీ వెంకటరామ స్వాములు, ఆయన గురుదేవులైన శ్రీలశ్రీ ఇడియాప్ప స్వాములకు మనమెంతో రుణపడి ఉన్నాము.

న్యాయ సుదర్లింగ ముఖ దర్శనం

1. ప్రతి కుటుంబంలోను ఆడ, మగ సంతానం ఉంటేనే మంచిదని సిద్ధులు చెబుతుంటారు. ఆడ సంతానం కోసం చింతించే తల్లిదండ్రులు శ్రీఅయ్యర్‌మలైలో గిరి ప్రదక్షిణ చేసి న్యాయ సుదర్లింగ దర్శనం చేసుకుంటే వారి కోరిక నెరవేరుతుంది.

2. తోబుట్టువుల మధ్య ఏర్పడే మనస్పర్థలు తొలగిపోతాయి.

3. కార్తీక మాసం శుక్లపక్ష ద్వితీయ తిధి నాడు శ్రీఅయ్యర్‌మలై గిరిప్రదక్షిణం, న్యాయ సుదర్లింగ దర్శనం చేసుకుంటే శుభఫలితాలు చేకూరుతాయి. జాతి, మత, కుల బేధాలకు అతీతం అన్నదానం చేస్తే శ్రీరత్నగిరీశుడి సంతషించి సకల సౌభాగ్యాలు అందిస్తాడు.

4. సంతోష్‌, సంతోషి అనే పేర్లున్నవారు పైన పేర్కొన్న విధంగా ఆ శుభదినాన గిరి ప్రదక్షిణ చేస్తే అన్నింటి శుభం కలుగుతుంది. ఆ పేర్లు కలిగినవారికి అన్నదానం, వస్త్రదానం చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి.

వ్యాపార ప్రముఖులు నగదును లెక్కించేటప్పుడు 'లాభం, రెండు, మూడు' అని లెక్కించడం మానుకుని ఇకపై 'ఓం ఏకదంతాయ నమః, ఓం రెండు, ఓం మూడు అంటూ లెక్కిస్తే వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారమూ బాగా అభివృద్ధి చెందడానికి శ్రీరత్నగిరీశ్వరుడు దోహదం చేస్తాడు.

గిరి ప్రదక్షిణ మార్గంలో సిరుమలై కొలను అని పిలువబడుతున్న తీర్థం సమీపంలో మనకు లభించే దర్శనమే న్యాయ సుదర్‌ లింగ దర్శనం.

నంది లింగ ముఖ దర్శనం

ప్రస్తుతం ఆచరణలో అనుసరింపబడుతున్న 'ప్రభవ నుండి అక్షయ' దాకా ఉన్న 60 సంవత్సరాల పేర్లు ఎలా పుట్టాయో తెలుసునా?

దేవతులు, అసురులు అమృతం పొందటానికి క్షీర సాగరమధనం చేశారు. ఆ మధనంతో పుట్టిన అమృతాన్ని దేవతల నుండి అపహరించుకున్నారు. అసురుల చేతనున్న అమృతాన్ని పొందటానికి శ్రీమన్నారయణుడు మోహిని అవతారం ఎత్తారు. ఆ మోహిని అందానికి ముగ్దులైన అసురులు అమృతాన్ని ఆమెకిచ్చారు. ఆ మోహిని అమృతాన్నంతటినీ దేవతలకు పంచిపెట్టింది. మోహిని అవతారం చూసి ముగ్ధుడైన నారదుడు తాను కూడా ఓ అందమైన యువతికి మారాలని అనుకుని శ్రీమన్నారాయణుడికి తన కోరికను తెలియజేశాడు.

'నారదా! కృష్ణావతార కాలంలో నీవు యువతి రూపం పొందుతావు. నాలాగే మోహినిలా అందంగా జనించాలంటే భోలోకంలో శ్రీఅయ్యర్‌మలైలో గిరి ప్రదక్షిణ చేయాలి. ఆ తర్వాత నీవు నన్నే శరణుపొందుతావు' అని శ్రీమన్నారాయణుడు తెలిపారు.

నారదుడు శ్రీఅయ్యర్‌మలై వెళ్ళి ప్రదక్షిణ చేసి అందమైన యువతిగా జన్మించేందుకు వరం పొందిన స్థలంలో చూడబడునదే నందిలింగ ముఖ దర్శనం. ఈ దర్శనం వల్ల నారదుడికి అందమైన యువతి రూపం కలిగింది. ఆ అందమైన యువతి రూపంలో నారదుడు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లాడు. ఆ ఇరువురి కలయిక వల్ల వారికి 60 మంది సంతానం కలిగింది. ఆ అరవైమంది పిల్లల పేర్లే 'ప్రభవ' నుండి 'అక్షయ' దాకా ఉన్న సంవత్సరాలు.

తమిళ సంవత్సరాలు ఇలాంటి పేర్లు రావడానికి శ్రీఅయ్యర్‌మలై గిరి ప్రదక్షిణ కారణమైంది.

నంది లింగ ముఖ దర్శన ఫలితాలు :

గిరి ప్రదక్షిణ మార్గంలో ప్రస్తుతం సిరుమలై కుళంగా పిలువబడే తీర్థం సమపీం నుండి శ్రీఅయ్యర్‌మలైని దర్శనం చేస్తే ఆ దర్శనాన్నే నంది లింగముఖ దర్శనం. శ్రీఅయ్యర్‌ మలైని నియమనిష్టలతో నంది లింగముఖ దర్శనం చేస్తే,

1. అందవిహీనమైన ముఖం కలిగినవారు అందంగా తయారవుతారు.

2. ఆపరేషన్‌, నిప్పుమంటల గాయం వల్ల ఏర్పడిన మచ్చలున్నవారు వశీకరమైన రూపాన్ని పొందుతారు.

3. అంగారక దోషం, నాగ దోషం వంటి పలు దోషాలకు సులువైన పరిహారం లభిస్తాయి. ఇలాంటి దోషమున్నవారు శుక్రవారాలలో గిరి ప్రదక్షిణ చేసి పసుపు, తమలపాకులు, గాజులు వంటి మంగళకరమైన వస్తువులను ముత్తయిదువలకు దానంగా ఇస్తే శుభ ఫలితాలను పొందుతారు.

4. ప్రేమ వివాహాలు సానుకూలమవుతాయి. ముఖ్యంగా మగువలకు తమ మనస్సుకు నచ్చిన భర్తలను పొందుతారు.

సాధారణంగా అందాన్ని ఇష్టపడే పురుషులు, మహిళలకు ఓ కల్పవృక్షంగా శ్రీఅయ్యర్‌మలై గిరి ప్రదక్షిణం భాసిల్లుతుంది. అయ్యర్‌మలై ఈశ్వరుడు అందాలను ప్రసాదించే దేవుడు!

వైరాగ్య ప్రకరణ లింగ ముఖ దర్శనం

ప్రతిమానవుడు జీవితంలో అభివృద్ధి చెందడానికి భగవంతుడు అనువైన సందర్భాలను ప్రసాదిస్తాడు. అయితే కొంతమంది మాతమ్రే ఆ సందర్భాలను తమకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. జీవితంలో ఉన్నత స్థితిని పొందుతారు.

సందర్భాలు ఎప్పుడూ సింగారించుకుని రావు. కనుక సందర్భం వచ్చినప్పుడు దానిని గుర్తించి తీవ్ర వైరాగ్యంతో సానుకూలం చేసుకోవడానికి శ్రీఅయ్యరమల మహేశుడు మనకు అందించే అరుదైన వరమే వైరాగ్య ప్రకరణ లింగ ముఖ దర్శనం.

సంవాణన్‌ అనే ఉత్తముడైన రాజు ఏ కార్యాన్ని చేపట్టినా పట్టువిడువ తీవ్ర ప్రయత్నాలు కొనసాగించి విజయం సాధిస్తాడు. వైరాగ్య చిత్తం కలిగినవాడు.

జీవితంలో సకలము సిద్ధిస్తే ఆ మానవుడిలో గర్వం తొంగిచూస్తుంది. అదే సమయంలో ఓటమి పాలైనవారు పడే వేదనను గుర్తించలేరు.

కనుకనే సంవాణుడికి వశిష్ట మహర్షి ఓ పరీక్ష పెట్టారు. అదేమిటి?

మాయ వలన రూపొందే సమస్తమూ మాయమవుతుంది. అయితే నిస్వార్థమైన పవిత్ర భావనను కలిగితే ఏర్పడేవన్నీ ఆ మాయనే అధిగమిస్తాయి. దీనిని అర్థం చేసుకోవాలంటే వైరాగ్యం కలిగి ఉండాలి. అప్పుడే ఏవైనా సాధించగలం.

వైరాగ్యపు పట్టును పరిశీలించేందుకే సంవాణుడిని నీటి చుక్క లభించని అడవిలో వేటకు పంపారు.

సంవాణుడు కూడా అలసిపోకుండా వేటాడుతూ వెళ్లాడు. ఉన్నట్టుండి అతడికి విపరీతంగా దాహం ఏర్పడింది. అతడి గుర్రానికి దాహమేసింది. తను నేర్చుకున్న అరుదైన విద్యతో నీటి వనరులున్న చోటును గుర్తించి బాణం వేయడానికి సిద్ధమయ్యాడు.

ఇక్కడే మాయ తన ప్రభావమేమిటో చూపించింది. అతడికి చేరువగానే నీరున్నట్లు ఎండమావి కనిపించింది. దగ్గరలోనే నీరున్నప్పుడు శక్తివంతమైన బాణం వేయడమెందుకని వెనక్కి తగ్గాడు. ఇలా పలు చోట్ల ఎండమావులే కనిపించాయి. చివరకు అతడిని సొమ్మసిల్లిపోయేలా చేయసాగింది. ఆ సమయంలో అతడి ఎదుట ఓ అందమైన యువతి కనిపించింది. ఆమెను చూడగానే 'నీళ్లు కావాలి' అంటు అడిగాడు. ఆ యువతి 'నీళ్లు కావాలా? నేను కావాలా?' మీకు రెండు నిబంధనలు విధిస్తాను. వాటికి కట్టుబడితే మీకు సహాయం చేస్తాను' అని చెప్పింది.

'ఏమిటా నిబంధనలు?' రాజు అడిగాడు. 'మీరు చేసిన దానధర్మాలను నాకు దానం చేస్తే దాహం తీరేందుకు నీళ్ళిస్తాను. మీరు చేసిన తపో ఫలితాలను దానం చేస్తే నీ భార్యనవుతాను' అన్నది ఆ యువతి.

సంవాణుడు తను దాహంతో బాధపడినా ఫరవాలేదు. తను స్వారీ చేస్తున్న గుర్రం దాహాన్ని తీర్చాలనుకున్నాడు. వెంటనే 'నేను చేసిన దానాలన్నింటని నీకు దానం చేస్తున్నాను' అంటూ సత్య ప్రమాణం చేశాడు. ఆ యువతి అందించిన నీటితో తను గుర్రం దాహం తీర్చాడు. వెంటనే ఆ అశ్వం ధర్మదేవత రూపంలో అతడి ఎదుట ప్రత్యక్షమైంది.

ఆ ధర్మదేవత సంవాణుడినితో ఇలా చెప్పింది. 'సంవాణా చక్రవర్తీ! నీకున్న వైరాగ్యం అద్భుతం. నిన్ను పరీక్షించేందుకే వచ్చాను. ఇక నీ ఎదుటనున్న ఆ ఉత్తమమైన కన్యను పరిణయమాడాలంటే శ్రీఅయ్యర్‌ మలై వెళ్లి గిరి ప్రదక్షిణ చేసి శ్రీరత్నగిరీశుడి ఆశీస్సులు పొందాలి. మిక్కిలి తపోబలాన్ని కలిగి ఉంటేనే ఆ కన్యను పొందగలవు' అని చెప్పింది.

సంవాణ మహారాజు శ్రీఅయ్యర్‌లమై చేరుకుని కొన్నేళ్లపాటు గిరి ప్రదక్షిణ చేశారు. ఆ సమయంలోనే వైరాగ్య ప్రకరణ లింగముఖ దర్శనమైన, మహా జ్యోతి ఆవిర్భవించి 'సంవాణ చక్రవర్తీ! నీ వైరాగ్యానికి తపోబలాన్ని చూసి సంతసిస్తున్నాను. నీవు ఆశించినట్లే సూర్య పుత్రిక అయిన ఆ యువతిని వశిష్ట మహర్షి సమక్షంలో పరిణయమాడగలవు' అని అశరీరవాణి పలికింది.

సంవాణ చక్రవర్తికి ఆ పడతితో పరిణయం జరిగింది. ఆ దంపతులకు జనించిన శిశువే 'కురు'. అతడి మూలంగానే కురువంశమే వచ్చింది. ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తున్నదేమిటి;

దానధర్మాలు చేస్తే ఆయుష్షు అధికమవుతుంది. వైరాగ్యంతో చేసే తపస్సు ద్వారా సుగుణవతియైన భార్య లభిస్తుంది. దీనిని అందరూ అర్థం చేసుకోవాలి. ఈ రెండింటిని పొందగల అనువైన క్షేత్రమే శ్రీఅయ్యర్‌మలై!

అనుభూతి ప్రకాశ లింగ ముఖ దర్శనం

పరాశక్తి పార్వతీ దేవికి కోటానుకోట్ల సంఖ్యలో భూతగణాలున్నాయి. ఆ భూతగణాలకు పార్వతీ దేవి తరచూ పరీక్షలు పెడుతుంటుంది. ఎందుకంటే చిన్న తప్పిదం కూడా జరుగని స్థలం ఆ దేవి లోకమే కదా! అదే సమయంలో ఆ దేవి లీలా విశేషాలు ప్రజలకు మంచి మార్గాలను అందిస్తాయి.

ఓ సమయం 'చిత్ర నేమి' అనే భూత గణ దేవతకు ఆ జగన్మాత ఓ పరీక్ష పెట్టింది. అదేమిటంటే...'పరుల సొమ్ముతో దానం చేస్తే మంచిదా? లేక తాను శ్రమించి సంపాదించిన సొమ్ముతో దానాలు చేస్తే మంచిదా?' అనే శీర్షికపై భూతగణాల మధ్య వివాదం జరిపించింది. ఆ వివాద నిర్వహణకు న్యాయనిర్ణేతగా చిత్రనేమిని పార్వతీదేవి నియమించింది.

చిత్రనేమి తనకు సన్నిహితులుగా ఉండే స్నేహితురాళ్ల వాదనలకు అత్యధిక అంకణాలను ఇచ్చి పక్షపాతంగా వ్యహరించింది. ఈ విషయం తెలుసుకుని ఆగ్రహించిన ఆ పరాశక్తి 'కుష్ఠు రోగంతో బాధపడెదవు గాక' అంటూ చిత్రనేమికి శాపమిచ్చింది. చిత్రనేమి పరాశక్తి పాదాలను ఆశ్రయించి శాపవిమోచన మార్గం చెప్పమని ప్రాధేయపడింది. కరుణించిన ఆ పరాశక్తి 'భూలోకం వెళ్లి శ్రీఅయ్యర్‌మలైలో కొలువైన శ్రీరత్నగిరీశ్వరుడిని ప్రదక్షిణ చేస్తే ఆవణి నెల శుక్ల పక్షంతో కూడిన శుక్రవారాల్లో సప్త కన్యలు వేంచేసి శ్రీఅయ్యర్‌మలైలో వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. ఆ సప్త కన్యల ఆశీస్సులు పొందితే నీ కుష్ఠు రోగం నయమవుతుంది' అని ఆశీర్వదించింది.

పరాశక్తి ఆదేశానుసారం చిత్రనేమి శ్రీఅయ్యర్‌మలైని పట్టు వీడక ప్రదక్షిణ చేసి అనుభూతి ప్రకాశ లింగ ముఖ దర్శనం లభిస్తుంది. ఆ సమయంలో ఆకాశంలో సప్త జ్యోతులు ప్రత్యక్షమై అయ్యర్‌మలైపై దిగుతాయి. ఆ సప్త జ్యోతులను వెనుకనే వెళుతుంది చిత్రనేమి.

ఆ సప్త జ్యోతులు శ్రీఅయ్యర్‌మలైలోని సప్త కన్యలతో ఐక్యమవుతుండటాన్ని చూసి చిత్రనేమి ఆ కన్యల పాదాలపై పడి ప్రార్థించి ఆశీస్సులు పొందుతుంది. వెంటనే కుష్ఠు రోగం నయమై దేవీలోకాన్ని చేరుకుంటుంది.

అనుభూతి ప్రకాశ లింగ ముఖ దర్శన ఫలితాలు:

ఆవణి మాసం శుక్ల పక్షంతో కూడిన శుక్రవారాల్లో శ్రీఅయ్యర్‌మలైలోని సప్త కన్యలకు అభిషేక ఆరాధనలు నిర్వహించాలి.

తామే పసుపు కొమ్మలను పొడిగా నూరి (మినపరాయిపై పసుపును నూరాలి. మిక్సిని ఉపయోగించకండి. దుకాణాల్లో లభించే పసుపు పొడిని వాడకండి) ఆ పసుపుతో స్నానమాచరించి, పసుపు వస్త్రాలను ధరించి, మల్లెపూవులతో సప్తకన్యలను పూజిస్తే శుభ ఫలితాలు పొందగలం.

1. న్యాయమూర్తులు, న్యాయవాదులు, తప్పుడు సాక్ష్యాలిచ్చేవారు, మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించేవారికి మంచి జరుగుతుంది. అయితే మళ్లీ అలాంటి తప్పిదాలకు దూరంగా ఉండాలి.

2. దారిద్య్రంతో బాధపడుతున్నవారు, చేతికందినది నోటికి అందని దుస్థితిలో ఉన్న దురదృష్టశాలురకు క్రమంగా జీవితంలో అభివృద్ధి చెందగలరు. వారి ఇళ్ళల్లో లక్ష్మీ కటాక్షం అధికమవుతుంది.

3. యౌవ్వన ప్రాయంలో ఉన్న వితంతువులకు మనశ్శాంతి లభిస్తుంది. వారి జీవితాలు మెరుగవుతాయి.

శ్రీఅయ్యర్‌ మలైని ముమ్మార్లు ప్రదక్షిణ చేసి (వీలయితే ఏడుసార్లు ప్రదక్షిణ చేయవచ్చు) పైన పేర్కొన్న విధంగా పూజిస్తే పూర్ణ ఫలితాలు పొంది శ్రీఅయ్యర్‌మల ఈశ్వరుడి అనుగ్రహం పొందగలం.

హృదయ ముఖ కమల లింగ ముఖ దర్శనం

'కరుణ కలిగినవారికి అన్నీ కలసివచి ఉన్నత స్థితి పొందుతారు' అనే తిరువళ్లువరు సూక్తి ప్రకారం తన దేహం, ఆర్జించే వస్తువులు, ప్రాణం సకలమూ ఆ సర్వేశ్వరుడి కోసం, అతడు సృష్టించిన జీవరాసుల కోసం త్యాగం చేసేవారు కొంతమంది మాత్రమే ఉంటారు.

అలాంటివారిలో వాలాసురుడు అనే రాక్షసుడు ఒకడు. వాలాసురుడు మహాశివుడి కోసం ఘోరతపమాచరించాడు. వాలాసురుడి తపస్సును మెచ్చుకున్న మహాశివుడు అతడి ఎదుట ప్రత్యక్షమై 'నాయనా! నీ మహా తపస్సును మెచ్చినాను. ఏం వరం కావాలో కోరుకో' అన్నాడు.

వాలాసురుడు చాలా సంతోషించి 'స్వామి మరణంలేని జీవితమనే వరమివ్వండి' అని అడిగాడు. శివుడు చిరునవ్వు నవ్వుతూ 'పుట్టిన జీవరాశులు అన్నీ మరణించడం ప్రకృతి ధర్మం. మరణం లేని జీవితం కావాలంటే జనన రహిత జీవితం ఉండాలి కదా!' అన్నాడు.

'అలాగయితే ఇకపై జన్మ రాహిత్యం కలిగేలా వరమివ్వండి' అని వేడుకున్నాడు.

'జన్మ రాహిత్యం పొందాలనుకున్నవాడు తన దేహం, ఆర్జించిన వస్తువులను, ప్రాణాన్ని పరమేశ్వరుడి కోసం పరుల సంక్షేమం కోసం త్యాగం చేయాలి. అలాంటి వారే జన్మరాహిత్యం పొందుతారు' అన్నాడు మహాశివుడు.

'పరమేశ్వరా! జన్మించినవానికి మరణం తప్పదనుకుంటే నేను ఆశించిన రీతిలో మరణించగలిగే వరాన్ని ప్రసాదించండి. అలా మృతి చెందే సమయంలో నా రక్తం మాణిక్యాల్లా, దంతాలు ముత్యాలుగా, వెంట్రుకలు వైఢూర్యాలుగా, కండరాలు పగడాలుగా, కన్నులు నీలంగా, లాలాజలం పుష్పరాగంగా మారాలి. ఈ రత్నాలన్నీ మీ అలంకరణలో చోటుచేసుకోవాలి. అదే నా కోరిక' అన్నాడు వాలాసురుడు.

ఆహా ఎంతటి అద్బుతమైన వరమిది! ఎంతటి మహోన్నత స్థితి!

పరమేశ్వరుడు ప్రీతినొంది 'వాలాసురా! నీ దేహం రత్నాలుగా మారాలంటే రత్నాలన్నింటికి అధిపతియైన శ్రీరత్నగిరీశుడిని నీవు ప్రదక్షిణ చేసి పూజించాలి' అన్నాడు.

వాలాసురుడు పరమేశ్వరుడి ఆదేశానుసారం శ్రీరత్నగిరిని దర్శించి ప్రదక్షిణ చేసి హృదయముఖ కమల లింగ దర్శనం పొందుతాడు. తన దేహం, ఆర్జించిన వస్తువులు, ప్రాణాన్ని దైవసేవకే అర్పించి పరులకు సేవలు చేసి తను అనుకున్న వరాలను పొందగలిగాడు.

దేవతలందరినీ గెలిచాడు. దేవలోకమే అతడి వశమైంది. ఇక భగవంతుడి వద్దకు వెళ్లే తరుణం ఆసన్నమైనట్లు తెలుసుకున్నారు. దేవతల రాజైన ఇంద్రుడిని పిలిచారు.

'దేవేంద్రా! ఇక దేవతలకు నా వల్ల ఎలాంటి కష్టాలు ఉండవు. దైవంతో ఐక్యమయ్యే సమయం సవీపిస్తోంది. నేను మేషం (మేక)గా మారి నీవు చేయనున్న యాగగుండంలో పడి మరణిస్తాను' అని చెప్పాడు. ఆ విధంగానే దేవేంద్రుడి యాగగుండంలో ప్రాణత్యాగం చేశాడు వాలాసురుడు. శివుడు వరమిచ్చినట్లే అతడి దేహభాగాలు రత్నాలుగా మారాయి.

ఆ రత్నాలన్నింటిని హారంగా మార్చి శ్రీఅయ్యర్‌మలైలోని రత్నగిరీశ్వరుడికి అలంకరించాడు మహేంద్రుడు. దేవతలు పుష్పవర్షం కురిపించారు.

హృదయ ముఖ కమల లింగ దర్శన ఫలితాలు :

శ్రీరత్నగిరీశుడిని ప్రదక్షిణ చేసి పూజించి రత్నమాలలను అలంకరించి ప్రార్థిస్తే

1. ప్రభుత్వ ఉన్నత పదవులు వెదక్కుంటూ వస్తాయి.

2. పదోన్నతులు సులువుగా లభిస్తాయి

3. పదవుల మార్పిడి బదిలీలలు వంటి సమస్యలు రావు

4. టెంపరరీ ఎంప్లాయిస్‌, సస్పెండడ్‌ ఎంప్లాయీస్‌ ఉద్యోగం పొందగలుగుతారు.

5. హృదయ సంబంధిత రోగాలు నయమవుతాయి. హృదయ రోగాలున్నవారు శుక్లపక్ష శనివారాల్లో గిరిప్రదక్షిణ, స్వామివారి దర్శనం చేస్తే శుభ ఫలితాలు పొందగలరు.

5. మద్యం, మగువ, జూదం వంటి వ్యసనపరులు ప్రాయశ్చిత్తం పొంది దైవానుగ్రహం పొందగలుగుతారు.

రత్నాలను మాలగా సమర్పించలేనివారు, రత్నసమానమైన సువాసనలు కలిగిన పుష్పమాలలను రత్నగిరీశ్వరుడికి ధరింపజేస్తే చాలు శుభ ఫలితాలు పొందగలరు. శ్రీరత్నగిరీశుడిని దర్శనం చేసుకునే పుష్పమాలలను ధరించి పూజించడమే అత్యుత్తమమైన మార్గం.

ప్రశ్నార్థ సంకేత లింగ ముఖ దర్శనం

ప్రతి నిత్యం మనం పూజించే విధానాలలో సంధ్యావందనం, గాయత్రీ జపం ప్రధానమైనవి. జాతి, మత, కుల బేధాలకు అతీతంగా అందరూ గాయత్రీ మంత్రాన్ని జపించి తీరాలి. గాయత్రీ మంత్రం నాలుగు వేదాల సారాంశం.

మన దేహాన్ని, మనస్సును పవిత్రంగా ఉంచటమే కాకుండా మన చుట్టూ స్వచ్చమైన ప్రకంపనలు కలిగించేదే (పాజిటివ్‌ వైబ్రేషన్స్‌) గాయత్రీ జపం. ఇది మన దేవుడికి, మన కుటుంబానికి, సమాజానికి చేసే అరుదైన సేవ. ఎల్ల వేళలా నవయవ్వనంతో, రోగాల బారిన పడకుండా మనల్ని రక్షించే కాయకల్ప సంజీవని గాయత్రీ మంత్రం.

అయితే కాలగమనంలో గాయత్రి మంత్రాన్ని జపించే అలవాటు బాగా తగ్గిపోయి లోకంలో దుష్టశక్తులు, తీవ్రమైన రోగాలు అధికమవుతాయని దీర్ఘదృష్టితో తెలుసుకున్న సూర్య భగవానుడు ప్రజలను ఆ అరిష్టాలనుండి కాపాడేందుకు ప్రజలను సమున్నత స్థితికి చేర్చేందుకు శ్రీఅయ్యర్‌మలైలో గిరి ప్రదక్షిణ చేయసాగారు. అంతే కాకుండా శ్రీఅయ్యర్‌మలై నలువైపులా బిల్వ వృక్షాలను, సుగంధాలను వెదజల్లే చెట్లను పెంచి బిల్వనందనవన సువాసనలు స్వామివారిపై పడేలా నందనవన మేర్పరచి గిరి ప్రదక్షిణ చేశారు. ఆదివారాలలో వ్రతమాచరించి శ్రీఅయ్యర్‌మలైలోని మూలికలకు 'సుతా ప్రాణ' అగ్ని జ్వాలలతో వాటిని మరింత జీవశక్తిని అందించారు. ఈ సుతా ప్రాణ అగ్ని జ్వాలలతో పెరిగిన మూలికలు శ్రీఅయ్యర్‌మల అంతటా ఉన్నాయి. కనుక ఎవరైతే ఆదివారాలలో శ్రీఅయ్యర్‌మలైలో గిరి ప్రదక్షిణ చేస్తారో వారంతా ఈ సుతా ప్రాణ జ్వాలలతో ఉన్న మూలికల సువాసనలు శ్వాసించి దేహారోగ్యాన్ని పొందగలుగుతారు.

సూర్యభగవానుడు నిర్వహించిన ఈ సత్కార్యాలతో సంతసించిన శ్రీరత్నగిరీశుడు సూర్య భగవానుడు 'జాపాల దీర్ఘ దర్శనం చేసేటప్పుడు సూర్యభగవానునికి సంబంధించిన అక్షరమైన 'క్రీం' అనే బీజాక్షర సిద్ధిని ప్రసాదించారు. ప్రశ్నార్థక సంకేత లింగ ముఖ దర్శనాన్నే జాపాల దీర్గ దర్శనం అని కూడా పిలుస్తారు.

జాపాల దీర్ఘ దర్శన ఫలితాలు :

ఆదివారంనాడు శ్రీఅయ్యర్‌మలైలో 'క్రీం' అనే మంత్రాన్ని జపిస్తూ గిరి ప్రదక్షిణ చేసి జాపాల దర్శనం లభిస్తే...

1. రోగ రహిత జీవితం పొందగలరు. ఆయుష్షు పెరుగుతుంది.

2. ఫైల్స్‌ (మూల వ్యాధి), రక్తవిరేచనం, మందం వంటి రోగాలు నయమవుతాయి.

3. పలు సమస్యలతో మతిస్థిమితంలేక అలమటించేవారికి మనశ్శాంతి లభించి మంచి నిర్ణయాలు తీసుకునే శక్తిని పొందగలుగుతారు.

నారింజ రంగు దుస్తులు ధరించి గిరి ప్రదక్షిణ చేస్తే శ్రీరత్నగిరీశుడి బిల్వాలతో పూజిస్తే శుభ ఫలితాలు పొందగలరు.

పఠలేరు గజ లింగ ముఖ దర్శనం

సూర్యభగవానుడు శ్రీఅయ్యర్‌మలై గిరి ప్రదక్షిణ ద్వారా తాను పొందిన అక్షర సిద్ధిని గురించి చంద్రభగవానుడికి వివరిస్తాడు. సూర్యభగవానుడిని నమస్కరించి, ఆశీస్సులు పొంది చంద్రభగవానుడు కూడా శ్రీఅయ్యర్‌మలలో సోమవారం వ్రతమాచరించి సంపంగి పూలతోటలను ఏర్పరచి శ్రీరత్నగిరీశుడిని ప్రదక్షిణ చేస్తారు. తన శక్తివంతమైన కాంతులతో 'అంశ పరిణామ' అనే శీతల జ్వాలలను అక్కడి మూలికలపై ప్రసరింపజేసి అయ్యర్‌మలై మూలికలు సమస్తమూ వైద్యగుణాలు కలిగి వుండేలా తీర్చి దిద్దుతారు.

రోజూ పూలమాలలు కట్టి వాటిని ధరింపజేసి శ్రీరత్నగిరీశుడిని ఆరాధించాడు చంద్రభగవానుడు. సోమవారంనాడు శ్రీ అయ్యర్‌మలైని గిరి ప్రదక్షిణ చేసి మొక్కితే ఈ 'అంశ పరిణామ' జ్వాలలను కలిగి ఉన్న మూలికలమీద పడిన సువాసనలు ప్రజలపై ప్రసరించినప్పుడు వారిలోని చంచల బుద్ధి తొలగుతుంది.

ఇలాంటి సేవలను చేస్తూ చంద్రభగవానుడు గిరి ప్రదక్షిణ చేసే సమయంలోనే పఠలేరు గజ లింగ ముఖ దర్శనం లభించడంతోపాటు శ్రీరత్నగిరీశుడు చంద్రభగవానుడికి 'రీం' అనే అక్షరాన్ని ప్రసాదిస్తారు.

పఠలేరు గజ లింగ ముఖ దర్శన ఫలితాలు :

సోమవారంనాడు శ్రీఅయ్యర్‌మలైని 'రీం' అనే బీజాక్షరాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేసి, పఠలేరు గజ లింగ ముఖ దర్శనం పొందగలిగితే,

1. మహిళల వల్ల కలిగే ఆపదలు తొలగు తాయి

2. మహిళలు గిరి ప్రదక్షిణ చేసి మొక్కితే కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలగుతాయి.

3. శీతలపానీయాలు, నీటిని తోడే పంప్‌లు, బోర్‌వెల్‌, ఫ్యాన్సీ షాప్స్‌ వంటి వ్యాపారాలు చేస్తున్నవారు ఉన్నత స్థితిని పొందుతారు.

ముత్యాలసరాలతో శ్రీరత్నగిరీశుడికి ధరింపజేసి, ఈశ్వరుడికి తెల్ల కలువపూల మాలలతో అలంకరించి పూజలు చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి.

వందనయ వంద ముఖ లింగ దర్శనం

చంద్రభగవానుడు తాను పొందిన అక్షర సిద్ధితో పలు అద్భుతాలు చేస్తుండటాన్ని గమనించిన అంగారకుడు కూడా శ్రీఅయ్యర్‌మలైకి వెళ్లి నియమనిష్టలతో గిరి ప్రదక్షిణ చేసి సింధూర పూలతోటలను పెంచి శ్రీరత్నగిరీశుడిని పూజించసాగారు. తాను ఏర్పరచిన తోటలపై తన దీక్షణ్య కిరణాలయిన సింధూర వ్రజ కిరణ జ్వాలలను ప్రసరింపజేసి అక్కడి మూలికల పుష్పలపై వ్యాపింపజేశాడు.

మంగళవారంనాడు శ్రీఅయ్యర్‌మలైలో గిరి ప్రదక్షిణం చేసేవారిపై ఆ పూలతోటల నుండి వెలువడే సుగంధాలు ప్రసరించేలా చేశాడు అంగారకుడు. ఈ పునీత సేవలను చేసిన అంగారకుడిని మెచ్చుకున్న మహేశుడు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వందన్య వన్ద ముఖ లింగ దర్శనం కల్పించి ఆయన 'హ్రీం' అనే అక్షరాన్ని ప్రసాదించారు.

వందన్య వన్ద ముఖ లింగ దర్శన ఫలితాలు :

మంగళవారాల్లో శ్రీఅయ్యర్‌మలైని 'హ్రీం' అనే అక్షరాన్ని జపిస్తూ గిరి ప్రదక్షిణ చేసి ఈ వందన్య వన్ద ముఖ దర్శనంతో శ్రీఅయ్యర్‌మలై ఈశ్వరుడిని మొక్కితే,

1. నేత్రదోషాలు, దిష్టి దోషాలు తొలగుతాయి.

2. పోలీసులు, కారు డ్రైవర్లు, అగ్నిమాపక దళం సభ్యులు తమ విధినిర్వహణలో కలిగే సమస్యల నుండి బయటపడతారు.

3. మాంగల్యబలం పెరిగి మహిళలు దీర్ఘాయుష్షు పొందుతారు. భర్తలు వ్యసనాల నుండి బయటపడతారు.

పురుషులు ఎరుపు రంగురాళ్లతో తయారు చేసిన చెవిపోగులు ధరించి గిరి ప్రదక్షిణ చేయడం, మహిళలు స్వయంగా తయారు చేసిన కుంకుమను పసుపుకొమ్ములతో సుమంగళి స్త్రీలకు దానమిస్తే పైన పేర్కొన్న ఫలితాలు పొందగలుగుతారు.

తిట్టు దేవత ఎట్టుపరి దర్శనం

నీటిలో పడవ వెళుతోంది. ఆ పడవపై ఇల్లు కట్టుకుని కూడా వెళుతుంటారు. దానినే 'పడవ నివాసం' అని అంటారు. పెద్ద పెద్ద నదులలో విహారయాత్రల కోసం ఈ బోట్‌ హౌస్‌లు నడుపుతుంటారు. ఆ పడవలలో పరిమితికి మించి జనం ఎక్కితే ఆ పడవ నీట మునిగిపోతుంది. ఆ విధంగానే అధికంగా పాపాలు చేస్తే మనకు చెప్పలేనంతగా కష్టాలు కలుగుతాయి. కనుకనే కష్టాలు ఎదురైతే మనం తెలుసుకోవాల్సిన విషయమేమిటి? మనం చేసిన తప్పిదాల వల్లే మనకు కష్టాలు కలుగుతాయి. దీనిని అవగాహన చేసుకుంటే మనకు అన్నీ శుభాలే. కష్టాలు కలుగవు.

ఇలా కష్టాలు తొలగింపజేసుకోవాలంటే ముందుగా మనం ఆత్మ విచారణ చేసుకోవాలి. అలా ఆత్మవిచారం చేసుకోవడానికి అనువైన స్థలమే శ్రీఅయ్యర్‌మలై క్షేత్రం.

స్వచ్చమైన నీటిలోన మన బింబాలను సుస్పష్టంగా చూడగలం. అలాగే ప్రశాంతమైన ప్రాంతంలోనే మన కష్టాలకు కారణాలను పరిశీలించుకోగలము.

శ్రీఅయ్యర్‌మలై వంటి పవిత్రమైన స్థలాల్లో దైవీక శక్తులు, పలు పర్వతశిఖరాగ్రాలలో అధికంగా ఉంటాయి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తిట్టు దేవతల 'సంహారతీక్షణ్య శక్తులు' భక్తులపై ప్రసరించి వారి కష్టాలను తొలగిస్తాయి.

ఈ తిట్టు దేవతల అనుగ్రహం పొందటానికి ఎనిమిది దిక్కులలోని అష్టదిగ్గజాలు శ్రీఅయ్యర్‌మలై గిరి ప్రదక్షిణ చేస్తుంటాయి. ఈ అష్టదిక్‌ గజాలు తమతోపాటు బుధభగవానుడిని వెంటబెట్టుకు వచ్చి ప్రదక్షిణ చేశాయి.

అలా గిరి ప్రదక్షణి చేసేటప్పుడు బుధ భగవానుడు ఆ ఎనిమిది ఏనుగులకు ఆహారం, నీటిని అందించి సేవలు చేశారు.

బుధభగవానుడి ఆ అద్భుతమైన సేవలకు ముగ్ధుడైన శ్రీరత్నగిరీశుడు ఆయనకు 'శ్రీం' అనే అక్షరాన్ని తిట్టు దేవత ఎట్టుపరి దర్శన సమయంలో ప్రసాదించాడు.

తిట్టు దేవత ఎట్టుపరి దర్శన ఫలితాలు :

శ్రీఅయ్యర్‌మలైని ప్రతి బుధవారంనాడు 'శ్రీం' అనే మంత్రాన్ని జపిస్తూ గిరి ప్రదక్షిణ చేసి చల్లటి మజ్జిగ, అన్నదానం చేసి తిట్టు దేవత ఎట్టుపరి దర్శనం పొందినట్లయితే

1. అలవికాని కష్టాలతో మనశ్శాంతి లేక బాధపడేవారు అన్ని కష్టాలు తొలగి ప్రశాంతత చేకూరుతుంది.

2. ఉన్నతమైన ధ్యాన స్థితులు సిద్ధిస్తాయి.

3. దుష్ట శక్తులవల్ల దారి తప్పిన చిన్నారులు మంచి మార్గంలోకి వస్తారు.

4. ప్రైవేటు కళాశాలు, పాఠశాలల్లో పనిచేసేవారు, యజమానులు శుభఫలితాలు పొందుతారు.

గిరి ప్రదక్షిణలో తదుపరి మనం చూడబోయేది ఓ అద్భుతమైన నాగదేవత పుట్ట. 'కనక సుందరాంగిణి' అనే నాగదేవత కొలువైన స్థలమిది. పౌర్ణమి దినాల్లో కనక సుందరాంగిణి శ్రీఅయ్యర్‌మలై ఈశుని గిరి ప్రదక్షిణ మొక్కి తనను ఆశ్రయించేందుకు వచ్చే భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నది.

పౌర్ణమి దినాన ఈ పుట్టను గోమయంతో అలికి, పసుపు, కుంకమ, పచ్చిబియ్యం పొడి మిశ్రమంతో రంగవల్లులు వేసి మొక్కితే నాగదోషాలు తొలగి, వివాహయోగం ప్రాప్తిస్తుంది. పసుపు రంగు గల తొమ్మిది గజాల చీరలను గిరి ప్రదక్షిణ వచ్చే సుమంగళి స్త్రీలకు దానం చేస్తే మంచిది

ఎక వింశతి పూరణిముఖ దర్శనం

జీవితంలో తన కోసమే కాకుండా పరుల కోసం ఉపకారాలు చేస్తే పుణ్యం కలుగుతుంది. ఓ మానవుడు ఇతరులకు చేయవలసిన బాధ్యతలు తెలిపే దైవాలు, దేవతలు, గ్రహాలు, గ్రహ అధిపతులు భూలోకంలో అవతరించి మానవులందరికీ సేవలందిస్తున్నారు. మానవులంతా పరోకారాలు చేస్తే మానవుడే మహేశుడై మనగలుగుతాడని పెద్దలు చెబుతారు.

ఓ అరటి మొక్కను నాటితే అది పలు అరటి చెట్లుగా వృద్ధి చెందుతుంది. పైగా అరటి యొక్క అన్ని భాగాలూ మానవులకు ఉపయోగపడతాయి. ఇలా సామాన్యమైన ఆ చెట్టే పండ్లు, పూలు, కాయలు, బోదెలు, ఆకులు, మట్టల రూపంలో ఇతరులకు మేలుచేస్తుంటే జ్ఞానబుద్ధి కలిగిన మానవుడు ఇతరులకు ఇంతకంటే మేలు చేయాలి కదా!

ఇలా ప్రయోజనకరమైన వృక్షాలు శ్రీఅయ్యర్‌మలై చుట్టూ చెట్లను నాటి వనాలను ఏర్పరచారు దేవతల గురువైన బృహస్పతి దేవుడు.

జీవనం అందించే అరటి :

అరటి ఆకు కొసలను చిన్న చిన్న ముక్కలు చేసి పప్పుతో కలిసి వండి అన్నంతో కలిపి శ్రీఅయ్యర్‌మలైకి గిరి ప్రదక్షిణ కోసం వచ్చే భక్తులకు అన్నదానం చేశారు. ఈ రకమైన అన్నం తింటే ఆసన ద్వారం వద్దే ఏర్పడే రోగాలు నయమవుతాయి.

ఇక అరటి పువ్వులను ఉడికించి ఆ రసంతో కరివేపాకును నూరి కలిపి ముంత పెరుగులో పోసి ఉదయం పరకడుపున మూడు రోజులపాటు తాగిస్తే విరేచనాలు ఆగిపోతాయి.

అరటి పిందెలను ముక్కలు చేసి నూనెతో వేయించి పరకడపున తింటూ వస్తే మూల రోగం నయమవుతుంది.

అరటి బోద రసాన్ని పరకడుపున తాగితే రక్తంలో ఉప్పుశాతం తగ్గి ఆరోగ్యం మెరుగవుతుంది.

అరటి మట్టనుండి రసం తీసి దానితో కొన్ని మూలికలను కలిగి తాగితే దేహంలో విషపూరితాలు మాయమవుతాయి.

అరటి పువ్వునుండి రసం తీసి దానితో తేనె, నెయ్యి కలుపుకుని నిర్ణీత రోజుల్లో తాగితే క్షయ రోగం నయమవుతుంది.

అరటిపండులో విటమిన్లు పోషకాలు అధికంగా ఉండటంతో అది ఆయుష్షును పెంచుతుంది.

రస్తాలి, మల అరటిపండ్లు, నాటు అరటిపండ్లు, పేయ్‌అరటిపండ్లు, ఎర్రరటిపండ్లు, పూవన్‌, కర్పూరవల్లి, మెత్తల్‌, నేంద్రపు అరటి పండ్లు అందించే అరటి చెట్లను బృహస్పతి భగవానుడు శ్రీఅయ్యర్‌మల అంతటా పెంచి అరటి తోటలను పెంపొందింపచేసి గిరి ప్రదక్షిణ చేశాడు.

అలా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఓ రోజు ఏక వింశతి పూరణి ముఖలింగ దర్శనం లభించింది. అశరీరవాణి 'బృహస్పతి దేవా! అరటి వనాలను ఏర్పరచి అందరికీ వైద్య సదుపాయాలు అందించిన నీ భక్తికి ఎంతో సంతోషించాం. నీకు 'ఔమ్‌' అనే అక్షర మంత్రాన్ని అందిస్తున్నాం' అని అశరీరవాణి పలికింది.

ఏక వింశతి పూరణి ముఖ లింగ దర్శన ఫలితాలు :

గురువారాల్లో శ్రీఅయ్యర్‌మల మహేశ్వరుడిని 'ఔమ్‌' అనే మంత్రాన్ని జపిస్తూ గిరి ప్రదక్షిణ చేసి, అరటిపళ్లను దానం చేసి ఏక వింశతి పూరణి ముఖ లింగ దర్శనం పొందితే,

1. రోగాలు లేకుండా దీర్ఘ ఆయుష్షును పొందగలము. రోగానపడి చాపమీదే గడిపే దుస్థితి తప్పుతుంది.

2. పిల్లలకు విద్యాబుద్ధులు అధికమవుతాయి.

3. ఫైనాన్స్‌ కంపెనీ, నగల వ్యాపారులు, వజ్రాల వ్యాపారులు వారి వ్యాపారాలలో అభివృద్ధిని సాధించగలరు.

4. సంతాన భాగ్యం ప్రాప్తిస్తుంది.

5. పిన్నవయస్సులోనే వెంట్రుకలు రాలడం, బట్టతల వంటి సమస్యలు తొలగుతాయి.

ద్విముఖ సుందరలింగ శిఖర దర్శనం

బృహస్పతి భగవానుడు పొందిన వరం, ఆ వరంతో చేస్తున్న సేవలను తెలుసుకున్న అసుర గురువైన శుక్రాచార్యుడు సైతం శ్రీఅయ్యర్‌మలైకి వెళ్లి గిరిప్రదక్షిణ నిర్వహించాడు. శుక్రాచార్యులు గిరి ప్రదక్షిణ చేయడం ఎందుకు?

శుక్రాచార్యుడి శిష్యుడైన మహాబలి చక్రవర్తి గురువాదేశాన్ని వినక వామనుడి రూపంలో వచ్చిన మహావిష్ణువుకు మూడడుగుల భూమిని దానం ఇచ్చారు కదా! 'గురువాజ్ఞను మీరిన శిష్యుడికి అన్ని విద్యలను నేర్పాము కదా!' అంటూ దిగులుతో మనోవేదనతో దానికి పరిహారం అన్వేషిస్తూ శ్రీఅయ్యర్‌మలైలో గిరి ప్రదక్షిణం చేయసాగారు.

గురువాజ్ఞను మీరిన శిష్యుడికి విద్యలు నేర్పినందువల్ల గురువుకు 'శిష్యమందక దోషం' కలుగుతుంది. ఇందువల్ల ఇతరు శిష్యులకు కష్టాలు కలుగుతాయి. కనుక ఈ దోష పరిహారం కోసం శ్రీఅయ్యర్‌మలైలో గిరి ప్రదక్షిణ చేశారు.

ఇక్కడ మనకు ఓ సందేహం కలుగుతుంది. గురువాజ్ఞను మీరినప్పటికి మహాబలి చక్రవర్తి మూడడుగుల నేలను దానంగా ఇచ్చింది మహావిష్ణువునకే కదా మరి అది ఎలా దోషమవుతుంది?

మహావిష్ణువుకు మూడడుగుల దానం చేయడంతో తాను ఇచ్చిన వాగ్దానం మేరకు మహావిష్ణువు పాతాళలోకంలో ఉన్న ఆయనకు దర్శనమిస్తున్నారు. అయితే గురువాజ్ఞను ధిక్కరించినందుకు శుక్రాచార్యుడు తన శిష్యుడైన బలిచక్రవర్తికి దర్శనమివ్వడం లేదు.

భగవంతుడికి కలిగి అపచారానికి గురువు వద్ద పరిహారం పొందగలం. మరి ఆ గురువుకే అపచారం కలిగితే ఆ గురువు ఎవరి వద్ద పరిహారం పొందగలరు?

కనుక సద్గురువు పొందిన పుణ్యమూర్తులారా! మీ గురువు వద్ద శరణు పొందండి. ఆయన చూపే మార్గంలో వెళ్లండి. ఇలా గురువు ఆదేశం ప్రకారం ఆయన మార్గంలో వెళ్లేవారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయన్నదే సిద్దుల వాక్కు. సద్గురువును పొందలేకపోయినవారు భగవంతుడి వద్ద నిష్టగా ప్రార్థించి, పూజిస్తే ఆయన తప్పకుండా పరిహార మార్గాలను చూపించకమానడు కదా!

అసుర గురు శుక్రాచార్యులు శ్రీఅయ్యర్‌మలై చుట్టూ వివిధ రకాలైన బిల్వ వృక్షాలను పెంచి, వాటిన ఇసంరక్షించి బిల్వ ఆకులతో ప్రజలకు అరుదైన వైద్యం అందించారు.

వీర్యశక్తినిచ్చే బిల్వం :

మన దేహాభివృద్ధికి మనం తీసుకునే ఆహార పదార్థాలే దోహదం చేస్తాయి. వాటిని జీర్ణింప చేసుకునే శక్తి ఉండాలి. దేహావయవాలన్నీ సక్రమంగా పనిచేయాలి.

పేగులలోని క్రిములను, పురుగులను విసర్జనమయ్యేలా చేయాలంటే రోజూ బిల్వ ఆకులను ఐదింటిని నమిలి మింగాలి. దీనితో ఆరోగ్యం కలుగుతుంది.

ఐదు బిల్వ ఆకులతోపాటు, రెండు అత్తి ఆకులు, రెండు వేప ఆకులు కలిపి రోజూ ఉదయం పరకడుపున మింగితే ఆరోగ్యం మెరుగవుతుంది.

మలబద్ధకం ఉన్నవారు రోజూ ఉదయం పరకడుపున బిల్వ ఆకులను ఐదింటిని నమిలి మింగితే మలబద్ధకం తొలగుతుంది.

ఇలా బిల్వ ఆకులను ఇతర ఆకులతో కలుపుకుని సక్రమంగా తింటే రోగాలను నయమయ్యేందుకు శుక్రాచార్యుడు తన వంతు సేవలను అందించారు. తాను శ్రీఅయ్యర్‌మలై రోజూ నియమనిష్టలతో ప్రదక్షిణ చేసి, తాను నాటిన బిల్వ మొక్కలన్నీ వృక్షాలుగా తీర్చిదిద్ది ప్రజలకు ఉపయోగపడేలా చేసి ప్రదక్షిణ చేసే సమయంలోనే ద్విముఖ సుందర లింగ శిఖర దర్శనం చేసుకున్నారు. అశరీరవాణిగా శ్రీరత్నగిరీశుడు 'శుక్రాచార్యా! నీ సేవలను మెచ్చుకున్నాం. మీకు 'క్లీమ్‌' అనే అక్షరాన్ని ప్రాప్తింపజేస్తున్నాం. దీనితో శిష్యుడి వల్ల నీకు కలిగిన దోషాన్ని తొలగించాం' అని అనుగ్రహించాడు.

ద్విముఖ సుందరలింగ శిఖర దర్శన ఫలితాలు :

శ్రీఅయ్యర్‌మలను శుక్రవారాలలో 'క్లీమ్‌' అనే మంత్రాన్ని జపిస్తూ గిరి ప్రదక్షిణ చేసి బిల్వ ఆకులను చేతిలో ఉంచుకుని మాలగా చేసి శ్రీరత్నగిరీశుడికి సమర్పిస్తే,

1. తీవ్రమైన కేన్సర్‌ వంటి రోగాలే కాకుండా అన్ని రకాల రోగాలు నయమవుతాయి.

2. అర్హతలేని విద్యార్థులు, మాటవినని, మర్యాదలు పాటించని విద్యార్థులకు పాఠాలు చెప్పడం వల్ల కలిగే దోషాలనుండి ఉపాధ్యాయులు విముక్తి పొందుతారు.

3. కుల మతాలకు అతీతంగా అందరికీ ఉచితంగా వేదాలను బోధించాల్సిన వేద పఠిత విద్యార్థులు కాసుల కోసం పాఠాలు చెబితే వచ్చే తీవ్రమైన దోషాలు, శాపాల నుండి విముక్తి పొందడానికి శ్రీఅయ్యర్‌మలై గిరి ప్రదక్షిణ ఎంతగానో తోడ్పడుతుంది. ఇతర వివరాలను గురువులను అడిగి తెలుసుకోవాలి.

4. శిరోజాలంకరణ, సుగంధ ద్రవ్యాలు, సినిమా, నాటకాలు, ఫోటో, ఫిలిం తదితర రంగాలలోని వారు వారి వృత్తులలో నైపుణ్యం పొంది అభివృద్ధి చెందుతారు.

5. రక్తహీనత, తెల్ల కుష్ఠు, ల్యూకామియ వంటి రోగాలు నయమవుతాయి.

ముమ్మూర్తి పతి లింగ ముఖ దర్శనం

మానవుడు పుట్టిన క్షణం నుండి కర్మలతోడుగానే పుడుతాడు. ఆ కర్మలకు అనుగుణంగానే అతడి జీవితం సాగుతుంది. ఇవన్నీ భగవంతుడి అనుగ్రహం వల్లే జరుగుతాయి. కనుక మనం అనుభవించేవన్నీ శ్రీవార్పణంగా సమర్పించినప్పుడు ఆ కర్మలు మనపై ప్రభావం చూపవు. జీవితమూ సాఫీగా కొనసాగుతుంది.

మానవులలో పరస్పర బేధభావాలు లేకుండా ప్రేమానురాగాలు చోటుచేసుకుంటాయి. ఇలాంటి జీవితాలను గడిపేవారి సంఖ్య కూడా చాలా స్వల్పమే.

మానవులు తమను అర్థం చేసుకోగలిగి జీవించేందుకు శ్రీశనీశ్వర భగవానుడు దేవలోకం నుండి 'శాంతపురి కాంత'పు రాళ్లను భూలోకానికి తీసుకువచ్చారు. భూలోకానికి వచ్చేటప్పుడు సంధ్యా సమయం కావటంతో గాయత్రీ మంత్రం జపిస్తూ కావేరి సమీపాన పూజ చేయనారంభించారు. అప్పుడాయన తను తీసుకువచ్చిన రాళ్లను అరటి ఆకులో ఉంచి, నీటిలో దిగి పూజలను ముగించుకున్నారు.

పూజ ముగిసి తిరిగొచ్చి చూస్తే ఆ రాళ్లు కనిపించలేదు. ఏం చేయాలో తెలియక అక్కడికి చేరువగా ఉన్న శ్రీఅయ్యర్‌మలై చేరుకుని శ్రీరత్నగిరీశ్వరుని పూజించి ప్రదక్షిణ చేశారు.

అలా నియమనిష్టలతో పలుమార్లు గిరి ప్రదక్షిణ చేయగానే ముమ్మూర్తి పతిముఖ లింగ దర్శనం లభించిన వేళ ఆ శాంతపురి కాంతపు రాళ్లు ధగధగా కాంతులు విరజిమ్ముతుండటాన్ని చూశాడు. ఆనందంతో ఆ కాంతపు రత్నాలను శ్రీరత్నగిరీశుడికే సమర్పించారు. కనుకనే ఈ చోట గిరి ప్రదక్షిణ చేసేవారికి అందరి వద్దా ప్రేమానురాగాలు కలిగేలా ప్రవర్తించగలిగే జీవనాన్ని సాగిస్తారని శనీశ్వరభగవానుడు భావించారు.

శ్రీశనీశ్వరు భగవానుడు దేవలోకం నుండి తీసుకువచ్చి తనకు అరుదైన రత్నాలను సమర్పించినందుకు మెచ్చిన రత్నగిరీశుడు ఆయనకు 'ఐమ్‌' అక్షరాన్ని ప్రసాదించారు.

ముమ్మూర్తి పతిముఖలింగ దర్శన ఫలితాలు :

శనివారాలలో శ్రీఅయ్యర్‌మలైని 'ఐమ్‌' అనే మంత్రాన్ని జపిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తే అరటినారతో మల్లెపూల మాలను కట్టి శ్రీరత్నగిరీశుడికి ధరింపజేస్తే,

1. వైద్యరంగంలో ఉన్న - డాక్టర్లు, నర్సులు, ప్రొఫెసర్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌, ఫార్మాసిస్ట్స్‌ మొదలుగువారు నైపుణ్యతను సాధించి అభివృద్ధి చెందుతారు.

2. చమురు, పెటోల్రు వ్యాపారులు, హోటల్‌ యజమానులు, కార్మిక సంఘం నాయకులకు సకల శుభాలు ప్రాప్తిస్తాయి.

మహాకలశ లింగ ముఖ దర్శనం

మల్లెలు సువాసనలు వెదజల్లే తన సుగుణాన్ని మార్చుకోదు. పండ్లన్నీ నిర్ణీత కాలంలో కాస్తాయి. ఆకలేసినా పులి గడ్డి మేయదు.

ఆవు పాలనివ్వడం మానదు. ఇవన్నీ భగవంతుడి ప్రసాదించిన గుణాలను మార్చుకోవు. అయితే మనిషి మాత్రమే అన్నీ తింటాడు. దేన్నైనా ధరిస్తాడు. ఎలాగైనా బతుకుతాడు.

తన ఉన్నతస్థితి నుండి మృగ గుణాలతో అధోస్థితికి చేరుకుంటాడు. మృగాలకు విచక్షణా జ్ఞానం లేదు. మానవుడికి ఉన్నా అతడు తన జీవనపు పద్ధతులను విపరీతంగా మార్చుకుంటూనే ఉన్నాడు.

కట్టుబాట్లను తన ఇష్టానుసారం లేదన్న ఆగ్రహంతో మనిషి తనను తానే నాశనం చేసుకోవడాన్ని నిరోధించగల శక్తిమంతుడైన రాహు భగవానుడు శ్రీఅయ్యర్‌మలలో ప్రదక్షిణ చేసి ఏదైనా మంచి మార్గం లభించక పోతుందా అని ప్రయత్నం చేయసాగారు.

విడువక నియమనిష్టలతో రాహుభగవానుడు చేసిన ప్రదక్షిణ, పూజలకు సంతసించిన శ్రీరత్నగిరీశుడు మహా కలశ లింగ ముఖ దర్శనం ఇచ్చారు. అశరీరవాణిగా 'ఒకరు నాటిన మొక్కను మరొకరు చెట్టుగా పెంచాడు. అలా పెరిగిన చెట్టు అందించిన పండ్లను మరొకరుడు పొందుతాడు. రాహు భగవానుడా! ఇలా ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించే జీవనమే అత్యుత్తమమైనది, దీనిని ప్రజలందరికీ బోధించు' అని పలికాడు.

శ్రీరత్నగిరీశుడి ఆదేశం ప్రకారం రాహుభగవానుడు సర్పాకారంలో గిరి ప్రదక్షిణ చేయసాగారు.

ఆర్తర నక్షత్ర దినాన రాహుభగవానుడు అయ్యర్‌మల మార్గమంతటా మల్లెపూలను జల్లి, శివనామావళిని పఠిస్తూ గిరి ప్రదక్షిణ చేశారు.

స్వాతి నక్షత్ర దినాన చిన్నపిల్లలకు పాలను దానం చేసి గిరి ప్రదక్షిణ చేశాడు రాహు భగవానుడు.

శతభిష నక్షత్ర రోజున చందనం దానం చేసి గిరి ప్రదక్షిణ చేశాడు.

రాహు భగవానుడి నిస్వార్థ సేవలను మెచ్చుకున్న శ్రీరత్నగిరీశుడు ఆయనకు 'ఉద్రౌమ్‌' అనే అక్షరాన్ని ప్రసాదించి మహాకలశ లింగ ముఖ దర్శన సమయంలో ఆశీస్సులందించారు.

మహాకలశ లింగ ముఖ దర్శన ఫలితాలు :

ఆర్తర, స్వాతి, సతభిష నక్షత్ర దినాలలో శ్రీఅయ్యర్‌మలైని 'ఉద్రౌమ్‌' అనే అక్షరాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేస్తే, తామే నూరిన చందనాన్ని శ్రీఅయ్యర్‌మలై రత్నగిరీశ్వరుడికి చందనపు తాపడం చేస్తే

1. సముద్రవాణిజ్యం, ఇనుప సంబంధింత వ్యాపారం, చమురు విత్తుల వ్యాపారం చేసేవారు వ్యాపారాభివృద్ధిని పొందగలుగుతారు.

2. దుష్టశక్తుల నుండి విముక్తి పొందుతారు.

3. చెడు స్నేహితుల వల్ల, మద్యం, రేసు, జూదం వంటి దురలవాట్ల నుండి బయటపడతారు. దుష్ట స్నేహితుల సహవాసం నుండి బయటపడతారు.

భూత లింగ ముఖ దర్శనం

అశ్విని, మఖం, మూలం - ఈ మూడు నక్షత్ర దినాలలో కేతు భగవానుడు సర్పరూపంలో శ్రీఅయ్యర్‌మలైని ప్రదక్షిణం చేశారు. కేతు భగవానుడు ఎందుకు అలా గిరి ప్రదక్షిణ చేశారు?

అన్ని జన్మలకంటే మానవజన్మే అత్యుత్తమమైనది. మానవులుగా పుట్టినవారంతా ఆయురారోగ్యాలతో విలసిల్లేందుకు భగవంతుడిని సేవలు చేయగలుగుతారు.

దీర్ఘాయువును కలిగి ఉంటే చాలునా? ఈ పవిత్రభూమిలో మనం ఎన్ని రోజులు జీవించామని కాదు ఎలా జీవించామన్నదే చాలా ముఖ్యం!

అణ్ణామలై ఈశ్వరుడు మానవదేహాన్ని ఇచ్చినప్పుడు మనం దేవుని వద్ద ఎలాంటి ప్రతిజ్ఞ చేశాం?

'ఈ పుడమిలో ఉన్నంతదాకా సదా సర్వకాలం నీ తలంపులతో, నీ కోసం, నీ భక్తుల కోసం, నీ వల్ల సృష్టింపబడిన ప్రాణుల కోసం క్షణం కూడా నిరుపయోగపరచకుండా నిస్వార్థ సేవలు చేస్తాను' అని వాగ్దానం చేస్తాం.

అయితే భూమిపై పుట్టాక ఆ వాగ్దానాలను మరచి, మానవ జన్మ మహత్యం ఎరుగక కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నాం.

కనుక దేహాన్ని సంరక్షించుకుని, విలువైన కాలాన్ని ప్రజలంతా భగవంతుడి సేవకు కేటాయించాలని వేడుకుంటూ కేతు భగవానుడు శ్రీరత్నగిరీశ్వరుడిని ప్రదక్షిణ చేశారు.

కేతు భగవానుడు ఉసిరి పువ్వులు, సింధూర పువ్వులు, వేపపువ్వులు, నేరేడు పువ్వులు తదితర పుష్పాలతో పూజించి ఆ మూలిక సమేత పుష్పాలను ప్రజలకు అందించసాగారు.

దీనితో ప్రజలంతా శిరో వ్యాధులు, తలనొప్పి, కపాల వాయువు, కపాల నొప్పి తదితర వ్యాధుల నుండి విముక్తి పొంది సంపూర్ణ ఆరోగ్యంతో జీవించసాగారు.

కేతుభగవానుడి ఆరాధనలను చూసి సంతోషపడిన శ్రీరత్న గిరీశుడు భూతలింగ ముఖ దర్శన సమయంలో అశరీరవాణిగా ఆయనకు 'సౌమ్‌' అనే అక్షర సిద్ధిని అందించారు.

భూత లింగ ముఖ దర్శన ఫలితాలు :

శనివారాలలో కేతు భగవానుడిని ప్రార్థిస్తూ 'సౌమ్‌' అనే అక్షరాన్ని జపిస్తూ శ్రీఅయ్యర్‌మలైని ప్రదక్షిణ చేసి పూజిస్తే,

1. తలకు వచ్చే ఆపదలన్నీ తొలగిపోతాయి.

2. బ్రైన్‌ ట్యూమర్‌, మెదడువాపు, సెరిబ్రాల్‌ హామర్‌హేజ్‌ వంటి వ్యాధులు నయమవుతాయి.

3. తల నిలువకుండా బాధపడే చిన్నారులకు ఉపశమనం కలుగుతుంది.

గిరి ప్రదక్షిణ సమయంలో కదంబ అన్నం (వెరైటీ రైస్‌) దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

తొడువిడయాన్ లింగ ముఖ దర్శనం

భూలోకంలో అప్పుడూ ఇప్పుడూ ఎల్లప్పుడూ అందరూ పుడుతుంటాడరు. అయితే ప్రజల మధ్య కీర్తిమంతులయ్యేది కొందరే!

దైవ శక్తి అనేది 'అతీంద్ర శక్తి' దానిని తెలుసుకొనజాలము. పూర్వపుణ్య సుకృతం వల్ల తిరుజ్ఞాన సంబంధరు వలె గర్భంలోనే దైవాంశంతో పుట్టేవారే కీర్తి ప్రతిష్టలను అందుకోగలుగుతారు. కనుకనే పుడితే కీర్తిమంతులుగా పుట్టాలి. లేకుంటే అసలు పుట్టనే కూడదు' అంటూ పెద్దలు చెబుతుంటారు.

ఇలా అద్భుత గుణమున్న సంతానం కావాలని కశ్యప ముని శ్రీఅయ్యర్‌మలైని నియమనిష్టలతో ప్రదక్షిణ చేశారు.

శ్రీఅయ్యర్‌మలైని ప్రదక్షిణ చేసి పద్దెనిమిది రకాల తులసి చెట్లను నాటి తులసీ వనాలను పెంచి పోషించాడు.

మూడు లేదా ఐదు తులసి ఆకులతో చిన్న అల్లం ముక్క, రెండు మిరియాలు కలిసి ఉదయం పరకడుపున (45 రోజులపాటు) నమిలి మింగితే ఆస్తమా, శ్వాసకోస వ్యాధులు నయమవుతాయి. శకున దోషాలు నివృత్తి అయ్యే అద్భుత మూలిక తులసి.

తులసితోపాటు ఇతర మూలికలు కలిపి ప్రజలు రోగాలపాలు కాకుండా సేవలందిస్తూ వచ్చారు కశ్యప ముని. కశ్యప ముని తపస్సును మెచ్చుకుని బ్రహ్మదేవుడు ఆయనకు తొడువిడయాన్‌ లింగ ముఖ దర్శనంలో జ్యోతి స్వరూపుడై ప్రత్యక్షమయ్యారు. కశ్యప ముని ఆనందంతో బ్రహ్మదేవుని సాష్టాంగంగా నమస్కరించి 'ప్రభో! గర్భంలోనే కీర్తిమంతుడైన సంతానం ప్రసాదించమ'ని వేడుకున్నాడు. బ్రహ్మదేవుడు శ్రీరత్నగిరీశుడిని ధ్యానించి ఆయన కృపచేత 'పయో వ్రతం' అనే అద్భుత వ్రతాన్ని బోధించాడు.

దాని ఫలితంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తినే శిశువుగా జనింపచేసుకున్నారు కశ్యప ముని. ఈ పయోవ్రతాన్ని కశ్యప ముని తన సతీమణి అతీథి దేవికి ఉపదేశించగా, ఆ దేవి ఆ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించి ఆవని మానం శుక్లపక్షం ఆర్తర నక్షత్ర దినాన్ని శ్రీమన్నారాయణుడినే శిశువుగా జనింపజేసుకుంది. కనుక తొడువిడయాన్‌ లింగ ముఖ దర్శనం వల్ల కశ్యప ముని భగవానుడినే సంతానంగా పొందే భాగ్యం పొందారు.

తొడువిడయాన్‌ లింగ ముఖ దర్శన ఫలితాలు :

ఆవణి మాసం శుక్లపక్ష ఆర్తర నక్షత్ర దినాన శ్రీఅయ్యర్‌మలైని ప్రదక్షిణ చేసి చక్కెర పొంగలి దానం చేసి పూజిస్తే,

1. పుట్టుకతోనే మంచి జ్ఞానం కలిగిన సంతానం పొందగలుగుతారు.

2. సుగుణాల రాశియైన భార్యను పొందగలుగుతారు.

3. యువతకులకు సుగుణవంతుడైన భర్త లభిస్తాడు.

దక్కిన తప్పులు నివర్తించే దర్శనం

దేవతలు అమృతం కోసం మావలి నాయకత్వంలో అసురుల సహాయం కోరారు. అమృతం మధనం కోసం తాము దేవతకుల సాయపడితే ఆ అమృతంలో తమకు వాటా లభిస్తుందని మావలి అందుకు అంగీకరించాడు.

మావలి సాయంతో అమృతం పొందగలిగిన దేవతలు వాటిని అసురలకు ఇవ్వకుండా తామే స్వీకరించడంతోపాటు మావలి సహా అసురులను హతమార్చారు.

అసురుల గురువైన శుక్రాచార్యుడు తనకు తెలిసిన సంజీవని విద్య ద్వారా మావళిని, రాక్షసులను బ్రతికించాడు.

మావలి తాను పోగొట్టుకున్న సామ్రాజ్యాన్ని, ఆయుధాలను తిరిగి పొందటానికి గురువును ఆశ్రయించాడు. శుక్రాచార్యుడు 'మావలి! శ్రీఅయ్యర్‌మలై వెళ్లి గిరి ప్రదరక్షిణ చేస్తే శ్రీరత్నగిరీశుడు నీ కోర్కెలను నెరవేర్చగలడని, దేవతలను జయించే ఆయుధాల ప్రాప్తికి నిర్వహించాల్సిన యాగం గురించి తెలుసుకోగలుగుతావు' అని చెప్పారు.

గురు ఆజ్ఞమేరకు మవాళి శ్రీఅయ్యర్‌మలై చేరుకుని ప్రదక్షిణ చేశాడు. గిరి ప్రదక్షిణ మార్గంలోని మర్రి, జమ్మి, వేప చెట్లకు నీరుపోసి పెంచాడు. మావళి ప్రార్థనలకు, చేస్తున్న సేవలకు ముగ్ధుడైన శ్రీరత్నగిరీశుడు దక్కిన తప్పులు నివర్తించే దర్శనమిచ్చి అశరీరవాణిగా ఇలా పలికాడు. 'మావలి! నీ తపస్సుకు మెచ్చినాను. ముల్లోకాలు జయించగలే శక్తి సామర్థ్యం కలిగిన 'విశ్వజిత్‌' అనే ఆయుధాన్ని అందిస్తున్నాను స్వీకరించు. నీవు పోగొట్టుకున్న సామ్రాజ్యాన్ని తిరిగి పొందగలవు. ఇక నీవు చేయన్తున్న యాగం ద్వారా ఆయుధాలను పొందుతావు' అని తెలిపారు.

మహేశుడి అనుగ్రహంతో ఆవణి మాసం పౌర్ణమినాడు తన గురువు ఆశీస్సులతో విశ్వజిత్‌ యాగాన్ని నిర్వహించి సామ్రాజ్యాన్ని తిరిగి పొంది గురువు ఆశీస్సుల మహత్తును తెలుసుకోగలుగుతారు.

దక్కిన తప్పులు నివర్తించే దర్శన ఫలితాలు :

ప్రతి నెలా పౌర్ణమినాడు ముఖ్యంగా ఆవణి నెల పౌర్ణమినాడు శ్రీఅయ్యర్‌మలై ప్రదక్షిణ చేస్తూ తమకు సాధ్యమైనంతగా అన్నదానం చేస్తే,

1. తమకు చెందాల్సినవి ఇతరుల వల్ల పోగొట్టుకున్నవారికి సకలమూ మళ్లీ పొందగలుగుతారు.

2. పితృదేవతల ఆశీస్సులతో పిల్లలు చదువుల్లో, క్రమశిక్షణలో అభివృద్ధి చెందుతారు.

3. అండ చరాచర గురు మహాదేవతల అనుగ్రహం, తీవ్రమైన భక్తిని, గురుభక్తిని పొందుతారు.

దక్కన తప్పులు నివర్తించే దర్శనం తర్వాత అయ్యర్‌మలై ముఖ మండపాన్ని చేరుకోగలుగుతాము. ఆ చోట ఆశీనులైన క్షీర ప్రదాతయైన వినాయకుడిని దర్శనం చేసుకుని పూజించి గిరి ప్రదక్షిణను పూర్తి చేయాలి.

పైన పేర్కొన్న విశేష దినాలలోనే గాకుండా ఎప్పుడైనా రత్నగిరీశుడిని ప్రదక్షిణ చేసి శుభ ఫలితాలను పొందవచ్చు

గిరి ప్రదక్షిణ నియమాలు

శ్రీరత్నగిరీశ్వరుడిని ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు:

1. పాద రక్షలు ధరించకుండా గొడుగులు పట్టుకుని గిరి ప్రదక్షిణ చేయకూడదు.

2. పురుషులు ధోవతులు, అంగవస్త్రం ధరించి గిరి ప్రదక్షిణ చేయాలి. పంచకచ్చం ధరిస్తే చాలా మంచిది. (రత్నగిరీశుడు రత్నాల మాలలు ధరించి ఉన్నందున వాటి కాంతులు తమపై ప్రసరించాలంటే సాధ్యమైనంతవరకు పై వస్త్రం ధరించకుండా గిరి ప్రదక్షిణ చేయడమే మంచిది)

3. సువాసనలు వెదజల్లే అగరువత్తులు వెలిగించుకుని, వాటిని చేతపట్టుకుని గిరి ప్రదక్షిణ చేయడం శుభదాయకం.

4. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు లేదా గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన మీదట తమకు వీలైనంతగా అన్నదానం చేస్తే గిరి ప్రదక్షిణ ఫలితాలు అధికమవుతాయి. గిరి ప్రదక్షిణ చేసేవారు పండ్లు, బిస్కెట్లు, రొట్టెలు వంటి ఆహార పదార్థాలను తీసుకెళ్లి గిరి ప్రదక్షిణ మార్గంలోనే వాటిని దానం చేయవచ్చు. దానధర్మాల సహితంగా గిరి ప్రదక్షిణ చేయడమే సర్వోత్తమం.

రాజలింగంగా, రత్నగిరీశ్వరుడిగా వెలుగొందుతున్న మహేశ్వరుడిని భక్తులంతా ప్రదక్షిణ చేసి పూజలు నిర్వహించి సకల సౌభాగ్యాలు పొందాలని ఆశిస్తున్నాము.

శ్రీ అయ్యర్ మలైలో కార్తీక దీప దానం

సకల సంపత్తులనిచ్చే మహేశ్వరుడు అగ్నితత్త్వంతో శ్రీఅణ్ణామలైలో వేంచేసి ఉన్నారు. అసమాన్య అగ్ని తత్త్వం అంశగా శ్రీఅయ్యర్‌మలైలోనూ మహేశ్వరుడు కోరినవరాలనిచ్చే వరదేవుడిగా విలసిల్లుతున్నారు. ఆ మహేశ్వరుడి అనుగ్రహం అందరికి లభించాలనే తపనతో శ్రీలశ్రీ లోపామాత అగస్త్య ఆశ్రమం ఆధ్వర్యంలో గత ఐదేళ్లుగా శ్రీఅయ్యర్‌మలై శిఖరాగ్రంలో కార్తీక దీపం రోజున దీపం వెలిగిస్తున్నాం.

శ్రీఅయ్యర్‌మలైలోను, దాని చుట్టు నివసిస్తున్న భక్తులు, భక్తశిఖామణులు కార్తీక దీపం భారీయెత్తున నిర్వహించేందుకు సహాయ సహకారాలను అందించటం ఆనందదాయకమైన విషయం.

దీపం ప్రత్యేకతలు :

మానవుడు నిత్యం చేసే పనులలో తెలిసో తెలియకో పలు రకాల పాపాలు చోటుచేసుకుంటాయి. ఆలయ దర్శనం, అన్నదానం, వృద్దుల సేవ, హోమం, సుమంగళి పూజలు వంటి కార్యాల ద్వారా మానవుడు కర్మ ఫలితాలను బాగా తగ్గించుకోగలుగుతున్నాడు.

అయితే తీవ్రమైన కర్మఫలితాలు ఈ సాధారణమైన భక్తి కార్యకలాపాల ద్వారా తొలగించుకోలేకపోతున్నాడు. వాటిని దగ్ధం చేసి బూడిదపాలయ్యేలే చేసే అగ్నియే కర్మ ఫలితాలను పూర్తిగా తొలగించగలుతుంది.

శ్రీఅయ్యర్‌మలైలో వెలిగించే కార్తీక దీపం మానవుడి తీర్చ సాధ్యం కాని కర్మఫలితాలను తొలగించి అతడిని ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి చేర్చుతుంది.

అందరినీ అనుగ్రహించే శ్రీఅయ్యర్‌మలై ఈశ్వరుడు

మానవులనే కాక జంతుజాలాలు, చెట్లు, చేమలు, ప్రాకే, ప్రాకలేని జంతువులు శ్రీఅయ్యర్‌మల ఈశ్వరుడిని దర్శించే సకలజీవులు ఉన్నత స్థితులను పొందగలుగుతారు. మన కళ్లకు అగుపడే క్రిమి కీటకాలు మన పితృదేవతలుగా ఉంటూ శ్రీరత్నగిరీశుడిని దర్శించి మోక్ష ప్రాప్తిని పొందుతుంటారేమో! అలా మన పితృదేవతలు మనకు ఆశీస్సులందించే అవకాశం కూడా కలుగుతుంది. కనుక ప్రజలందరూ కార్తీక దీప దానం అనే ఈ అరుదైన సేవలో పాలుపంచుకుని సకల సౌభాగ్యాలతో వర్థిల్లాలని ప్రార్థిస్తున్నాము.

శుభాలనిచ్చే అన్నదానం

కార్తీక దీపం నాడు మా ఆశ్రమం ఆధ్వర్యంలో పలు రకాల ఆహార పదార్థాలను దీప దర్శనానికి వచ్చే భక్తులందరికీ దానంగా అందజేస్తున్నాం. మా ఆశ్రమవాసులు కుటుంబ సమేతంగా వేంచేసి శ్రీఅయ్యర్‌మలైలో బసచేసి, భగవన్నామాన్ని స్మరిస్తూ ఆహార పదార్థాలను వండి వార్చి శ్రీఅయ్యర్‌మలై ఈశ్వరునికి నైవేద్యంగా సమర్పించి, ఆ నైవేద్య ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తుంటారు.

దీనితో నిత్య దైవన్నామ స్మరణ, ఆలయ దర్శనం, తర్పణం, గాయత్రీ, వేదమంత్ర పారాయణం, హోమం - వంటి వాటిని గురించి తెలియని నిరుపేద భక్తులు శ్రీఅయ్యర్‌మలై ఈశ్వరుడి అనుగ్రహాన్ని ప్రసాదం రూపంలో పొందటానికి వీలవుతుంది.

పైగా అన్నదానంలోని ఆహార పదార్థాలు మన రోజువారీ సమస్యలను పరిష్కరించే సంజీవని ఔషధంగాను పనిచేస్తుంది.

1. కరివేపాకు అన్నం : గర్భసంబంధిత సమస్యలు, రక్తహీనత, రుతుస్రావ సమస్యలను పరిష్కరిస్తుంది. సైన్యంలో వీరమరణం పొందినవారికి ఆత్మశాంతిని కలిగిస్తుంది.

2. కాలిఫ్లవర్‌ ఆహారం : భార్యాభర్తలు, తోబుట్టువుల మధ్య ఏర్పడే మనస్పర్థలను పూర్తిగా తొలగిస్తుంది.

3. జీడిమామిడి ప్రసాదం : భగవద్‌ సేవలలో, ప్రజాసేవలు చేయక, కాలాన్ని వృధాచేసేవారికి సేవా తలంపులను కలిగించి భగవత్‌ చింతన ఏర్పరస్తుంది.

4. అరటి అన్నం : ఆసన ద్వారంలో ఏర్పడే రోగాలను నయం చేస్తుంది. పితృదేవతల ఆశీస్సులు లభింపజేస్తుంది.

వస్త్రదానం ప్రత్యేకత

కార్తీక దీపం రోజు శ్రీఅయ్యర్‌మలైలో పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల నిరుపేదలకు వస్త్రదానాలు కూడా నిర్వహిస్తున్నారు. నూతన వస్త్రాలకు సంబంధించిన ప్రత్యేక పూజల ద్వారా ఈ వస్త్రాలను దానం చేయడం వల్ల వాటిని స్వీకరించేవారి సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయి.

ఉదాహరణకు ఉత్తరాదిన ఉన్న కైలాసపర్వతం, కేధార్‌నాథ్‌, కాశి వంటి పవిత్ర క్షేత్రాలలో జీవితంలో ఒకసారైనా దర్శింకపోతామా అని ఆరాటపడేవారు ఎందరో ఉన్నారు.

హిమాలయ పర్వతంపై సంచరించే మేకల నుండి సేకరించిన మేలు రకం కంబళి దుస్తులను దానంగా పొందుతున్నప్పుడు ఇలాంటి ఆరాటాలన్నీ మటుమాయమై భగవద్‌ ఆనందం కలుగుతుంది.

ఆహా ఎంతటి మహోన్నత సేవ ఇది! ప్రజలందరూ ఈ అరుదైన సేవలో భాగస్వాములై దైవానుగ్రహం పొందుదురు గాకా.

-ఓం గురువే శరణం-

om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya
om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi
om sri guruve saranam om sri guruve saranam om sri guruve saranam