ఓం వల్లభ గణపతియే నమః
ఓం శ్రీ అంకాళ పరమేశ్వరీ నమః
ఓం గురువే శరణం
శ్రీ ఆయుర్ దేవి మహిమ |
కృతయుగంలో కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లిన శ్రీ ఆయుర్ దేవి ఉపాసన కాలగమనంలో ప్రజల అశ్రద్ధ వల్ల మరుగవటంతో ప్రస్తుతం సిద్ధపురుషుల అపార కరుణాకటాక్షాల వల్ల కలియుగ మానవుల నడుమ శ్రీ ఆయుర్ దేవి మళ్లీ సకల సౌభాగ్యాలతో విలసిల్లుతోంది.
శ్రీకైలాస వాసులైన ముని పరంపర 1001వ గురు మహాసన్నిధానం శక్తిశ్రీ అంకాళపరమేశ్వరీ ఆరాధ్య భక్తాగ్రణ్యుడు శ్రీలశ్రీ వెంకటరామ స్వాములు 1992వ సం|| నవరాత్రి మహోత్సవాల్లో చెన్నై మైలాపూరు శ్రీవెళ్ళీశ్వర శివాలయంలో 'శ్రీ ఆయుర్ దేవి మహిమ' అనే శీర్షికన నవరాత్రులూ ఆధ్యాత్మిక అద్భుత ప్రవచనం అందించి 'శ్రీఆయుర్దేవి' అందమైన రూపాన్ని ఆస్తీక మానవుల సౌభాగ్యం కోసం సమర్పించారు. తమ గురువుగారైన శ్రీలశ్రీ ఇడియాప్ప సిద్ధ స్వాముల కృపచేత శ్రీ అగస్త్యులవారి క్రాంతాల నుండి శ్రీ ఆయుర్దేవి యొక్క పరాశక్తి అంశాలకు రూపమేర్పరచి కలియుగ మానవులకందరికీ ఆధ్యాత్మిక సేవలందించి తరిస్తున్నారు శ్రీలశ్రీ వెంకటరామ స్వాములు.
నవ హస్తాలను కలిగిన పరాశక్తియైన శ్రీఅఖిలాండేశ్వరీ యొక్క అవతారంగా భాసిల్లు శ్రీ ఆయుర్దేవి మానవుల సేవే మాధవసేవగా భావించే త్యాగశీలురైన మహా సిద్ధపురుషులను, మహర్షులను తమ కరకమలాలతో దరిచేర్చుకుని పాలిస్తున్నది. ఆ దేవి నవమ హస్తం సాక్షాత్తు అభయ హస్తమే!
సాధారణంగా సిద్ధపురుషులు రూపాలను ఆలయ స్తంభాలపైనే చూడగలం. శ్రీ ఆయుర్దేవి ఆరాధించేందుకు శ్రీపరాశక్తి సమేతులై సిద్ధపురుషులు నమస్కరిస్తున్న రూపాలు కొలువుదీరి ఉండటం విశేషదాయకం. శ్రీదేవి (శాక్త) ఉపాసనలో ఉన్నతస్థితిని చేరుకున్న మహాపురుషులే సిద్ధపురుషులు. తన భక్తులను నమస్కరిస్తే సంతసించే శ్రీ ఆయుర్దేవి, ఎల్లవేళలా అంతటా అన్నింటా శివచిత్తంలోనే తరించే సిద్ధుల ద్వారా భక్తులకు పరిపూర్ణంగా కృపాకటాక్షాలను అందించి ఆ దేవి ఆనందిస్తుంది. కనుకనే శ్రీ ఆయుర్దేవి ఆరాధన మానవజాతిని కష్టాల నుండి కడతేర్చే సంపూర్ణమైన ఆరాధనగా పరిగణించాలి. శ్రీ అగస్త్య క్రాంతాల నుండి తన గురు కృపలచేత, శ్రీ ఆయుర్దేవి మహిమలను సేకరించి సమర్పించినవన్నీ ఓ అణువు కన్నా స్వల్పమైనదని, శ్రీఆయుర్దేవి మహిమలన్నింటిని వివరించడానికి పలు కోట్ల చతుర్యుగాలు చాలవని శ్రీలశ్రీ వెంకటరామస్వాములు చెబుతారు. ఆహా ఎంతటి అద్భుతమో కదా శ్రీ ఆయుర్దేవి మహిమ!
శ్రీఆయుర్దేవి కరకమలాల వివరణ
దక్షిణ హస్తం (పైనుండి దిగువకు) 1. గయాసుర మహర్షి. 2. ఆణి మాండవ్యులు 3. అత్రి మహర్షి 4. కుండలినీ మహర్షి
వామ హస్తం (పైనుండి దిగువకు) 1. అహిర్పుథన్య మహర్షి 2. సారమా ముని 3. ఆస్తీక సిద్ధులు 4. కార్గిణీ దేవి, సంవృత మహర్షి
ఎనిమిదో హస్తంలో ఆశీనులైన కార్గిణీదేవి శ్రీ ఆయుర్దేవి కరుణ వల్ల అమృత కలశంగా వెలుగొందుతున్నది. ఈ హస్తంలోనే శ్రీసంవృత మహర్షి కలశంలో కొలువుదీరి ఉంటున్నారు.
పొదిగై మల జల్లులు... వేలకొలది సంఖ్యలో అద్భుతమై వన మూలికా గుణాలు కలగలసి సువాసనలు వీస్తుండగా..
సిద్ధపురుషుల అగ్రగణ్యులైన శ్రీ అగస్త్య మహర్షులవారు తన శిష్యుల సమేతంగా శివ ఆరాధాన నిర్వహించిన మీదట మౌనంగా ఆశీనులయ్యారు. బోగర్ శాంతంగా తన సద్గురువు వద్ద మోకరిల్లి అడగటం ఆరంభించారు.
బోగర్ : సద్గురుదేవా! నేటి నుండి మనమందరమూ దివ్య క్షేత్రాటనం నిర్వహించబోతున్నాము కదా! ముఖ్యంగా 'దేవి ఉపాసనలను గురించి కలియుగ మానవులకు ఎలుగెత్తి చాటాల్సిన తరుణమిది' అంటూ సాక్షాత్తు సదాశివుడే నుడివిన చందాన నేటి పూజలో పూసగుచ్చినట్లు వివరించారు. కనుక మనం అంబికాదేవి అనుగ్రహించే క్షేత్రాలలో పర్యటించనున్నాము కదా!
అగస్త్యులు : అవును బోగా! అంతేకాదు, శ్రీవిద్యగా దర్శనమిచ్చే పరాశక్తి తిష్టవేసిన మేరుచక్రంలో మాత్రమే 43 కోట్ల దాకా దేవీ స్వరూపులు కొలువుదీరి ఉన్నారు. అధర్మం అధికమవుతున్న ఈ కలియుగంలో కోటానుకోట్ల సంఖ్యలో వ్యాధులు, మానసిక వ్యాధులు, పేదరికం, దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు, అపహరణలు వంటి సామాజిక రుగ్మతలు రోజురోజుకు అధికమవుతూనే ఉన్నాయి. కనుక ఈ 43 కోట్ల దేవేరులు భూలోకంలో అవతరించి దుష్టశక్తులను దునుమాడి సుఖశాంతులను కలియుగ మానవులకు అందించటానికి ఆయత్తమవుతున్నారు. అయితే శివుడి చిత్తమేదో ఆ చిత్తం ప్రకామే కదా జరుగుతుంది.
పులిప్పాణి : దేవుడి మనస్సులో ఏముందో మీకు తెలియనిదా గురుదేవా?
అగస్త్యులు : శిష్యులారా, ఆది శివుడి అనుజ్ఞ ప్రకారం పలు యుగాలలో పలువురు దేవేరులు అవతరించారు. అయితే యుగధర్మాలు మారుతుండటం వల్ల దేవేరుల అవతార అంశాలు కూడా అందుకు తగ్గట్టుగా మారుతున్నాయి.
బోగర్ : జ్ఞాన గురువర్యా! ప్రస్తుతం మళ్లీ అవతరించే శ్రీదేవి శక్తి ఎవరనేదీ తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నాము.
అగస్త్యులు : (చిరునవ్వు నవ్వుతూ) కృతయుగంలో, తేత్రాయుగంలోను ఇంటింటా ఆరాధించబడిన శ్రీ ఆయర్ దేవి ఎన్నటికీ ఆదిపరాశక్తి అవతారమే. ప్రస్తుతం సిద్ధపురుషుల ద్వారా కలియుగంలో మళ్లీ ఆమె అవతరించాలన్నదే ఆ పరమేశుడి చిత్తం.
శ్రీఆయర్ దేవి మళ్లీ అవతరించబోతున్నదీ అని చెప్పడం కంటే శ్రీ ఆయర్దేవి ఉపాసన కలియుగంలో మల్లీ నూతనోత్తేజం పొందబోతున్నదనటమే సమంజసం. అవును శిష్యులారా! దీనిని తర్వాత మీకు వివరిస్తాను. ఎన్నో ఆధ్యాత్మిక రహాస్యలు పలు యుగాలలో సద్గురువుల ద్వారా బహిర్గతమయ్యాయి. అవన్నీ సాధారణ మనిషి బుద్ధికి అర్థంకాని ఆధ్యాత్మిక రహస్యాలు. కాలగమనంలో సక్రమంగా అనుసరింపబడని వాటినంతా మానవజాతి మరచిపోతున్నది. ఆ మరచిపోయిన సంగతులను సద్గురువు ద్వారా ఒకడు తెలుసుకోగలుగుతాడు.
బోగర్ : గురుదేవా! మానవుడు జీవిత కాలంలో తెలుసుకోవలసినవాటి గురించి అవగాహన కలిగి ఉండాలి. దేనిని తెలుసుకుంటే మానవుడు అన్నీ తెలుసుకున్నవాడవుతాడో వాటిని మాత్రమే తెలుసుకుంటే చాలును' అని అతడు భావించాలి కదా!
అగస్త్యులు : అవును భోగా! తొలుత గురువు పాదాలను పట్టుకో. ఆయనే అన్నింటినీ తెలుసుకోగలిగినవారు. ఓ మనిషి తన జీవితకాలంలో వేదం, గణితం, భౌతికం, అణుశాస్త్రం, వైద్య, చట్టం వంటి అన్ని విద్యలను నేర్చుకోగలడా? అయితే దైవానుగ్రహంతో అన్నింటిని ఇవ్వగలిగిన సద్గురువును ఆశయ్రిస్తే చాలు. ఆయనే జ్ఞానం, సత్యజ్ఞానం. తక్కినవన్నీ పాఠాలకే పరిమితమైనవి కనుక మన సిద్ధుల పారంపర్యంకు చెందిన సద్గురువు ద్వారా అంగీరస నామ సంవత్సరం (కలియుగాది 5094) శ్రీ ఆయుర్ దేవి రూప దర్శనం నవరాత్రి పూజల సందర్బంగా మళ్లీ జరగాలన్నదే దైవ చిత్తం.
శ్రీవిద్యా ఉపాసనలో ఉన్నత స్థితిని చేరుకున్న శ్రీ భాస్కరాయర్, శ్రీ ఆయుర్దేవి ఉపాసన వైశిష్ట్యాన్ని తెలుసుకుని శ్రీ అంబికాదేవి పాదాలను శరణుజొచ్చిన ఉత్తమ పురుషులు.
శ్రీ అగస్త్య మహా ప్రభువుల ఆజ్ఞ ప్రకారం శ్రీకైలాస పొదియ ముని పరంపరం 1001వ గురు మహాసన్నిధానం శక్తి శ్రీ అంకాళ పరమేశ్వరి ఆరాధ్య భక్తాగ్రణ్యుడు శ్రీలశ్రీ వెంకటరామ స్వాములు తమ గురువుగారైన శ్రీ-ల-శ్రీ ఇడియాప్ప సిద్ధులు అనుగ్రహం చేత 'శ్రీ ఆయుర్దేవి' శిలా రూపాన్ని, బింబ స్వరూపాన్ని చెన్నై మైలాపూరు శ్రీ వెళ్లీశ్వర ఆలయంలో 1992 సం|| అక్టోబర్ నవరాత్రి ఉత్సవాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించినప్పుడు కలియు ఆధ్యాత్మిక భక్తులకు సమర్పణం చేశారు. శ్రీ ఆయుర్దేవి స్వరూపం 'కపాల సిద్ధ వడినాడి' అనే క్రాంతముల నుండి శ్రీ-ల-శ్రీ స్వామివారిచే పరిష్కరించబడి సమర్పించబడినది. సిద్ధులు భాండాగారమైన ఈ క్రాంతాలు శ్రీవిద్యా ఉపాసన యొక్క ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉన్నప్పుడే విజ్ఞానంతో తెలుసుకోగలం.
బోగర్ : కృతయుగం, త్రేతాయుగం తర్వాత శ్రీ ఆయుర్దేవి ఆరాధనలు కనుమరుగయ్యాయా గురుదేవా?
అగస్త్యులు : లేదు బోగా! అయ్యప్ప ఆరాధన, మేల్మరువత్తూరు శ్రీఆదిపరాశక్తి మహిమ, శ్రీ గురువాయూరప్పన్ దర్శనం 300, 400 సంవత్సరాలలోపు పలువురు సిద్ధపురుషుల ద్వారా ఎలా పునరుజ్జీవనం అయ్యాయో అదే విధంగా పలు యుగ మానవుల అశ్రద్ధ కారణంగా కాలగమనంలో మరుగైన శ్రీ ఆయుర్ దేవి ఆరాధన మళ్లీ జనబాహుళ్యంలో వాడుకలోకి వచ్చింది.
శ్రీదేవి కారుణ్యదేవిగా ప్రజా సంక్షేమం కోసం మళ్లీ ఆవిర్భవించి భక్తులకు వరదాయినిగా ఉంటోంది.
పులిప్పాణి : జ్ఞానగురువా! ఇలా కొత్తగా దేవేరీలు ఆవిర్భవించటం అవశ్యమేనా అని ఆధ్యాత్మిక భక్తులు కొందరు అయోమయపడుతుండటం ఎందుకో?
అగస్త్యులు : మంచి ప్రశ్న వేశావు పులిప్పాణి! కలియుగ మానవులు సుఖాలనే కోరుకునేవారు. దుఃఖాలు, కష్టాలు వెంటనే తీరిపోవాలి అని ఎదురుచూస్తారు. సుఖదుఃఖాల నడుమ నిజమైన భక్తిని వారు పొందలేరు. కనుకనే వారికి అవసరమైన ఇహపర సుఖాలను అందించి వాటికి మించిన పరబ్రహ్మ ఒకటుందని పామరజనానికి కూడా తెలియజేయడానికే దేవి ఉపాసన అనే శాక్త ఆరాధన పుట్టింది.
బోగర్ : ఆ కారణంగానే మారియమ్మ ఉత్సవాలు, కాళిపూజలు వంటి అమ్మవారి ఆరాధనలు కలియుగంలో విశిష్టతను సంతరించుకున్నాయా గురుదేవా?
అగస్త్యులు : అవును. ఏ స్వామిని వేడుకుంటే ఏ వ్యాధి తీరుతుంది. డబ్బు కష్టాలు తీరుతుందా? సంతాన భాగ్యం కలుగుతుందా? ఉద్యోగం లభిస్తుందా అంటూ కోటానుకోట్ల మంది ప్రజలు పలు ఆలయాలను వెదుక్కుంటూ అలమటిస్తున్నారు. ఈ విధంగానైనా ప్రజలు దైవభక్తిని కలిగి ఉన్నారు కదా అని పైలోకాన ఉన్న పితృదేవతలు, ఋషులు, దేవతలు సంతసిస్తున్నారు.
కనుకనే ఓ వ్యాధినో, కష్టాన్నో తీర్చడానికి దేవేరీలు మళ్లీ అవతరిస్తున్నారు. దీనివల్లే అమ్మవార్ల ఆరాధన కలియుగంలో బలపడుతున్నది. నవీన దైవీ అంశాలు అని అనడం కంటే పలు యుగాలలో అవతరించిన దేవేరులే మళ్లీ శక్తిరూపం దాల్చుతున్నారని ఆధ్యాత్మిక వాదులు తెలుసుకుని స్పష్టతను పొందాలి.
బోగర్, పులిప్పాణి : శ్రీ ఆయుర్దేవి అవతార మహిమలను సరళమైన రీతిలో తెలుసుకోవాలని ఆశిస్తున్నాము గురువర్యా!
అగస్త్యులు : లక్షలాది క్రాంతములలో వేలకొలది సిద్ధులు, మహర్షులు వర్ణించినవాటిని క్లుప్తంగా చెప్పటం సాధ్యమా? అయినా మీరు కోరినట్లే చెబుతాను. కృతయుగం నుండి యుగ యుగానికి ధర్మనియమాలు కొద్దిగా కొద్దిగా విడువబడినందువల్లే కలియుగంలో ప్రస్తుతం హింసాకాండ, అరచకాలు అధికమయ్యాయి. దీనికి ముఖ్యకారణం జీవుల మధ్య క్రమశిక్షణ తగ్గిపోవడమే. దైవభక్తితోపాటు క్రమశిక్షణను కలిగి ఉంటే తనకు అవసరమైనవాటిని తన కర్మఫలితాలను పొందగలరని ప్రతి మనిషి అర్ధం చేసుకుంటే కామ, క్రోధం, పోటీ, ఓర్వలేనితనం వంటి వాటికి చోటుండదు. సకల జీవరాశులు సంతోషంగా జీవిస్తాయి కదా!
పులిప్పాణి : సద్గురువే! అలాగైతే చిన్నారుల నుండి వృద్దుల దాకా అందరూ ఓర్పు, మంచితనం, వినయం వంటి ఇహపర సుఖాలను అందించగలిగేది ఆయుర్దేవే! అయితే శ్రీ అంబిక వీటిని అందించే పద్ధతులే అత్యద్భుతాలు కదా!
బోగర్ : కలియుగంలో మానవుడు వెంట వెంటనే ఫలితాలను ఆశిస్తుంటాడు. అర్చన చేసిన వెంటనే వ్యాధి నయమైపోవాలి. మండలంపాటు పూజలు చేసిన వెంటనే సంతానభాగ్యం కలగాలి. ఇలా శ్రీ ఆయుర్దేవి వద్ద కూడా వేడుకుంటారు కదా గురుదేవా!
అగస్త్యులు : సక్రమమైన ఇహపర సుఖాల కోసం ప్రార్థించటం తప్పుకాదు శిష్యులారా! దాన ధర్మాలతో కూడి సక్రమమైన రీతిలో పూజలు చేస్తే ప్రార్థనా ఫలితాలు బలపడతాయి. దీనికోసమే మనం సత్సంగాలను ఏర్పరచాం. సత్సంగాలలో ఉన్నవారు ప్రవచనాలు, పుస్తకాలు, పత్రికలు, సంభాషణల ద్వారా ప్రజల దాన ధర్మాల విశిష్టతలను గురించి బోధించాలి.
ప్రతి మనిషి రాత్రి నిదురించడానికి ముందు 'ఈ దినాన కనీసం ఇరువురికైనా సద్విషయాలను, దైవసేవలను గురించి సద్గురువు బోధించినవాటిని చర్చించామా?' అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇదే వాస్తవమైన ఆత్మవిచారం. ఇలాంటి సులవైన ఆత్మవిచారాన్ని కలిగించి సౌభాగ్యాలను ప్రాప్తింపచేయునదే శ్రీ ఆయర్దేవి. ఈ సత్కార్యాల కోసమే శ్రీ అఖిలాండేశ్వరి తొమ్మిది హస్తములతో అవతరించింది. 'కోరిన కోర్కెలను కోరినట్లు అందించగల కారుణ్యమూర్తి ఆ అమ్మవారే అన్నది ప్రార్థన యొక్క రెండో పాఠం. అదే ఆత్మవిచారపు జ్ఞానమవుతుంది.
బోగర్ : గురువర్యా! సాధారణంగా శంఖు, చక్రం వంటి ఆయుధాలను ధరించి దుష్ట నిగ్రహ రూపంలోనే కదా అమ్మవారు అవతరిస్తారు. మరి శ్రీ ఆయుర్ దేవి రూపం చాలా వ్యత్యాసంగా ఉంటున్నదే!
అగస్త్యులు : 'ఆది పరాశక్తి అవతార ఆశయం అదే బోగా! దీనినే శ్రీ ఆయుర్దేవి అనుగ్రహ పరిపాలనం వ్యత్యాసమైనదనే చెబుతున్నాం. శ్రీ ఆయుర్దేవి యొక్క తొమ్మిది హస్తములు నవగ్రహ తత్త్వాలను సులువైన రీతిలో బోధిస్తున్నాయి.
బోగర్ : మానవుడి సుఖాలను, దుఃఖాలను వేర్వేరుగా తొమ్మిది రకాలుగా విభజించవచ్చు. ఈ విశ్వంలోని సకల జీవుల అన్ని రకాల సుఖదుఃఖాలు ఈ తొమ్మిదింట అణగిపోతాయి. కష్టాలను, దుఃఖాలను నివృత్తి చేయాలన్నదే ఇప్పటి సామూహిక ప్రార్థనగా ఉంటోంది. దీనిని పరిగణనలోకి తీసుకునే మానవుడి మేధస్సును పెంచడానికి నవగ్రహ దేవతలను ఆ దేవదేవుడు రూపొందించాడు. వారివారి కర్మఫలితాలకు తగినట్లు ఇహపర సుఖాలను నవగ్రహాధిపతులు గణిస్తుంటారు. తొమ్మిదవ హస్తమే అభయహస్తం. ఆ హస్తంలో శ్రీచక్రానికి ధీటైన 'దీపికా బింబ చక్రం' ఉంది. ఈ చక్రపు బిందుస్థానం నుండి సువాసనలతో కూడిన ధూపములు సకలలోకాలకు వ్యాపించి ఉన్నాయి. ఈ ధూపపు కిరణాలే లోకంలోని అన్ని జీవరాశుల సృష్టి, కర్మ పరిపాలనలను నిర్ణయిస్తోంది. నిత్య జీవశక్తిని అందిస్తోంది.
కుంభకోణం, వారణాసి వంటి క్షేతాల్రలో నిర్వహించే కుంభమేళా ఉత్సవం తెలియజేయు సృష్టిని ఆవిర్భవించగల అమృత కలశాన్ని పరమేశ్వరుడు ఈ దూపికా బింబ చక్రము నుండే రూపొందిస్తున్నారు.
శ్రీ ఆయుర్ దేవి ఆవిర్భావం |
నవహస్తాలు కలిగిన శ్రీ ఆయుర్దేవి శివాంశ సంభూతురాలైన ఆదిపరాశక్తి. నవ సిద్ధపురుషులు కలియుగ మానవలు పలురకాల దుఃఖాలను తొలగించడానికి అద్భుతమపై తపములాచరించి దైవావతారాలనుండి పొందిన వరాలను శాంతమైన పద్ధతిలో ఎదుర్కొని సిద్ధపురుషుల తపోబలంతో వాటిని తొలగించటమే గాక దుష్టశక్తులు మళ్లీ దరిచేరకుండా పలు ప్రాయశ్చిత పద్ధతులను వారి ద్వారా అనుగ్రహించే అమ్మవారే శ్రీ ఆయుర్దేవి!
ఇక అభయహస్తంలో సాక్షాత్తు పరమశివుడే కొలువుదీరగా, అంబిక రూపాన్ని, ఆమె కరకమాలపై స్థానం పొందిన కోటానుకోట్ల సిద్ధపురుషుల తపోఫలితాలను విశదపరుస్తుండగా శ్రీ నందీశ్వరుడు వాటిని పలు గ్రంథములుగా రచిస్తూనే ఉన్నాడు. శ్రీవిద్యా ఉపాసనలో ఉన్నత స్థితిని పొందినవారే ఈ దృశ్యాలను తిలకించగలరు. గురువు అనుగ్రహం వుంటే అన్నింటినీ తెలుసుకోగలరు.
ఓ హస్తంలో పలుకోటి యుగాలు ఆశీనులయ్యే భాగ్యాన్ని పొంది సిద్ధ మహర్షి ఆ హస్తంలో ఆశీనులయ్యే అన్ని అర్హతలు కలిగిన మరొకరు రాగానే అమ్మవారిలో ఐక్యమై కరపీఠాన్ని అధిష్టించడానికి వీలుకల్పిస్తారు. ఇలా ఆయుర్దేవి అమృతహస్తాలలో ఆశీనులైన సిద్ధపురుషుల సంఖ్యను లెక్కగట్టలేము. ఇలా కోటాను కోట్ల మంది సిద్ధపురుషులు, మహర్షులు శ్రీఆయుర్దేవి పవిత్రదేహంలోనే ఐక్యమయ్యారు.
శ్రీఆయుర్దేవి మహిమలను, రూపాలను, అవతార రహస్యాలను వివరించే శ్రీ అగస్త్య గ్రంథాలలో కపాల సృష్టి గ్రంథం, దూపికాదేవి గ్రంథం కూడా ఉన్నాయి.
తమ గురుదేవులైన శ్రీ-ల-శ్రీ ఇడియాప్ప సిద్ధపురుషులు అనుగ్రహం చేత ఇటువంటి సిద్ధ గ్రంథపు రహస్యాలను కలియుగ మానవుల ఆధ్యాత్మిక ఉన్నతకోసం సోదాహరణంగా వివరిస్తున్నవారే శ్రీ-ల-శ్రీ వెంకటరామస్వాములు
శ్రీ ఆయుర్ దేవి వాహనం |
హంసవాహనంపై కొలువుదీరిన దేవి శ్రీ ఆయుర్ దేవి. ఆ దేవి సమీపాన రెండు సింహ పీఠములు ఉన్నాయి. తిరువిడై మరుదూరు మహాశివుడికి నందిగా సలాలగన్ అనే నందీశ్వరుడు ఆశీనులై ఉన్నాడు. పలు కోట్ల సంవత్సరాలపాటు తపమాచరించి సలాలగ్నుడు ఆ అరుదైన భాగ్యాన్ని పొందాడంటే శ్రీఆయుర్ దేవికి హంసవాహనంగా, రెండు సింహవాహనాలుగా ఉన్నవారు ఎంతటి ఘోరతపమాచరించి ఉంటారో కదా!
శ్రీఆయుర్ దేవికి హంసవాహనమైన స్వారోషిషణ్ అనే మహా తపస్వి శ్రీమన్నారాయణుడి ఉపాసించి మహర్షిగా మారినవారు. ఆయన శ్రీమహావిష్ణువునే సాక్షాత్తు మహేశ్వరుడిగా దర్శించాలని కోరుకున్నప్పుడు, 'దేవీ ఉపాసన వల్లే నన్ను మహాశివుడిగా దర్శించగలవు' అన్నారు. ఆ మేరకు స్వారోషిణ మహర్షి శ్రీదేవి ఉపాసనలో మునిగి తేలి హంసవాహనం మారే భాగ్యాన్ని పొందగలిగారు.
నవ సంఖ్యా తత్త్వం
ప్రతి మనిషిలోని నవ ద్వారాలు ఉన్నాయి. నాసికా ద్వారాలు గుండా వెళ్లే శ్వాసను క్రమబద్ధం చేసి మనస్సును ఏకాగ్రతపరచే తత్వ్తానికి 'ప్రాణాయామం' అని పేరు. దీని విశేషాలు అందరికీ తెలిసినవే.
నాసికలు మినహా తక్కిన సప్తద్వారాలలోను శ్వాసము ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక రహస్యాలను తెలిసినవారే సిద్ధపురుషులు. కర్ణాయామం, యోనియామం, కుక్కుటయామం అని మూడు విధాల యామ నియమ పద్ధతులతో తక్కిన ఏడు ద్వారాల శ్వాసను క్రమపరచినట్లయితే సిద్ధులవలే ఎల్లవేళలా శివచిత్తంతో విరాజిల్లవచ్చు.
మానవుడి తలంపుల ద్వారా ఈ నవ ద్వారాల ద్వారా శక్తులు, భావనలు లోపలకు బయటకు వచ్చి వెళుతుంటాయి. దీని క్షణ క్షణానికి ప్రతి మానవుడి ఆధ్యాత్మిక స్థితి మారుతూపోతుంది. వేలకొలది తలంపులు, శక్తులు ఆగమన తిరోగమనాల ద్వారా మానవుడి మనస్సు శాంతచిత్తమవుతుంది. అతడి మానసిక స్థితి కూడా మారుతుంది. పద్మాసనంలో ఆసన, యోని ద్వారాలు, ప్రాణాయామంలో నాసికలు, నేత్రాలు, మౌనం వల్ల నోరు, ఓంకారం వల్ల చెవులు శాంతమవుతాయి. నవద్వారా శ్వాస ప్రక్రియలను క్రమబద్ధీకరించడమే ఉన్నత ధ్యానమవుతుంది. దీనికి 'సర్వ సిద్ధ యోగం' లేదా 'సర్వ సిద్ధ శరీర ధ్యానం' అని పేరు.
దేహమే దేవాలయం
నవద్వారాల వాసికలకు అనుగుణంగా మానవుడి దేహ కర్మ పరిపాలన జరుగుతుంటుంది. దీనికి అనువుగానే సుఖదుఃఖాలు కలుగుతుంటాయి. కనుకనే అన్ని జీవుల సుఖదుఃఖాలను తొమ్మిది విధాలుగా వర్గీకరించారు. మానవుడి దేహంలోనూ నవగ్రహాలు పరిపాలన చేస్తున్నాయి. నవగ్రహ దేహపరిపాలన విధి కూడా ఉంది. హృదయ కమలంలో ఆత్మ, సర్వేశ్వరుడిగా కొలువై యుండగా, దేహమే దేవుడు కొలువైన ఆలయం. దేహంలోని తొమ్మిది చోట్ల నవగ్రహాలు పరిపాలన సాగిస్తున్నాయి. తక్కిన దైవాలు పరిపాలించే దేహాంశాలు కూడా ఉన్నాయి. నవగ్రహ ఆరాధన సాధారణంగా ఆలయలలోనే జరుగుతాయి. అయితే శ్రీ ఆయుర్దేవి ఇంటింటా కొలువుదీరాల్సిన అఖిలాండేశ్వరి. కనుకనే శ్రీఆయుర్ దేవి పూజ చేస్తున్నాం.
1. శివాంశం పరిపూర్ణంగా కలిగి ఉన్నది కనుక పరబ్రహ్మ ఆరాధనను
2. నవగ్రహ తత్త్వాన్ని తెలిపి తొమ్మిది రకాల ఇహపర సుఖాలను అందిస్తుంది కనుక నవగ్రహ ఆరాధనను
3. సకల ఐశ్వర్యాలు అందించి రక్షిస్తుంది కనుక శ్రీలక్ష్మీ నారాయణ ఆరాధనను
4. అతి అద్భుత సిద్ధపురుషులు, మహర్షులు మహా తపస్సుల వల్ల సాధించిన సుఖదఃఖాల నివృత్తి పద్ధతులను అందిస్తున్నందున - సద్గురువుల ఆరాధనను సమైఖ్య పరచి సమర్పిస్తున్నందు శ్రీ ఆయుర్దేవి ఆరాధాన శ్రీ అఖిలాండేశ్వరి దేవి సర్వ దైవ సంపూర్ణ ఆరాధనగా విరాజిల్లుతుంది.
బోగర్ : సద్గురువు దేవా! శ్రీ ఆయుర్దేవి హంస వాహనాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణమేమిటో సెలవివ్వండి.
అగస్త్యులు : పక్షులలో తొలుత జన్మించిన పక్షి హంసే. సృష్టి సమయంలో ప్రతి లోకంలోనూ ఒక్కో పక్షి ఆదిమూల పక్షిగా భగవంతుడు సృష్టించాడు. పక్షిశాస్త్రంలో ఉండే ప్రతి పక్షీ వేర్వేరు యుగాలలో తొట్టతొలుతగా జనించిన పక్షులే. ఇలా దేవీలోకంలో ఆది పక్షిగా ఆవిర్భవించిన హంస ఓ పర్యంతము శ్రీమహావిష్ణువు శయనించి క్షీర సమద్రంలో నీటిని, పాలను వేరుపరచినదట.
శ్రీరంగనాధుని సన్నిధిలోనూ పాల కల్తీనా అని దేవతలు అచ్చెరువొందగా అన్నిలోకాలలోను పవిత్రమైనదిగా భావించే పాలకడలిలోను నీరు కలిసిపోయిందా? ఈ నీరు ఎలా చేరింది అని అందరూ ఆశ్చర్యపోతున్న వేళ శ్రీమహావిష్ణువు ఇలా వివరించారు.
'నా ప్రార్థనలకు తగ్గట్లు పరమేశ్వరుడు నా ఛాతీపై నృత్యమాడారు. దీనితో నా బరువు పెరిగింది' ఆ అధికమైన బరువును ఆదిశేషుడు మోయలేక ఊపిరాడక 'ప్రభో! ఉన్నట్టుండి మీ దేహపు బరువు అధికం కావడానికి కారణమేమిటి?' అని అడిగాడు. పరమేశ్వరుడు నృత్యం చేసిన వైనాన్ని ఆదిశేషుడికి వివరించాను.
'సాక్షాత్తు సదాశివుడిని, శ్రీమన్నారాయణుడిని కలిపి మోసే భాగ్యం పొందిన నేను ఎంతటి పుణ్యం చేసానో కదా!' అని పులకించిపోయాడు ఆదిశేషుడు. ఆనందభాష్పాలు రాల్చాడు. ఆ కన్నీటి చుక్కలు పాలకడలిలో పడింది. హంస పాలసముదంలోని నీటిని వేరుపరచింది. ఇలాంటి దైవీక లీలలను నిర్వహించిన హంసే శ్రీ ఆయుర్దేవికి వాహనంగా ఉంటోంది.
సింహ పీఠాలు |
పులిప్పాణి : ఆహా! వినడానికే ఆనందంగా ఉంది. గురుదేవా! ఇక సింహ పీఠాలు గురించి...
అగస్త్యులు : పులిప్పాణి వాటి గురించి కూడా చెబుతాను ఆలకించు! సింహపీఠాలుగా ఉన్న వీరు యుగధర్మ పురుషులు. పలు కోట్ల యుగాలలో ధర్మ పరిపాలన చేసిన మనుప్రజాప్రతినిధులు. కర్తమ ప్రజాప్రతి శిష్యులు. అధర్మానికి వ్యతిరేకంగా గర్జించినవారు. ప్రాణుల కర్మ పరిపాలనలను నిర్ణయించే పితృలోక ఆదిత్యుల నియామకాలను నిర్వర్తించగలిగిన అద్భుతమైన అవతార పురుషులు ఒక్కో లగ్నంలో జనించే ఆడ, మగ జీవులను పరిపాలనకోసం యుగాంతర మను దేవతలు ఉన్నారు. సింహరాశికి అధిపతియైన సూర్యనారాయణమూర్తి కృపాకటాక్షాలను పొందినవారే ఈ సింహపీఠాలుగా ఉన్నవారు. అన్ని లోకాలలోను సింహ లగ్న జీవులకు అధిపుతులు కూడా వీరే.
బోగర్ : గురుదేవా! అలాగైతే శ్రీ ఆయుర్దేవి దర్శనం వల్ల నమస్కారయోగం, అన్ని ఆసన పద్ధతులు సిద్ధిస్తాయి కదా?
అగస్త్యులు : తప్పకుండా సిద్ధిస్తాయి! యోగం నేర్చుకునేవారు ముఖ్యంగా రాజయోగులకు శ్రీ ఆయుర్దేవి ధ్యానం అనువైన త్వరితగతిన ఫలితాలను అందించగలదు. అంతేకాదు, హంస వాహన దర్శనం (హంస పాలను నీటిని వేరుపరిచేలా) పగలు, రాత్రిని విభజించి దీర్ఘదర్శనాన్ని అపారమైన జ్యోతిష గ్రహ పరిపాలన జ్ఞానాన్ని అందించగలదు. జ్యోతిష్యులకు శ్రీ ఆయుర్దేవి పూజ చాలా ముఖ్యమైనది.
త్రిమూర్తులు
భోగర్ : బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు శ్రీ ఆయుర్దేవికి వందనమాచరించే తత్త్వాన్ని వివరించండి గురుదేవా?
అగస్త్యులు : త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయ కారకులే అయినా ఆ మువ్వురూ ఏకమైనప్పుడు పరబ్రహ్మగా వెలుగొందుతారు. మువ్వురు తమ కర్తవ్యాలను సమర్థవంతంగా నిర్వర్తించడానికి శ్రీ ఆయుర్దేవిని పరబ్రహ్మ అంశగా పూజిస్తున్నారంటే దేవియొక్క మహత్యాన్ని వర్ణించగలమా; పైగా త్రిమూర్తుల అంశాలు యుగానికి యుగం మారుతూంటుంది. మనిషి స్వల్ప మేధస్సుకు అందని ఇలాంటి దైవీక స్థితులను సద్గురువు అనుగ్రహంతోనే పొందగలము.
త్రిమూర్తులు ఒక్కో యుగంలోనూ ఒక్కో నామం ధరించి అనుగ్రహిస్తుంటారు. శ్రీ ఆయుర్దేవిని పూజించే త్రిమూర్తులు నామావళి ఏదంటే-
రుద్ర - తైత్రీయ ప్రజాపతి
విష్ణు - రుద్రప్రళయుడు
బ్రహ్మ - రుద్ర ప్రియుడు
వీరు దేవి గుణాంతర యుగానికి చెందిన త్రిమూర్తులు. త్రిపుర సంహారమూర్తికి మునుపటి యుగానికి చెందిన త్రిమూర్తులు.
కనుక ఈ త్రిమూర్తుల దర్శనం అహంకారం, ద్వేషం, మాయ అనే త్రివిధాల మాయా జ్ఞానాన్ని అందించి, ఆ మాయలను తొలగించే పరిహార పద్ధతులను సిద్ధపురుషుల ద్వారా తెలియజేస్తోంది. శ్రీ ఆయుర్ దేవి నుండి ఇచ్ఛాశక్తి, క్రియా శక్తి, జ్ఞాన శక్తిని పొంది మానవుడి దేహ, జ్ఞానాభివృద్ధిని ప్రసాదించేవారే ఈ త్రిమూర్తులు.
శ్రీ చిత్రగుప్త దేవుడు
బోగర్ : ఆచార్యదేవా! చిత్రగుప్తనాధుడు శ్రీ ఆయుర్దేవి పాదాలకు సమర్పించేది ఏమిటో తెలుపండి.
అగస్త్యులు : పాలీనుడు అనే నామధేయం కలిగిన చిత్రగుప్త దేవుడు సృష్టి కార్యాన్ని నిర్వర్తించే బ్రహ్మదేవుడు కర్మ పరిపాలనను, బ్రహ్మ గురువుల ఆయుష్షును శ్రీదేవి ఆజ్ఞానుసారం నిర్ణయిస్తుంటాడు. ఆయన సాధారణ దేవస్వరూపులు కాదు. బ్రహ్మ గురు లోకాల వ్యవస్థ పరిపాలకులు. ఈయన దర్శనం అలభ్యం. ఆయన కిరీటం కేవలం తలపాగాగ ఉండదు. కోటానుకోట్ల జీవరాశుల తలరాతలను నిర్ణయించే బ్రహ్మగురువుల కర్మ ఫలితాలను క్రమబద్ధీకరించే అద్భుతమైన దైవీక సృష్టి.
ప్రతి క్షణం లెక్కకు మిక్కుటమైన జీవుల కర్మ ఫలితాలు మారుతూనే ఉంటాయి. వీటిని ఇసుమంతైనా తప్పిదానికి పాల్పడకుండా సక్రమంగా విభజించడం దేవుని అద్భుత సృష్టి వల్దే సాధ్యం కాగలదు.
ఆత్మ విచారమూర్తి
ప్రతి మనిషి రోజూ రాత్రివేళ నిదురపోవడానికి ముందు ఆ నాడు తాను నిర్వహించిన కార్యాలను వాస్తవమైన మనసాక్షితో నిశితంగా పరిశీలించి వాటిని ఈ పాలినన్ అనే చిత్రగుప్త దేవునికి సమర్పించి, ఆ నాటి తప్పిదాలకు క్షోభపడి ఆ నాటి సత్కార్యాలు చేయడానికి లభించిన అవకాశాలకు దేవతలకు ధన్యవాదాలు తెలుపటమే 'నేనెవరిని' అనే వాస్తమైన ఆత్మవిచారానికి నాంది అవుతుంది. శ్రీ చిత్రగుప్త దేవుడు కేవలం కర్మాలను లెక్కగట్టేవాడు మాత్రమే నని లోకులు భావిస్తుంటారు. అది తప్పు. మానవుడిలో ఆత్మవిచారాన్ని పాదుకొల్పువాడు ఇతడే.
బోగర్ : ఆత్మ విచారానికి మార్గాన్ని అందించే అనుగ్రహాన్ని చిత్రగుప్తుడు ఎలా పొందాడు గురుదేవా?
శ్రీకృష్ణుడి పునీత దేహం పొందిన కిరీటం
అగస్త్యులు : చెబుతాను విను భోగా! ఓ సారి చిత్రగుప్తుడు పలు కోట్ల జీవరాశుల తలరాతలకు సంబంధించిన కర్మ ఫలితాను గణిస్తుండగా, వాటిలో అధికంగా చెడు ఫలితాలు ఉండటం పట్ల చింతించిన శ్రీపాలీనుడు తన శిరస్సుపై మొట్టికాయ వేసుకుంటాడు. దీనితో ఆయనకు తీరని తలనొప్పి రావటంతో తన విధులను నిర్వర్తించలేకపోయాడు. కర్మలూ, సర్వలోకాలూ స్తంభించిపోయాయి. చిత్రగుప్తుడు దిగ్భ్రాంతికి గురై లేచి శ్రీకృష్ణభగవానుడిని ప్రార్థించగా ఆయన తన ఎడమవైపు నడుమున ధరించబడి ఉన్న వస్త్రాన్ని అందించగా, దానిని చిత్రగుప్తుడికి తలపాగలా ధరింపజేస్తాడు. చిత్రగుప్తుడి తలనొప్పి నయమైంది. శ్రీకృష్ణ పరమాత్ముడిచ్చిన తలపాగయే శ్రీ ఆయుర్దేవి చిత్రపటంలో చిత్రగుప్తదేవుడి శిరస్సుపై మెరుస్తున్నది. కానడానికి వీలులేని కన్నులకింపైన కిరీటం ఇదే!
ఒంటి తలనొప్పికి ఔషధం
తీరని ఒంటి తలనొప్పితో బాధపడేవారు ఈ చిత్ర గుప్తుడి దర్శనం, ధ్యానం, నామస్మరణం చేస్తే ఆ నొప్పి పటాపంచలవుతుంది. కనుక ఇలాంటి పార్శ్వపు శిరోభారం కలిగినవారు తలకు నూనె రాసుకునేందుకు కూడా నోచుకోలేని నిరుపేదలకు దువ్వెనలు, నూనెను దానంగా ఇచ్చి పాలీనన్ చిత్రగుప్త దేవుని స్తుతించాలి.
పులిప్పాణి : జ్ఞాన గురువర్యా! శ్రీకృష్ణుడు, శ్రీ పాలీనన్ చిత్రగుప్తుడికి దర్శన భాగ్యం కల్పించారా?
అగస్త్యులు : చిత్రగుప్త దేవుడు ప్రార్థించినా ఆయనకు విశ్వరూపదర్శనం కలిగించని శ్రీకృష్ణుడు ఆయనకు వేనుగోపాల కృష్ణుడి రూపంలోనే దర్శనమిచ్చారు. విశ్వరూప దర్శనం కలిగించకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి.
బోగర్ : కలియుగంలో పిల్లనగ్రోవితో ఉన్న కృష్ణుడి చిత్రపటాన్ని పూజకు ఉపయోగిస్తే సంపదలన్నీ గాలిలో కలసిపోతాయనే అపోహ ఉంది కదా గురుదేవా?
అగస్త్యులు : ఇళ్ళలో పిల్లనగ్రోవిని మోగించు శ్రీకృష్ణుడి చిత్రపటాన్నిగాని, విగ్రహాన్నిగానీ పూజగదిలో ఉంచి పూజలు, ప్రార్థనలు చేస్తే ఎలాంటి నష్టాలు కలుగవు. మురళీకృష్ణుడిగా దర్శనమిచ్చిన శ్రీకృష్ణుడు చిత్రగుప్తుడితో 'ఈనాటి నుండి నీ నామస్మరణ, ఆరాధనలు ప్రజలలో ఆత్మవిచారాన్ని ప్రేరేపించును గాక!' అని వరాన్ని ప్రసాదించాడు. పైగా ప్రజల నిత్యకర్మలను గణించే నిన్ను తలచుకునేవారికి వారిలోని లోపాలను నివృత్తి చేసుకునే పరిపక్వత ప్రాప్తిస్తుంది. తొలుత తనను ఎరుకపరచుకుని, ఇతరులలోనూ తానే ఉన్నాననే మనో భావన కలుగుతుంది' అని వరమిచ్చాడు. కనుక పిల్లనగ్రోవితో ఉన్న శ్రీకృష్ణుడిని పూజించటం వల్ల శ్రీచిత్రగుప్తుడి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. కఠినమైన ధ్యాన పద్ధతుల కంటే ఆత్మవిచారం సులువుగా లభిస్తుంది. ఇది శ్రీకృష్ణపరమాత్ముడు ప్రసాదించిన వరం. శ్రీరమణమహర్షుల వారి పాత ఆశ్రమంలో మురళీకృష్ణుడి చిత్రపటం అందరినీ ఆకట్టుకోగలిగింది. అయితే దాని ఆత్మవిచార ఆధ్యాత్మిక రహస్యాన్ని ఇప్పటికైనా భక్తులు అర్థంచేసుకొనెదరు గాక!
శ్రీధర్మదేవుడు
బోగర్ : సద్గురువా! శ్రీధర్మ మహారాజైన కాల మహా ప్రభువు శ్రీ ఆయుర్దేవిని ఆరాధించటంలో దాగిన తాత్పర్యం ఏమిటో సెలవివ్వండి.
అగస్త్యులు : అణువు కన్నా స్వల్పమైన క్రిముల నుండి పెద్ద ప్రాణులవరకు, దేవాదిదేవతలు, గంధర్వులు సహా సకల జీవరాశుశ కాల నిర్ణయాన్ని దైవ నియతి ప్రకారం నిర్వర్తించి పరిపాలన సాగిస్తున్నవారే శ్రీయమధర్మరాజుగా పిలువబడే శ్రీకాల మహాప్రభువులవారు. భూలోకంలో ప్రజలలు 'యమభయం' నుండి విముక్తి పొందటానికి మంత్రాలను పఠించి పూజలు చేస్తుండటాన్ని మనం చూస్తున్నాం. ఈ మనోస్థితిని కాసింత వృద్ధి చేసి యమభయం తొలగటం కంటే తమ పూజలు, మృత్యుంజయహోమాలు, దానధర్మాలు, దైవానుగ్రహము తోడై తమ ఆయుష్షును అధికం చేస్తాయని భావించడమే శ్రేయోదాయకం. శ్రీకాళ మహాప్రభువు తన దైవీక సేవలను వారివారి కర్మ ఫలితాలను బట్టి సకమ్రంగా నిర్వర్తిస్తున్నారు. లేకుంటే ప్రాణులు, జీవరాశులు ప్రజలతో పాటు విపరీతంగా పెరిగి స్థలాభావంతో ఈ లోకమే స్తంభించి పోతుంది.
మరణ భయం వద్దు |
మానవులు మరణమంటేనే భీతిల్లుతున్నారు. మరణాన్ని భరించలేదని దుఃఖంగానే భావిస్తున్నారు. మరణం తర్వాత కూడా జీవితం ఉందని ఎరుకలోకి వచ్చినా మానవుడి మనస్సు దాని స్థితిగతులను తెలుసుకోలేకున్నది. శ్రీయమధర్మరాజులు ఓ దేహం నుండి ప్రాణాన్ని తొలగించి మరొక దేహానికి తీసుకెళ్లే అత్యద్భుతమైన దైవీక సేవను చేస్తున్నారు. కనుక యముడంటే భయపడవద్దు. వారి వారి విధి నిర్ణయానుసారం మరణాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నవారి యమభయం ఉండదు. ధ్యానంలో ఒక భాగంగా ప్రతి మానవుడూ శ్రీరమణమహర్షిలా రోజూ తన మరణాన్ని పునరావృత్తం చేసుకోవడమే అత్యద్భుత ధ్యానమవుతుంది. ఆత్మనాశనం లేదని. ఆత్మలు నివసించే ఆలయాలే దేహశరీరాలు అని తెలుసుకుంటారు. నిజానికి నిద్ర కూడ ఒక మరణం లాంటిదే. శ్రీ ఆయుర్దేవి చిత్రపటంలో శ్రీసుధర్మనన్ అనే శ్రీ కాల మహా ప్రభువు, ఆయన సతీమణి శ్రీ సుధర్మిణి కూడా కొలువుదీరి ఉన్నారు.
కలియుగంలో ప్రతి ఇల్లాలు సుమంగళిగానే జీవించాలనే కోరుకుంటారు. ఆ మహిళలు చేసే పూజా విధానాలు, శీలత్వం, పెద్దలకు సేవలు చేయడం వల్ల భర్త ఆయుష్షును పెంచుతాయి. ఇలాంటి గుణాలున్న మహిళలకు మాంగళ్య ప్రాప్తం, సుమంగళి స్థితిని దైవానుగ్రహంచేత పైన పేర్కొనబడిన శ్రీ సుధర్మిణి సమేత శ్రీకాల మహాప్రభువు అనుగ్రహిస్తున్నారు.
బోగర్ : అకాల మృత్యుదోష నివృత్తి గురించి వివరించండి గురుదేవా?
శ్రీ గయాసుర మహర్షి
అగస్త్యులు : కొన్ని కుటుంబాలలో పితృదేవతల శాపాల వల్ల, పితృ కార్యాలు సక్రమంగా నిర్వర్తించలేకపోవడం వల్ల కలిగే అకాల మృత్యు దోషం వల్ల కలిగి పిన్నవయస్సు మరణాలు, ఆకస్మిక మరణాలు, ప్రమాదాలు, యుక్త వయస్సులో వైధవ్యం, శిశు మరణాలు వంటి పెను దుఃఖాల నుండి శ్రీకాల మహాప్రభువు తొలగించి, శ్రీ ఆయుర్దేవి అనుగ్రహం వల్ల మంచి మార్గ మేర్పడుతుంది.
శ్రీ ఆయుర్దేవి కుడి వైపు తొలి హస్తం శ్రీ గయాసుర మహర్షి
బోగర్ : శ్రీ ఆయుర్దేవి కుడి చేతులు నాలుగింటిలో తొలి కరపీఠంగా వెలుగొందుతున్న శ్రీగయాసుర మహర్షి గురించి తెలుపగలరా గురువర్యా?
అగస్త్యులు : శ్రీఆదిపరాశక్తి సమేత శ్రీవిద్యా లోకంలో అద్భుతమైన పితృ కోగణ సూక్ష్మ బిందు హారంలో స్వర్ణతామర వలె చంద్ర కళలో కట్ట హారంలో కుండిలీ సహితంగా శంఖు చక్రధారిగా త్రినేత్రాలతో భాసిల్లుతున్నదే శ్రీమాదేవి.
శ్రీమాదేవిని ఉపాసన చేసి ఉన్నత ఉత్తమస్థితిని చేరుకున్నవారే గయాసుర మహర్షులవారు. వేలకొలది మహాలక్ష్మీదేవేరీలు ఏకమై ప్రసాదించే వరాలను శ్రీమాదేవి ప్రత్యేకదేవిగా ఇవ్వగలరు. ప్రథమ తిథిలో ఆరాధించడం ఆమెకు అత్యంత ప్రీతికరం. ముఖ్యంగా నవరాత్రి ప్రథమ తిథిలో ఈ దేవి అనుగ్రహమూ వరాలు అధికంగా వర్షిస్తాయి.
బోగర్ : జ్ఞానదేవా! గయాసుర మహర్షి శ్రీ మాదేవి గురించి ఎందుకు తప్పస్సు చేశారు?
అగస్త్యులు : కలియుగంలో ప్రజలకు కలిగే కష్టాలన్నింటికి మూల కారణం వారు తమ పితృదేవతలకు సంబంధించిన విధులను నెరవేర్చకపోవడమే. దానం, తర్పణం, శ్రాద్ధం వంటి పితృ రుణాలను మనః పూర్వకంగా నిర్వర్తించేవారు, ఆత్మార్థంగా నిర్వహించేవారు అరుదైపోయారు. దక్షిణకు సరిపడా మంత్రాలను పఠించడం ఆనవాయితీగా మారింది. వీటిని వేల సంవత్సరాలకు మునుపే దీర్ఘ దర్శనంతో తెలుసుకున్న గయాసుర మహర్షులు కలియుగ ప్రజలను పితృశాపాలనుండి కాపాడే నిమిత్తం శ్రీమాదేవి గురించి తపస్సు చేశారు.
కోటానుకోట్ల యుగాలు తపస్సు చేసిన శ్రీ గయాసుర మహర్షుల నిస్వార్థ పూరిత తపస్సును చూసి ఆశ్చర్యపోయారు దేవతలు. వారంతా గయాసుర మహర్షిషిని కలుసుకుని 'మీ అద్భుత తపస్సు కారణంగా శ్రీమాదేవి అనుగ్రహం సంపాదించటానికి ముందు మావలన వీలుపడే దైవీక సేవలను మీకు చేయాలనుకుంటున్నాము' అన్నారు. శ్రీమాదేవి అనుగ్రహం వల్ల వారి వినమ్రతను తెలుసుకున్న మహర్షులు 'మీరందరు నా అంగంలో వాసం మేర్పరచుకోవాలని ప్రార్థిస్తున్నాను' అని వేడుకున్నారు.
బోగర్ : సద్గురువే! ముప్పది ముక్కోటి దేవతలు తన దేహంలో వాసమేర్పరచుకునేంత దేహ దారుఢ్యాన్ని శ్రీ గయాసుర మహర్షులు కలిగి ఉన్నారంటే వారెంతటి తపస్సు చేశారో వినడానికే విస్మయం కలుగుతోంది.
అగస్త్యులు : వాస్తవమే బోగా! గయాసురుడు శ్రీ మాదేవి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందినవారు కదా! అమృతం సేవించిన ముప్పది మక్కోటి దేవతల వాసం వల్ల సమిష్టి సంజీవ స్థిర జీవితాన్ని శ్రీమాదేవి అనుగ్రహం చేత పొందిన శ్రీ గయాసుర మహర్షులు నిటారుగా నిలిచిన రాతి వృక్షంలా దేవాది దేవతల శరీరాలకు భూమిలో సమాధి అయ్యారు. అదే నేటికీ కోటానుకోట్ల జీవుల పితృ శాపాల నివృత్తిగా మారింది. గయ పవిత్ర క్షేత్రం. ఆ మహాపురుషుడు పునీత దేహంతో వెలసిన స్థలమే గయ. తరతరాలుగా మానవులు పెంచుకుంటూ వచ్చిన పితృరుణాలన్నీ, ముప్పది ముక్కోటి దేవతల అనుగ్రహం చేత, శ్రీమాదేవి పరిపూర్ణ అనుగ్రహంతో, శ్రీ గయాసుర మహర్షులు అద్భుత తపం కారణంగా గయ క్షేత్రంలో సమర్పించే పిండ తర్పణం వల్ల తీరిపోతున్నాయి.
పులిప్పాణి : అవును మహాశయా! శ్రీగయాసుర మహర్షులు నేటికీ అనుగ్రహమిచ్చే గయ క్షేత్రాన్నే బ్రహ్మదేవుడు తన సృష్టికి సంబంధించిన బ్రహ్మ యాగాన్ని నిర్వహించేందుకు ఎంపిక చేసుకున్నారు. పితృదేవతల అధిపతియైన శ్రీమహావిష్ణువు గయాసుర మహర్షులు వాసస్థలమైన గయ స్థలాన్నే శ్రీవిష్ణు ఉదయస్థానంగా ఏర్పరచుకుని శ్రీవిష్ణు పాదాలను మోపారు. గయాసుర మహర్షుల ఛాతీపైనే మహావిష్ణుని పాదాలు దర్శనమిస్తున్నాయి. ఇలా గయభూమి పితృదేవతల దైవీక భూమిగా, శ్రీవిష్ణు పాద స్థలంగా మారేందుకు తపమాచరించినవారే శ్రీగయాసుర మహర్షులు.
బోగర్ : గయాస్థలంలో పిండ తర్పణం ఇవ్వడం వల్ల ఫలితమేమిటి గురుదేవా?
అగస్త్యులు : కలియుగంలో మానవుడి దేహం ఆహార సంబంధిత అన్నమయకోశంగానే ఉంటున్నది. పితృదేవతలు తమ ఆహారాన్ని ద్రవరూపంలో పొందాలన్నది దైవీక నియతి. కనుకనే తర్పణాలు జలంతో ఇవ్వబడుతున్నాయి. దేవతలు అగ్ని మూలంగాను, గంధర్వులు ఆవు నెయ్యితోను ఆహారం పొందాలన్నది దైవ నియతియే! పితృదేవతలకు అధిపతియైన శ్రీమహావిష్ణువే గయలో శ్రీపాద స్వరూపంలో ఉండటం వల్ల ఆయనే పిండ తర్పణాలను స్వీకరించి అన్నంగాను, జలంగాను, ఆవు నెయ్యిగాను విభించి పితృదేవతల రుణాలను క్షణాలలో పొగొట్టి అనుగ్రహిస్తున్నారు. గంగా మహాదేవి ఇందుకు సాక్షిగా నిలిచి, నీటి ధార కారుతున్నప్పుడు పితృల రుణం నివృత్తి పూర్తవుతోంది.'
బోగర్ : మహాశయా! పితృ రుణాలు తీరడం వల్ల కలిగే సుఫలితాలు ఏమిటి?
అగస్త్యులు : 'శ్రీమాదేవి అనుగ్రహం పొందితేనే పితృ రుణాలు తీరిపోతాయి. దీనికి దోహదపడేవారే శ్రీగయాసుర మహర్షులు. ఆయన పలు పరిహారాలను సూచించారు.
సులువైన పితృ పరిహార పద్ధతులు
ఆరా కూర
1. 1001 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించి గోధుమ తినుబండారాలను నాలుగు దిక్కులలోను ఉంచి శునకాలకు ఆహారంగా ఇస్తే చేతబడి, శూన్యం వంటి కష్టాలు తొలగుతాయి.
2. మృతులకు ప్రీతికరమైన ఆహార పదార్థాలు, దుస్తులు, అలంకార వస్తువులను గాయత్రీ మంత్రాన్ని జపించి నిరుపేదలకు దానంగా ఇస్తే వైవాహిక ఆటంకాలు తొలగుతాయి. ఓర్వలేనితనం, క్రోధాల వల్ల కొందరు కుటుంబాలను విడగొట్టి వారి కష్టాలు కలిగించి వుంటారు. వీరందరూ గాయత్రీ మంత్రాన్ని జపించి పశు దానం చేస్తే కుటుంబాలను విడగొట్టినందువల్ల కలిగే పాపాల నుండి బయటపడతారు. మహిళలు ఆవులకు పసుపును ధరింపజేసి పండ్లు, ఆకుకూరలు వంటి ఆహారపదార్థాలను తినిపించి గాయత్రీ మంత్రాలను జపించి 21 సార్లు పశువును ప్రదక్షిణం చేయాలి. పురుషులు ఆవుకు కుంకుమ దిద్ది పైన చెప్పినట్లు మహిళల వలెనే పూజించాలి.
3. సంతాన భాగ్యం వేడుకునేవారు నాలుగు ఆకులు కలిగిన ఆరకూరాకు, ఒక్కో ఆకుకు 11సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించి కొద్దిగా బెల్లం చేర్చి సూటి ఆవుకు ఆహారంగా ఇస్తే సంతానం కలుగుతుంది. ఇలాంటి దాన ధర్మాలను ఏ స్థలంలోనైనా చేయవచ్చు. గంగా, కృష్ణా గోదావరి వంటి పుణ్య నదుల తీరాలలో చేస్తే విశేషదాయకమైన ఫలితాలు కలుగుతాయి.
తక్కిన పరిహారాలు
1. అపస్మారక స్థితిలో వాతంతో coma స్థితిలో మాటలాడలేని పరిస్థితుల్లో మృతి చెందినవారికి తూర్పు పడమరలుగా దర్బలను ఉంచి వాటిపై పిండ తర్పణం చేయాలి. మగవారికి ఈ రీతిలోనే చేయాలి.
2. మోయలేనంత రుణాలను ఉంచి మృతి చెందిన వారికి ఈశాన్య దిక్కులో దర్భలను ఉంచి పిండ తర్పణం సమర్పించాలి.
3. మగ సంతానంలేనివారు దర్బలను ఈశాన్యంలోను, ఆడ సంతానంలేనివారు వాయువ్యం దిక్కులోను దర్భలను పరచి తర్పణం చేయాలి.
4. సంతతిలేకుండానే మృతి చెందినవారికి దర్భలను నైరుతి దిక్కున పరచి పిండ తర్పణం చేయాలి. ఇక మహిళలు తమ అత్త మామల పై తన తల్లిదండ్రుల వద్ద అబద్దాల ఆరోపణలు తెలుపటం వల్ల పలు కష్టాలు కలుగుతాయి. పెద్దలకు సేవలు చేయకుండా అహంకారంతో ప్రవర్తించే మహిళలుకు కొన్ని శాపాలు ఉన్నాయి. వీరు దర్భలో మూడు ముడులు వేసి, అందులో పిండం ఉంచి, కట్టుబట్టలతో నీటిలో దిగి పిండాన్ని జలంలో విడిచి, ధరించిన వస్త్రాలను దానం చేయాలి. దీనితో తగని రీతిలో తాను బాధపెట్టిన అత్త మామల శాపాల నుండి నివృత్తి పొందవచ్చు.
మహిళలు పిండ తర్పణం
బోగర్ : మహిళలు పిండ తర్పణం చేయవచ్చునా గురుదేవా?
అగస్త్యులు : చేయవచ్చు. ఓ మహిళ మెట్టినింట పెద్దలను అవమానపరిస్తే ఆ పెద్దలు పెట్టే శాపాల వల్ల ఆ మహిళకు పలు కష్టాలు కలుగుతాయి. కనుక ఆ మహిళ పైన పేర్కొన్న పద్ధతిలో పిండ తర్పణం సమర్పించి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చును.
బోగర్ : పితృహోమ గుండాలు గురించి శ్రీ గయాసుర మహర్షుల వివరణను తెలుపండి గురుదేవా?
పితృహోమ గుండాలు
అగస్త్యులు : దీనిని వివరించాలంటే పలు సంపుటాలుగా పెద్దదవుతుంది. అయినా క్లుప్తంగా వివరిస్తాను. ప్రజలకు ప్రకటించెదవు గాక.
హోమం చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయనేది మనకందరికీ తెలిసిన విషయమే. పితృదేవతలకు హోమం చేస్తారు. మృతుల ఎత్తుకు తగ్గట్లు తగిన స్థలంలో హోమ గుండం నిర్మించాలి. పురుషులే కాకుండా మహిళలు చేసే హోమాలు కూడా ఉన్నాయి. పితృ హోమగుండాలను ఏ దిక్కున నిర్మించాలనే వివరాలను సైతం శ్రీగయాసుర మహర్షులు తెలిపి ఉన్నారు.
మనం తెలిసో తెలియక చేసే కొన్ని చర్యల వల్ల దోషాలు మనల్ని పట్టిపీడిస్తున్నాయని మనం తెలుసుకోలేము. అలాంటి దోషాలకు తగు నివృత్తిని గయాసుర మహర్షులు వివరించారు.
శ్రీగయాసుర మహర్షులు తెలిపిన హోమ వివరాలు |
తప్పిదం | కలిగే దోషం | దోష ఫలితం | హోమగుండం దిక్కు | ఆహుతి సమర్పణ |
వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో విడిచిపెట్టి తల్లిదండుల్రు మరణించటం | శురుహత్తి దోషం | ఊహించని ప్రమాదాలు | ఆగ్నేయం | వారికి ప్రీతికరమైన ఆహారాన్ని ఆహుతిగా దానమివ్వడం |
ఆస్తి కోసం కాపాడి, ఆస్తిని కాజేసి విడిచి పెట్టడం | ఘోరకత్రు దోషం | రోగాలు, తీరని పేదరికం | ఈశాన్యం | పూర్వీకుల సొత్తులో ఓ భాగాన్ని శివాలయానికి ఇవ్వడం, వారికి ప్రీతికరమైన తీపి పదార్థాల ఆహుతిగా ఇవ్వడం |
భార్యమాట విని తల్లిదండ్రుల్ని హింసించి | మారివడు దోషం | కుటుంబంలో పిల్లలు మూర్ఛిల్లడం | నైఋతి | అనాధాశ్రమాల్లో ఉన్న వితంతువులకు, వృద్ధులకు సహాయం |
తల్లిదండ్రులు పిల్లలను తామున్నప్పుడే | కుమారికా దోషం | జీవిత చరమాంకంలో నిరాదరణ | వాయవ్యం | అనాథ పిల్లలకు సేవలు చేయడం |
గమనిక
ప్రమాదాల్లో మృతి చెందినవారికి ఆగ్నేయ మూలలో హోమ గుండం నిర్మించాలి.
శ్రీగయాసురులు పేర్కొన్న తర్పణ విధి విధానాలు |
మృతుల స్థితి | తర్పణపు కొసను పెట్టాల్సిన దిక్కులు |
మాటలాడలేక మృతి చెందినవారు | తూర్పు పడమర |
అప్పులు అధికంగా బాకీ పెట్టినవారు | ఈశాన్యం నైఋతి |
మగ సంతానం లేనివారు | ఆగ్నేయం వాయవ్యం |
ఆడ సంతానం లేనివారు | వాయవ్యం ఆగ్నేయం |
సంతానం లేనివారు | ఆగ్నేయం ఈశాన్యం |
అత్తమామలు గురించి తల్లిదండ్రుల వద్ద చాడీలు తెలిపే మహిళలు (దీనికి పెద్ద శాపాలున్నాయి) | దర్భలో మూడు ముళ్ళు వేసి వాటిలో పిండం పెట్టి కట్టిన వస్త్రంతో నీటిలోకి దిగి పిండాన్ని నీట విడిచి మారుబట్టలు ధరించి కట్టిన వస్త్రాలను దానం చేయడం |
గమనిక
1. తర్పణ మంత్రాలు తెలియనివారు పైనపేర్కొన్న దిక్కులలో దర్భలను పెట్టి మృతి చెందినవారి పేరు పలికి కుడిచేతి బొటవేలు, చూపుడువేలి మధ్య నువ్వులు కలిపిన నీటిని దర్భ కొస ప్రాంతంలో పడేలా పోయాలి.
2. స్నానం చేసి దైవనామం నినదిస్తూ వండిన అన్నాన్ని చేతినిండుగా తీసుకుని ఉంటగా చేస్తే అదే పిండము.
3. పిండాన్ని (అన్నపు ఉంట) అన్నసారాన్ని నీటి మూలంగా దర్భలో ఆవాహనమయ్యే పితృలు (పైలోకులు) స్వీకరిస్తారు.
బోగర్ : శ్రీమాదేవిని సులువుగా మొక్కే పద్ధతి ఉందా గురుదేవా?
అగస్త్యులు : శ్రీఆయుర్దేవి వంటి శ్రీ మాదేవి రూపాన్ని మన సిద్ధ పారంపర్యానికి చెందిన సిద్ధపురుషులు తగిన సమయంలో ఎరుకపరుస్తారు. అంత వరకు శ్రీమాదేవిని మనస్సులో ధ్యానించి ప్రథమ తిథిన ఏదైనా ఓ ఆలయంలో పిండితో ముగ్గులు వేసి మల్లెపూవులను పేదలకు దానం చేసి పూజిస్తూ ఉండాలి. నవరాత్రి ప్రథమ తిథిలో రెండేళ్ల వయస్సు కలిగిన బాలికను అలంకరించి, ఆభరణాలు ధరింపజేసి శ్రీమాదేవిగా వర్ణించి నమస్కరించాలి. లేదా పైన పేర్కొన్న విధంగా పిండి ముగ్గులు వేసి దానం చేయాలి. ఇదే శ్రీమాదేవిని సులువుగా పూజించే పద్ధతి.
ఇలా అద్భుత తపములు చేసి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసి శ్రీఆయుర్దేవి కుడివైపు తొలి హస్తంలో కొలువుతీరారు గయాసుర మహర్షులు.
బోగర్ : సద్గురువర్యా! శ్రీఆయుర్దేవిని తొట్టతొలుత పలుకోటి యుగాలకు మునుపు లోకానికి పరిచయం చేసింది ఎవరు?
అగస్త్యులు : ప్రస్తుతం కలియుగంలో ప్రజలు చాలా సులువైన మార్గంలో సంప్రదాయబద్ధంగా శ్రీఆయుర్దేవి దర్శనం పొందారు. అయితే పలుకోట్ల యుగాలకు ముందు తిరుఅణ్ణామలైలో కొన్ని పక్షములకు, యుగాలకు అరుణాచల పర్వతాన్ని గిరి ప్రదక్షిణ చేసిన వారికే ఆయుర్దేవి దర్శనం లభించాలన్నది దైవీక నియతిగా ఉండేది. అంతేకాక శ్రీఆయుర్దేవి దర్శనానికి ముందు 'దువిత చిరంజీవి' అని, ఆద్యంత ప్రభువు అని పిలువబడిన శ్రీ వినాయక- ఆంజనేయ అర్ధనారీశ్వర రూపాలు కలిగిన దైవాలను దర్శించాలి. ఇది త్రేతాయుగ నియతి.
తిరుఅణ్ణామలై గిరిప్రదక్షిణ మార్గంలో శ్రీఆయుర్దేవి దర్శన మార్గం అనే మార్గం ఉంది. పృథ్వీనంది సమీపంలో ఏనుగు గుంట ముక్కోణ తీర్థ ప్రాంతంలో గురుకృపచే నిర్ణీత నక్షత్ర దినాన నిర్ణీత హోరలో శ్రీఆయుర్దేవి మూలమంత్రాన్ని జపించేవారికి శ్రీ దువిత చిరంజీవి దర్శనం లభిస్తుంది. కృత, త్రేతాయుగాలలో శ్రీదువిత చిరంజీవి మహా ప్రభువుల అర్ధనారీశ్వర రూప దర్శనం లభించింది. ఆయనే శ్రీఆయుర్దేవి దర్శనానికి మార్గం చూపుతారు.
కలియుగంలో మహాపురుషుల, గురువుల అనుగ్రహం పొందగలిగినవారికే ఇలాంటి అద్భుత దర్శనం లభించగలదు. తక్కినవారికి తిరుఅణ్ణామలై శివరూపంలో దర్శనమివ్వడం వల్ల నిర్ణీత ప్రాంతంలో పర్వతాన్ని దర్శిస్తే అదే శ్రీఆయుర్దేవి ముఖరూపంలో దర్శనమివ్వగలదు. అయితే దీనికి కూడా సద్గురువుల అనుగ్రహం ఉండాలి.
బోగర్ : శ్రీదక్షిణామూర్తులవారు తపోరూపంలో ఉన్న వటవృక్షం భూలోకంలో ఉందా గురువుగారు?
అగస్త్యులు : కోటానుకోట్ల ఆధ్యాత్మిక రహస్యాల నెలవుగా ఉన్న తిరుఅణ్ణామలైలో పర్వత శిఖారాగ్రంలో వటవృక్షం ఉంది. ఈ వృక్షం దిగువన దక్షిణామూర్తులవారు మానవ శరీరంలో నేటికీ దర్శనమిస్తున్నారు. భారతదేశంలోని పలు పుణ్యనదుల తీరాలలో, పొదిగై పర్వతం, హిమాలయం, కొల్లిమల వంటి సిద్ధులు నివసించే పర్వత ప్రాంతాలలో వటవృక్షం ఉంది. దానిని 'ఊర్థ్వ మూల వృక్షం' అంటారు. ఈ వృక్షపు వేరుభాగం వంగి పైకెగబాకి ఆకాశంలో వేర్లు విడిచి ఉంటుంది. చూడటానికి అద్భుత దృశ్యమిది.
వేరుభాగం పైదిక్కుగాను, ఆకులు, కాండాలు దిగువగాను ఉన్న అద్భుత వృక్షాలు ఎన్నో ఉన్నాయి. వీటి దర్శనమే పలు సిద్ధులను అందిస్తాయి. తిరుఅణ్ణామలై వటవృక్షం ఉన్న పర్వత ప్రాంతంలో దర్శనమిచ్చే శ్రీఆయుర్దేవి శిలారూపాన్ని సనకాది మునులు నలువురూ నేటికి ప్రతి దినం పూజించి వెళుతుంటారు. తిరుఅణ్ణామలైని స్పర్శించకుండా దానిని ప్రదక్షిణం చేసే సూర్యభగవానుడు సైతం శ్రీఆయర్దేవిని ప్రతినిత్యం దర్శించి నమస్కరించి వెళుతున్నారు.
ఇవే కాకుండా హిమాలయాల్లో శ్రీ మహాఅవధూత బాబా, త్రైలింగ్యస్వామి వంటి అద్భుత మహాపురుషులు రోజూ పూజించే మంచు పర్వతం గుహలో శ్రీతారాదేవి ఆలయంలో శ్రీఆయుర్దేవికంటూ ప్రత్యేక సన్నిధి కూడా ఉంది. గురువుల అనుగ్రహం పొందినవారు దానిని నేటికీ దర్శించవచ్చు. శ్రీరమణ మహర్షులు దర్శించిన వటవృక్ష ఆకులు కలిగిన అపూర్వమైన వటవృక్షం ఉన్న తిరుఅణ్ణామలై శిఖరాగ్రంలో శ్రీఆయుర్దేవి శిలారూపాన్ని చూడవచ్చు. ఇది నేటికీ బ్రహ్మ రహస్యంగానే ఉంటున్నది.
శ్రీఆయుర్ దేవి ఆలయం
బోగర్ : గురుదేవా! శ్రీ ఆయుర్దేవికి ఆలయాలు నిర్మించవచ్చునా?
అగస్త్యులు : అమ్మవారి అభీష్టం ఉంటే ఏవైనా జరుపవచ్చు. నా పరంపరకు చెందిన, మా యొక్క గ్రంథాలనుండి స్వీకరించబడిన శ్రీఆయుర్ దేవి మూలమంత్రాన్ని నిర్ణీత సంఖ్యలలో ఉచ్చాటనం (జపం, పారాయణం) చేయాలి. శ్రీఆయుర్దేవికి చెందిన గాయత్రీ మంత్రాన్ని కూడా నిర్ణీత సంఖ్యలో ధ్యానించాలి. ఆ తర్వాత మేము సూచించిన శ్రీఆయుర్దేవి హోమాలను నిర్ణీత సంఖ్యలో నిర్వహించాలనే నిర్ణీత ఆవాహన కొలతలు ఉన్నాయి. ఏ దైవానికైనా ఓ ఆలయం ఏర్పరచేటప్పుడు ఇలాంటి ఆధ్యాత్మిక సూచక లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ సవ్యంగా సాగితే శ్రీఆయుర్దేవి అమ్మవారే తనకుతానుగా ఆలయాన్ని పొంది అనుగ్రహిస్తుంది. అయినా శ్రీఆయుర్దేవి ఆలయ నిర్మాణం కోసం మానవులు ప్రయత్నించడం తప్పుకాదు. శ్రీఅంబిక అభీష్టం గనుక ఉంటే ఆ సత్సంకల్పం నెరవేరుతుంది.
బోగర్ : త్రిమూర్తులు మినహా శ్రీఆయుర్దేవిని దర్శించిన దైవీక అవతార పురుషులెవరైనా ఉన్నారా గురుదేవా?
అగస్త్యులు : త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి, రావణ సంహారానికి ముందు తిరుఅణ్ణామలైలో గిరి ప్రదక్షిణ చేసిన సమయంలో శ్రీఆయుర్దేవిని దర్శించారు. అప్పుడా శ్రీదేవి 'శ్రీరామా! ద్వాపరయుగంలో నీవు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు నా సంపూర్ణ అనుగ్రహం నీకు ప్రాప్తించగలదు' అని ఆశీర్వదించారు.
శ్రీకృష్ణావతారంలో తమ సద్గురువులైన సాంధీపుని వద్దకు గురుదక్షిణ చెల్లించేందుకు వెళ్లి శ్రీకృష్ణుడితో ఆయన 'శ్రీకృష్ణా! నీ వద్ద గురుదక్షిణ పొందే తరుణం ఆసన్నమైంది. యెన్నో యేళ్లకు ముందు సముద్రరాజు నా కుమారుడిని అపహరించుకెళ్లాడు. అతడికి విముక్తి కలిగించి నా చెంతకు చేర్చడమే నీవిచ్చే గురుదక్షిణ కాగలదు' అన్నారు. శ్రీకృష్ణుడు పలు సముద్ర లోకాలు దాటి వెదికినా సాంధీపుని కుమారుడు కంటబడలేదు. 'గురు దక్షిణ లేకుండానే తిరిగి వెళ్లటమా? అందులోనూ పూర్ణావతారంలో సాధ్యపడదా?' అంటూ శ్రీకృష్ణుడు కాసేపు ఆలోచించాడు.
తనను పూర్ణావతార అంశాలనుండి వేరుపరచుకుని మానవ అవతారమైన శ్రీరామచంద్రుడిగా భావించుకున్నారు. ఆ సమయాన అరుణాచల క్షేత్రం, శ్రీఆయుర్దేవి మూలమంత్రాన్ని జపిస్తూ శ్రీకృష్ణుడు సముద్రగర్భంలో దిగారు. మత్స్యావతారమెత్తిన శ్రీకృష్ణుడికి సముద్రంలో లోతుకు వెళ్లడం అసాధ్యమా! సముద్రగర్భంలో ఓ మత్స్యం ఉదరంలో సాంధీపుని కుమారుడు ఉండటాన్ని గమనించి అతడిని ఒడ్డుకుచేర్చి గురుదక్షిణగా గురువులకు సమర్పించాడు. ఆ సమయాన సాంధీపుడు 'శ్రీకృష్ణా! శ్రీఆయుర్దేవి మహిమలను లోకానికి చాటిచెప్పి ప్రజలకు సేవలు చేయుదువు గాకా!' అని ఆశీర్వదించారు.
సద్గురువు సాంధీపుని అభీష్టం మేరకు శ్రీకృష్ణుడు నేటికీ తిరుఅణ్ణామలై అరణ్యంలోని వట వృక్షపు ఆకుపై ముద్దులొలికే చిన్నికృష్ణుడి రూపంలో నీటిపై తేలియాడుతు శ్రీఆయుర్దేవి మహత్యాన్ని పలుకోట్ల లోకాలకు, సనకాది మునుల ద్వారా వ్యాపింపచేస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని నారదమహర్షులకు సిద్ధపురుషులే తెలిపారు. నేటికీ గోకులాష్టమి నాడు తిరుఅణ్ణామలైలో శ్రీఆయుర్దేవి దర్శన స్థలంలో కృష్ణుడి పిల్లనగ్రోవి రీంకారం విని శ్రీరమణ మహర్షులు, శ్రీ శేషాద్రి స్వాములు, శ్రీవిఠోబా స్వాములు, శ్రీపూండి స్వామిలు, శ్రీ దక్షిణామూర్తి, శ్రీజ్ఞానానందగిరి స్వాములే కాకుండా భారతియార్, శ్రీనరసింహ భారతి స్వాములు తన్మయం చెందారు.
శ్రీ రమణమహర్షులు ఎల్లప్పుడూ ఆ పర్వత శిఖరాన్నే తదేకంగా తిలకించడం వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యమిదే. ప్రపంచపు ఆధ్యాత్మిక శిఖరంగా భాసిల్లుతున్న అణ్ణామలైలో కోటానుకోట్ల దైవీక లీలలు జరిగాయి. వాటిని తిలకించి ఆత్మానుభవం కలిగి పరమానందంలో మునిగితేలినవారే శ్రీరమణ మహర్షులు, శ్రీజ్ఞానానందగిరి స్వాములు తదితరులు. సామాన్య మానవుడు సైతం ఆత్మ భావంతో గిరి ప్రదక్షిణ చేస్తే సద్గురువు అనుగ్రహం చేత ఇలాంటి దైవీక లీలలను పరమాత్మ లీలను అనుభవించి తరలించగలుగుతాడు.
శ్రీ ఆయుర్దేవి ద్వితీయ దక్షిణ హస్తం
శ్రీఆణి మాండవ్య మహర్షి
బోగర్ : గురుదేవా! శ్రీఆయుర్దేవి ద్వితీయ దక్షిణ హస్తంలో కొలువుదీరే భాగ్యం పొందిన శ్రీఆణి మాండవ్యులు ఎలా అంతటి అనుగ్రహం పొందగలిగారు?
అగస్త్యులు : శ్రీఆణి మాండవ్యుల చరిత్రను ఇదివరకే కొందరికి వివరించి ఉన్నాను. ఆయన శ్రీవిధాత్రి దేవి అనే అంబికను స్తుతించి ద్వితీయ తిథిదినాలలో ఆరాధించారు. ఆ తిథిలో శ్రీవిధాత్రి దేవి శత మహాలక్ష్మీదేవి అనుగ్రహాలను సమకూర్చుకోగలిగినంత శక్తిని కలిగి ఉన్నారు.
సముపార్జిత శక్తులున్న దేవి
శ్రీఆణిమాండవ్యుల చరిత్ర
శ్రీమాండవ్య మహర్షి అద్భుత తపములు చేసి వాటి ఫలితాలను ప్రజలకందించి సేవ చేసిన ఉత్తమ మహర్షులు. ఓసారి ఆయన దీర్ఘ ధ్యానంలో ఉన్నప్పుడు ఆ వనంలో రాజభటులు తరముకొచ్చిన చోరులు ఆయన ఆశ్రమంలో చొరబడి దాక్కున్నారు. మహర్షి సమీపాన ఆయుధాలు పడి ఉండటాన్ని గమనించి రాజభటులు 'ఆయనే దోపిడీ దొంగల నాయకుడు' అని భావించి కారాగారానికి తరలించారు.
సమగ్రంగా విచారణ జరుపకుండా మహారాజు కూడా ఆయనను ఉరికంబానికి తరలించారు. మూడు రోజులపాటు ధ్యానయోగంలో ఉంటూ తేజోమయమైన కాంతులతో విరాజిల్లుతున్న ఆ మహర్షిని చూసి వణికిపోయిన రాజు ఆయన మహాతపస్వి అని నిర్ధారించుకుని తమ ప్రజలతోపాటు శరణాగతి నొంది చేసిన తప్పును మన్నించమని ప్రాధేయపడ్డాడు. 'ఇందులో నీ తప్పిదం లేదు మహారాజా' అంటూ ఆ మహర్షి మన్నించారు.
ఆ తర్వాత 'నిరంతరం దైవాన్నే ధ్యానిస్తూ గడుపుతున్న తనకు ఎందుకీ దండన?' అంటూ ఆత్మవిచారం చేసుకుంటూ ధ్యాననిష్టలో గడుపసాగారు. ఆయన తపోబలానికి తాళలేక భగవంతుడు ప్రత్యక్షమై 'మునిపుంగవా, పిన్న వయస్సులో నీవు ఓ తూనీగ తోకను తాడుతో కట్టి దాని దిగువ భాగాన్ని ముల్లుతో బాధించడం వల్లే నీకీ కష్టమొచ్చింది' అని తెలిపారు. ఊహతెలియని వయస్సులో చేసిన చిన్నతప్పుకు ఇంతటి శిక్షా?
గురువుల అనుగ్రహంతో తపో విధానాలు తెలుసుకున్నందున మిమ్మల్ని ప్రసన్నం చేసుకుని వివరణలను పొందగలిగాను. అయితే రాబోవు యుగాలలో భక్తి తగ్గిపోతుంది. తపో విధానాలు కనుమరుగవుతాయి. ముఖ్యంగా కలియుగ మానవులు కోట్లకొలదిగా ఘోర తప్పిదాలకు పాల్పడనున్నారు. వారికి ఎలాంటి పెద్ద శిక్షలు పడతాయో కదా అని భయపడుతున్నాను' అన్నాడా మహర్షి. దేవ దేవుడు సమాధానమిస్తూ 'ముని శ్రేష్ఠుడా! చేసిన తప్పులకు దండన తప్పదు. అయితే ప్రాయశ్చిత్త పద్ధతులను తమవంటి మహర్షులే కదా భగవంతుడి నుండి పొంది ఇవ్వగలరు' అన్నారు.
శ్రీఆణిమాండవ్యుల తపస్సు
శ్రీ ఆణి మాండవ్య మహర్షి
అటు పిమ్మట శ్రీఆణి మాండవ్యులు మళ్లీ అరణ్యాలకు వెళ్లి పలు కోట్ల యుగాల పర్యంతం మహా తపస్సు చేశారు. ప్రజలు పిన్నవయస్సులో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తములను వేడుకుంటుండగా శ్రీవిధాత్రి అనే అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. అప్పటి నుండి ఆయన విధాత్రి ఉపాసనను తీవ్రంగా ఆచరించసాగారు. ఆ ఉపాసనల కారణం చేత ఆయన చిన్నారులకు పరిహారములను తెలుసుకోగలిగారు.
చిన్నారులకు పరిహారములు
1. పసివాడని పిల్లలకు కలిగే వ్యాధులు, శారీరక వ్యాధులు, గన్నేరు వ్యాధులు వాటికైన కారణము, పరిహారములు
2. చిన్నారులకు కలిగే వ్యాధులు, దిష్టి, శాపాలు
3. పిల్లల సంరక్షణ పద్ధతులు, విద్య, వీరం, సంగీతం, జ్ఞానం వంటి పలు ప్రత్యేకతలను పొందటం వంటి విషయాలపై పరిశోధనలు సాగించి చిన్నారులకు, బాలబాలికలకు అనువైన దైవీకజీవితాన్ని అందిచటానికి చేయాల్సిన పరిహారములు, నివృత్తులను ప్రసాదించారు.
వీటి వల్ల బాలారిష్ట దోషాలు, దిష్టి దోషాలు సులువుగా నివృత్తి అయ్యాయి. చిన్నారులు మందబుద్ధితో ఉండటం, ఆకలిలేకపోవడం, మాందం, పడిశం, విరేచనాలు వంటి వ్యాధులకైన నివారణములు, పరిహార పద్ధతులను శ్రీఆణిమాండవ్య మునులు వివరించారు.
మొత్తానికి పిల్లల సంరక్షణకు శ్రీమాండవ్యుల వివరణలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
చేతిబిడ్డ ఎదుగుతున్నప్పుడు ప్రతి నెలా ఆయా నెలలకు సంబంధించిన దేవతలు కాపాడుతుంటారు. వారెవరు? చిన్నారులకు కలిగే వ్యాధులు, వ్యాధి నివారణ పద్ధతులు అంటూ పలు విషయాలను శ్రీమాండవ్య మహర్షి వివరించారు.
బోగర్ : శ్రీమాండవ్యుల చిన్నారుల సంరక్షణకు సంబంధించిన విధివిధానాలను వివరించండి గురువర్యా!
అగస్త్యులు : తలిదండ్రులు తమ బిడ్డలను ధర్మశీలురుగా పెంచాలి. తలిదండ్రులు తమ పిల్లలకు చేయాల్సిన విధివిధానాలను సక్రమంగా శ్రీమాండవ్య మహర్షులు వివరించారు.
శ్రీఆణి మాండవ్య మహర్షులు అనుగ్రహించిన చిన్నారుల దోష పరిహారాలు, కాపాడే దేవతలు |
బిడ్డ వయస్సు |
కాపాడే దేవత |
పరుల తలంపు |
చిన్నారి పొందే వేదన |
తలిదండ్రులకు కలిగే కష్టం |
దోష నివృత్తి పద్ధతులు |
---|---|---|---|---|---|
తొలి నెల |
తిలమాత |
అసూయ |
నిద్రలేమి, ఏడుపుల కఫం |
దంపతుల మధ్య మనస్పర్థలు |
108 సార్లు గాయత్రీ మంత్రం జపించి నీరు తాగాలి. |
రెండో నెల |
పుంగవి |
ఆరాటపడే తలంపులు |
విరేచనం |
అత్తగారితో విరోధం |
108 సార్లు గాయత్రీ మంత్రం జపించి చెంబుడు నీళ్లు తాగాలి. |
మూడో నెల |
వైఖరి |
కోపపు తలంపులు |
తలనొప్పి |
తండ్రికి, మామకు మధ్య విభేదాలు |
108 సార్లు గాయత్రీ మంత్రం జపించి చిరుగడ్డి నీటిని తాగాలి. |
నాలుగో నెల |
భువన |
హీనపు తలంపులు |
వంటినొప్పితో ఏడ్వడం |
దంపతుల మధ్య అబద్ధాలు |
108 సార్లు గాయత్రీ మంత్రం జపించి చిరుగడ్డి నీటిని తాగాలి. |
ఐదో నెల |
తరణి |
కక్ష గట్టే తలంపులు |
తేపుల వ్యాధులు |
ఆడపడచుతో విభేదం |
108 సార్లు గాయత్రీ మంత్రం జపించి తులసి జలాలను తాగాలి. |
ఆరో నెల |
భావిని |
క్రోధపు తలంలపులు |
భయంతో ఏడ్వడం |
పనిచేసేచోట అపవాదులు ఏర్పడటం |
108 సార్లు గాయత్రీ మంత్రం జపించి బిల్వ జలాలను తాగాలి. |
ఏడో నెల |
జగతాయి |
కామపు తలంపులు |
మూత్రాశయ సమస్యలు |
ఉన్నతాధికారితో మనస్పర్థలు |
108 సార్లు గాయత్రీ మంత్రం జపించి వన్ని ఆకుల నీరు తాగాలి |
ఎనిమిదోనెల |
జలజాక్షి |
చేతితో చేసిన పాపం |
శ్వాసకోశ సమస్యలు |
అప్పులు అధికమవుతాయి |
108 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించి జమ్మి ఆకుల నీరు తాగాలి. |
తొమ్మిదో నెల |
స్వర్ణాక్షి |
కాలితో చేసిన పాపం |
గుండెలో పడిశం |
కిందపడి గాయంతో బాధలు |
108 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించి సొంటి నీరు తాగాలి. |
పదోనెల |
త్రిమబాల |
నడినెత్తిని శ్వాసించుట |
దగ్గు |
వాగ్దాన భంగం |
108 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించి మల్లెపూవుల నీటిని తాగాలి. |
11వ నెల |
జలపుత్రి |
గాఢంగా హత్తుకోవడం |
అతిసురం |
వస్తువులు పోగొట్టుకోవడం |
108 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించి పారిజాతపు నీటిని తాగాలి. |
12వ నెల |
విశ్వధాయి |
ముద్దాడటం |
అతిమూత్రం |
స్నేహితుల మధ్య మనస్పర్థలు |
108 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించి చామంతి పూల నీటిని తాగాలి. |
రెండేళ్ల వయస్సు |
మాలమాత |
వీపుపై గుద్దటం |
వెనుక పడిపోవడం |
పార్శ్వపు తలనొప్పి |
108 సార్లు ఆయా దేవతల నామాల్ని పిల్లలు, తల్లిదండ్రులు జపించాలి. |
మూడేళ్ల వయస్సు |
ప్రభుధారిణి |
బంగారం కోల్పోవుట, గండాలు కలుగటం |
108 సార్లు ఆయా దేవతల నామాల్ని పిల్లలు, తల్లిదండ్రులు జపించాలి. |
||
నాలుగేళ్ల వయస్సు |
చతురాణి |
చిరుకష్టాలు, దుఃఖాలు |
108 సార్లు ఆయా దేవతల నామాల్ని పిల్లలు, తల్లిదండ్రులు జపించాలి. |
||
ఐదేళ్ల వయస్సు |
పాలినీమాత |
బంధువులను కోల్పోవుట |
108 సార్లు ఆయా దేవతల నామాల్ని పిల్లలు, తల్లిదండ్రులు జపించాలి. |
||
ఆరేళ్ల వయస్సు |
పినాకిణి |
విడిపోయి జీవించటం |
108 సార్లు ఆయా దేవతల నామాల్ని పిల్లలు, తల్లిదండ్రులు జపించాలి. |
||
ఏడేళ్ల వయస్సు |
సప్తా |
శత్రువుల దాడి |
108 సార్లు ఆయా దేవతల నామాల్ని పిల్లలు, తల్లిదండ్రులు జపించాలి. |
||
8 నుండి 15 యేళ్ల వరకు |
దేవధారిణి |
దంపతులు, తలిదండ్రుల వేరు కాపురాలు |
108 సార్లు ఆయా దేవతల నామాల్ని పిల్లలు, తల్లిదండ్రులు జపించాలి. |
శ్రీ విధాత్రి దేవి
బోగర్ : శ్రీవిధాత్రి దేవి రూపం ఎలా ఉంటుంది గురుదేవా?
అగస్త్యులు : శ్రీవిధాత్రి దేవి రూపాన్ని నా పరంపరకు చెందిన సిద్ధపురుషుల ద్వారా భగవదనుగ్రహం వల్ల మేము తర్వాత వెలువరిస్తాం. శ్రీవిధాత్రి దేవి త్రిపుర సంహారంలో పరమేశ్వరుడికి మహాశూలం ధరించి సహాయపడింది. మేఘవర్ణంలో డాలు, శూలం, బాణం, కవచం ధరించి అనుగ్రహిస్తోంది. శ్రీయమధర్మరాజు, ధర్మదేవతలు చేత పూజించబడే దేవి.
జీవుని ముగింపు
ఓ సారి చక్రచూడుడు అనేవాడు తన మరణం గురించి తెలుసుకునేందుకు యమధర్మరాజు అనుహ్రం కోసం ఘోరతపమాచరించాడు. యముడు ప్రత్యక్షమై 'నీ మరణానికి ముందు నేను నాలుగు సార్లు హెచ్చరికలు చేస్తాను' అని తెలిపారు.
చక్రచూడుడు మృత్యువుకు చేరువవుతుండగా యమధర్మరాజు అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. చక్రచూడడు దిగ్భ్రాంతి చెందాడు. 'యమధర్మరాజా మీరు నుడివినట్లు నాలుగు సార్లు హెచ్చరికలు చేయలేదే?' అని ప్రశ్నించాడు.
యముడు సమాధానం చెబుతూ 'చక్రచూడా! నీకే కాదు అందరికీ భగవద్ నియమానుసారం మరణం గురించి నాలుగు హెచ్చరికలు ఇవ్వబడతాయి.
1. తలవెంట్రుకలు, మీసం తెల్లబడటం
2. శిరోజాలు రాలి బట్టతల రావటం
3. చర్మాలు కుంచించుకుపోవడం
4. నడక, దేహం పట్టు సడలిపోవడం
వీటిని తెలుసుకున్నాక మానవుడు మృత్యువు చేరువవుతోందని పసిగట్టి దానధర్మాలు, భగవద్సేవలు వంటి సత్కార్యాలు చేయడం మంచిది. ఈ సత్కార్యాలు చేసినవారే మరణ భయం లేకుండా మరణాన్ని స్వాగతించగలరు. తక్కినవారంతా యమభయంతోనే మరణిస్తారు. ఇలా ధర్మాన్ని కాపాడే శ్రీయమధర్మరాజునే ఆరాధించిన ఘనత శ్రీవిధాత్రిదేవికి దక్కింది.
ద్వితీయ తిథిలో గోధుమ తినుబండారాలు నివేదించి, సుగంధ పుష్పాలతో పూజించి ఈ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చు.
శ్రీఆయుర్దేవి తృతీయ దక్షిణ హస్తం
శ్రీ అత్రి మహర్షి |
బోగర్ : గురుదేవా! సంసారిక జీవితంలో మహిళలకు ధర్మాన్ని అందించిన శ్రీ అత్రి మహర్షి, ఆయన సతీమణి అనసూయ దేవి గురించి వివరించండి. శ్రీ అత్రి మహర్షి, శ్రీ ఆయుర్దేవి తృతీయ దక్షిణ హస్తంపై కొలువై ఉన్నారు కదా?
మహిళల విశిష్టత
అగస్త్యులు : ప్రాపంచిక జీవితంలో మహిళలకు ఉన్నతస్థానం కల్పించబడింది. సహనం, వినయం, విధేయతలను సహజసిద్ధంగా కలిగి ఉన్న మహిళలు భర్తల కీర్తి ప్రతిష్టలకు పెరిగేందుకు దోహదం చేయాలి. ఎందుకంటే భర్తలు చేసే దాన ధర్మాల వల్ల కలిగే పుణ్యంలో సగభాగం భార్యలకు చేరుతుంది.
బోగర్ : గురుదేవా! ఇలాంటి అనుగ్రహాలను మహిళలు ఎలా పొందుతారు?
అగస్త్యులు : తీవ్రమైన శివభక్తుడైన భృగుమహర్షి కైలాసంలో ప్రతి దినము పరమేశ్వరుడిని ప్రదక్షిణం చేయడం ఆనవాయితీ. ఆయన శ్రీపార్వతి దేవిని ఎన్నడూ ప్రదక్షిణం చేయలేదు. దీనితో ఆగ్రహించిన శ్రీపార్వతిదేవి భృగుముని వచ్చినప్పుడు పరమేశ్వరుడ పక్కనే నిలిచి దర్శనమిచ్చారు. భృగుమహర్షి చాకచక్యంగా తుమ్మెద రూపం దాల్చి పరమేశ్వరుడిని మాత్రమే ప్రదక్షిణం చేసి వెళ్లిపోయారు.
శ్రీ అత్రి మహర్షి
ఈ సంఘటనపై చింతించిన పార్వతీదేవి పరమేశ్వరుడితో 'స్వామీ! ఋషులుంతా ఇలా శివుడు వేరు శక్తి వేరు అని విభజించి ఆరాధిస్తూ వెళితే లోకులు ఏమనుకుంటారు. శ్రీదేవి ఉపాసన సైతం కాలగమనంలో అదీ కలియుగంలో ఆ ఉపాసన తప్పనిసరి అవుతుంది కదా! కనుక మీలోని సగభాగాన్ని అంటే ఎడమభాగాన్ని నాకివ్వండి' అని వేడుకుంది. ఉమాదేవి కోరికను మన్నించిన పరమేశ్వరుడు ఆమెకు తన దేహంలో సగభాగమిచ్చారు. ఆనాటి నుండి భర్తలు చేసే పుణ్యంలో సగభాగాన్ని భార్యలు పొందేలా పార్వతి దేవి వరం కూడా పొందింది.
పులిప్పాణి : అయితే, మహిళలు చేసే కార్యాలవల్ల వచ్చే పాపంలో సగం భర్తలకు చేరేలా దైవ నియతి ఎలా వచ్చింది గురుదేవా?
శ్రీ అత్రీ మహర్షి
చంద్రుడి శాప విమోచనం
అగస్త్యులు : రుద్ర ప్రజాపతులను మొక్కిన దక్షుడు తన 27 నక్షత్ర కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేశారు. శ్రీచంద్రుడు రోహిణిపై అధిక వ్యామోహం చెంది ఆమెతోనే గడిపేందుకు అధిక సమయం వెచ్చించేవాడు. ఈ విషయాన్ని తక్కిన భార్యలు దక్షుడి వద్ద ఫిర్యాదు చేశారు. దీనితో ఆగ్రహించిన దక్షుడు 'నీకున్న పదహారు కళలు తరిగిపోవు గాక' అంటూ శ్రీచంద్రభగవానుడికి శాపమిచ్చాడు. కళలు కోల్పోయిన చంద్రుడిని చూసి 27 నక్షత్ర యువతులూ దిగులు చెందారు. తమ తొందరపాటు బుద్ధి వల్ల దక్షుడి శాపం వల్ల ఏర్పడిన ఊహించని కష్టాన్ని చూసి కలత చెందారు.
బోగర్ : గురుదేవా! మెట్టింటి లోపాలను మహిళలు పుట్టింట తెలుపరాదని, వేటినైనా సహనంతో ఓర్చుకోవాలని ఈ సంఘటన మనకు తెలియజేస్తున్నది కదా.
అగస్త్యులు : చక్కగా చెప్పావు. 27 నక్షత్ర యువతులు తమ తండ్రి దక్షుడి వద్దకు మళ్లీ వెళ్లి చంద్రుడికి శాపవిమోచనం తెలుపమంటూ వేడుకున్నారు. దక్షుడు వారికి సమాధానం చెబుతూ 'మీరంతా పరిహారం కోసం పరమేశ్వరుడిని ప్రార్థించండి. ఇక భవిష్యత్తులో మహిళలు ఇలాంటి దుఃఖములు రాకుండా కాపాడుకునేలా ఓ వరం ఇస్తాను. మహిళలు చేసే పాపంలో సగభాగం వారి భర్తలకు చేరుతుంది. ఈ విషయం తెలుసుకుని భార్యాభర్తలు పరస్పరం ఐకమత్యంగా జీవించెదరు గాక అని వరమిచ్చారు.
బోగర్ : భర్తకు కలిగే పుణ్యంలో సగభాగం భార్యకు చేరుతుంది, అలాగే భార్య చేసే పాపంలో సగం భర్తకు చేరుతుంది. దీనిని బట్టి మహిళలకు అధిక శక్తి ఉన్నట్లుందే. ఇది సంబేధంలేని నియతిగా ఉందే గురుదేవా?
అగస్త్యులు : కారణం లేకుండా ఇలాంటి నియతి ఉండదు. పక్షపాతంగా కనిపించే దీనిని సక్రమపరిచేందుకే శ్రీఅత్రి మహర్షులు సతిగా ఉన్న శ్రీ అనసూయా దేవి, ఆ మహర్షి తపోబలంచేత ప్రాయశ్చిత పరిహారాలను అందించింది. సంసారిక జీవితం సవ్యంగా ఉండటానికి శ్రీ అత్రి మహర్షి దంపతులు అందించిన పద్ధతులు సద్వినియోగపడతాయి. తగాదాలు, కలతలు లేకుండా జీవననౌక సాఫీగా సాగుతుంది.
బోగర్ : శ్రీఅత్రి మహర్షి కఠోర బ్రహ్మచర్యం పాటించారు కదా?
అగస్త్యులు : తృతీయ తిథిలో శ్రీ భోక్తాదేవి అనే దేవిని ఆరాధించి అనుసూయ అనే అద్భుతమైన సతిని పొందారు. నైష్టిక బ్రహ్మచారిగా ఉన్న శ్రీఅత్రి మహర్షిని పలు దేవాధిదేవతలు ఆయనను దాంపత్య జీవితానికి ఆదర్శజ్యోతిగా ఉండమంటూ ప్రాధేయపడ్డారు. త్రినేత్రములు కలిగి అగ్ని రూపంలో చూపుడు వేలు ముద్రతో ఉన్న శ్రీ భోక్తా దేవిని శ్రీ అత్రి మహర్షి ఉపాసన చేస్తూ వచ్చారు. తనకు ఉత్తమ సతి లభించడమే కాదు లోకంలోని మహిళలందరికీ ఆమె ఆదర్శంగా ఉండాలన్నదే ఆయన కోరిక. మహర్షులు 'తృతీయ తిథి' ఆరాధనల వల్ల సంతసించిన శ్రీభోక్తాదేవి శ్రీ అనసూయా దేవిని అమ్మహర్షికి అనువైనదని ఆశీర్వదించారు. అయితే వివాహానంతరం ఆ దంపతులు మళ్లీ ఘోర తపమాచరించారు.
బోగర్ : పెళ్లయిన తర్వాత కూడా తపస్సా? ఎందుకు గురుదేవా?
మహర్షి దంపతుల తపస్సు
అగస్త్యులు : అనసూయ దేవి నిస్వార్థంగా తన పతికి సేవలందించిన ఆదర్శ గృహిణి. దైవీక నియతి ప్రకారం మహర్షి తపో ఫలితాలలో సగభాగం ఎలాంటి ప్రయత్నాలు లేకుండానే ఆమెను చేరాయి. తను చేసే చిన్న తప్పిదం వల్ల పాపంలో సగభాగం పతికి చేరుతుంది అదే జరిగితే ఆయన తపశ్శక్తి వ్యర్థమవుతుంది కదా, ఇది మంచి పద్ధతి కాదు కదా అని ఆమె చింతించారు. ఆ దైవీక నియతిని మార్చేందుకు సంకల్పించారు. ఘోరతపస్సు చేశారు. దైవీక నియతిని మార్చటం సాధ్యపడదని బాగా తెలిసిన శ్రీఅత్రి మహర్షులు, మహిళల పతివ్రతా ధర్మమే వారిని కాపాడే ఉత్తమ దైవం అని లోకానికి ఎలుగెత్తి చాటేందుకే ఆయన కూడా అనుసూయాదేవితోపాటు తపస్సుకు ఉపక్రమించారు.
పులిప్పాణి : ఆ ఇరువురికి అనుకూల దైవం శ్రీభోక్తాదేవి కదా శ్రీదేవి ఎలాంటి వరాలిచ్చి అనుగ్రహించిందో, ముగింపును తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాను గురువర్యా!
బోగర్ : ఇద్దరూ ఘోరతపమాచరించారంటే ఎంతటి అద్భుత తపస్సది గురుదేవా! ఎందుంటే ఆ తపోవిధానాన్ని బట్టే శ్రీభోక్తాదేవి అనుగ్రహం లభిస్తుంది కదా?
శ్రీ భోక్త గుణ ప్రీతం |
అగస్త్యులు : అవును శిష్యులారా! దాంపత్యంలో ఉంటూ చేసే తపస్సు ఇతర తపస్సులకంటే విభిన్నమైనది. ఆ ఇరువురి తపస్సుకు 'భోక్త గుణ ప్రీతం' అని పేరు. శ్రీ అత్రి మహర్షులు మంచి దాంపత్యానికి తోడయ్యే సత్కార్యాలను నెరవేర్చుతూనే రోజంతా శ్రీభోక్తాదేవిని ఆరాధిస్తూ లోకమంతటా పలువురికి ఈ ఉపాసనను వ్యాపింపజేశారు. శ్రీ అనుసూయాదేవి సైతం శ్రీభోక్తాదేవి పూజలో తన భర్తకు అన్ని విధాల సాయపడటమే కాక ఉదయం, సాయంత్రం రెండు వేళలా పలు ఆలయాలకు చక్కెర కలిపిన గోధుమ పిండిని చీమలపుట్టలో ఉంచి సింధూరపువ్వులను మహిళలకు దానమిచ్చేవారు. ఈ 'భోక్త గుణప్రీతం' అనే పూజను సులువైన పద్దతిలో మహిళలందరు చేస్తే భర్తకు దీర్ఘాయుష్షు, సద్గుణం ప్రాప్తిస్తాయి.
బోగర్ : గురుదేవా! చాలా సులువైన పూజగా ఉంది. అదే సమయంలో ఫలితాలు మెండుగా ఉన్నాయే!
అగస్త్యులు : వేదాలు కఠినమైన హోమ పద్ధతులు కలియుగంలో తగ్గిపోతున్నాయి. కనుకనే సిద్ధపురుషులు పామర ప్రజలు ఆచరించే రీతిలో సులవైన శక్తి ఉపాసనను సద్గురువుల ద్వారా తెలియజేస్తున్నారు. శ్రీ అత్రి మహర్షి, అనసూయా దేవి భక్తిపూర్వకమైన ఆరాధనను మెచ్చుకున్న శ్రీభోక్తాదేవి పరమశివుని అనుగ్రహం చేత లీలలను నిర్వహించేందుకు సిద్ధమైంది.
కైలాసానికి చేరువగా...
భృగుమహర్షి తుమ్మెదగా మారి పరమేశ్వరుడిని మాత్రమే ప్రదక్షిణ చేసినందున ఆగ్రహించిన పార్వతీదేవి ఆయనలో సగభాగాన్ని కోరింది కదా. ఆ సమయంలో పరమేశ్వరుడు ఆ కోరిక నెరవేరాలంటే తొలుత భూలోకంలో శ్రీఅత్రి మహర్షులు ధర్మపత్ని అనుసూయాదేవి పాటించే దాంపత్య నియమాలను తెలుసుకుని రమ్మని ఆదేశించాడు.
శ్రీఅనసూయాదేవి ప్రతిరోజూ తన భర్త పాదాలను పవిత్ర జలాలతో కడిగి అర్చించి పాద పూజచేసి నమస్కరించేవారు. పాదపూజ అభిషేక జలాన్ని ఓ గిన్నెలో భద్రపరస్తూ వచ్చేది. దీని అద్భుత మహిమను ఆమె తెలుసుకోలేకపోయేది. ఆ పవిత్ర జలాల వల్ల భవిష్యత్లో ఓ దైవానుభవాన్ని పొందగలిగింది.
'తాను లోకమాత కదా ఓ ఋషి పత్ని వద్దకు వెళ్లటమా?' అని ఆదిపరాశక్తి భావించలేదు. తనకు తెలియనివాటిని తెలిసినవారి వద్ద అడిగి తెలుసుకునేందుకు వినమ్రంగా శ్రీఅనసూయాదేవిని వెదుకుతూ భోలోకం చేరింది.
శ్రీనారదులు శ్రీ అనసూయాదేవి గొప్పదనాలను శ్రీపార్వతిదేవికి వివరించారు. శ్రీ పరమేశ్వరి సాధారణ మహిళలా శ్రీ అత్రి మహర్షులవారి పర్ణశాలను చేరింది. 'జీవితధర్మం' గురించి వివరణలను తెలుపమని అనసూయాదేవిని వేడుకుంది. అప్పుడు...
త్రిమూర్తులు ముగ్గురు ఋషుల రూపంలో మహర్షి అత్రి నివాసానికి విచ్చేశారు. శ్రీ అత్రి మహర్షి ఆ సమయంలో లేకపోవడంతో అనసూయాదేవి వారిని సాదరంగా ఆహ్వానించింది. అథితులుగా తమ ఇంటి భోజనం చేయమని కోరింది. ఆ ఋషులు 'మేము అవధూత సిద్ధులం. నగ్నంగా భోజనాన్ని వడ్డిస్తే స్వీకరిస్తాం' అని చెప్పారు. శ్రీఅనసూయాదేవి ఇది ఎలాంటి దైవీక పరీక్షో కదా!
పార్వతిదేవి ఆశ్చర్యపోయింది. 'త్రిమూర్తులు ఆమె ఇంటికి అతిథులుగా వేంచేయడమే అరుదైన భాగ్యం! అయితే తన ఇంటికి అతిథులుగా విచ్చేసినవారు త్రిమూర్తులేనని అనసూయాదేవికి తెలియదు. అయితే త్రిమూర్తులే ఆమెను తీవ్రమైన పరీక్షలోకి నెట్టారు. ఆమె ఏం చేయబోతున్నదో కదా!' అని పార్వతిదేవి ఆసక్తిగా గమనించసాగింది. శ్రీఅనసూయాదేవి ఏమాత్రం తడబడకుండా 'మహాశయులారా ఆశీనులు కండి' అంటూ వారిని ఉచితాసనములపై కూర్చోబెట్టి తన భర్తకు రోజూ పాదపూజచేసి దాచిన పవిత్రజలాలను తీసుకువచ్చి ఆ ముగ్గురిపై చల్లింది. ఆ జలాల పవిత్రత కారణంగా ఆ ముగ్గురు పసికందులుగా మారారు. అమ్మహర్షులు తెలిపినట్లే అనసూయాదేవి మేనిపై దుస్తులేవీ లేకుండా పసికందుల రూపంలో ఉన్న మువ్వురికీ బువ్వను తినిపించి నమస్కరించింది.
పతి ఆయుష్షు వృద్థి
అనసూయ దేవి పాతివ్రత్య మహిమకు ఆశ్చర్యపోయిన త్రిమూర్తులు, పార్వతీ దేవి తమ నిజస్వరూపాలతో ప్రత్యక్షమై ఆమెను కీర్తించారు. అదే సమయంలో శ్రీభోక్తాదేవి కూడా ప్రత్యక్షమై ప్రశంసించి సంసారంలో భర్తలు పాటించాల్సిన పరిహార పద్ధతులు గురించి వివరించింది.
1. భర్త చేసిన పుణ్యంలో సగభాగం భార్యకు చేరదు.
2. భర్తలు ఇష్టపడితే అవసరమైనంత మేరకు పుణ్యాన్ని తమ భార్యలకు ప్రాప్తింపచేయవచ్చు
3. భార్య చేసిన పాపాలు భర్తపై ప్రభావం చూపవు. దీనివల్ల భార్యాభర్తల ఆయుష్షుకు ఎలాంటి భంగమేర్పడదు.
-అనే మూడు వారాలను శ్రీ అనసూయాదేవి కలియుగ మానవులకు అందించారు. భర్తలకు సంబంధించిన సులువైన ధర్మాలు, నియమాలు అనుసరించమని, సతులవల్ల పతులు అభివృద్ధి చెందగలరన్నారు. సుమంగళిగా, మాంగల్య ప్రాప్తిస్తుందని, దైవభక్తిని కలిగి ఉంటారని చెప్పారు.
శ్రీ అత్రి మహర్షులు శ్రీఅనసూయా దేవి అనుగ్రహించిన స్త్రీపురుషులు నక్షత్రాల ప్రకారం ధర్మాలు |
నక్షత్రం |
పురుషులు చేయాల్సిన దానం |
మహిళలు చేయాల్సినవి |
అశ్విని |
పసుపు అన్నప్రసాదం |
పసుపును చక్కగా నూరి ముద్దచేసి ఏదైనా ఆలయానికి ఇవ్వడం |
భరణి |
ఉసిరిక పొడి |
గణపతి ఆలయానికి నూరిన చందనం ఇవ్వడం |
కృత్తిక |
వట్రల్ పులుసు |
మురుగన్ ఆలయానికి పండ్ల సమర్పణ |
రోహిణి |
పెరుగు |
అమ్మవారి ఆలయానికి పాలు దానం చేయడం |
మృగశిర |
పప్పు |
పెరుమాళ్ గుడికి తులసిమాల సమర్పించడం |
ఆరుద్ర |
సంకటి, అంబళి |
శివాలయానికి కుంకుమం ఇవ్వడం |
పునర్వసు |
క్షీరాన్నం |
కృష్ణుడిగుడికి దీపాలు, వెదుర్లు ఇవ్వడం |
పుష్యమి |
సాంబారన్నం |
జమ్మిచెట్టు వద్దనున్న నాగుపాము పుట్టలోపాలు పోయడం |
ఆశ్లేష |
మజ్జిగ, వట్రల్ పులుసు |
వన్ని వినాయకుడి ఆలయంలో మోదకం సమర్పించడం |
మఖ |
ఆకుకూర |
వటవృక్షపు వినాయకుడి ఆలయంలో మోదకం సమర్పించడం |
పుబ్బ |
పనసపండ్ల తియ్యటి అన్నం |
మురుగన్ ఆలయంలో పంచామృతం సమర్పించడం |
ఉత్తర |
పులుసన్నం |
వైదీశ్వరాలయంలో మిశ్రమ అన్నం సమర్పించడం |
హస్త |
కొబ్బరి అన్నం |
ఏదైనా ఆలయ మూలవిరాట్టుకు మల్లెపువ్వుల దానం |
చిత్త |
చక్కెర పొంగలి |
శివాలయానికి బిల్వమాలను సమర్పించడం |
స్వాతి |
పప్పుపొడి అన్నం |
అమ్మవారి ఆలయంలో ముల్లై పూల సమర్పణ |
విశాఖ |
కరివేపాకుపొడి అన్నం |
గణపతి ఆలయంలో వెలగపండు, బెల్లం కలిపి సమర్పించడం |
అనూరాధ |
పొంగలి |
శివాలయంలో పొగడ పువ్వులు సమర్పించడం |
జ్యేష్ఠ |
మామిడి అన్నం |
శివాలయంలో తామరపువ్వులు సమర్పించడం |
మూల |
అదిరసం |
పెరుమాళ్ ఆలయంలో దోసెలు సమర్పించడం |
పూర్వాషాఢ |
పోళీలు |
కాలభైరవ ఆలయంలో బంగాళాదుంపల అన్నం సమర్పించడం |
ఉత్తరాషాఢ |
శెనగపిండి |
ఎల్లదేవతలకు నారికేళ జలాల సమర్పణ |
శ్రవణం |
బియ్యపు పిండి, కేసరి |
వినాయకుడి గుడికి జిల్లేడు పూల (అర్క పత్రి) మాల సమర్పించడం |
ధనిష్ఠ |
అటుకులు |
వినాయకుడి గుడికి జమ్మి పత్రాల (శమీ పత్రి) మాల సమర్పించడం |
శతభిష |
కిచిడి |
హయగ్రీవ ఆలయానికి చక్కెర పొంగలి సమర్పించడం |
పూర్వాభాద్ర |
పిట్టు |
మురుగన్ ఆలయానికి తేనె, కొర్రల పిండి సమర్పించడం |
ఉత్తరాభాద్ర |
మినుమల భక్షణం |
ఆలయ పశువుకు ఆకకూరలు, పండ్లు సమర్పించడం |
రేవతి |
కొత్తిమీర అన్నం |
అమ్మవారి ఆలయంలో పాదప్రదక్షీణ చేసి తీపి పదార్థాల సమర్పించడం |
అగస్త్యులు : ఈ విధమైన రీతిలో ఉమాదేవి శ్రీఅనసూయాదేవి నుండి 'భోక్త గుణప్రీతి' ఆరాధన పద్ధతులను తెలుసుకుంది. శ్రీఅనసూయాదేవి శ్రీపార్వతిదేవికి 'దాంపత్య ధర్మం' ఉపదేశించిన స్థలమే అంబాసముద్రం చేరువగా ఉన్న శివశైలం అనే దివ్యక్షేత్రం. అక్కడే పార్వతీ దేవి పరమేశ్వరుడి దేహంలో అర్థభాగం కోసం శ్రీఅనసూయాదేవి నుడివిన రీతిలో ధర్మాలు ఆచరించి అద్భుత తపస్సు చేసింది.
శ్రీఅత్రి మహర్షి మహిమ
బోగర్ : శ్రీఅత్రి మహరషి' శ్రీఆయుర్దేవి హస్తపీఠంపై కొలువైనది ఏచోట గురుదేవా?
అగస్త్యులు : శ్రీఅనసూయాదేవి తపోబలంచేత దాన ధర్మ సహిత ప్రార్థనల వల్ల
1. శ్రీ అత్రి మహర్షి తపోఫలం సగభాగం శ్రీ అనసూయకు చేరక ఆయనవద్దే స్థిరపడింది. దీనితో ఆయన ఆయుష్షు వృద్ధి పొంది పలుకోటి యుగాలు జీవించారు.
2. శ్రీ అనసూయాదేవి తీవ్ర భోక్తాదేవి ఉపాసనవల్ల ఆమె తన పూజలలో సగభాగం శ్రీఅత్రి మహర్షిని చేరాయి.
3. శ్రీ అనుసూయాదేవి తప్పిదాలకు సంబంధించిన పాపాలు ఏవీ శ్రీఅత్రి మహర్షి దరిచేరలేదు.
శ్రీఅనసూయాదేవి అద్భుత తపస్సువల్ల కలిగిన ఫలితాలు ఇవి. దీనితో ప్రపంచంలోనే 'తపోఫల శిఖరాగ్రం'గా శ్రీఅత్రి మహర్షి వెలుగొందారు. ఆ మహర్షులవారి జ్యోతి స్వరూపాన్ని తిలకించి దైవావతారాలే మొకరిల్లాయి.
బోగర్ : గురుదేవా! హిమాలయమంతటి తపోఫలాలను పొందినా శ్రీఅత్రి మహర్షి కించిత్తూ గర్వపడలేదే...!
అగస్త్యులు : అవును, శిష్యులారా! అది కూడా శ్రీఅనసూయాదేవి పవిత్రతా స్వభావం చేతనే! ఆకాశమంతటి దైవానుగ్రహం కలిగి ఉన్నా శ్రీఅత్రి మహర్షులు కించిత్తు గర్వపడకుండా లోకమంతటా స్త్రీజాతి దాంపత్యం గురించి ప్రచార మొనర్చి 'భోక్తాదేవి' ఆరాధనను వ్యాపింపచేసి ప్రజానీకం కోసమే తన తపమును అంకితమొనర్చారు.
అర్ధనారీశ్వరిగా పార్వతీ దేవి
అత్రి, అనసూయ ఇరువురూ శివశైలం చేరి ఆచోట తపమాచరిస్తున్న పార్వతీదేవిని దర్శించి నమస్కరించారు. ఆ దేవదేవుని సగభాగాన్ని పొందటానికి పూర్వాభిముఖంగా శివుడికి నైవేద్యం సమర్పించి ఇరువురూ 'దేవా! ఘోర తపమాచరిస్తున్న పార్వతీదేవి అభీష్టాన్ని నెరవేర్చి, ఇద్దరు కలిసి మీ అర్థనారీశ్వర స్వరూప దర్శన భాగ్యం కల్పించి తరింపజేయండి' అని ధ్యానంలో ఆశీనులయ్యారు. కళ్లు తెరచి చూసేసరికి... ఆ ఇరువురూ సమర్పించిన నైవేద్యం మాయమైంది. పూర్వాభిముఖుడిగా ఉన్న మహాశివుడు అంతర్థానమయ్యాడు.
'కళ్యాణి!' అంటూ పరమేశ్వరుడు ముద్దుగా తన సతీదేవిని ఆహ్వానించి ఆ దేవేరికి తన దేహపు ఎడమవైపు సగభాగాన్ని అందించి, పడమటి దిక్కుగా అర్ధనారీశ్వరులుగా ఆవిర్భవించారు.
బోగర్ : గురువర్యా! పార్వతిదేవీ తన పతిదేవుని దేహపు సగభాగాన్ని పొందిన స్థలమే శివశైలమా?
అగస్త్యులు : అవును నాయనా! అంతేకాదు, శ్రీఅత్రి, శ్రీఅనసూయాదేవి శ్రీపార్వతి దేవి నోమొనర్చిన స్థలాన్ని ప్రదక్షిణ చేయగా ఆ చోట శ్రీఆయుర్దేవి ప్రత్యక్షమై 'అత్రీ మహర్షీ! నీవు సాధించిన సత్కార్యాన్ని మెచ్చి నా కరపీఠాన్ని నీకందిస్తున్నారు. అనసూయా! శ్రీవిద్యాలోకంలోనీవు అత్యద్భుతమైన విశిష్టతలను పొందెదవు గాక!' అని ఆశీర్వదించింది.
శ్రీఆయుర్దేవి చతుర్థ దక్షిణ హస్తం
శ్రీకుండలినీ మహర్షి
పులిప్పాణి : గురుదేవా! శ్రీఆయుర్దేవి చతుర్థ దక్షిణ హస్తంపై అమరి అనుగ్రహిస్తున్న శ్రీ కుండలినీ మహర్షి, పాండిచ్చేరి సమీపం పెరుంబాక్కం - తిరువక్కరైలో శ్రీవక్రకాళియమ్మన్ ఆలయంలోని జీవసమాధి పొందిన సిద్ధ మహాముని కదా?
అగస్త్యులు : అవును. రెండు కోట్లసంవత్సరాలపాటు తపస్సు చేసిన ఉత్తమ సిద్ధపురుషుడాయన. నేటికీ కలియుగంలో దుర్మంత్రములు, దుష్టదేవతలు, చేతబడి, శూన్యం తదితర మంత్రాలు, దిష్టి, మాయ మంత్రాలవాటివల్ల ఎన్నో కుటుంబాలు శాంతిలేక వాడిపోతున్నాయి. ప్రతికూల పరిస్థితులను తట్టుకునేంత పూజాఫలాలను వారు పొందలేకున్నారు. ఇలాంటి దుష్ట శక్తులకు అణచివేయడానికే శ్రీ కుండలినీ మహర్షి అన్న ఆహారాలు లేకుండా రెండు కోట్ల సంవత్సరాలు తపస్సు చేసి శ్రీవిఘ్న కాదిని దేవి దర్శనం పొందారు.
శ్రీవిఘ్న కాదిని దేవి
బోగర్ : శ్రీవిఘ్న కాదిని దేవి దుష్టశక్తులను దునుమాడే కాళికాదేవి స్వరూపమే కదా గురువుగారు ?
అగస్త్యులు : అవును. చిటికీ మాటికీ కోపం తెచ్చుకునే ముక్కోపిలకు శ్రీవిఘ్న కాదిని ఆరాధిస్తే కోపమే రాదు. కోపాన్ని సంహరించే వనమాలి ఆమె. శ్రీవిఘ్న కాదిని అనుగ్రహ దర్శనం పొందిన శ్రీ కుండిలీని మహర్షి మరో రెండు కోట్ల సంవత్సరాల పర్యంతమూ పలు లోకాలలో తపమాచరించి శ్రీవిఘ్నకాదిని దేవిని ఆరాధించారు. ఆమె మహత్యాన్ని లోకమంతటా వ్యాపింపచేశారు.
శ్రీ కుండలినీ మహర్షి
ఇంతటి అత్యద్భుత తపముల వల్ల ప్రపంచమంతటా ఉన్న దుష్టశక్తులు, దుశ్చేష్టలను, దుర్దేవతలను అణచివేయగల తపోశక్తి పొందారు. చివరకు కోటానుకోట్ల దుష్టశక్తులను అణచివేసి తిరువక్కరైలోని శ్రీవక్రకాళి తిరుసన్నిధిలో జీవసమాధి నొందారు.
పులిప్పాణి : సద్దురువే! చేతబడులు, శూన్యం వంటి చేష్టల వల్ల బాధపడుతున్నవారికి శ్రీకుండలినీ మహర్షుల సమాధి దర్శనం ఒక వర ప్రసాదమే కదా?'
శ్రీవక్రకాళి మహిమ
అగస్త్యులు : అవును శిష్యులారా! దుష్టశక్తులను తన వైపునకు ఆకర్షింపజేసుకుని వాటిని అణచి వేయగల శక్తిసామర్థ్యాలను కలిగినవారే శ్రీకుండలినీ మహర్షులు. పౌర్ణమి దినాన తిరువక్కరై శ్రీవక్రకాళియమ్మకు అన్నప్రసాదం నైవేద్యంగా సమర్పించి నిరుపేదలకు అన్నదానం చేసి శ్రీకుండలినీ మహర్షులవారిని దర్శనం చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి. మాంత్రికులు, చేతబడి, శూన్యం జరిపేవారెవరూ ఆ స్థలంలో అడుగుపెట్టేందుకు సైతం భయపడుతుంటారు. ఎందుకంటే దుష్టశక్తుల నుండి ప్రజలకు విముక్తి కలిగించి వారికి సేవల చేయడమే మహద్భాగ్యంగా భావించి నేటికీ ఆ సేవలను కొనసాగిస్తున్నారు శ్రీకుండలినీ మహర్షులు. ఎవరూ ఇప్పటి వరకూ చేయనంతగా అద్భుత తపాన్ని ఆచరించి నిస్వార్థంగా ప్రజల సంక్షేమం కోసం త్యాగం చేసి అనుగ్రహించే ఉత్తమమైన సిద్ధ మహర్షులు ఆయనే.
శ్రీవిఘ్న కాదిని పూజ
బోగర్ : శ్రీవిఘ్న కాదిని దేవిని సామాన్య ప్రజలు ఆరాధించే పద్ధతి ఏదైనా ఉందా గురువుగారు?
అగస్త్యులు : పెసరపప్పు పిండితో చక్కెర చేరి చతుర్థిరోజున ఆలయాలలో నిరుపేదలకు దానం చేసి చామంతి పువ్వులు దానంగా ఇస్తే శ్రీవిఘ్నకాదిని దేవి సంప్రీతి చెందుతుంది. నవరాత్రులలో చతుర్థినాడు నాలుగేళ్ల వయస్సున్న బాలికను అలంకరించి ఆభరణాలు ధరింపచేసి మోకరిల్లి మొక్కితే పైనపేర్కొన్నట్లు చామంతి పూలు, తీపితో కూడిన పెసరపిండి దానాలు చేస్తే శ్రీవిఘ్నకాదిని దేవి పరిపూర్ణానుగ్రహం లభిస్తుంది.
దుష్ట శక్తి పుట్టుక
పులిప్పాణి : గురువర్యా! దుష్టశక్తులు పుట్టడానికి కారణమేమిటి?
అగస్త్యులు : దుర్దేవతలను దుష్టశక్తులను ఉపాసించడం వల్ల లభించే శక్తులను పలువురు తప్పుడు కార్యాలకు ఉపయోగించి ఇతరుల జీవితాలను నాశనంచేస్తుంటారు. అయితే దేవుని సృష్టిలో కారణ కార్యం లేకుండా ఏవీ జరుగవు.
శూన్యపు కష్టాలకు కారణం
ఉన్నత పదవులలో ఉన్నవారు తమ అధికారులను దుర్వినియోగం చేయడం, ఇతరులను బెదరించి అణచి తమకు అవసరమైన స్వార్థపూరిత పనులను చేయించుకోవడం, అధికార ధోరణిలో తప్పుడు మార్గంలో డబ్బులు స్వీకరించడం, తమ అపరిమిత దేహశక్తితో బలహీనులను హింసపెట్టి డబ్బులు గుంజటం, పెత్తందారీ ధోరణిలో ఇతరుల శ్రమల వల్ల సంపదలు సమకూర్చుకుని వారి జీవితాలకు సాయపడకుండా బతకడం వంటి పాపపు చర్యలకు పాల్పడేవారే మరు జన్మలలో బిల్లీ, శూన్యం వంటి దుష్టశక్తులుగా పుడుతుంటారు.
అంతేకాదు, రోజు, వారం పట్టించుకోకుండా చేసే కొన్ని కార్యాలు ప్రతికూల పరిస్థితులను కలిగిస్తుంటాయి. వీటన్నింటిని అంతర్గత శత్రుత్వంగాను, లోపలి నుండి వచ్చే దుష్టశక్తులుగా ఉంటాయి. ఉదాహరణకు అన్ని రోజులలో క్షవరం చేసుకోకూడదు. అందునా మంగళవారం, శుక్రవారాల్లో క్షవరం చేసుకోరాదు. ఆ రెండు దినాలలో క్షవరం చేసుకుంటే పలు కష్టాలకు గురవుతారు. దుష్టశక్తులు అధికమవుతాయి. ఇలా దుష్టశక్తులను మనమే రూపొందిస్తుంటాం.
బోగర్ : ఈ దుష్టశక్తులను ఎలా నిరోధించడం గురుదేవా?
అగస్త్యులు : దీనికైన విధి విధానాలు, పరిహారాలను శ్రీకుండలినీ మహర్షులు తెలియజేసి ఉన్నారు. వాటిని ప్రజలు పాటించి సులువైన మార్గంలో దుష్టశక్తుల నుండి తమను కాపాడుకోవాలి. ఇలా పలు కోట్లలోకాలలో ఉన్న దుష్టశక్తులను తమ తపోబలం చేత కట్డడి చేసి ప్రజలను కాపాడి తిరువక్కరై జీవసమాధిలో ఉంటూనే అద్భుత సేవలు చేస్తున్న శ్రీకుండలినీ మహర్షులు శ్రీ ఆయుర్దేవి నాలుగో కుడిచేతిలో ఆశీనులయ్యే అరుదైన భాగ్యం పొందగలిగారు. శ్రీఆయుర్దేవి యొక్క కరములో ఆశీనులైన ఒక్కో మహర్షి, సిద్ధులు ప్రజల పలు రకాల కష్టాలను పోగొట్టేందుకు తమ తపోబలాలను అందించి అనుగ్రహిస్తున్నారు. శ్రీఆయుర్దేవి అనుగ్రహ దర్శనం గురుకృపచేత అన్ని రకాల కష్టాలనుండి విముక్తి కలిగించి సౌభాగ్యజీవితాన్ని ప్రసాదిస్తాడు.
శ్రీ కుండలినీ మహర్షులు ప్రసాదించిన |
రాశులు |
శూన్య తిథులు |
మేషం |
షష్టి |
వృషభం |
చతుర్థి, త్రయోదశి |
మిథునం |
పంచమి, అష్టమి, చతుర్థశి |
కటకం |
సప్తమి |
సింహం |
తృతీయ, షష్టి, నవమి, త్రయోదశి |
కన్య |
పంచమి, అష్టమి, చతుర్థశి |
తులాం |
ప్రథమ, ద్వాదశి |
వృశ్చికం |
దశమి |
ధనస్సు |
ద్వితీయ, సప్తమి, ఏకాదశి, చతుర్థశి |
మకరం |
ప్రథమ, తృతీయ, ద్వాదశి |
కుంభం |
చతుర్థి |
మీనం |
ద్వితీయ, ఏకాదశి, చతుర్థశి |
అమావాస్య, పౌర్ణమి పరిపూర్ణ రోజులలు అన్ని శుభకార్యాలకు అనువైనవి.
నిర్ణీత రాశులవారు వారికైన శూన్య తిథులలో అన్ని శుభకార్యాలను, గోళ్లు, క్షవరం, తలవెంట్రుకల కత్తిరింపులను చేయరాదు. ఇలాంటి శూన్య తిథులలో విష్ణు సహస్రనామం, కాల భైరవ స్తుతి, అభిరామి అందాది, స్కంధ షష్టి కవచం వంటి వాటిని సామూహికంగా పారాయణం చేసినట్లయితే శూన్యతిథులలో దుష్ట శక్తుల ప్రభావం నుండి తప్పించవచ్చు.
తలవెంట్రుకలు కత్తిరించటం, ముఖ క్షవరం, గోళ్లు కత్తిరించటం చేయని నక్షత్ర దినాలు
కుండలినీ మహర్షులు తెలిపినవి |
నక్షత్రం |
పౌరాణిక సంఘటనలు |
కలిగిన అరిష్టాలు |
భరణి |
కృష్ణుడు |
శ్యమంతకమణి అపహరించినట్లు అపవాదు |
కృత్తిక |
వీరబాహుదేవులు క్రౌంచపర్వతం |
మాయవల్ల మైకం |
ఆరుద్ర |
శకుని |
దుర్యోధనుడి వద్ద బందీకావటం |
ఆశ్లేష |
ఇంద్రుడు అహల్య |
యోని దేహ శాపం |
మఖ |
యమధర్మరాజు మార్కండేయుడు |
పదవీచ్యుతి |
పూర్వఫల్గుణి |
దశరథుడు రాత్రి వేట |
ఋషి శాపం |
విశాఖ |
శూరపద్ముడు మురుగన్ కోపం |
నాయకుడు,బంధువు, పైఅధికారి కోపం |
జ్యేష్ట |
కర్ణన్ ఇంద్ర |
కవచకుండలం కోల్పోవటం |
మూల |
కంసుడు కృష్ణుడు |
వినాశకాలం |
పూర్వాఆషాఢ |
శిశుపాలుడు కృష్ణుడు |
వినాశకాలం |
పూర్వాభద్ర |
ధర్మరాజు జ్యూదం |
రాజ్యం, ఆస్తి కోల్పోవుట |
పైన పేర్కొన్న నక్షత్ర దినాలలోనే కాకుండా వారివారి రాశియొక్క శూన్య తిథులు, మంగళ, శుక్రవారాల్లో క్షవరం, గోళ్లు కత్తిరించటం చేయరాదు. తగని రోజులలో క్షవరం చేసినందువల్ల పలువురు పురాణపురుషులు, ఇతిహాస దేవమూర్తులు పైన పేర్కొన్నరీతిలో కష్టాలపాలయ్యారు.
శ్రీఆయుర్ దేవి ప్రథమ వామ హస్తం
శ్రీఅహిర్బుద్న్య మహర్షులు
బోగర్ : గురుదేవా! శ్రీఆయుర్దేవి ప్రథమ వామహస్తంలో దర్శనమిచ్చే శ్రీ అహిర్బుద్న్య మహర్షుల మహోన్నతిని వివరించమని వేడుకుంటున్నాను.
అగస్త్యులు : ప్రతి సిద్ధపురుషుడు ప్రజలకు కలిగే కష్టాలను తొలగించటానికి తపస్సుతో త్యాగం చేసి తన జీవితాన్నే వారి కోసం అంకితం చేస్తుంటారు. ప్రజల కోటాను కోట్ల కష్టాలను తీర్చేందుకే పలు కోట్ల సిద్ధపురుషులు అవతరించారు. కనుక ప్రజలకోసం నిస్వార్థంగా అందరూ దైవకృపతో సేవలు చేయాలి. తనకోసం, తన కుటుంబం కోసం జీవిస్తే అది నిష్ప్రయోజనం. ఇలా మళ్ళీ మళ్లీ కోటి జన్మలు ఎత్తి స్వార్థపూరితంగా జీవిస్తే ఏమి ప్రయోజనం?
శ్రీఅహిర్బుద్న్య మహర్షులు
శ్రీసుదర్శన మహామంత్రానికి సంబంధించిన శ్రీ అహిర్బుద్న్య మహర్షులు కాశీలో గంగానదీ తీరాన 64 విశిష్ట తీరాలలో ప్రతి యేటా ఒక్కో ఘాట్లోను తన తండ్రిగారి అస్థి కలశాన్ని మోస్తూ 'శ్రీనిధిప్రభ' అనే దేవిని పూజించి పితృ కార్యాలను చక్కగా నిర్వర్తించారు.
శ్రీనిధి ప్రభా దేవి
శ్రీ అహిర్బుద్న్య మహర్షుల తండ్రి, తన కుమారుడి అద్భుత తపములను నిర్వహించి పలులోక జీవుల పితృ రుణాలను తీర్చే సన్మార్గునిగా, సద్గురువుగా, మహర్షిగా మారనుండటాన్ని దీర్ఘదర్శనంతో తెలుసుకున్నారు. గంగానదిలో తమ దేహాన్ని విసర్జిస్తున్నప్పుడు తన కుమారుడు అహిర్బుద్న్య మహర్షికి శ్రీనిధిప్రభా దేవి ఉపాసనలను నేర్పించి 'అహిర్బుద్న్యా! రాశి గ్రహ సంక్రమణల సూక్ష్మాన్ని దోష పరిహార నివృత్తులను శ్రీనిధిప్రభాదేవి నీకందించి సంతోషిస్తుంది. వాటిని ప్రజలకు సులువుగా వివరించెదవు గాక' అన్నారు.
శ్రీ అహిర్భద్న్య మహర్షి
శ్రీఅహిర్బుద్న్య మహర్షి
అహిర్బుద్న్య మహర్షి 'తండ్రీ! గ్రహ స్థితి విద్య ప్రపంచంలా విస్తరించబడి ఉందే. నా వల్ల వీటన్నింటినీ గ్రహించడానికి ఈ ఆయుష్షు చాలునా, అందుకు ధీటైన జ్ఞానం కావాలి కదా?' అని అడిగారు.
'దిగులు చెందకు అహిర్బుద్న్యా! శ్రీనిధి ప్రభాదేవి అనుగ్రహంచేత అన్ని ప్రాప్తిస్తాయి. నా అస్తి కలశాన్ని మోస్తూ శ్రీనిధి ప్రభాదేవిని పూజించి పలు క్షేత్రాలకు వెళ్లి మూర్తి స్థలం, తీర్తాలను దర్శించెదవుగాక! ఎక్కడ నా అస్థి, తామరగా మారుతుందో అప్పుడే నా ఆత్మ సద్గతి పూర్ణమయ్యిందని, శ్రీనిధిప్రభాదేవి అనుగ్రహము సంపూర్ణంగా లభించినట్లు తెలుసుకుంటావు. తామర పుష్పించే స్థలమే ఉన్నతమైన పితృస్థలం అని శ్రీదేవి నీకు ఎరుకపరుస్తుంది' అన్నారు. ఆనాటి నుండి గ్రహ సంక్రమణ స్థితులను, దోష పరిహారపద్ధతులను సద్గురువులు, సత్సంగముల ద్వారా వ్యాపింపచేసి కోటానుకోట్ల జీవుల పితృ రుణాలను తీర్చెదవు గాక' అన్నారు.
గ్రహ సంక్రమణ ఫలితాలు
అహిర్బుద్న్య మహర్షులు గంగనదీ 64 ఘాట్లలో ఒక్కో ఘాట్ వద్ద యేడాదిపాటు నిధి ప్రభాదేవిని ధ్యానించసాగారు. శ్రీదేవి గ్రహరాశి సంగమ స్థితులను ఆయనకు వివరించగా వాటిని తన జ్ఞానంతో వృద్ధి పరచుకున్నారు.
ఉదాహరణకు ఒకరి జాతకంలో మేషరాశిలో, గురు, శుక్రుడు అంటూ గ్రహ సంగమాలు ఉంటాయి. ఇలా 12 రాశులలో పలు గ్రహాలు పలు స్థితులలో సంగమమవుతుంటాయి. ఇలా గ్రహ సంక్రమణల వల్ల సత్ఫలితాలు, దోషాలు కలుగుతాయి. ఈ దోషాలకు కలిగే ఫలితాలు, పరిహార పద్ధతులను శ్రీ అహిర్బుద్న్య మహర్షులు విభజించారు.
కాశీలోను గయలోనే కాక పలు క్షేత్రాలలో 6400 సంవత్సరాలకు పైగా శ్రీనిధి ప్రభా దేవి అనుగ్రహం చేత రాశి గ్రహ సంక్రమణ స్థితులను గురించి విస్తృత జ్ఞానాన్ని పొంది చివరగా తమిళనాటు కుంభకోణంలో కావేరి నదీ తీరాన చక్రపడితురైకి వచ్చేశారు అహిర్బుద్న్య మహర్షులు.
చక్రపడితురై కుంబకోనం
కుంభకోణం చక్రపటితురై మహిమ
అహిర్బుద్న్య మహర్షులు పునీతమైన కావేరి నదీ తీరంలో అమర్చిన చక్రపడితురైలో తన తండ్రిగారి అస్థి కలశాన్ని ఉంచి తర్పణాది పితృ రుణాలను దాన ధర్మాలను చేసి శ్రీనిధి ప్రభాదేవిని పూజించారు. పూజలు ముగిసిన తర్వాత గణ గణమంటూ గంటలు మ్రోగుతుండగా...
అస్థికలశం నుండి తామర పుష్పాలు గుత్తులు గుత్తులుగా పుష్పించి కావేరీ నదీలో కన్నులు మిరిమిట్లు గొల్పేలా తేలియాడాయి. అహిర్బుద్న్య మహర్షులు ఆనంద కడలిలో తేలియాడారు. అక్కడే శ్రీనిధి ప్రభాదేవి దర్శనమిచ్చి 'అహిర్బుద్న్య మహర్షీ! మీ తపోధనాన్ని చూసి సంతసించాం. వచ్చే యుగాలలో పితృకార్యాలను సక్రమంగా నెరవేర్చలేక పలు కుటుంబాలు సంతతిలేక, పేదరికం, వయసుమీరినా పడతులకు వివాహం కాక, తీవ్రమైన రోగాలు వంటి కష్టాలపాలవుతారు. కుంభకోణంలో చక్రపటితురై వద్ద చేసే అమావాస్య, గ్రహణ, మాసారంభపు తర్పణాలను, పితృ శ్రాద్ధ తర్పణాలు, పిండాలన్నింటిని నీవే స్వీకరించి పితృశాపాలను నివృత్తి చేసి ప్రజలను ఒడ్డుకు చేర్చెదవుగాక!' అని అనుగ్రహించింది.
కనుకనే అమావాస్య, గ్రహణం, మాసారంభపు, సంక్రాంతి వంటి విశేషమైన దినాలలో కుంభకోణం చక్రపటితురైలో తర్పణాలతో వీలయినంత అన్నదానం చేస్తే శ్రీఅహిర్బుద్న్య మహర్షులే వాటిని స్వీకరించి పితృశాపాలను నివృత్తి చేస్తున్నారు.
బోగర్ : శ్రీగయాసుర మహర్షులు అనుగ్రహ విధానం శ్రీఅహిర్బుద్న్య మహర్షుల కంటే వేరుగా ఉంది కదా గురుదేవా?'
అగస్త్యులు : అవును బోగా! సంపన్నులు కాశీ, గయ వెళ్లి పితృ రుణాలను తీర్చగలరు. దక్షిణాదిన ఉన్న పేద, సామాన్య ప్రజలు ఏం చేయగలరు? అమావాస్య తర్పణాన్ని చక్రపటితురై వద్ద భక్తిశ్రద్ధలతో నిర్వహించేవారికి అహిర్బుద్న్య మహర్షుల కరుణచేత వారికి కాశీవెళ్లే యోగాన్ని సైతం ఆ మహర్షులవారే కల్పిస్తారు. అదే విధంగా గయలో శ్రీగయాసుర మహర్షులవారిని భక్తి శ్రద్ధలతో ధ్యానించేవారికి ఆయన అనుగ్రహం చేత చక్రపటితురైలో పవిత్ర కావేరి స్నానమాచరించే అవకాశం ప్రాపిస్తుంది. పైగా చక్రపటితురై వద్ద పరిహారాలు గ్రహసంక్రమణ దోషాలను కూడా నివృత్తి చేస్తాయి.
బోగర్ : జ్ఞానగురుదేవా! చక్కరై పటితురైనా? లేక చక్రపటితురైనా?
చక్ర పటితురై నామ వివరణ |
అగస్త్యులు : (చిరునవ్వుతో) శ్రీమన్నారాయణ పెరుమాళుకే ఈ సందేహం కలిగింది. నీకు కలుగటంలో ఆశ్చర్యమేముంది. పితృదేవతల నాయకుడైన పెరుమాళ్ శ్రీఅహిర్బుద్న్య మహర్షులను పరీక్షించేందుకు వచ్చారు. ఆ రోజే అహిర్బుద్న్యుల తండ్రిగారి అస్థినుండి తామరపుష్పాలు పుష్పించాయి. మహర్షి ఆనందించి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించి తాను తినటానికి ముందు ఓ అతిథి కోసం వేచి చూస్తుండగా శ్రీపెరుమాళ్ ఋషి రూపంలో అక్కడకు వేంచేశారు.
చక్కెర! చక్రం
ఆ ఋషిని సాదరంగా ఆహ్వానించిన అహిర్బుద్న్యుల చక్కెర పొంగలి ప్రసాదాన్ని అందించారు. ఆ ఋషి తన కుడిచేతిని ఆ ప్రసాదంపై మోపి 'చక్కెరా? చక్రమా' అంటూ పెద్దపెట్టున నవ్వారు. అహిర్బుద్న్యులు ఏమి పాలుపోక ప్రసాదపు పళ్ళెరాన్ని చూడగా చక్కెర పొంగలిపై విష్ణు చక్రపు ముద్ర ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. చక్కెర పొంగలిలో చక్రం. చక్కెర పొంగలి కాస్తా విష్ణు చక్రపు పొంగలిగా మారిందే! అవును! గయలో శ్రీ విష్ణుపాదాలు! అదేరీతిలో చక్కెరపటితురైలో తన చక్రపు ముద్రను ముద్రించి తన అంగీకారాన్ని శ్రీమహావిష్ణువు తెలియజేశారు. నేటికీ కుంభకోణం చక్రపటితురై సమీపం ఋషిగా వచ్చి అనుగ్రహించిన శ్రీమహావిష్ణువు గుడిని దర్శించవచ్చు. అమావాస్య వంటి విశేష పితృదినాలలో శ్రీఅహిర్బుద్న్య మహర్షులు ఆ ఆలయానికి వేంచేయడాన్ని గురువుల కృపచేత చూడగలం.
చక్కెర వ్యాధి నివారణం
'అహిర్బుదన్యా! చక్కెర పొంగలిని సమర్పించి చక్రపటితురైని పునీతం చేసిన కారణంగా నేనీ ప్రాంతంలో చక్కెర వ్యాధి (మధుమేహం)ని నయంచేసే ధన్వంతరీ రూపంలో కొలువై ఉంటాను. ప్రథమ నుండి అమావాస్య, పౌర్ణమి వరకు ప్రతి తిథిలోను నన్ను ధ్యానించి నేను నుడివినట్లు ఆహారపు పరిపక్వతను అనుసరించే వారికి చక్కెర వ్యాధిని నయమొనర్చుతాను. ఇందులో దృఢమైన విశ్వాసమే సత్ఫలితాన్ని ఇవ్వగలదు' అని శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి ఒక్కో తిథికి సంబంధించిన ఆహారాన్ని సూచించారు.
కనుక చక్కెర వ్యాధితో బాధపడుతున్నవారు, చక్కెర వ్యాధిని నయం చేయడంలో నైపుణ్యతను పెంచుకోదలచిన వైద్యులకు చక్రపటితురై పెరుమాళ్ అద్భుత ఫలితాలను అందిస్తున్నారు. కుంభకోణం చక్రపటితురైలో అమావాస్య, మాసారంభం, శనివారం, తిరువోణ, పునర్పూస, మూల నక్షత్రాలు, సంక్రాంతి, గ్రహణ కాలాల్లో ఇక్కడ తర్పణం, పిండాలు, పితృహోమాలు, శ్రాద్ధాలు, దానధర్మాలు, ఉత్తరక్రియలు వంటి పితృకార్యాలను చేస్తే శ్రీఅహిర్బుద్న్యులు వాటిని స్వీకరించి వసు, రుద్ర, ఆదిత్య పితృలకు, పితృదేవతలకు నేరుగా అందించి అద్భుతమైన వరాలను పొంది అందిస్తారు. చక్కెర వ్యాధికలిగినవారు పైన పేర్కొన్న తిథి సంబంధిత ఆహారాన్ని అందించి దాన ధర్మాలు చేస్తే అద్భుత గుణాలు కలుగుతాయి.
శ్రీఅహిర్బుదన్యులు తెలిపిన |
తిథులు |
ఆహారపు రకాలు |
ప్రథమ |
అరటిబోదె వేపుడు |
ద్వితీయ |
కోవకాయ (వేపుడు) |
తృతీయ |
సిరుకూరాకు (పప్పుతో మితమైన వేపుడు) |
చతుర్థి |
అరటిపూవు వేపుడు/కూర |
పంచమి |
నూల్కోల్ (ఉడికించి తినడం) |
షష్టి |
చిక్కుడు కాయ వేపుడు |
సప్తమి |
పిడికెడు తులసి + మిరియాలు |
అష్టమి |
ఒక ఉసిరికాయ + జలం |
నవమి |
మెంతికూర కలుజుకూర |
దశమి |
కాకరకాయ కలుజుకూర వేపుడు |
ఏకాదశి |
ఉస్తికాయల వేపుడు |
ద్వాదశి |
ముల్లంగిని ఉడికించి తినడం |
త్రయోదశి |
21 బిల్వ ఆకులు + మిరియాలు, సాయంత్రం దానిమ్మ పానీయం |
చతుర్థశి |
అవిశ పువ్వులు వేపుడు |
అమావాశ్య పౌర్ణమి |
నీరారై (చిక్లింతకూర) ఆకుల కలుజుకూర |
ఆయా తిథులలలో ఉదయం తీసుకోవాల్సిన అల్పాహారం ఇవే. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వారి వారి ఇష్టప్రకారం ఆహారం స్వీకరించవచ్చు.
శ్రీ ఆయుర్దేవి ద్వితీయ వామహస్తం
శ్రీసారమా మహర్షి
బోగర్ : శ్రీఆయుర్దేవి ద్వితీయ వామహస్తంపై కొలువుదీరే భాగ్యం పొందిన సారమా మహర్షి గురించి వివరించండి గురుదేవా.
శ్రీ పాపఘ్నిదేవి
అగస్త్యులు : 'శ్రీపాపఘ్నిదేవి' అనే దేవతను ఆరాధించి పలు అద్భుత వరాలను పొందినవారు సారమా మహర్షులు. షష్ఠి తిథిలో శ్రీపాపఘ్ని దేవిని పూజించి ప్రతిరోజూ ఆలయంలో పశువుకు అవిశె కూరను సమర్పిస్తూ వచ్చిన మహర్షి తన ప్రతి అంగమూ పునీతంకావాలని కోరుకుంటూ తపమాచరించారు. ఒక్కో అంగానికి 1008 షష్ఠి తిథులలో శ్రీపాపఘ్ని దేవిని పూజించి ఉపవాసముండి తేజమయం రూపం పొందారు. పలు వేల అంగాల కోసం పలు లక్షల సంఖ్యలో షష్ఠి తిథులలో నోములు ఆచరించిన ఆయన గోళ్లపై కూడా కాంతులు ప్రకాశిస్తుండేవి. ఆ మేరకు పాదాతి కేశం దాకా అన్ని అంగాలతో దైవారాధన నిర్వహించారు.
పులిప్పాణి : సద్గురువే! మానవుడు తన అంగాలతో పలు తప్పిదాలను చేస్తాడు. పూర్వజన్మ కర్మల వల్ల ఈ జన్మలో చేరే కర్మలు అతడిని శోకభరితం చేస్తుంటాయి. దీనికిగాను ప్రాయశ్చిత్తాలను సారమా మహర్షులు అందించటం గురించి సంతోషపడుతున్నాము గురుదేవా!
అగస్త్యులు : బాగా అర్థం చేసుకోండి శిష్యులారా! ప్రాయశ్చిత్తం చేస్తే పాపాలు తరగవు. ప్రాయశ్చిత్తం అనేది ఓ తప్పు చేసినందకు మనసారా చింతించి అందుకు ముగింపు పలికేందుకే పరిహారాలు చేయాలి. పరిహారం తర్వాత కూడా అదే తప్పులు కొనసాగితే పాపాలు అధికమై అధికంగా బాధకలిగిస్తాయి. దీర్ఘాయుష్షును పొందాలనుకునే మానవుడు తన జీవితంలో ఏదైనా ఒకరోజు తన తప్పులకు బాధపడి సరిదిద్దుకుంటాడు కదా అనే ఉన్నత తలంపుతోనే సద్గురు మూలంగా కఠినమైన పాపాలకు పరిహారాలను దేవుడు అందిస్తున్నాడు.
శ్రీ సారమా మహర్షి
మానవుడు తన దేహంలోని అన్ని అంగాలు చేసేపాపాలకు సారమా మహర్షులు ప్రాయశ్చిత్తాలను అందించారు. సారమా మహర్షి అందించిన, అన్ని అంగాల వల్ల చేసిన పాపాలకు పరిహార పద్ధతులు ఆచరించి కోటానుకోట్ల మంది మంచి మార్గంలో పడ్డారు.
బోగర్ : సారమా మహర్షులు కరికాల చోళుని కాలానికి చెందినవారా గురుదేవా?
అగస్త్యులు : సారమా మహర్షులు పలు యుగాలలో ఇదే పేరుతో అవతరించి పలు సేవలను చేశారు. మహర్షులంతా దైవానుగ్రహాన్ని పరిపూర్ణంగా కలిగినవారు. దేవుని అభీష్టం ప్రకారం పలు రకాలు సేవలను చేయడానికిగాను పలు యుగాలలో అదే పేర్లతోనో, వేరు పేర్లతోనో సృష్టింపబడుతుంటారు. ఈ విధంగానే శ్రీఅత్రి మహర్షి, శ్రీకుండలినీ మహర్షి, సారమా మహర్షి తదితరులు పలు యుగాలలో అవతరించి సేవలు చేశారు. కాల పరిమితి, చారిత్రక నియమాలన్నింటికీ వీరు అతీతులు. వీరిని చారిత్రక పరిశోధకులు పాఠ్యాంశాల్లో గనుక చేర్చితే అయోమయం కలుగుతుంది. ఆధ్యాత్మిక మహర్షుల చరిత్ర విజ్ఞానికి అతీతమైనది.
యోగ మహిమ
బోగర్ : గురువర్యా! ఆయన తిరుచ్చిలో సెవ్వంది నాదర్గా కరుణాకటాక్షములను అందిస్తున్న తాయుమాన స్వామికి సేవలు చేశారు కదా?
అగస్త్యులు : అవును! సారమా మహర్షులు తన తపోబలం చేత నాగలోకం నుండి భూలోకానికి సెవ్వంతి విత్తనాలను తీసుకొచ్చి సెవ్వంతి రంగులు ఏర్పండేందుకు దోహదపడ్డారు. ఆయనే సెవ్వంతి వినాయకుడిగా తిరుచ్చి మలకోట శివుడికి ఈ నామకరణం చేశారు.
పులిప్పాణి : గురుదేవా! ఈ కాలంలో యోగం, కాండం, కరణం వీటిని గణించి శుభదినాలు ఏర్పడటం లేదు కదా? దీనివల్ల పలు వ్యతిరేక ప్రభావాలు కలుగుతాయేమో కదా!
అగస్త్యులు : వాస్తవమే! పంచాగాన్ని పరిశీలించి రోజును గణించి శుభముహూర్తాలను పెట్టినా వైవాహిక జీవితాలన్నీ సక్రమంగా సాగటం లేదు కదా అని బాధపడటం కద్దు! శుభదినాలు చూడకుండా కార్యాలు చేస్తే ప్రతికూలాలు, ముఖ్యంగా రోగాల బారినపడతారు. కొన్ని రోగాల కోసం నిర్ణయించిన యోగంలో కొన్ని దాన ధర్మాలు చేస్తే ఆ రోగాలు నయమవుతాయి. ఇలాంటి యోగ దానధర్మ పద్ధతులను శ్రీపాపఘ్ని దేవి అనుగ్రహం వల్ల సారమా మహర్షులు తెలియజేశారు. యోగాలు పలు రకాలు. అమృతయోగం, సిద్ధయోగం, మరణయోగం, ప్రబాలరిష్ట యోగం అని యోగులు పలురకాలు. వారం, తిథి, నక్షత్రం, యోగం, కరణం ఈ అయిదు కలిగిన పంచాంగంలో (పంచ అంగం = పంచ భాగాలు) యోగాలను గురించి విశిష్టమైన వివరాలను సారమా మహర్షులు అందించారు. ఇవి కాక దేహంలోని ప్రతి అంగము చేసే పాపానికి ప్రాయశ్చిత్త పద్ధతులను కూడా తెలియజేశారు.
బోగర్ : దేహంలోని అంగాలు చేసే పాపాలు తొలగే మార్గాలను చూపెడితే మానవ లోకానికి అది పెద్ద బహుమానమే అవుతుంది కదా గురువర్యా?
అగస్త్యులు : వాస్తవమే! ఇలాంటి ప్రాయశ్చిత్త పద్ధతులు పొందటానికి సారమా మహర్షులు పలు కోట్ల సంవత్సరాలు తపస్సు చేసి దేహ శక్తిని పొందిన ఆయన తన దేహాన్ని చొక్కావలె జీవుడి నుండి వేరు చేసినప్పుడు, ఆ దేహాన్ని అగ్నిదేవుడు సైతం కాల్చలేక దిగ్భాంతి చెందారంటే స్పటికమైన ఆయన శరీర ఉన్నతి గురించి ఏమని వర్ణించగలం! కనుకనే శ్రీఆయుర్దేవి జీవ రహస్యంలా సారమా మహర్షులను తన హస్తంలో కొలువుదీర్చారు.
రోగాన్ని నయంచేసే యోగదానాలు |
పాపం చేసే అంగం |
పాపం వల్ల వచ్చేరోగాలు, దోషాలు, శాపాలు |
పరిహారం చేయాల్సిన యోగసమయం |
నైవేద్యం, దానం |
పూజించాల్సిన ఆలయం, మూర్తి (మూర్తికి చెందిన గాయత్రీ జపంతో |
శిరస్సు |
తండ్రికి తద్దినం చేయని దోషాలు |
విషకంభ |
పిట్టు |
హయగ్రీవుడు |
నేత్రం |
కంటిపొర, పుండు వంటి రోగాలు |
ప్రీతి |
పాల తాలికలు |
దత్తాత్రేయుడు |
చెవి |
చెవియొగ్గి వినే అలవాటు, వినికిడి రోగాలు |
ఆయుష్మాన్ |
వడ |
వరాహస్వామి |
ముక్కు |
స్వాస కోశరోగాలు |
సౌభాగ్య |
ఇడియాప్పం |
త్రివిక్రమస్వామి |
పెదవి |
పెదవి, నోటి రోగాలు(కేన్సర్),అసత్య దోషం |
శోభన |
పాయసం |
శ్రీరాముడు |
చెంప |
అన్నదోషాలు, శత్రువుల వల్ల కష్టాలు |
అతికండ |
క్షీరాన్నం |
శ్రీకృష్ణుడు |
చేతులు |
వాత రోగాలు, నరాల వ్యాధులు |
సుకర్మ |
రాగి రొట్టె |
శ్రీనరసింహస్వామి |
భుజాలు |
కీళ్ల నొప్పులు |
తృతి |
గోధుమ పలహారం |
కేశవుడు |
రొమ్ము |
మానసిక వ్యాధులు |
శూల |
మురుక్కు |
సుదర్శనుడు |
ఉదరం |
గర్భసంబంధిత రోగాలు |
కండ |
కొబ్బరి అన్నం |
గురు పాదుక నమస్కారం |
నడుము |
ఇతరుల ఆస్తుల అపహరణ వల్ల వచ్చే తీవ్రపాపాలు |
వృద్ది |
దోసె |
శంకరనాధుడు |
పొత్తి కడుపు |
కురచ దుస్తుల ధరిస్తే కలిగే మానభంగాలు |
ధృవ |
మోదకం, అన్నం |
గణేశుడు |
తొడ |
స్నేహితులకు ద్రోహం చేయడం |
వ్యగత |
మిరియాల పొడి |
మురుగన్ |
మోకాలు |
అప్పులు |
హర్షణ |
వడ |
హనుమంతుడు |
పాదం |
అవమర్యాద, ఇతరుల ఎదుట అవమానపడుట |
వజ్ర |
పెరుగన్నం |
దామోదరడు |
వెన్నెముక |
పుష్టరోగాలు |
సిద్ది |
పులిహోర |
పురుషోత్తముడు |
వీపు |
అనాథగా మారటం, పిల్లలచేత నిరాదరణకు గురికావడం |
వ్యతపత |
నల్లేరు ఊరపిండి అన్నం |
శరభేశ్వరుడు |
వెనుక కంఠం |
శిశు వ్యాధులు |
వరీయాన్ |
నిమ్మపులుసు అన్నం |
ప్రత్యంకరా దేవి |
పుష్టం(ఆసనం) |
పదవీచ్యుతి |
పరిఘ |
శెనగ ఉండ |
చిన్నమస్తా దేవి |
పురుషాంగం |
ఆస్తులు కోల్పోవడం |
శివ |
ముడిశెనగల అన్నం |
కార్త్యాయన ఋషి |
స్త్రీ యోని |
పిత్త, మైకపు రోగాలు |
సిద్ధ |
చిక్కుడుకాయల అన్నం |
విజయా దేవి |
రోమం |
కార్యాలయంలో ఇతరులవల్ల కష్టాలు |
సాధ్య |
పప్పన్నం |
సరస్వతి |
గోరు |
దాహ రోగాలు, హృదయ రోగాలు |
శుభ |
అటుకుల ఉప్మా |
గాయత్రి |
కనురెప్ప |
పిల్లల క్రమశిక్షణారాహిత్యం |
శుక్ల |
లడ్డు |
లలితా |
కనుబొమ్మ |
భర్తకు పెనుముప్పు |
బ్రహ్మ |
జిలేబీ |
బ్రాంరాంబికా |
బొడ్డు |
కంటిచూపు మాంద్యపురోగాలు |
ఇంద్ర |
అనుముల అన్నం |
మహేశ్వరి |
నుదురు |
భర్త ఆయుష్షు తరుగుదల |
వైధృతి |
పోళి |
వైదీశ్వరాలయం |
శ్రీపాపఘ్ని దేవి పూజ
పులిప్పాణి : శ్రీపాపఘ్ని దేవిని ఎలా పూజించాలి గురుదేవా?
అగస్తుల్యు : షష్ఠి తిథిలో ఆలయంలో పశువుకు అగత్తి కూరాకు ఆహారంగా పెట్టి నమస్కరించాలి. నవరాత్రి షష్ఠి తిథిలో ఆరేళ్ల బాలికకు అలంకారం చేసి కొత్త దుస్తులు ధరింపజేసి ఆభరణాలు పెట్టి నమస్కరిస్తే శ్రీపాపఘ్ని దేవి సంతసించి అనుగ్రహిస్తుంది.
అంగహీనం ఉన్నవారికి
బోగర్ : అంగహీనం వున్నవారికి ఏదైనా మార్గం చూపబడిందా గురుదేవా?
అగస్త్యులు : వీరు తమ జీవనకాలం అందటా సారమా మహర్షిని గురువుగా కీర్తించి స్తుతిస్తే తగు ఫలితాలు లభిస్తాయి. శ్రీసారమా మహిర్షిని ఆరాధించిన వారికి పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో అంగహీనం నయమైన అద్భుతం జరిగింది. అంగహీనులు సమాజంలో పలు వర్గాలలో ఉన్నారు. వారు తమకు ఏ అంగం లోపంగా ఉందో దానికి సంబంధించిన సారమా మహర్షులు అందించిన పరిహారం, దాన ధర్మాలు చేస్తే దైవానుగ్రహంతో మంచి జరుగుతుంది. ఎవరూ తలంచి చూడని అద్భుతమైన మార్గంలో సారమా మహర్షులు తన తపోఫలితాలను ప్రజలకు సమర్పించినందున శ్రీ ఆయుర్దేవి కరకమలాలో ఒకదాని కొలువై వున్నారు.
శ్రీఆయుర్దేవి తృతీయ వామహస్తం
శ్రీఅస్తీక సిద్ధపురుషులు
బోగర్ : మన సిద్ధపురుషుల పారంపర్యంలో సకల కోటి నాగలోకాలకు నాయకుడిగా విరాజిల్లు శ్రీ అస్తీక సిద్ధులు శ్రీ ఆయుర్దేవి తృతీయ వామహస్తమున కొలువై అనుగ్రహిస్తున్నారు కదా. ఆయన మహిమలు వివరించండి గురుదేవా.
అగస్త్యులు : అస్తీక సిద్ధులు మానవుడి జీవితంలో పలు అంశాలలో నిర్వర్తించాల్సిన సులువైన జీవన మార్గాలను రూపొందించారు. సప్తమి తిథిలో శ్రీపుణ్యాదేవి అనే అమ్మవారిని ఆరాధించి అత్యద్భుత వరాలను పొంది వాటిని ప్రజల అవసరాలకు అర్పించి అనుగ్రహిస్తున్నారు.
బోగర్ : గురుదేవా! పాము అంటే పదాతి దళం వణకిపోతుంది కదా. ఈ పాము విషయంలో ఎలాంటి మానవుడైనా భయమొందుతాడు కదా! దీనికి నాగభూషణాలకు అధిపతియైన శ్రీఅస్తీక సిద్ధులు కవచం లాగా కాపాడుతుంటారు కదా!
పాము భయం తొలగాలంటే..
అగస్త్యులు : వాస్తవమే. నాగపాము సైతం భగవంతుడు సృష్టించిన ఓ జంతువే. దాని మార్గాన దానిని విడిచిపెట్టాలి. దారిలో కనబడితే 'శ్రీఅస్తీకా, అస్తీకా' అనడమో లేక 'అస్తీక సిద్ధాయ నమః' అంటూ శ్రీఅస్తీక సిద్ధపురుషుడిని ఆహ్వానించేలా స్తుతిస్తే ఎలాంటి విషపూరితమైన పామైనా అడ్డుతొలగుతుంది. కాటువేయదు. ఇది ఆధ్యాత్మిక రహస్యాన్ని మానవలోకానికి ఎలుగెత్తి చాటించి వారిలోని భయాన్ని తొలగించెదరు గాక! అస్తీకా అభయం అంటే ఎలాంటి పాము కాటువేయదు. ఇది దైవ నియతి.
పులిప్పాణి : సద్గురువర్యా! పలు కుటుంబాలు నాగ దోషం వల్ల సంతాన భాగ్యం లేకుండా, వైవాహిక అడ్డంకులతో బాధపడుతున్నారు కదా. దీనికి శ్రీ అస్తీక సిద్ధులు పరిహార పద్ధతులేమైనా సూచించారా?
నాగదోష నివారణ |
అగస్త్యులు : ఒక్కో నక్షత్రానికీ ఒక నాగదేవత ఉంటుంది. ఆయా నక్షత్రాలవారికి ఏర్పడే నాగదోషం వల్ల పలు రోగాలు, బాధలు కలుగుతాయి. దీనికి పరిహారంగా చెట్టుకింద వున్న పాముపుట్టలో ఆయా నక్షత్రాల రోజున పాలను పోస్తే ఎలాంటి నాగదోషమైనా ఇట్టే తొలగిపోతుంది. ఇలాంటి 27 రకాల నక్షత్రాల వల్మీక (పుట్ట) అభిషేకాలు గురించి ఆధ్యాత్మిక వివరణాలను శ్రీపుణ్యాదేవి నుండి పొంది ప్రజల సంక్షేమం కోసం అందించారు శ్రీ అస్తీక సిద్ధపురుషులు. నాగరాజు, నాగవళ్లి, నాగరత్నం, నాగలక్ష్మి అనే పేర్లున్నవారు ప్రతిదినం శ్రీ అస్తీక సిద్ధులను పూజించాలి. వారి నక్షత్రాలకు సంబంధించిన రోజున నాగదేవిని జపించటం శ్రేయోదాయకం.
బోగర్ : నాగదోషం మహిళలకు మాత్రమే కలుగటానికి కారణమేమిటి గురుదేవా?
అగస్త్యులు : అలాంటిదేమీ లేదు బోగా! స్త్రీపురుషులకిరువురికీ పలు నాగదోషాలు ఏర్పడతాయి. అయినా కలియుగంలో మహిళలు పురుషులతో సరిసమానమైన హక్కులు పొందకపోవడం వల్ల వనితలకు పెళ్లి చేయడమే ఓ పెద్ద యాగంలా మారింది. మహిళలకు నాగదోషం ఏర్పడినప్పుడు వారి వివాహాలకు ఆటంకాలు, సంతానలేమితో బాధపడటం వల్ల నాగదోషం పెద్ద సమస్యగా పరిణమించింది. నాగదోషానికి శ్రీఅస్తీక సిద్ధులు తెలిపిన పరిహార పద్ధతులు అతిఅద్భుతదేవ ప్రీతినిచ్చే పరిహారాలు. భూలోకంలోనే కాదు ఊర్థ్వలోకాలలోను శ్రీఅస్తీకసిద్ధుల పరిహార ప్రాయశ్చిత్తములు ఆయాలోకవాసులకు ఎంతో సాయపడుతున్నాయి.
మగువల నాగదోషాల నివృత్తికి...
నాగదోషాలు స్త్రీలకే అధికంగా కలుగుతాయనటం ఒకింత వాస్తవమే. పురుషులకు నాగదోషం ఏర్పడి ఆయుర్ భంగం కలుగుతుంది. పతివ్రతా శిరోమణులైన మహిళలు మగవారి నుండి నాగదోషాన్ని పొంది వాటివల్లే కలిగే కష్టాలను అనుభవించి త్యాగశీలురవుతుండటం ఆనవాయితీ. కనుక మగవారికి ఏర్పడే నాగదోషాలు అంతగా వెలుగులోకి రావు.
పరీక్షిత్తు మహరాజుల నాగదోష నివృత్తి
అర్జునుడి మనుమడు పరీక్షిత్తు మహరాజు పాండవకులంలో చిట్టచివరి వారసుడు. అతడి కుమారుడే జనమేజయుడు. పరీక్షిత్తు మహారాజు అరణ్యంలో వేటాడి అలసిపోయి దాహార్తి కోసం సమీపంలో ఉన్న శమీక మునుల ఆశ్రమానికి వెళ్లాడు. ధ్యానంలో ఉన్న మునిని చూసి తనను పట్టించుకోలేదన్న కోపంతో ఓ మృతసర్పాన్ని ఆ ముని మెడలో వేసి తన రాజ్యానికి చేరుకుంటాడు పరీక్షిత్తు. ఆ ముని కుమారుడు సింగి, తన తండ్రి మెడలో చచ్చిన పాము మాలగా ఉండటాన్ని చూసి ఆగ్రహం చెంది 'ఈ అధర్మపు కార్యానికి పాల్పడివారు ఏడు రోజుల్లో పాముకాటుకు గురై మృతి నొందును గాక!' అంటూ ఘోర శాపమిచ్చాడు.
ధ్యానం నుండి లేచిన శమీక ముని జరిగిన సంగతి తెలుసుకుని చింతించాడు. కొడుకుని మందలించాడు. 'ఎంత పనిచేశావు సింగా? ధార్మిక పద్ధతిలో పరిపాలన సాగించే పరీక్షిత్తు వన్యమృగాల బారి నుండి కంటికి రెప్పలా కాపాడాల్సిన మనమే వారి మరణం ఆశించడం ఘోరతప్పిదం కదా' అని అన్నారు. తండ్రీకొడుకులు రాజమందిరానికి వెళ్లి జరిగిన విషయాన్ని వివరించారు. ఆగ్రహంతో తాను చేసిన తప్పిదానికి సింగి శాపం సరైన దండనే అని గ్రహించిన పరీక్షిత్తు మహరాజు తన జీవితంలో మిగిలిన ఏడు రోజులను భగవన్నామ స్మరణలో గడిపి తక్షకుడనే పామును ఎదుర్కొని మరణాన్ని పొంది సద్గతి నొందాడు.
శ్రీ అస్తీక సిద్ధుల విజయం |
పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు ఉత్తుంగుడు అనే ఋషి సలహా మేరకు తండ్రిని చంపిన నాగుపాముపై కక్ష గట్టి సర్పయాగం నిర్వహించాడు. ఉత్తుంగ మహర్షి మంత్రనాదాలకు కట్టుబడి సర్వలోకాల నుండి నాగలోకాల నుండి కోటాకోట్ల సంఖ్యలో సర్పాలన్నీ ఆ యాగగుండంలో పడి మరణించాయి. ఇక చివరగా మిగిలిన తక్షకుడనే సర్పరాజు దేవేంద్రుడిని ఆశయ్రించాడు. అయితే ఉత్తుంగ మహిర్షి మంత్రనాదం దేవేంద్రలోకానికి పాకి తక్షకుడే కాక ఇంద్రుని సైతం లాగిపడేలా చేసింది.
పరిహారం కోసం సకలదేవతలు శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు. ప్రపంచంలోని నాగదైవాలన్నింటికీ శివగురువు శ్రీఅస్తీక సిద్ధపురుషులే కనుక ఆ మహాపురుషుని శరణుజొచ్చి ప్రాధేయపడండి అంటూ మహావిష్ణువు సలహా ఇచ్చారు. ఆ ప్రకారం దేవతలంతా శ్రీఅస్తీక సిద్ధులను వేడుకున్నారు. ఆలోపున జనమేజయుడు, ఉత్తుంగుడు సైతం ఆ యాగ తీవ్రతను చూసి భీతిల్లి అస్తీక సిద్ధపురుషులను ధ్యానించి 'స్వామీ ఏమి చేయాలో తెలియక నిర్గతిలో ఉన్నాం కాపాడమంటూ వేడుకున్నారు.
వెంటనే శ్రీఅస్తీక సిద్ధపురుషులవారు ఆ యాగ గుండంలో ప్రత్యక్షమయ్యారు. అందరూ ఆయనకు చేతులెతి నమస్కరించారు. సాష్టాంగ ప్రణామములూ చేశారు. 'ఓం శ్రీ అస్తీక సిద్ధరాయ నమః' అని లోకమంతా శ్రీఅస్తీక నామం ప్రతిధ్వనించేలా దేవాది దేవతలంతా నినదిస్తూ దర్శించారు. పలు కోట్ల యుగాలకు ఒక మారు తపస్సు నుండి వెలువడే శ్రీ అస్తీక సిద్ధుల తేజోమయమైన రూప దర్శనమే అద్భుతమైన సర్వలోక, సర్వదుఃఖములను నివారించే జ్యోతి స్వరూపంమది. జనమేజయులు, ఉత్తంగులు అస్తీకుల దేహ కాంతిని తిలకించి శాంతచిత్తులై సర్పయాగాన్ని ముగించారు.
శ్రీ అస్తీక సిద్ధులు
శ్రీఅస్తీక సిద్ధుల 'సర్పశాంతి' అనే మూలికను రహస్యమైన 'సర్పరక్షక' మంత్రం పఠించి పూర్ణ ఆహుతిగా హోమం నుండి అగ్నిలో భస్మమైన కోటానుకోట్ల నాగరాజులు నాగ దేవతలు ప్రాణమొంది అందరినీ నమస్కరించి వారి వారి లోకాలు తరలి వెళ్ళారు. అస్తీకులు తమకు పునర్జీవనం ప్రసాదించినందున అన్ని నాగరాజులు నాగదేవతలు 'ఈనాటి నుండి శ్రీఅస్తీకులను స్మరించేవారిని మేము కాటు వేయము గాక' అని సత్య ప్రమాణం చేశారు.
'జనమేజయా! నీ తండ్రి పరీక్షిత్తు మహారాజును చూడుము' అని శ్రీఅస్తీక సిద్ధులు ఊర్థ్వలోకం కేసి చూపెట్టారు. అక్కడ ధర్మరాజు సహా పంచపాండవులు, అభిమన్యుల సమేతంగా పరీక్షిత్తు ఆనందంగా కబుర్లాడుతుండగా శ్రీకృష్ణ పరమాత్మ ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోతుండటం కనిపించింది.
జనమేజయా! తక్షకుడనే సర్పం కాటువేయడం ఓ దైవీక లీల మాత్రమే! కనుకనే ఓ ఉద్వేగంతో పరీక్షిత్తు మహారాజు శ్రీశుకమహర్షిచేత శ్రీభాగవత స్మరణం చేసి ప్రస్తుతం నీవు చూస్తున్న అత్యద్భుత లోకంలో శ్రీకృష్ణుడితో ఆశీనులయ్యే భాగ్యమూ పొందారు.' ఈ విధంగా అస్తీక సిద్ధులు వివరిస్తుండగా జనమేజయులు తన్నుతాను మరచిపోయారు. సిద్ధుల వాక్కుచేత అందరికీ ఓ అద్భుత సమాధి స్థితి కలిగింది.
మహిళల త్యాగ గుణం
శ్రీఅస్తీక సిద్ధులు మహరాజును ఆలింగనం చేసుకును 'జనమేజయా! నీకిప్పుడు మరో పరీక్ష! అనవసరంగా సర్పయాగం చేసి నాగదోషములను పొందావు. రాజు దోషాలు ప్రజలకూ కలుగుతాయి. నీ ప్రజలు నీ పాపాలను స్వీకరిస్తే నీ దోషాలు నివృత్తి అవుతాయి' అని తెలిపారు.
లక్షలాదిమంది యువతీయువకులు గుమికూడి 'మా మహారాజుగారి పాపములన్నింటినీ మేము స్వీకరిస్తాం' అని ఎలుగెత్తి నినాదాలు చేశారు. శ్రీఅస్తీక సిద్ధులు వారి మనోభావాలను పరిశీలించి చూశాడు. ఆ తర్వాత 'జనమేజయా! నీ ప్రజలలో మహిళా లోకమే ముఖ్యంగా యువతులు నీ పాపాలను మనసారా స్వీకరించేందుకు అంగీకరిస్తున్నారు. కనుక మానవలోకంలో మహిళలు శ్రేష్టులు. వీరి పూజాఫలాలు వారి భర్తల నాగదోషాలను తొలగించే శక్తిగా మారుతాయి. నాగదేవత పూజలను నేటి నుండి మహిళలకే పరిమితం చేస్తున్నాను. ఈ నాగపూజ సకల ఐశ్వర్యాలను ప్రాప్తింపజేస్తాయి' అని వరముల నొసగారు.
ఈ విధంగా జనమేజయుడికి కలగాల్సిన నాగదోషం మహిళలకు కలిగి, ఈయన అనుగ్రహించిన నాగదోష నివారణ పద్ధతులను మెచ్చుకుని శ్రీఆయుర్దేవి తన హస్తంలో స్థానం కల్పించారు.
శ్రీఅస్తీక సిద్ధపురుషులు అనుగ్రహించిన నాగదోష నివారణ పద్ధతులు |
జన్మ నక్షత్రం |
పూజించాల్సిన |
పూజించాల్సిన |
పాలను పోయాల్సిన |
ఫలితం |
అశ్విని |
సరస్వతి |
సర్పరిగన్ |
తూర్పు |
మాంగళ్యల శూక్ష్మ దోష నివృత్తి |
భరణి |
దుర్గ |
వాసుఖి |
పడమర |
రుతుస్రావ రోగ నివారణ |
కృత్తిక |
అగ్ని |
దక్షకన్ |
దక్షీణం |
సకమ్రంగా రుతు స్రావం కలుగును |
రోహిణి |
బ్రహ్మ |
సంగపాలన్ |
ఉత్తరం |
దంపతుల నడుమ మనస్థాపాలు తొలగును |
మృగశిర |
చంద్రుడు |
మదిమదన్ |
ఆగ్నేయం |
భర్త బుద్ధిహీనత వల్ల కలిగే కష్టాలు తొలగును |
ఆరుద్ర |
రుద్రుడు |
కార్కోడకన్ |
ఈశాన్యం |
పిల్లల రోగాలు నయమగును |
పునర్వసు |
దేవులు |
ధనంజయన్ |
నైరుతి |
స్నేహితుల వల్ల కలిగే కష్టాలు తొలగును |
పుష్యమి |
వ్యాళన్ |
ఖులిగన్ |
వాయవ్యం |
కొడుకు, కుమార్తె బాధ్యతలు నిర్వర్తించగలుగుతారు |
అశ్లేష |
ఆదిశేషన్ |
ఆదిశేషన్ |
రావిచెట్టు వద్ద వల్మీకం |
వదినె ద్వారా కుటుంబ సమస్యలు తీరుతాయి |
మఖ |
శుక్రుడు |
పదుమన్ |
బిల్వవృక్షం వద్ద వల్మీకం |
విడిపోయిన దంపతులు ఒక్కటవుతారు |
పూర్వఫల్గుణి |
పార్వతి |
మహాపదుమన్ |
మఱ్ఱిచెట్టు వద్ద వల్మీకం |
కన్యకా దోష నివృత్తి, పెళ్లి ఆటంకాలు తొలగుతాయి |
ఉత్తర |
సాత్తాన్ |
సామతంతన్ |
వేపచెట్టు వద్ద వల్మీకం |
అమ్మ, మశూచి రోగాలు తొలగుతాయి. |
హస్త |
సూర్యుడు |
వాస్మరుదం |
అమ్మవారి గుడి వల్మీకం |
లికోడర్మా, చర్మవ్యాధులు తొలగుతాయి |
చిత్త |
విశ్వకర్మా |
విజయన్ |
మురుగన్ గుడి వల్మీకం |
పోయిన సొత్తు తిరిగి చేతికందుతుంది |
స్వాతి |
లక్ష్మి |
లవణం |
మునీశ్వర గుడి వల్మీకం |
గాలి, శేష్ట వ్యాధులు నయమవును |
విశాఖ |
సుభ్రమణ్యుడు |
షష్టికన్ |
కొలను సమీప వాల్మీకం |
చాలకాలంగా లభించని పని దొరుకును |
అనురాధ |
వాయు |
విమలుడు |
ఎల్లయమ్మన్ గుడి వల్మీకం |
వాయు, వాత వ్యాధులు తొలగుతాయి |
జ్యేష్ట |
దేవేంద్రుడు |
సంచణన్ |
కొండమీది వాల్మీకం |
జ్యేష్ట నక్షత్ర యువతుల ఆశలు తీరును |
మూల |
కందన్ |
అసురాదికుడు |
శివాలయ వల్మీకం |
జీవితంలో ఆకస్మిక అభివృద్ధి కలుగును |
పూర్వాషాఢ |
వరుణుడు |
కారుణుడు |
అమ్మ గుడి ఎడమవైపు వల్మీకం |
సంతోషదాయక జీవితం కలుగును |
ఉత్తరాషాఢ |
గణపతి |
గంబీరుడు |
అమ్మ గుడి కుడివైపు వల్మీకం |
మందబుద్ధులు నిశాగ్రబుద్ధులుగా మారుతారు |
శ్రవణము |
విష్ణువు |
కాళింగుడు |
శివాలయ ఎడమవైపు వల్మీకం |
నిరంతర స్థాయి ఉద్యోగం లభించును |
ధనిష్ట |
ఇంద్రాణి |
ఇందుపాలుడు |
శివాలయ కుడివైపు వల్మీకం |
అయన, శయన సుఖాలు ప్రాప్తించును |
శతభిష |
యముడు |
పాశాలుడు |
సమాధి ఆలయ వల్మీకం |
మరణ భయాలు తొలగును |
పూర్వాభాద్ర |
కుబేరుడు |
జొలిపలన్ |
పొలం నడుమనున్న వల్మీకం |
ఋణాలు లేని సుఖమయ జీవనం ప్రాప్తించును |
ఉత్తరాభద్ర |
కామధేనువు |
థేనుపాలుడు |
వృక్షంతో కూడిన వల్మీకం |
పసిబిడ్డల కోసం చనుబాలు స్రవించును |
రేవతి |
శనీశ్వరుడు |
సంచితా |
సొరంగ వల్మీకం (మేల్మరువత్తూరు గుడిలో, తిరువెట్రియూరులో ఉంది) |
కన్నికా దోషం తొలగి సుఖమొందుతారు |
ఆయా నక్షత్రాలకు సంబంధించిన నాగదేవతల నామాలను స్తుతించి ఆయా దేవతామూర్తులకు పూజలు చేసి నిర్ణీత దిక్కున/వృక్షంలో ఆలయంలోగల పుట్టలలో నాగదేవతలకు పాలను పోసి మొక్కితే పైన పేర్కొన్న ఫలితాలు ప్రాప్తిస్తాయి.
శ్రీఆయుర్దేవి చతుర్థ వామహస్తం
శ్రీకార్గిణీదేవి శ్రీసంవర్దర్
శ్రీఆయుర్దేవి చతుర్థ వామహస్తంలో శ్రీకార్గిణీదేవి అనే సిద్ధకుల మహర్షిణి శ్రీసంవర్థరుడనే జ్ఞాని కొలువై అనుగ్రహిస్తున్నారు.
పులిప్పాణి : ఓ సిద్ధ కుల మహిళామణి శ్రీఆయుర్దేవి కరపీఠంలో కొలువుకావడం మహిళాలోకాన్ని ఉన్నతస్థితికి తీసుకెళ్లుతున్నది కదా గురుదేవా?
అగస్త్యులు : ఆడ, మగ అనే బేధాలు, జ్ఞానులు, యోగులు, సిద్ధులపరంగా లేవు. ఇక సాధారణ మానవుడు పలు ఉన్నత ఆధ్యాత్మిక స్థితులకు చేరాలంటే ఆడ మగ అనే బేధాలను విస్మరించాలి. అంగమూ అందమూ ఆడ మగ అని విభజించి తెలుపునది విజ్ఞానపూర్వ తత్త్వం. అయితే ఆధ్యాత్మికంలో ఆడ, మగ వివరణలు వేరుగా ఉంటున్నది. ఇక్కడే శక్తి తత్త్వం వాడుకలోకి వస్తోంది.
ఎద్దుల బండి, గుర్రపు బండి, విద్యుత్ బండి వీటిలో శక్తి ఎలా వేర్వేరుగా ఉంటుందో అదే రీతిలో పురుషశక్తి, స్త్రీ శక్తి అనే రెండు శక్తులే ఉంటాయి. దేవి ఆరాధనలో ఇవి రెండు సంగమవుతాయి. ఈ వాస్తవాన్ని శక్తి సంగమాలలోనే దైవీక శక్తి పుడుతుంది. కనుక శక్తి యొక్క వేర్వేరు రకాలే పురుషశక్తి, స్త్రీ శక్తి అని భావించాల్సి ఉంటుంది. ఆడ, మగ అనే వైరుధ్యాలు లేవు.
బోగర్ : దేవి ఉపాసన స్త్రీ, పురుషులిర్వురికీ చాలా ముఖ్యం కదా గురుదేవా?
ఆడ, మగ వైరుధ్యం
అగస్త్యులు : అవును! దేవీ ఉపాసన పురుషుడు చేపట్టినప్పుడు అతడు కాలక్రమంలో వావివరుసలు లేని కామాన్ని విడిచిపెట్టి, స్త్రీ జాతిని పరిపూర్ణమైన దైవ సృష్టి అనే భావనకు చేరుకుంటాడు. అంటే స్త్రీ శక్తి ప్రాధాన్యతలను తెలుసుకోగలుగుతాడు. వీటిని తెలుసుకున్నాక ఆ దేవి ఉపాసన ఫలితంగా శ్రీఅఖిలాండేశ్వరి, పురుషశక్తి, స్త్రీ శక్తి సంగమాన్ని అర్థంచేసుకుని దానిని దైవీక శక్తిగా మార్చి ఆ పరమాత్ముడి దర్శనం లభింపచేస్తుంది.
శ్రీ కార్గిని దేవి శ్రీ సంవర్దర్
దేవీ ఉపాసనను నిర్వహించే ఓ మహిళ, పురుష శక్తి మహిమను తెలుసుకుని తన భర్తను శరణుజొచ్చితే శ్రీఅఖిలాండేశ్వరియే ఆమెకు పురుష, స్త్రీ శక్తులను సంగమింపజేసి భర్తను దైవంగా చూపెడుతుంది.
బోగర్ : దీనిని కలియుగపు స్త్రీ పురుషులు తెలుసుకోవాలి కదా గురుదేవా?
అగస్త్యులు : నేను తెలిపినవన్నీ కలియుగ మానవులకు అనుగ్రహించిన అమ్మవారే శ్రీ కార్గిణి అనే మహిళా సన్న్యాసిని శ్రీ కార్గి అని పిలువబడే ఈమె అష్టమి తిథి రోజులలో శ్రీ బ్రహ్మచారిని అనే దేవిని స్తుతించి అనుగ్రహం పొందిన సిద్ధ దేవి ఆమె. అవతార పురుషులు కూడా నాగదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందలేదు. అయితే కార్గిణి శ్రీబ్రహ్మచారిణి దేవికైన సకలకోటి నాగదేవతలను ఉపాసించి వాటి అనుగ్రహం పొందింది.
శ్రీకార్గిణిదేవి మహిళాలోకం అనుభవించే దుఃఖాలకు నివృత్తి పద్ధతులను అన్వేషించి పలు కోట్ల సంవత్సరాలు కాసింత పాలను మాత్రమే సేవించి తపమాచరించింది. శ్రీకార్గిణిదేవియే, కార్గిణి సన్న్యాసిని, కార్గి బ్రహ్మచారిణిదేవి అనే పలు నామాలలో పిలువబడుతోంది. తాను ఆరాధించిన దేవియైన శ్రీబ్రహ్మచారిణి దేవియొక్క తిరునామంతో శ్రీకార్గిణి బ్రహ్మచారిణి అనే సిద్ధజ్ఞానిగా పిలువబడుతోంది.
అమృత కలశ మహిమ
కార్గిణిదేవి, శ్రీబ్రహ్మచారిణి దేవిని ధ్యానించి పలు కోట్ల యుగాలు తపమాచరించింది కదా! ఒక్కో మహా ప్రళయ అంతమున క్షీరసాగరమనే పాలకడలిలో శయనించిన శ్రీరంగనాధుడు పొర్లి పడుకున్న దిశ మార్చి కరయోగ స్థితులను కూడుకుని నిదురపోతారు. ఆ కదలికల వల్ల చెదిరే పాలకడలి యొక్క అత్యద్భుత పాలచుక్కలు నిర్ణీతమైన కొందరికే చేరుతుంది. అది కూడా శ్రీరంగనాధులు ఇష్టపడే జీవులకు అవి చేరుతాయి. అందునా శ్రీబ్రహ్మచారిణి దేవిని ఉపాసించేవారికి క్షీరసాగరపు పాలచుక్కులు సునాయాసంగా లభిస్తాయి
అద్భుత అమృతం
ఇలా పలుకోట్ల యుగాలలో శ్రీకార్గిదేవి పూర్ణమైన పాలకడలి పవిత్ర క్షీరపు చుక్కలు ప్రాప్తించాయి. దీనితో ఆమె ఉదరం కలశంలా పెద్దదై సకల లోకాలలోని మహిళా జీవులందరికి అనుగ్రహించింది. ఈ ఉదర కలశాన్ని శ్రీఆయుర్దేవి తన పవిత్ర హస్తంలో మోయగా అది అమృత కలశంగా మారింది. శ్రీ కార్గిణియే శ్రీఆయుర్దేవి పవిత్రహస్తంలో అమృత కలశంగా మారింది. శ్రీఆయుర్దేవి చతుర్థ వామహస్తంలో వెలుగొందుతున్నదీ అమృతకలశం. పాలకడలిలో ఆవిర్భవించి అమృతం కంటే మునుపటిది.
దేవతలు, అసురులు ఈ అమృత కలశాన్ని పొందటానికి ఆరాటపడ్డారు. పలుకోట్ల యుగాలలో పలు అద్భుతమైన వరాలను పొందినా దానిని మహిళా లోకం కోసం త్యాగం చేసి సమర్పించిన కార్గిణి దేవి తపంతో సరితూగు తపస్సు చేసే వారికే ఈ అమృతకలశం మని మహేశ్వరుడు ఆజ్ఞాపించడంతో ఎవరూ పొందలేకపోయారు. దేవతలు, అసురులు కార్గిణి దేవిని ఆశ్రయించి ఆమె ఉపదేశించిన దానధర్మాలతో శ్రీబ్రహ్మచారిణి దేవిని ఉపాసించడంతో శ్రీదేవి వారి ఎదుట ప్రత్యక్షమై 'శ్రీఆయుర్దేవి ఎనిమిదో హస్తంలో కొలువైన అనుగ్రహిస్తున్న అమృత కలశపు స్త్రీ కులస్థులకు అద్భుత సేవలు చేసే తపోశీలురకే దక్కుతుంది.
అయినా మీకు అమృతం కావాలంటే దానిని పాలకడలి నుండి పొందే పద్ధతిని శ్రీ మహావిష్ణువు నుండి పొందెదరు గాక! ఈ అమృతానికి సరితూగునది స్వర్లోకాలలోనూ లభించదు' అని ప్రకటించి అంతర్థానమైంది. కనుక అమృతకలశంగా మారి అనుగ్రహిస్తున్న శ్రీకార్గిణిదేవిని మహిళలందరు పూజించి తమ కష్టాలకు పరిహారం పొంది సుఖజీవితం గడపాలి.
బోగర్ : గురుదేవా అమృతంగా మారిని శ్రీకార్గిణీదేవి ఎలా అనుగ్రహించారు?
అగస్త్యులు : శ్రీకార్గిణిదేవి గురు తత్త్వాన్ని దేవి ఉపాసన ద్వారా వివరించాలి అని శ్రీఆయుర్దేవిని ప్రార్థించగా శ్రీ ఆయుర్దేవి శ్రీబ్రహ్మచారిణి అభిలాషలను 'సంవర్థుడు' అనే జ్ఞాని ద్వారా విశేషంగా నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు.
శ్రీసంవృద్ధులు
సంవృద్ధులు అనే జ్ఞాని పలుకోట్ల సంవత్సరాలు, పలు లోకాలలో గురుకుల తత్త్వాన్ని వ్యాపింపజేశారు. గురుతత్త్వాన్ని సులువుగా ప్రజలకు బోధించేందుకు దేవి ఆరాధనే ఉన్నతమైనది అని తెలిసికొని అందుకు తగిన తరుణం కోసం ఎదురు చూడసాగారు. పలు యుగ కాలాలు తపస్సుచేసి సంవృద్ధుడు శ్రీకాల భైరవులను ఆశ్రయించాడు. శ్రీకాలభైరవుడు ప్రళయ కాలాన్ని నిర్ణయించే శివాంశమూర్తి ఆయన. ప్రపంచంలో ప్రతి క్షణ కాలం కాలభైరవుడు శ్వాసగాలుల వల్ల వాక్య పంచాంగంగా, గణితంగా, కాలనిర్ణయంగా వివరిస్తోంది. ఈయన అనుగ్రహం వల్లే శ్రీ సంవృద్ధుడు వంటి మహర్షులు ప్రళయంలోను బ్రతికి జీవించి పలు కోట్ల యుగాలపాటు గురు మహిమను విస్తరింపజేస్తున్నారు.
శ్రీశశి ప్రభా ఆరాధన
'సంవృద్ధుడా!
శశి ప్రభా అనే అంబికను అష్టమి రోజుల్లో ఆరాధించి వృషభానికి (ఎద్దుకు) అరటిపళ్లను దానం చేయాలి. నీ అష్టావక్ర వృషభ పరంపరలో వచ్చినందువల్ల నవరాత్రిలో ఎనిమిదోరోజు తిథిలో మా అంబిక యొక్క అనుగ్రహం పొందెదవు గాక!' అని అనుగ్రహించారు కాలభైరవులు. శ్రీ సంవృద్ధులు శ్రీ శశిప్రభా దేవిని 88 చతుర్ యుగాలపాటు అష్టమి తిథులలో ఆరాధించి దేవిని దర్శించగలిగారు. ఇప్పటి దాకా పలుకోట్ల యుగాల వరకూ గురు తత్త్వాన్ని వివరించి వస్తూండిన శ్రీసంవృద్ధులు గురు బ్రహ్మదేవలోక మర్యాదను పొందియున్నాం.
అయితే శశిప్రభా దేవినోట సద్గురు తత్త్వాన్ని వర్ణించినప్పుడు పలు కోట్ల యుగాలలో తాను అనుభవించినదానికంటే మరింతగా విశేషమైన అంశాలను శ్రీశశిప్రభా దేవి అనుగ్రహించింది కదా అని ఆశ్చర్యపోయారు. తాము నేర్చినది అణువంతే నని గ్రహించారు. శ్రీశశిప్రభాదేవి చిరునవ్వు నవ్వుతూ 'సంవృద్ధా! దేవి ఉపాసనలోనే దైవీక పరిపూర్ణతను చూడగలం. అయితే సద్గురువుల ఉపాసనలో సంపూర్ణతను పొందినవారు చాలా అరుదు.
ఎందుకంటే సద్గురువే తమ గురువుల విధివిధాలనాలను దేవి ఉపసాన ద్వారా అనుగ్రహిస్తున్నారు. తినగ తినగ చేదుకానిదే అమృతం. గురు అనుగ్రహమే ఆ అమృతం. అది పాలకడలిలలో రానున్న అమృతం కాదు. శ్రీఅఖిలాండేశ్వరిగా కొలువైన శ్రీఆయుర్దేవి ఎనిమిదో హస్తంలో వెలుగొందు అమృతకలశంలోని అమృతమే. నేను సూచించు ఆ ఉపాసన సంపూర్ణత్వాన్ని తెలియజేయునది అదియే. శ్రీదేవీ ఉపాసనలో పరిపూర్ణత్వం పొందడానికి శ్రీకార్గిణిదేవి నా అంశమైన శ్రీ బ్రహ్మచారిణిని ఆరాధించి ఉత్తమస్థితిని చేరుకున్నది.
ఆ అమృతాన్ని పొందినది ఆమె మాత్రమే! సద్గురువు ఉపాసనతోపాటు దైవీక సేవలు చేసి నా ఆరాధనలతోపాటు గురుతత్త్వాన్ని కూడా బోధించెదవు గాక! అని సంపూర్ణ ఆశీస్సులందిస్తున్నాను అని ప్రకటించింది.
గురువు - వివరణ
గురు పారంపర్యాలు, గురు వందన పద్ధతులు, గురు ఆరాధన పద్ధతులు, గురు పూర్ణిమ పూజా విధులు గురుకుల తత్త్వాలు గురు ఆరాధన క్షేత్రాలు గురు భగవానుల గ్రహదశాభుక్తులు వంటి గురు తత్త్వాలను శ్రీసంవృద్ధులు శ్రీశశిప్రభా వద్ద నేర్చుకోవడమే గాక పలుకోట్ల యుగాలలో ప్రచారం చేసి భృంగ వృషభ పరంపరలు పుట్టి లోకమంతటా సత్సంగాలు ఏర్పడేందుకు దోహదం చేశారు. కోటానుకోట్ల సత్సంగాలు నేడు భోలోకంలోనే కాదు భువర్లోకములోను సద్గురువుల అనుగ్రహాలు వ్యాపింపబడ్డాయి.
కలియుగంలో మానవుడు దైవాన్ని దర్శించడానికి ఉన్న మార్గాలు సద్గురువులు నిర్వహించే సత్సంగాలే. తమ తపోఫలితాలను సకల కోటి జీవులకు త్యాగం చేసి అద్భుత కార్యాలనొనర్చిన సంవృద్ధుని కూడా తన ఎనిమిదో హస్తంలో శ్రీకార్గిణిదేవితోపాటు చేర్చుకున్నదీ ఆయుర్దేవి. అమృతకలశంలోపలా వెలుపలా కాంతులు జిమ్మే పీఠాన్ని శ్రీసంవృద్ధులు పొంది ఉన్నారు. వీరి ఉపాసనే సద్గురువును మనకందించగలదు.
వీరి కృపాకటాక్షాల వల్లే నవరాత్రి అష్టమి తిథిలో భక్తిశ్రద్ధలతో పూజించేవారికి శ్రీఆయుర్దేవి అమృతపు అంశాలు గురు ఆశీర్వాదములుగా లభిస్తున్నాయి. కార్గిణిదేవి, సంవృద్ధ మహర్షుల అనుగ్రహిస్తున్న ఆయుర్దేవి హస్తముల ఆరాధన మహిళలకు సుఖదాయక జీవితాన్ని, అందరికీ గురువుల అనుగ్రహాన్ని కలిగించే మార్గాన్ని ప్రాప్తింపజేస్తుంది.
భోలోకాన తొలి సత్సంగం ఏర్పాటైన స్థలం చెన్నై తిరుముల్లైవాయిల్లో ఉన్న శ్రీమాసిలామణీశ్వర శివాలయమే. శ్రీసంవృద్ధులు శిష్యులుగా బృంగీశ్వర సిద్ధులు తొలి సత్సంగాన్ని ఈ ఆలయంలోనే పలుకోటి యుగాలకు ముందు ప్రారంభించారు. శ్రీసంవృద్ధులు, శ్రీబృంగీశ్వర సిద్ధుల పవిత్ర రూపాలు ఆ ఆలయంలోని స్తంభాలపై చెక్కబడి ఉన్నాయి. సద్గురువు పొందదలచినవారు ఈ ఆలయాన్ని తప్పక దర్శించి తీరాలి.
శ్రీకాల మహాప్రభువుల వాహనం
శ్రీఆయుర్దేవి పాదాలకు మొక్కి నిలిచే శ్రీయమధర్మరాజుగా కీర్తింపబడే కాలమహా ప్రభువులు శ్రీసుధర్ముడు అనే తిరునామం కూడా కలిగినవారు. ఈయన నచికేతుడికి అనుగ్రహించిన కఠోపనిషత్తులో మరణం తర్వాత ప్రారంభమయ్యే జీవితం గురించి ధర్మనియమాలు గురించి వివరించబడి ఉన్నది. వీరి వాహనమైన సువాలీనుడు అనే వృషభం అత్యద్భుత తపోఫలాలు కలిగినది.
శ్రీజ్ఞానేశ్వరి దివ్యచరిత్రలో 'ఈ వృషభాన్ని వేదం చెప్పేలా చేయగలమా?' అని ఊరి ప్రజలంతా అడిగినప్పుడు ఐదేళ్ల బాలుడైన శ్రీజ్ఞానేశ్వరులు ఆ వృషభాన్ని వృషభజీవ పరమాత్మ వాసంగా భావించి ప్రదక్షిణ చేసి కరములతో స్పర్శించి నమస్కరించి 'సువాలీన మహాప్రభువా! వేదం పఠించు' అని వేడుకున్నప్పుడు సువాలీనుడనే ఆ వృషభరాజం భువర్లోకవాసులంతా పుష్పవర్షం కురిపించేలా వేదాన్ని పఠించింది.
బోగర్ : సద్గురువర్యా! శ్రీజ్ఞానేశ్వరుల చరిత్రలో స్థానమొందుటకే శ్రీఆయుర్దేవి, సువాలీన మహాప్రభువులను భూలోకానికి వృషభంగా పంపినట్లున్నదే!
శ్రీకశవనంపట్టి సిద్ధులు
అగస్త్యులు : దిండుకల్ సమీపంలో కశవనంపట్టి గ్రామంలో అవధూతగా భాసిల్లుతున్న అత్యద్భుత అవధూత సిద్ధపురుషులైన 'వరుణా ఇష్ట దిగంబర సిద్ధులు (కశవనంపట్టి మౌన స్వాములు) మునుపటి జన్మలో శ్రీజ్ఞానేశ్వరుడిగా అనుగ్రహపాలనం చేశారన్నది పలువురికి తెలియని ఆధ్యాత్మిక రహస్యం. ఈయనే కశవనంపట్టి మౌనస్వాములు అని పిలువబడ్డారు.
శ్రీకశవనంపట్టి మౌనస్వాములు గురించి అగస్త్య గ్రంథ సంపుటమైన మా ప్రచురణ అయిన 'శ్రీఅగస్త్య విజయం' (మాసపత్రిక) ఆగస్టు, సెప్టెంబర్ 1993 సంచికలలో ప్రచురితమై ఉన్నాయి.
బగోర్ : కలియుగంలో దున్నపోతు అని అవహేళనగా పలికే ఆచారం ఉంది కదా గురుదేవా!
అగస్త్యులు : అది తప్పు బోగా! దేవుడు సృష్టించిన ప్రపంచంలో తేలు, పాము, నెమలి, మానవుడు, దేవతలలో సహా అన్ని జీవులలోను భగవంతుడు కొలువై యున్నాడు. దున్నపోతు అని హేళనగా దూషించినట్లయితే మరణ దోషాలు కలుగుతాయి. దీర్ఘకాలం పడకలోనే గడిపే రీతిలో మరణమూ కలుగుతుంది.
యముడివాహనమైన వృషభరాజానికి మఖనక్షత్రపు రోజున అగత్తి కూరను తినిపిస్తే రోగాలకు తావులేని సుఖమయ మరణం ప్రాప్తిస్తుంది. యమ భయంలేని మరణదేవతను చూడవచ్చు. ప్రపంచంలో మానవుడు మరణించడానికి మాత్రమే భయపడుతుంటాడు. ఆ యమభయం తొలగి, గుండెపోటు, వాహన ప్రమాదం, ఆత్మహత్య వంటి అశుభ మరణాలు కలుగకుండా చిరునవ్వుతో దైవచింతనతో మరణ దేవతను పూజించడానికి మఖ నక్షత్ర దినాన ఆ వృషభ ఆరాధన సాయపడుతుంది. ఇలాంటి సులువైన ఆరాధనలను సిద్ధపురుషులే కలియుగ మానవుల సంక్షేమం కోసం అందించారు.
పులిప్పాణి : సువాలీనుని ఆరాధించే పద్ధతి అంటూ ఉన్నదా గురువర్యా!
అగస్త్యులు : మఖ నక్షత్రంలో వృషభానికి అగత్తి కూరను సమర్పించడమే సువాలీన మహాప్రభువుల గురువైన కారడయాన్ కరట్టై అనే దైవ దేవతకు చేసే ఆరాధన. గురువును నమస్కరిస్తే శిష్యుడు సంతోషిస్తాడు కదా? వాహనం నడిపేవారు (drivers) సువాలీనుని ఆరాధించడం చాలా మంచిది. ప్రమాదాలు దరిచేరవు!
శ్రీఆయుర్దేవి పూజా విధానము |
కైలాస వాస మునుల పరంపరలోని 1001వ గురు మహా సన్నిధానం శక్తి శ్రీఅంకాళ పరమేశ్వరి అనుంగు భక్తులు శ్రీ-ల-శ్రీ వెంకటరామన్ స్వాములు తమ గురువులందించిన అనుగ్రహభాషణమిది. శ్రీఆయుర్దేవి పూజావిధానంలో కలశపూజతోను కలశం లేకుండా శ్రీఆయుర్దేవి చిత్రపటం, బింబం ఉంచి చేసే సాధారణమైన సులువైన పూజలున్నాయి.
పరాశక్తి అంశమైన శ్రీఆయుర్దేవి సకలసౌభాగ్యాలను, జ్ఞానాన్ని, అద్భుతమైన ఐశ్వర్యాలను అందించగల ప్రతక్ష్య దైవం. ఇలాంటి శ్రీఆయుర్దేవిని సక్రమమైన పద్ధతిలో పూజించడం కలియుగంలో అపరిమితంగా కలుగుతున్న దోషాలను, పాపాలను తొలగించి మంచి మార్గాలను పరిపూర్ణ శాంతిని భగవత్ కృపను అందించగలదు.
శ్రీ ఆయుర్దేవి ఉపాసన కలియుగంలో ఓ ఆధ్యాత్మిక రహస్యంగానే ఉంది. ఇలాంటి అపూర్వమైన పరశాక్తి అంశంగా భాసిల్లు శ్రీఆయుర్దేవి అద్భుత ఆకారాన్ని దైవావతార విశేషాలను, దేవి అంశాలను, కళ్యాణ గుణాలను, పూజా పద్ధతులను కలియుగ మానవులు పాటించడానికిగాను తమ గురుదేవులైన శ్రీ-ల-శ్రీ ఇడియాప్ప సిద్ధులు వారి గురుకులవాసంలో నేర్చినవాటిని ఎలుగెత్తిచాటినవారే కైలాస వాస మునుల పరంపరలోని 1001వ గురు మహా సన్నిధానం శక్తి శ్రీఅంకాళ పరమేశ్వరి అనుంగు భక్తులు శ్రీ-ల-శ్రీ వెంకటరామన్స్వాములు. శ్రీ-ల-శ్రీ స్వాములు వివరించిన శ్రీవ్యాస భగవానులు అనుగ్రహించిన శ్రీఆయుర్దేవి ఆరాధనను పాటించి ఇతరులకు తెలియజేసి అందరికీ ఆయుర్దేవి అనుగ్రహం కలిగింప చేయడమే మనందరి భాధ్యత!
నవరాత్రులలో శ్రీఆయుర్దేవి ఆరాధాన పలురెట్లు దైవానుగ్రహాన్ని ప్రాప్తింపచేస్తుంది. నిత్య ఆరాధన అమ్మవారి శ్రీపాదారవిందములకు మనల్ని చేర్చగలదు.
శ్రీఆయుర్దేవిని సాధారణంగా, కలశం ప్రతిష్టించి ఆరాధించవచ్చును. నవరాత్రులలో కలశపూజ చాలా విశేషదాయకం. తక్కిన రోజులలో చిత్రపటం పెట్టి సాధారణ పద్ధతులలో పూజించవచ్చును.
కలశం : వెండి కలశం, కంచుకలశం, రాగి కలశం, ఇత్తడి కలశం, మామిడి లేదా పనస కలపతో చేసి కలశం ఇవే పూజకు అనువైనవి.
కలశ అలంకారం : కలశాన్ని శుభ్రంగా కడిగి పుసుపు, కుంకుమ, చందనం పెట్టి, కలశంలో మామిడాకులు పెట్టి, ఆ ఆకుల నడుమ నారలు ఒలువని కొబ్బరిని ఉంచి, పూలతో అలంకరించాలి.
కలశ జల ద్రవ్యాలు : శుభ్రమైన నీటిని లేదా గంగాజలం వంటి పవిత్ర నదీజలాన్ని మూడు సార్లు వేడి చేసి బాగా చల్లార్చి కలశంలో పోయాలి. వెట్టివేర్లు, తులసి ఆకులు, వీటితో కాసింత పొడిచేసిన కడుక్కాయలు, ఏలకులు, సొంటిని కలశపు నీటిలో వేయాలి.
కలశస్థాపనం : అరటి ఆకును దక్షిణాభిముకంగా వేసి, దానిపై పచ్చి బియ్యాన్ని పరచి అందులో ఉంగరపు వేలితో 'ఉ' 'ఓం' అని రాసి కలశాన్ని పెట్టాలి. వీలయితే కలశానికి పసుపు వర్ణ వస్త్రాన్ని (రవిక, చీర) ధరింపజేయవచ్చు. పట్టు వస్త్రాన్ని వాడకండి. నార వస్త్రాన్ని ఉపయోగించవచ్చు.
నైవేద్యం : పసుపు వర్ణ పదార్థములు, చక్కెర పొంగలి, కుంకుమ పూలు చేర్చిన (కేసరిపౌడర్ కలుపని) పాలతో కూడిని కేసరి వంటివి. ఇవేవీ లేకపోయినా పసుపు వర్ణం కలిగిన అరటి పండ్లు చాలును.
నిత్యపూజలు చేసేవారైతే ముంతమామిడి (చిన్నవి), ద్రాక్ష, పసుపు అరటి పండ్లు తదితరాలను నైవేద్యంగా సమర్పించవచ్చు.
కలశ జలం : కలశంలో పోసే జలాన్ని మూడుసార్లు వేడి చేసి చల్లార్చి ఉపయోగించడం చాలా మంచిది.
1. కలశ జలాన్ని తొలిసారి వేడి చేయడం ప్రళయానంతరం సృష్టించే పృథ్వీ తత్త్వాన్ని
2. రెండోసారి వేడి చేయడం అబ్ తత్వాన్ని తెలియజేస్దుంది.
3. మూడోసారి వేడి చేయడం ఆ జలం అత్యంత పవిత్రంగా ఉండటానికే. కనుక గంగానది వంటి పుణ్య నదీ జలాలను మూడుసార్లు వేడి చేసి చల్లార్చి వాడటం వల్ల కలశపు జలం మరింతగా పవిత్రతను ఆపాదించుకుంటుంది. గంగానది జలాన్ని వేడి చేయడం గంగ పుట్టుక స్థలం గంగోత్రి వద్ద పారే వేడి నీటిని తలపిస్తుంది.
జలాన్ని ఆరబెట్టడం వల్ల మంచు పర్వతంలో కొలువైన మహేశ్వరుడి శాంత స్వరూప తత్త్వాన్ని తెలియజేస్తుంది.
పూజ : పసుపుతో చేసిన వినాయకుడి పూజతో దేవీ పూజ ప్రారంభమవుతుంది.
శ్రీవినాయకుడిని ఆరాధించిన తర్వాత శ్రీఆయుర్దేవి పూజ ఆరంభం. శ్రీవినాయకుడి పూజను వారి వారి ఇష్టానుసారం చేయవచ్చును.
1. ఆయుర్దేవిని పురుషులు, స్త్రీలు, చిన్నారులు వయోబేధం లేకుండా పూజించవచ్చు. శ్రీఆయుర్దేవి కంటూ ప్రత్యేకమైన కట్టుబాట్లు లేవు. అయినా వ్రతం, అన్నదానం వంటి సత్కార్యాలు చేయడం వల్ల వాటికైన విశేష ఫలితాలు సమకూరుతాయి.
2. శ్రీఆయుర్దేవి పూజా పద్ధతిలో ఉన్న మంత్రాలను కలశపూజకు, కలశం లేకుండా శ్రీఆయుర్దేవి చిత్రపటాన్ని ఉంచి చేసే సాధారణ పూజకు పఠించవచ్చును. ఆయుర్దేవి చిత్రపటానికి పసుపు కుంకుమ దిద్దాలి.
3. తనకు తెలిసిన అభిరామి అందాతి, మహిషాసుర మర్ధిని శ్లోకం, లక్ష్మీస్తోత్రం, లలితా సహస్రనామం వంటి దేవభాష, తమిళ, తెలుగు మంత్రాలు, శక్తీ కీర్తనలు పారాయణం చేయాలి.
4. అనివార్య కారణాలవల్ల నిరాడంబరంగా పూజచేసేవారు శ్రీఆయుర్దేవి మూల మంత్రం, శ్రీఆయర్దేవి గాయత్రిని 24/36/64/108 సార్లు జపించి నైవేద్యం సమర్పించి పూజిస్తే చాలును.
5. శ్రీఆయుర్దేవి పూజతోపాటు అన్నదానం చేస్తే అది మహత్యపూర్వకమైన పూజ అవుతుంది. కొన్ని అన్న ప్రసాదపు పొట్లాలను గాని రొట్టె/బన్నులు (bread and bun) వంటి ఆహార పదార్థాలను శ్రీఆయుర్దేవి మూలమంత్రం జపిస్తూ, శ్రీఆయర్దేవి గాయత్రి లేదా తమకు తెలిసిన దైవనామాలను పలుకుతూ శ్రీఆయుర్దేవికి సమర్పించిన తర్వాత ఆలయం వెలుపల ఉన్న పేదలకు అందిస్తే అదే అన్నదానమవుతుంది. దీనితో శ్రీఆయుర్దేవి ప్రసాదాన్ని నిరుపేదలకు, అన్నార్తులకు అందించటం వల్ల అత్యద్భుత దైవీక కార్యాలను చేయవచ్చు.
6. ఉచితరీతిలో నైవేద్య పద్ధతితో శ్రీఆయుర్దేవిని ఆరాధించటానికి ఉదయం రెండు ఒలిచిన అరటిపండ్లను చక్కెరతో చేర్చి 24 సార్లు శ్రీఆయుర్దేవి మూలమంత్రాన్ని జపించి ప్రసాదంగా పుచ్చుకోవాలి. మధ్యాహ్నం అన్నం వండిన వెంటనే పిడికెడు అన్నపు ముద్దను తీసుకుని దానిపై పప్పుముద్దను టమోటా ముక్కను పెట్టి శ్రీఆయుర్దేవి మూలమంత్రాన్ని 64 సార్లు జపించి ప్రసాదంగా స్వీకరించాలి.
సాయంత్రం రాగి, వెండి గిన్నెలో బాగా కాచి ఆరబెట్టిన పాలలో చక్కెరనుచేర్చి శ్రీఆయుర్దేవి మూల మంత్రాన్ని 108 సార్లు జపించి ప్రసాదంగా స్వీకరించాలి.
7. శ్రీఆయుర్దేవి ఏవిధంగా పూజించినా మనసారా పూజిస్తే శ్రీఆయుర్దేవి సంతసించి అనుగ్రహిస్తుంది. అయితే శ్రద్ధాపూర్వకమైన భక్తితో మనస్పూర్తిగా భక్తిస్థితిని తెలిసినవారు సద్గురువు మాత్రమే. కనుక తగిన సద్గురువును ఆశ్రయించి సిద్ధపురుషులు, మహర్షులు, పెద్దలు సూచించిన పద్ధతుల ప్రకారం పూజిస్తే కాలక్రమేణా శ్రీదేవి దర్శన భాగ్యమూ కలుగుతుంది.
కలశపూజలో కలశాన్ని సిద్ధం చేసుకుని శ్రీవినాయకుడి పూజ తర్వాతే శ్రీఆయుర్దేవి పూజ ఆరంభమవుతుంది. కలశం లేకుండా సాధారణ పూజకూడా వినాయకుడి పూజ లేదా వినాయకుడి స్తుతితో ప్రారంభమవుతుంది.
జప సంకల్పం
అస్య శ్రీఆయర్దేవి మహామంత్రస్య బృహస్పతి రుషిః|
అనుష్టుప్ చందః శ్రీఆయుర్దేవి దేవాతా శ్రీం బీజం|
హ్రీం శక్తిః ఐం క్లీం శ్రీఆయుర్దేవి ప్రసాద
సిద్ధయేత్ జపే వినియోగః
కరన్యాసం (కరపూజ)
కరన్యాసం చేయలేనివారు రెండు చేతులెత్తి నమస్కరిస్తే చాలును.
ఓం శ్రీం హ్రీం జ్ఞానాయ అంకుష్టాభ్యాం నమః (చూపుడు వేలిని బొటనవేలి అడుగు నుండి కొస వరకు రుద్దుకోవాలి)
ఆయుర్దేవి ఆయుర్ వృద్ధికరాయ తర్జనీభ్యాంం నమః (బొటనవేలితో చూపుడు వేలిని అడుగు నుండి కొస వరకు రుద్దుకోవాలి)
కమలధారిణ్యై శక్త్మై మధ్యమాభ్యాం నమః | (బొటనవేలితో మధ్యవేలి అడుగు నుండి కొస వరకు రుద్దుకోవాలి)
హంసవాహిన్నై బలాయ అనామికాభ్యామ్ నమః (బొటనవేలితో ఉంగరపు వేలి అడుగు నుండి కొస వరకు రుద్దుకోవాలి)
స్వాహా తేజసే కనిష్ఠికాభ్యామ్ నమః| (బొటనవేలితో చిటికెన వేలి అడుగు నుండి కొస వరకు రుద్దుకోవాలి)
ఓం శ్రీ స్వాహా వీర్యాయ కరతల కరపృష్టాభ్యామ్ నమః (రెండు చేతులను అరచేతిని పైచేతిని తుడిచేలా, పైచేయి అరచేతిని తుడిచేలా రుద్దుకోవాలి)
హృదయాదిన్యాసం (అంగ పూజ)
హృదయాదిన్యాసం చేయలేనివారు తలపై నుండి హృదయం (గుండె) దాకా రెండు చేతులలో ఒకసారి తడుముకుంటే చాలును.
ఓం శ్రీం హ్రీం ఐం జ్ఞానాయ హృదయాయ నమః| (కడి చేతితో హృదయాన్ని తాకాలి)
ఆయుర్దేవి ప్రకాశాయ శిరసే స్వాహా | (కుడి చేతితో శిరస్సును తాకాలి)
కమలధారిణ్యై శక్తై శిఖాయ వషట్ | (కుడి చేతితో శిఖను తాకాలి)
హంసవాహిన్యై బలాయ కవచాయ హూమ్ | (కుడి చేతితో ఎడమ భుజాన్ని, ఎడమ చేతితో కుడి భుజాన్ని తాకాలి)
స్వాహా తేజసే నేత్రాయా వౌషట్ | (కుడి చేతితో ముఖానికి నేరుగా చిటికె వేయండి)
ఓం శ్రీం స్వాహా వీర్యాయ అస్త్రాయ ఫట్ | (రెండు చేతులతో ముఖానికి నేరుగా కొట్టండి)
భూర్భువసువరో మితి దిగ్బంధః (కలశాన్ని గాని శ్రీఆయుర్దేవి పటాన్ని తాకి నమస్కరించాలి)
ధ్యానం
శ్రీఆయుర్దేవిని తలచుకుంటూ ధ్యానించండి.
జయాంబ జయ సర్వాణి జయ గౌరీ ఆయుర్దేవి
నమో నమస్తే శివకామసుందరీ
నమో నమస్తే అరుణాచలేశ్వరీ
నమో మహా గౌరీ నమో నమస్తే||
మూలమంత్రం
ఓం శ్రీం హ్రీం ఐం శుభాయై దేవసేనాయై
ఆయుర్దేవ్యై స్వాహా||
శ్రీఆయుర్దేవి మూల మంత్రాన్ని 24/36/64/108 సార్లు జపించండి.
శ్రీఆయుర్దేవి గాయత్రీ :
ఓం మహా దేవ్యై చ విద్మహే పరాశక్తై చ దీమహీ
తన్నో ఆయుర్దేవ్యై ప్రచోదయాత్ ||
శ్రీఆయుర్దేవి గాయత్రీ మంత్రాన్ని 24/36/64/108 సార్లు జపించండి.
లం పృథ్వ్యాత్మనే గంథం సమర్పయామి
(చందనాన్ని కలశంపై / పటంపై పూయండి)
హమ్ ఆకాశాత్మనే పుష్పాణి పూజయామి|
(కలశానికి/ పటానికి పుష్పం సమర్పించండి)
యం వాయ్వాత్మనే ధూపమాగ్రాపయామి|
(కలశానికి/ పటానికి ధూపం చూపండి)
రం అగ్నియాత్మనే దీపం దర్శయామి|
(కలశానికి/ పటానికి దీపం చూపండి)
వమ్ అమృతాత్మనే అమృతం మహా నైవేద్యం నివేదయామి|
(ఉచితరీతిన నైవేద్యం సమర్పించండి)
సమ్ సర్వాత్మనే సర్వోపచారాణ్ సమర్పయామి||
(సర్వ ఉపచారాలను స్వీకరించమని దేవిని వేడుకోండి)
(నైవేద్యపను వివరణను మునుపే వివరించాం)
మహా మంత్ర జపవిధానం (ఆరాధన)
ధ్యాయేత్
నవాంభుజరూఢమ్ వరదాభయ పాణికామ్|
అయుషో దేవదామ్ నిత్యామ్ ఆశ్రితాభీష్ట సిద్ధిదామ్||
ఆయుర్దేవి మహాప్రాజ్ఞే సూతికా గృహవాసినీ|
పూజితా పరయా భక్త్యా దీర్ఘమాయుః ప్రయచ్చమే||
సింహస్కంతగతాం దేవీం చతుర్హస్తామ్ త్రిలోచనామ్|
శక్తి శూల గధా పద్మ ధారిణీమ్ చంద్రమౌళికామ్||
విచిత్ర వస్త్ర సంయుక్తామ్ సర్వాభరణ భూషితామ్|
సింహస్కంత గధే దేవీ సూరాసుర సుపూజితే||
ప్రభవయాత్యప్తక్తే సంఖే ఆయుర్దేవీమ్ నమోస్తుతే|
ఆయుర్దేవి బలం దేహి సర్వారిష్టం వ్యపోహయా ||
ఆయుష్మతాత్మికామ్ దేవీమ్ కరాళ వదనోజ్వలామ |
ఘోర రూపాం సదా ధ్యాయోత్ ఆయుష్యం యాచయామ్యహమ్ ||
శుభం భవతు కళ్యాణీ ఆయుర్ ఆరోగ్య సంపదామ్|
సర్వశత్రు వినాశాయ ఆయర్దేవి నమోస్తుతే||
షష్టాంశామ్ ప్రకృతైర్ సిద్ధదామ్ ప్రతిష్టాభ్య చ శుప్రబామ్|
శుప్రదామ్ చాబి శుభతామ్ దయా రూపం జగత్ ప్రసూమ్||
దేవీం షోడష షృశామ్ దామ్ శాశ్వతస్థిర యౌవనాం|
బింబోష్టీమ్ సుదధీమ్ శుద్ధామ్ శరత్చంద్రనిబాణనామ్||
నమో దేవ్యై మహా దేవ్యై సిద్ధ్యై శాంత్యై నమోనమః|
హంసవాహిన్యై సింహపీఠ నివాసిన్యై నమో నమః||
శుభాయై దేవసేనాయై ఆయుర్దేవ్యై నమో నమః|
వరదాయై పుత్రదాయ ధనదాయై నమో నమః||
సృష్ట్యై షష్టాంశ రూపాయై సిద్ధాయై చ నమో నమః|
మాయాయై సిద్ధయోగిన్యై ఆయుర్దేవ్యై నమో నమః||
సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః |
బాలారిష్టాహ్రు దేవ్యై చ ఆయుర్దేవ్యై నమో నమః||
కళ్యాణధాయై కళ్యాణ్న్యై బలదాయై చ కర్మణామ్|
ప్రత్యక్షాయై స్వభక్తానామ్ ఆయుర్దేవ్యై నమో నమః||
పూజ్యాయై స్కాంత కాంత్యై సర్వేషామ్ సర్వకర్మషు |
దేవరక్షణ కారిణ్యై ఆయుర్దేవ్యై నమో నమః||
శుద్ధ తత్త్వమ్ స్వరూపాయై వంధితాయై తృణామ్సదాః|
వర్జితక్రోధ హింసాయై ఆయుర్దేవ్యై నమో నమః||
పైన పేర్కొన్నట్లు మంత్ర జపం (పారాయణం) తర్వాత శ్రీఆయుర్దేవి మూలమంత్రం, గాయత్రీ జపించి, కరన్యాసం, అంగన్యాసం చేసి మళ్లీ శ్రీఆయుర్దేవి మూలమంత్రం, గాయత్రీ జపించిన మీదట పూజ సంపూర్ణమవుతుంది.
శ్రీఆయుర్దేవి పూజా సంపూర్ణం
శ్రీఆయుర్దేవిని తొట్టతొలుత తిరుఅణ్ణామలై క్షేత్రంలో లోకానికి తెలిపినది ద్విత చిరంజీవి అనే దైవావతారమే. గణపతి, ఆంజనేయ స్వరూపాలున్న అర్ధనారీశ్వర రూపమే ద్విత చిరంజీవి రూపం!
శ్రీఆయుర్దేవి హంస వాహనంలో సింహపీఠం నుండి నవ భుజములతో అనుగ్రహిస్తుంది. ఆది గ్రంథాల నుండి శ్రీఆయుర్దేవి అమ్మవారి దివ్య రూపాన్ని తమ గురువు అనుగ్రహం చేత కలియుగ మానవాళికి తొట్టతొలుత ఎరుకపరచిన ఘనత శ్రీ-ల-శ్రీ వెంకటరామన్స్వాములకే దక్కుతుంది.
శ్రీఆయుర్ దేవి నామావళి
1. ఓం శ్రీ అఖిలాండేశ్వర్యై నమః
2. ఓం శ్రీ అన్న వాహిన్యై నమః
3. ఓం శ్రీ అద్భుత చారిత్రాయై నమః
4. ఓం శ్రీ ఆది దేవ్యై నమః
5. ఓం శ్రీ ఆది పరాశక్యై నమః
6. ఓం శ్రీ ఈశ్వర్యై నమః
7. ఓం శ్రీ ఏకాంత పూజితాయై నమః
8. ఓం శ్రీ ఓంకార రూపిణ్యై నమః
9. ఓం శ్రీ కాలభైరవ్యై నమః
10. ఓం శ్రీ కృతయుగ సిద్ధ శక్త్యై నమః
11. ఓం శ్రీ చక్రవాసిన్యై నమః
12. ఓం శ్రీ సిద్ధపురుష తత్వాయై నమః
13. ఓం శ్రీ శివశక్తి ఐక్య స్వరూపిణ్యై నమః
14. ఓం శ్రీ లలితా పరమేశ్వర్యై నమః
15. ఓం శ్రీ త్రిమూర్తి స్వరూపిణ్యై నమః
16. ఓం శ్రీ నవగ్రహ రూపిణ్యై నమః
17. ఓం శ్రీ నవముద్రా సమారాత్యాయై నమః
18. ఓం శ్రీ పద్మాసనస్థాయై నమః
19. ఓం శ్రీ యోగాంబికాయై నమః
20. ఓం శ్రీ దుర్గా లక్ష్మి సరస్వతి నిశేవితాయై నమః
21. ఓం శ్రీ విష్ణు రూపిణ్యై నమః
22. ఓం శ్రీ వేద మంత్ర యంత్ర శక్త్యై నమః
23. ఓం శ్రీం హ్రీం ఐం శుభాయై నమః
24. ఓం శ్రీ శివ కుటుంబిణ్యై నమః
25. ఓం శ్రీ అరుణాచల మేరుస్తాయై నమః
26. ఓం శ్రీ కరపీఠ వరప్రసాదిన్యై నమః
27. ఓం శ్రీ ఆయుర్దేవ్యై నమః
నవ కరములతో శుభాలను ఎన్నింటినో అందించే శ్రీ ఆయుర్దేవిని అద్భుత నామావళులతో పసుపు (స్వర్ణ) వర్ణ పుష్పములతో అర్చించినచే సర్వ మంగళ సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయి.
ఓం గురువే శరణం