ఓం శ్రీ వల్లభగణపతి రక్ష
ఓం శ్రీ అంగాళ పరమేశ్వరి రక్ష
ఓం శ్రీ గురువే శరణం
మహిళలకు కుశా విధానం
|
స్త్రీ జాతికి శారీరక కష్టాలను, మానసిక ఒత్తిళ్లను ఆధునిక ప్రపంచంలో జీవనశైలివిధానము క్రమముగా పెంచి పేర్చుతున్నది.
కుటుంబములో స్త్రీని ధనార్జన కొరకు, సంఘములో ఎదుగుదల కోసం, ఉద్యోగము చేయమని నేటి సాంఘికవ్యవస్థ హక్కుతో కోరుతున్నది. అనాదిగా భారత సంప్రదాయమునందు జరిగిన బాల్యవివాహము, తగిన సమయములో శీఘ్రముగా వివాహము చేసికోవడం, కేవలము కల్పనము లేక పురాణ కథలుగా మిగిలినవి.
ఈ పద్ధతులు కామముతో కూడిన పురుషుల దృష్టి స్త్రీలపై పడకుండునట్లు రక్షణను కల్పించే విధముగా ఆచరణలో ఉండేవి. ఇప్పటి సమాజములో సహజముగా కన్నె వయసు స్త్రీలు, యౌవ్వన స్త్రీలు మానసికంగానూ, భౌతికంగానూ, లైంగిక వేధింపులకు గురిఅవ్వడము జరుగుతున్నది. అనేక స్త్రీలు వారి గృహ పరిసరాలనుండి వేరుపడి, దూరపు చదువుల కోసం, లేక కొలువు రీత్యానో నివసించడము అలవాటుగా మారింది. ఈ కారణాలచేత స్త్రీకి రక్షణ ఒనర్చె ఒక సానుకూల శక్తి నిత్యమూ అవసరము.
దుష్టుల దృష్టి, మరియు విపరీత చేష్టలు, అపరాధములు కావించే వారి చెడు చూపుల బారి నుండి, అన్ని దిక్కులనుండి, అనేక విధాలుగా చుట్టుముట్టే ప్రతికూల శక్తులనుండి, రక్షించే కవచము వలె ఉపయోగపడే సానుకూల శక్తి స్త్రీకి అవసరము. ఆధునిక స్త్రీలను ఆదుకొనే సానుకూల శక్తి కుశాతత్త్వము. కుశా తత్త్వమును అనుసరించి ప్రయోజనము పొందడానికి స్త్రీల యొక్క జాతి, కుల, మత నియమములతో సంబంధము లేదు. కుశా శక్తి యొక్క అందమేమంటే, ఎట్టి పూజ లోనైనా, ప్రార్థన లోనైనా, కుశా తత్త్వము ఇనుమడింపచేసి జాతి, మత కట్టుబాట్లకు అతీతంగా స్త్రీలు లబ్ది పొందవచ్చు. కుశా శక్తి రోజులో అన్నింటికంటే శక్తివంతమైన రక్ష వలె పని చేస్తుంది. శోధించి అనుసరించితే, మీరు కుశను ఇష్టపడుతారు.
కుశ ప్రార్థన
|
ఆధునిక కాలములో స్త్రీజాతి ఎదుర్కొనే వ్యాధులు, రుగ్మతలు, ఋతు స్రావ సంబంధమైన ఇబ్బందులు, వయసు మీరిన పిదప ఆలస్య వివాహము, నిస్సత్తువ, రొమ్ము కాన్సర్, గర్భాశయము వంటి కష్టాలనుండి రక్షణ కలిగించే పూజావిధానాలగూర్చి వివరముగా ఆశ్రమ ప్రచురిత గ్రంధాలలో లిఖింపబడినవి. కుశా ప్రార్థన ఒక ప్రత్యేక ప్రార్థన, దానిని వేఱొకదానితో సంబంధము లేని విధంగా ఆచరించవచ్చు. లేక వేరొక పూజలో చక్కగా ఇనుమడింపచేసి కొంత విశేష ఫలితములను, మరియు సానుకూల గుణములను పొందవచ్చు.
శ్రీ అరుందది సమేద వశిస్టరు
కరంతట్టాంకుడి తంజావూరు
కుశా ప్రార్థనలో మొదటి మెట్టుగా కుశ సంఖ్యను రూఢీపరచుకోవాలి. ఒక స్త్రీకి శుభస్కర మైన కుశా సంఖ్యను రూఢి పరచుకోవాలి. దానిని అన్ని పూజా క్రతువులలో ఉపయోగించి అవసరమైన సానుకూల శక్తిని పొందవచ్చు. ఉదాహరణకు, ఆడవారు వారి ఇళ్ల ముంగిళ్ళలో ప్రతి దినము ముగ్గులు వేసే అలవాటును కలిగియుంటే, కుశ తత్త్వమును ఈ విషయములో ఉపయోగించవచ్చు. బియ్యపు పిండిని మాత్రమే ముగ్గులు వేయడానికి ఉపయోగించాలి. కాల్షియం పొడిని మరి ఎటువంటి ఇతర రసాయన తయారీలను ఏ పరిస్థితి లోనూ ముగ్గు పెట్టుటకు వాడరాదు. మ్రుగ్గు యొక్క రూపాంతరమునకు మొత్తముగా వినియోగించే చుక్కల సంఖ్య, ఆ ముగ్గును తీర్చే స్త్రీకి ఉపయుక్తమైన కుశ సంఖ్యగా ఉండాలి. ఉదాహరణకు, ఒక స్త్రీ పుట్టిన తేదీ రెండవ రోజు జులై మాసమైతే, ఆమె కుశ సంఖ్య నాలుగు. ఎంచుకున్న ముగ్గులో 4, 13, 22 లేక 31 చుక్కలు ఉండవచ్చు. ఈలాటి ముగ్గు వేసిన ఒక రోజున, ఆనాటి దిన చర్యలలో అనేక సానుకూల ఫలాలను కురిపించేదే కుశా తత్త్వము.
అనేక అనుకూలమైన ఫలాలను పొందడానికి, ముఖ్యమైన కార్యములు ప్రారంభించే ముందుగా కుశనుపయోగించి, పైన చెప్పిన రీతిలో ముగ్గును అలంకరించవచ్చు. ఉద్యోగ రీత్యా వ్యక్తులతో భేటీకి ముందుగాను, వివాహసందర్భములలో చేసే కార్యాలకు ముందుగాను, ప్రసవ సమయాలలో, శస్త్ర చికిత్సకు ముందర, రోగ నిర్ధారణ పరీక్షలకు ముందుగా, ఇలా ఎన్నో సందర్భాలలో దోహదకారి కుశ తత్త్వము. ఒక దినాన, ఆ రోజు తేదీ వాడి కుశ సంఖ్యను గణించి, ఆ సంఖ్యను బట్టి చుక్కలు పెట్టి, ముగ్గును రూపొందించి చక్కటి ఫలితములను సమకూర్చుకోవచ్చు. ఈ విధంగా కుశ ముగ్గులు అనుదినము వేయవచ్చు. ఉదాహరణకు, ఒక మాసము నందు, మూడవ రోజున, 6, 15, 24 చుక్కలను ఉపయోగించి రంగవల్లి వేస్తే, ఆనాటికి కుశ ఫలమును పొందవచ్చు.
కొన్ని ప్రాంతాలలో చుక్కలు పెట్టకుండా రంగవల్లులు దిద్దుతారు.
ఒకఆకృతి లేక రూపుకట్టు ప్రాధాన్యత సంతరించుకున్న ముగ్గును వేసేటప్పుడు, కుశ సంఖ్యను బట్టి అన్ని రూపాలను చిత్రించవచ్చు.
ఉదాహరణకు ఒక ముగ్గులో సీతాకోకచిలుకలు ఉంటే, ఆ రోజుకు సరిపడునట్లుగా, స్త్రీ కుశ సంఖ్యను బట్టి సీతాకోకచిలకల సంఖ్యను నిర్ణయించి ముగ్గును వేయాలి.
స్త్రీలు ముగ్గువేసేటప్పుడు పాడేప్రార్థనా గీతమును సిద్ధపురుషులు అందించినారు. అది స్తోత్రమాలలో కలదు. గీతము పాడుతూ ముగ్గును వేయడం, స్త్రీలో దాగిన కుశాశక్తిని మేలుకొలిపే అత్యంత శక్తివంతమైన ఆచారము. ముగ్గును వేసేటప్పుడు మనసులోకానీ, బిగ్గరగా కానీ స్తోత్రమును పాడడము మంచిది. ముగ్గును గీస్తూ పాడలేని పక్షంలో, ముగ్గువేయడం ముగించిన తరువాత, ఆ ముగ్గుకు ఎదురుగా నిలబడి, లేకకూర్చుండి పాడవచ్చును.
స్తోత్రమాలలో ఉన్న గీతాన్ని తృప్తికరంగా గానముచేయలేని పక్షాన స్త్రీలు స్వీయనామమునో లేక వారి భర్తగారి నామమునో మనసులో లేక పైకి జపించాలి.
ఒక ఇంటి పూజామందిరములో ఆ గృహపు స్త్రీ యొక్క జాతకపు రాశిచక్రమును బియ్యపుపిండితో వేయాలి. ఒక్కొక్క రాశిలో నాలుగు పూవులనుంచాలి. సువాసన కలిగిన సహజమైన పూవులను మాత్రమే ఈ పూజకు ఉపయోగించాలి. వాసనలేని పూవులను భగవదర్పణకు వినియోగించరాదు. స్త్రీ జాతకమునకు బదులుగా శ్రీసీతా అమ్మవారి జాతకచక్రమును పూజమందిరమున పూజించవచ్చు. ఇక్కడ ఆ పధ్ధతి వివరించ బడినది.
మేష రాశితో మొదలుపెట్టి అన్ని పన్నెండు రాశులలో పూవులను కుశా ప్రక్రియ ప్రకారము ఏర్పరచి దైవానికి సమర్పణ చేయాలి.
ఒక రాశిలో నాలుగుపూవులను, రెండుఫై వరుసలో రెండుక్రింది వరుసలోనూ ఉంచాలి. ఫై వరుసలోని రెండుపూలను మొదట జోడించి, క్రిందివరుసలోని పూలను తరువాత జోడించాలి.
పైన జతపరచిన రెండుపూలను మీ ఇష్టదేవత పాదపద్మములకు మొదట అర్పించాలి. తరువాత మాత్రమే క్రిందివరుసలో జతపరచిన పూలను అర్పించాలి.
తరువాతిది వృషభ రాశి. ముందు(పైన) వివరించిన విధానమునే పాటించి 12 రాశి చక్రాలకు 48 పూవులను ఉపయోగించి, ఇష్టదేవతకు అర్పించాలి. ఇది కుశాశక్తిని ఆహ్వానించడానికి, శక్తివంతమైన పూజా పధ్ధతి. మనము దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఆటంకాలను అరికట్టగలిగే సాధనా ప్రక్రియ. మనమువెళ్లే ముళ్లదారిలో ఎదురయ్యే అవరోధాలను పటాపంచలు చేయడానికి కుశాశక్తిని ఆవాహనము చేద్దాము.
కుశను కుశతో పెంపొందించుట
|
గాయత్రి మంత్ర జప శక్తులను పది రెట్లు వృద్ధి చేసే ప్రార్థనా పధ్ధతి ఒకటి కలదు. అదే పూజలో కుశాపూజను ఉపయోగించి కుశాశక్తులను ఇనుమడింపచేయవచ్చు. కుశ అనే ఒక దర్భకలదు. తమిళములో దర్బయ్ అంటారు. స్త్రీలు ఈపూజ కొరకు ఇరవై దర్భలను సమకూర్చుకొని, ఒక గాయత్రిమంత్రమును ఎంచుకోవాలి. లేక స్వీయనామజపమును చేయవచ్చు.
పూజకు సిద్ధమైన స్త్రీ సొంత నామమునే జపించడానికి ఎంచుకోవచ్చును. మంత్రము లేక నామము లెక్కించడానికి కుడిచేతి బొటనవ్రేలు ఉపయోగించాలి. ఉంగరపు వేలి యొక్క మధ్య కణుపు దిగువన లెక్క ప్రారంభించవచ్చు.
రెండవ మంత్రమును ఉంగరపువేలి మూడవ కణుపు క్రింద లెక్కించి, మూడవ మంత్రమును చిటికెనవ్రేలి మూడవకణుపు దిగువలో చెప్పాలి. నాల్గవ మంత్రము చిటికెన వేలి మధ్య కణుపు దిగువలో చెప్పాలి. ఐదవ మంత్రమును చిటికెన వేలి మొదటి కణుపు దిగువన, ఆరవ మంత్రము ఉంగరపువేలి మొదటి కణుపు దిగువన, ఏడవ మంత్రము మధ్యవేలి మొదటికణుపు దిగువన, ఎనిమిదవ మంత్రము చూపుడువేలి ఫై భాగపుదిగువన తొమ్మిదవ మంత్రము చూపుడువేలి మధ్యభాగపు దిగువన, పదవ మంత్రము చూపుడువేలి చివరి కణుపు దిగువన చెప్పాలి.
పదవ మంత్రము వచ్చేసరికి మనసులో కుశా మంత్రముగా అనుకోవాలే తప్ప పదవ మంత్రముగా లెక్కించ రాదు. ఇప్పుడు ఒక కుశాదర్భను తీసికొని కుడిచేతివైపు ఉంచుకోవాలి.
శ్రీ సీతా దేవి యొక్క జాతకం
పైన చెప్పిన పధ్ధతిలోనే మరొక పదిమంత్రములను జపించాలి. ఇట్టి జపవిధానమును పాటించి, పదవ మంత్రమును ఎట్టిపరిస్థితిలోనూ పదవదిగా చెప్పకుండా కుశా మంత్రముగా జపించాలి. ప్రతి పునరుక్తికి కుడిచేతి ప్రక్కన ఒక దర్భను ఉంచాలి.
ఈ విధంగా నూరు మంత్రాలను చెప్పాక, మీకుడిచేతి వైపు పదిదర్భలు ఉంటాయి. పదవ దర్భను కుశాదర్భగా మనుసులో లెక్కించవచ్చు, లేక బిగ్గరగా కుశ అనవచ్చు. మనసులోకానీ, పైకి కానీ పదవ దర్భను కుశా అని లెక్కించి కుడిచేతి ప్రక్కన ఉంచాలి.
వంద మంత్రాలు ముగిసిన తరువాత జపము లెక్కించడానికి కుడిచేతిని కాక ఎడమచేతిని ఉపయోగిస్తూ, పైన పాటించిన ప్రక్రియను పునరావృత్తి చేయాలి. అలాగే, ప్రతిపది మంత్రములకు ఎడమప్రక్కన ఒక కుశా దర్భను ఉంచి, నూరుమంత్రాలు ముగియగానె, పదవదర్భను కుశగా లెక్కించడము చేయాలి. ఎడమప్రక్క కూడా కుడివైపువలెనే పదవదర్భను ఎట్టిపరిస్థితిలోనూ ‘పది’ అని అనరాదు. కేవలము కుశగా గుర్తించాలి. ఈ విధంగా ఎడమ వైపు పది దర్భలను పేర్చుతాము.
రెండు వందల గాయత్రిజపము ముగిసిన తరువాత ఇరవై దర్భలు ఏర్పడుతాయి. ఇరుప్రక్కల పది దర్భలు ఉండగా కుడిచేతి చిటికెనవేలితో పదిదర్భల గుత్తిని ఎడమచేతి చిటికెనవేలితో పదింటిగుత్తిని పట్టుకోవాలి. దర్భలు అరచేతి(కుడి) లోనుండిబయటకు వెళ్ళాడునట్లు పట్టుకోవాలి. ఈ విధంగా దర్భలను ఇరువైపులా పట్టుకొని ఒకే ఒక సారి గాయత్రిని చెప్పాలి. అంతే! ఇప్పుడు మీ గాయత్రీ జపము పదింతల శక్తిని కలిగి ఉంటుంది. అరచేతిలో ధరించేవిధానము వీడియోలో గమనించగలరు.
మీకిప్పుడు 2000 గాయత్రి మంత్రజప ఫలితము వచ్చినది. 200 గాయత్రి జపము 2000 గాయత్రీ జపమునకు సమానమైనది. మిమ్ము రెండు వేల గాయత్రి మంత్ర శక్తి చేరినది. మీశక్తులు ఇప్పుడు పది రెట్లు అయినవి.
కుశా శక్తులు కూడా పది రెట్లు పెరిగినవి. పైనచెప్పిన జపవిధానాన్ని ఎంత సమయమైనా కొనసాగించవచ్చు. గాయత్రి శక్తులను అధికముగా ఆర్జించి, అత్యంత సానుకూలశక్తులను సంపాదించుకోవచ్చు.
కుశలో కుశ
|
మూడు సమరూప వస్తువులు వరుసలో పేర్చి యుంటే, మధ్యలో ఉన్న వస్తువు కుశా శక్తి కలిగియుంటుంది. స్త్రీలు కుంకుమ (నిమ్మ పసుపు కలిసి కుంకుమ కాగలదు) ను శరీరములోమూడు చోట్ల ధరించవచ్చు. అది, నుదుటి మధ్యలో, తిరుమాంగల్యం, మరియు నుదుటి పై భాగములో ఈమూడింటి లో కుశా శక్తికలదు. ఇప్పుడు నుదుటిమధ్యలో పెట్టిన కుంకుమ మధ్యస్థమైన స్థానమునందు ఉన్నందువలన అధిక శక్తిని సంతరించుకుంటుంది. దీనినే కుశ లో కుశ అంటారు.
స్త్రీలకు విన్నపమేమనగా వారినుదుటిపైన లభ్యమౌతున్న అపారమైన శక్తిని వినియోగించడం ద్వారా వారి భర్తలకు, దీర్గాయుష్షును, చక్కని ఆరోగ్యమును అందజేయకలరు. వారి పవిత్ర లలాటముమీద రసాయనిక పదార్ధములను కృత్రిమ, నకిలీ లేక ప్లాస్టిక్ స్టిక్కర్లను ఎప్పుడూ వాడకుండా ఉండాలని విజ్ఞప్తి.
మీ ప్రియమైన భర్తకు అనారోగ్యము, కుటుంబానికి దురదృష్టము కలిగించేవిధంగా నకిలీ పదార్ధములతో మీ లలాటాఫలకమును అలంకరించవద్దు.
మూడు విధముల రక్ష
|
పురుషులు నల్లని దారము నడుముచుట్టూ ధరించడము ఒక సంప్రదాయపు అలవాటు. మనచుట్టూ మసలే వారి దుష్ట ఆలోచనల నుండి మంచిరక్షను పొందడానికి దోహదకారి ఈ నల్లని దారము. వ్యతిరేక శక్తులు, వామాచారపు శక్తులు (చేతబడి), మరియు పిశాచముల వలని విఘ్నముల నుండి రక్షించే నల్లదారాన్ని స్త్రీలు కూడా వారి నడుము చుట్టూ ధరించాలి. వారిఎడమచేతి మణికట్టున కాశిదారము (కాశి లోని కాలభైరవుని యొద్ద ప్రసాదము) నుకట్టుకోవాలి. ఎడమచేతి మణికట్టుకు కట్టే దారమునందుకానీ నడుమున కట్టే దారమునందుకానీ మూడు వరుసల దారము చుట్టాలి. మూడు చుట్లు చుట్టిన ఈ సన్నత్రాడు మధ్యన ఉన్నవరుస అవసరమైన కుశా శక్తిని కలిగియుండి ఎల్లప్పుడూ అత్యంత రక్షను వారికి అందించగలదు. ఇటువంటి సులువైన దైవీక యంత్రపరికరములతో ఎల్ల వేళల మిమ్ములను మీరు రక్షించుకోండి.
హృదయ కమల కోలం
|
కోలము అంటే ముగ్గు.
ఒక ప్రత్యేక ముగ్గును సిద్ధ పురుషులు మానవాళికి అందించారు. ఈ ముగ్గును హృదయకమల కోలముగా పిలుస్తారు. హృదయము అంటే గుండె. కమలము తామరపూవు తోసమానము.
ఆరంభములో ఈ ముగ్గును భగవంతునికి ఒక సమర్పణముగా భావించి వేయాలి. తరువాతి కాలములో ఈ ముగ్గువలని ప్రయోజనము, కలిగేమేలు క్రమేపీ తెలుసుకోగలం. కోయంబత్తూరునకు సమీపము నందు కాంగేయం అనేటువంటి ఒకఊరు లో ఊదిమలై మురుగన్ కోవెల ఉంది. అక్కడ ఈ రంగవల్లిని కొంతకాలము వేస్తే మరింత స్పష్టముగా ఇందుదాగిన దైవీకవరాలను అర్ధము చేసుకోగలుగుతారు. గుండె యందు పదహారు ముఖ్యమైన రక్తనాళాలు ( సిరులు, ధమనులు) ఉన్నవి. గుండె యొక్కఆరోగ్యము ఈ నాళాల పైనే ఆధారపడియున్నది. పద్మములోని ఎనిమిది రేకలు గుండెలోని ఎనిమిది సిరులు, ఎనిమిది ధమానులను సూచిస్తున్నవి.
శ్రీ సీతారామ ఇందలూరు
8 x 2 = 16, ఇదే కుశా శక్తిని ఇచ్చేది. ఇన్నిరేకులను భగవంతునికి ముగ్గు రూపములో సమర్పించుకొంటె, గుండెకు ఎటువంటి వ్యాధి సోకదు.
హృదయకమల కోలములోఉన్న అందము, శక్తి అటువంటిది. ఈ ముగ్గును వేసే పధ్ధతిని తెలుసుకోవడానికి, ఇక్కడ వీడియోను పొందుపరచాము. నిదానముగా నేర్చుకోవచ్చును. ముగ్గును వేయడానికి కేవలము బియ్యపు పిండి లేక గోధుమ పిండిని ఉపయోగించాలి.
కృత్రిమ పూవులను, రంగు పొడులను రంగవల్లిని అలంకరించడానికి వాడకూడదు. భగవంతునితో ఐక్యత చెందాలన్న కోరిక ప్రతి మనిషి యొక్క అంతరంగములో ఉంటుంది. ఈ ముగ్గు వేయడం గుండె ఆరోగ్యాన్ని నిశ్చయముగా పెంచడమే కాక, కొంతకాలం ఈ సాధన కొనసాగిస్తే, దైవం దిశగా మనసు మళ్లేందుకు దోహదకారి అవుతుంది. అలా మనలను గమ్యము వైపునడిపించేదే ఈ పూజ.
ఈ ముగ్గును స్త్రీలు మాత్రమే కాక భార్యాభర్తలు కూడా కలసి వేసుకోవచ్చు.
పూజ చేసే సమయంలో కాటన్ చీరను లేక నూలు దుస్తులను ధరించాలని సిద్దుల సలాహా. ప్రత్తియందున్న పంచభూత తత్వాల ఫలితంగా, కాటన్ దుస్తులు ధరించినప్పుడే, మనము దైవీక మంత్రాలను ఆకర్షించి, లీనము చేసికోవడము సాధ్యము. సుబ్రహ్మణ్యస్వామి యొక్క ఇరువురిభార్యలైన శ్రీ వల్లి, శ్రీ దేవనాయి తోకూడియున్న దైవీక స్వరూపము కుటుంబ ఐక్యతకు ఎట్టివిధంగా తోడ్పడగలదో యన్న సందేహము వివాహితలైన స్త్రీలకు కలగవచ్చు. షణ్ముగ స్వామి ని మనకు అందించినదే శివ భగవానుడు. శివుని సృష్టి లో ఎంతో అందము, అంతరార్ధము ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఇద్దరు భార్యలు మానవుని భౌతిక, సూక్ష్మ శరీరాలను సూచిస్తూ ఉంటారు. స్త్రీ పురుషుల వివాహము జరిగిన కొంతకాలానికి, వారి మధ్య శారీరక ఆకర్షణ, భౌతిక సంబంధము నందు ఆసక్తి, నెమ్మదిగా క్షీణిస్తూ ఉంటాయి. తరువాతి పర్యవసానం భగవంతునితో ఐక్యతను అనుభవించడమే. మానవుని జీవితకాలములో, ఈశ్వరునితో ఏకత్వము పొందిన అనుభూతిని, మాటలలో వ్యక్తపరచలేనిధై, అవగాహనపరిధిలో లేనిదై ఉంటుంది. ఆ యత్నమే బ్రహ్మానందముగా మారుతుంది.
శ్రీ కన్నిమూలై గణపతి లాల్గుడి
భగవంతుని ప్రప్రధమైన ఉనికి శుద్ధ చైతన్యము. స్త్రీకి భగవంతుని ప్రతిరూపమే భర్తగా లభించునని పెద్దవాళ్ళ విలువైన సామెత. మన ఇంద్రియములకు గోచరమౌ సృష్టి భగవంతుని వ్యక్తీకరణము. ఈ విధంగా దైవమునర్ధము చేసికొంటే, వివాహమునకు ముందు పెండ్లికొడుకై యున్నపురుషుని భర్తగా పొందిన పిదప భగవత్స్వరూపముగా స్త్రీ గుర్తించవచ్చు. భార్య భర్తను సుబ్రహ్మణ్యస్వామి అవతారముగా గుర్తించినప్పుడు, ఆమెకు ఆస్వామి ఆశీర్వచనములు తనయొక్క ప్రియమైన భర్త వలన లభించగలవు.
తమిళనాడు, తెనకాశి యొద్ద ఉన్న ఇలాంజి లో నున్న స్వామి యొక్క కార్తికేయ స్వరూపము లోని రహస్యము ఇదే. ఈ విషయము స్పష్టీకరించడానికే ఆరు ముఖములతో గాక పన్నెండు ముఖములతో సుబ్రహ్మణ్య స్వామి విరాజిల్లుచున్నారు. శ్రీ కృష్ణుని రాసలీల లోనున్న పరమార్ధము, దైవీక రహస్యము ఇదియే.
శ్రీకృష్ణ పరమాత్మ బృందావనంలో గోపికలతో నాట్యమాడినప్పుడు, ఒక్కొక్క గోపికతో నాట్యమాడే కృష్ణస్వరూపము అద్వితీయమైనదై రాసలీల కొనసాగినది. రాసలీల అనేకమైన భగవానుని రూపములతో కొనసాగినందులకే, విశిష్టతను సంతరించుకొన్నది. అందువలననే రాసలీల అంత అందమైనది.
నిష్కళంక భక్తితో ప్రార్థించు స్త్రీకి భర్త రూపములోను, పురుషునికి భార్య రూపములోను కణ్ణిమూలై గణపతి తనయొక్క ఆశీర్వాదమును అందించును. భక్తితో వేడుకొన్న పురుషునికి పెండ్లికూతురి రూపములో ఆశీర్వాదము లభించగలదు. అట్లే స్త్రీ యొక్క ప్రార్థన ఫలించగా భర్త రూపములో కణ్ణిమూలైగణపతి వెంట వచ్చును. ఈ విధముగా కణ్ణిమూలై గణపతి దర్శనమునకు అరుదెంచిన భక్తులు ఆ స్వామి ప్రతిని తమ ప్రసాదముగా కొనిపోగలరు. స్త్రీలైనా, పురుషులైనా అంతా భగవత్స్వరూపములే. గణపతిని ప్రార్థించగా ప్రతి మనిషి ఒక గణపతిని తీసికొనిపోవుట దైవము మనకు అందించిన అద్భుత వరము. ఒకే బొమ్మను అనేక ప్రతులుగా కంప్యూటర్లో నిలిపినా, మొదటి చిత్రము మారదు. ఒక కంప్యూటర్ మాత్రమే ఇంత శక్తిని కనబరిస్తే, భగవంతునిలో ఇమిడియున్న శక్తి సంగతి ఏమని చెప్పాలి.
ఓం గురువే శరణం