ఓం వల్లభ గణపతియే నమః
ఓం శ్రీ అంకాళ పరమేశ్వరీ నమః
ఓం గురువే శరణం
సులభసాధ్య అగస్త్య దేవారం సేకరణ |
కరుణా స్వరూపులైనవారే సిద్ధపురుషులు. ఎల్లలు లేని పరమాత్ముడైన భగవంతుడి కరుణాకటాక్షములను అణువంతయినా అర్థం చేసుకోలేని స్థితిలో మనం ఉండటం వల్ల సిద్ధపురుషులు దైవానుగ్రహాన్ని, కృపను మనకు ప్రాప్తించి లబ్దిపొందే రీతిలో పలు ఆరాధన పద్ధతులను మనకందించారు. ఈ రీతిలోనే పన్నిరు తిరుమురై కీర్తనలను మనం ఎలా పఠించి లబ్దిపొందాలో ఆ పద్ధతులను మన కోసం వారు అందిస్తున్నారు. ఈ సత్కార్యం వెనుక ఆశ్చర్యకరమైన ఓ చరిత్ర దాగి ఉంది. అదేమిటో మనం తెలుసుకుందామా.
కాలచక్రంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అంటూ యుగాలు వరుసగా వస్తుంటాయి. కృతయుగంలో మానవులకు భగవంతుడిపై అపార విశ్వాసములు సంపూర్ణంగా ఉండేవి. దేవ దేవీ సంచారములు కూడా ఉండేవి. కనుకనే భగవద్ అవతారాలను స్వయంగా దర్శించే భాగ్యాన్ని ఆ యుగంనాటి మానవులు పొందగలిగారు. శివుడు, పార్వతి, మహావిష్ణువు అంటూ దైవమూర్తులను మనమిప్పుడు తోటిమానవులను ఎలా చూడగలుగుతున్నామో ఆ విధంగానే వీధులలోనే చూడగలిగేవారు. రాముడు, కృష్ణుడు వంటి అవతారపురుషులు, మార్కండేయ, అగస్త్య, వశిష్ట, కాకపుజండర్ వంటి మహర్షులను కూడా సహమానవులతో మమేకమై సంభాషించి ఆధ్యాత్మిక రహస్యాలను బోధిస్తూ ఉండేవారు. దైవారాధన పద్ధతులు, సంధ్యావందన, తర్పణం, హోమం, యాగం వంటి క్రతువులను నిర్ణీత సమయంలో నిర్విఘ్నంగా నిర్వహిస్తుండేవారు.
విధివశాత్తు ఇద్దరు సతులతో సంసారం చేసే పురుషులు, పరిస్థితుల ప్రభావం వల్ల ఇద్దరు పతులతో సంసారం చేసే మహిళలు తిరుచ్చి ఉయ్యకొండాన్ తిరుమలైలో ఉన్న శ్రీ ఉజ్జీవ నాదర్ ఆలయంలో కొలువై ఉన్న రెట్టయ్ పిళ్ళయార్ మూర్తులను దర్శించి అర్ధనారీశ్వరులకు ఐదు కొబ్బరి దీపాలను వెలిగించి ప్రార్థిస్తే వారి కష్టాలన్నీ తొలగిపోతాయి.
యుగధర్మాలు మార్పు చెందినప్పుడల్లా ఈ దైవారాధన పద్ధతులలో అశ్రద్ధ క్రమేణా తగ్గుతూ వచ్చింది. ప్రజలు దైవారాధనను ఉబుసుపోకగా నిర్వర్తిస్తున్నారు. అయితే ప్రజలను సన్మార్గంలో నడిపించేలా సిద్ధపురుషులు దైవీకభావాలు మరుగున పడకుండా, సుస్థిరపరిచేలా తమవల్ల సాధ్యమైనంతగా సత్కార్యాలను నిర్వర్తిస్తూనే ఉన్నారు. భూమ్యాకాశాలు ఉన్నంతవరకే కాదు ఆ తర్వాతి గోచరమయ్యే వస్తువులు, గోచరం కాని వస్తువులు జనించి మాయమైనా కూడా దయార్ద్రహృదయులైన సిద్ధుల అద్భుతసేవలు కొనసాగుతూనే ఉంటాయి.
ఈ రీతిలోనే కృతయుగంలో నియమనిష్టలతో కొనసాగుతుండిన వేదపారాయణం కాలగమనంలో సంధ్యావందనం, గాయత్రీజపం వంటి ఆరాధనపద్ధతులవలెనే క్షీణదశకు చేరుకున్నప్పుడు పవిత్రదక్షిణ భారతదేశంలో చతుర్థపురుషులుగా పిలువబడే తిరుజ్ఞాన సంబంధర్, మణివాసగ స్వాములు తిరువాసగ భాగాలను పఠించి దైవభక్తిని, తమిళ వేదపారాయణ ప్రాశస్త్యం అణగారిపోకుండా సంరక్షించసాగారు. మానవుడి కల్పనలకు అందని పలు అద్భుత సంఘటనలను మహాశివుడి కరుణాకటాక్షాలతో ఈ మహాపురుషులు నిర్వర్తించి ఉన్నారు. మృత్తికను స్వర్ణంగా మార్చడం, కరవును పోగొట్టడం, మొసలి మింగిన బిడ్డ కొన్నేళ్ళ తర్వాత దాని నోటి నుండే వెలికితీయడం, మృతి చెంది భస్మమైపోయిన చిన్నారిని బ్రతికించడం, ఉదరానికి బండరాయిని కట్టుకుని నడిసముద్రంలోకి దూకిన వ్యక్తి నమశ్శివాయ పంచాక్షరీ జపం వల్ల తెప్పవలే పైకి రావడం వంటి పలు అద్భుతాలు నిర్వర్తించి శివనామ మహిమను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. నాయన్మార్లే కాదు తిరుమూలర్, శేక్కిళార్ వంటి 27 శ్రేష్ఠ భగవదారాధకులు అందించిన దైవీక పాటలనే పన్నిరు తిరుమురై పాటలు అని పిలుస్తుంది.
శ్రీఅగస్త్య మహర్షి నడిచి వెళుతుంటే వారి వెంటే వాయుభగవానుడు నడిచి ఆయన అనుమతితో చల్లటి గాలులను ప్రసరింపజేస్తాడు. సుగంధ పుష్పాలన్నీ అగస్త్యులవారికి సువాసనలను వెదజల్లుతాయి. అంతెందుకు ఆ మహర్షి వెళుతుంటే శిరస్సు మీదుగా దేవలోకపు విమానాలు సంచరించేందుకు కూడా వెనుకంజ వేస్తాయి.
మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ పన్నిరు తిరుమురై పాటలను అన్నింటిని ప్రతిదినం పఠించి తీరాలి. ఈ తిరుమురై పాటలు అన్నీ మన జీవితంలో నిత్యం అనుభవించే సుఖదుఃఖాలతో సంబంధం కలిగి ఉంటున్నాయి. అయితే నేటి కలియుగంలో జీవించే ఓ సాధారణ వ్యక్తి వల్ల ఈ పన్నిరు తిరుమురైలోని అన్ని పాటలను రోజూ కీర్తించగలడా? దేవారం, తిరుకోవయార్, తిరుపల్లాండు, తిరువాచగం, పెరియపురాణం, తిరువిసైప్పా, తిరుమందిరం వంటి సంచికలు ఈ పన్నిరు తిరుమురై సంపుటంలో ఉంటాయి.
భగవరాధకులచే దైవానుగ్రహంతో మానవజాతి అభివృద్ధి కోసం అందించబడినవే ఈ పాటలు. సాధారణ వ్యక్తి కలిగే దైవభక్తి, అతడికి ప్రాపంచిక వస్తువులపై ఉన్న ఆసక్తి వీటిని పూర్తిగా తెలుసుకున్న సిద్ధకుల నాయకుడైన శ్రీఅగస్త్య మహాముని కలియుగ మానవుడు పన్నిరు తిరుమురై సంపుటాలన్నింటినీ ఎలా రోజూ పఠించగలడో తెలుసుకునే నిమిత్తం పొదిగై పర్వతంలో భగవద్ అనుగహ్రం కోసం తపస్సు చేయసాగారు. అన్నాహారాలు లేకుండా యేళ్ల తరబడి ఆయన తపస్సు కొనసాగింది. సుదీర్ఘకాలం తర్వాత భగవంతుడు ప్రత్యక్షమై అగస్త్యమహామునికి దర్శనమిచ్చారు. ఆ సిద్ధశ్రేష్ఠుడి కోరిక ఏమిటో తెలుపమన్నాడు.
' దేవాధిదేవా మీకు తెలియనది ఏమైనా ఉందా. నేటి మానవుడు సంపాదన, సంసారమునకు అన్నపానీయాలు సమకూర్చడం, కుటుంబ సభ్యులను సంరక్షించడం అంటూ స్వార్థచింతనలతోనే తన కాలాన్ని పూర్తిగా వృథా చేస్తున్నాడు. తన వాస్తవమైన బాధ్యత అయిన భగవదారాధనను పూర్తిగా విస్మరిస్తున్నాడు. ప్రస్తుతం శివరాధనకు వెచ్చిస్తున్న సమయం స్వల్పంగా ఉంటోంది. దీనితో శివరాధనను విడిచి సంచితకర్మలను పెంచుకుంటూ పోతున్నాడు. ఈ పాపకర్మలనుండి ప్రజలను కాపాడడం సిద్ధపురుషులు బాధ్యత కదా? ఈ బాధ్యతను మాకు కల్పించినది కూడా మీరే కదా స్వామీ' అన్నారు అగస్త్యమహాముని.
' కృతయుగంలో జరిగినట్లు నేటి కలియుగంలో కూడా వేదపారాయణం నిర్వహించకపోయినా కనీసం పన్నిరు తిరుమురై పాటలను రోజూ పఠిస్తూ వస్తే కలియుగ మానవుడికి వేదాలను పఠించినంత ఫలం దక్కుతుందని మునుపు మీరే నుడివారు కదా. అయితే నేటి మానవుడు పన్నిరు తిరుమురై పాటలను రోజూ పూర్తిగా పఠించలేక దుస్థితికి చేరుకుంటున్నాడు. మీరు అనుగ్రహించి పన్నిరు తిరుమురై పాటలన్నీ తప్పకుండా పాడాలన్న నిబంధనలో కాస్త సడలింపులేవైనా ఉంటే తెలుప ప్రార్థన ' అన్నారు.
మహాశివుడికి అగస్త్యమహర్షి తన అభిప్రాయాన్ని పూర్తిగా వివరించాడు.
బ్రహ్మను నిందిస్తే మహావిష్ణువు వద్దకు వెళ్లి ప్రాయశ్చిత్తం పొందవచ్చు. విష్ణువును నిందిస్తే పరమేశ్వరుడి వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పుకోవచ్చు. అయితే ఆ మహాశివుడినే నిందిస్తే ఉత్తమ గురువులు మాతమ్రే ప్రాయశ్చిత్తాన్ని అందించగలుగుతారు. అయితే సద్గురువును నిందిస్తే ఏడేడు లోకాలు తిరిగినా ప్రాయశ్చిత్తం పొందలేరు. ఆ ఉత్తమ గురువులు మనసుపెడితేనే ప్రాయశ్చిత్తం ప్రసాదించగలరు. అవివేకం వల్ల గురువాజ్ఞలను మీరినవారికి (గురువును నిందించినవారు కాదు సుమా) ప్రాయశ్చిత్తం అందించగలిగే పుణ్యక్షేత్రమే తిరుచ్చి ఉభయకొండాన్ మలైలోని శ్రీఉజ్జీవనాధుల ఆలయ క్షేత్రం!
ప్రాణకోటిపై అగస్త్యమహామునికి ఉన్న ప్రేమానురాగాలను గుర్తించి సంతసించాడు మహాశివుడు. 'మహర్షీ! నీ ప్రార్థన నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. భూలోక జీవులపై నువ్వు చూపుతున్న కరుణ అనన్య సామాన్యం. నీవు కోరుకున్నట్లే కలియుగ మానవుడు పన్నిరు తిరుమురై పాటలన్నింటినీ పఠించితీరాలన్న నిబంధనలో కొంత సడలింపును ప్రకటించి, కొన్ని పాటలను పఠిస్తే యుగధర్మ నియతి ప్రకారం అన్ని పాటలను పాడినంత ఫలం కలిగేలా అనుగ్రహిస్తాను ' అన్నాడు మహాశివుడు. ఇలా వేదనాయకుడైన మహాశివుడి అనుగ్రహంతో మనకు లభించిన పాటలే శ్రీఅగస్త్యుల పన్నిరు తిరుమురై తిరట్టు అనే దైవీక కీర్తనలు. వేలకొలది పన్నిరు తిరుమురై పాటలను పఠించాలన్న కఠిన నియమం నుండి కాస్త సడలింపు పొంది అందించిన భక్తిపాటల సంఖ్య 32. ఈ పాటలను ఇక్కడ అందిస్తున్నాం కైలాస మునీశ్వరుల పరంపరలోని సిద్ధపారంపర్యం ద్వారా ఈ పన్నిరుతిరుమురై పాటలను కలియుగంలో మనకు అందించినవారు ఆ పరంపరలోని 1001వ గురుమహాసన్నిధానం శక్తి శ్రీఅంకాళ పరమేశ్వరి భక్తశిఖామణి శ్రీ వెంకటరామ స్వాములే. తన గురువులైన శివగురు మంగళ గంధర్వులు శ్రీలశ్రీ ఇడియాప్ప సిద్ధస్వాములు వద్ద గురుకుల వాసం గడిపిన శ్రీవెంకటరామ స్వాములు మనకందరికీ సకల సౌభాగ్యాలు కలుగాలనే తలంపుతో వీటిని మనకందించారు. అందరూ ఈ తిరుమురై పాటలను పాడి ఇహలోకపు ఇడుముల నుండి విముక్తి పొందాలని మనసారా కోరుకుంటున్నాము.
శ్రీఅగస్త్య మహాముని ప్రసాదిత పన్నిరు తిరుమురైని పఠించడం వల్ల కలిగే ఫలితాలు
1. ఉదయం, సాయంత్రం అంటూ ఏ సమయంలోనైనా ఈ పన్నిరు తిరుమురై పాటలను పాడి దైవానుగహ్రం పొందవచ్చు.
2. వంటరిగా పాడటం కన్నా పలువురితో కలిసి చేసే ప్రార్థనకు బలం అధికం. దైవభక్తులు తమ కుటుంబ సభ్యులందరిని కలుపుకుని ఈ పాటలు పాడితే చాలా మంచింది. బంధువులు, స్నేహితులు, తెలిసినవారు, తెలియనివారు ఇలా అన్నిరకాలకు చెందినవారంతా ఈ పాటలు పాడితే సామాజిక ఐకమత్యం శాంతి సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయి.
3. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మూడువేళలా రోజూ సంధ్యావందనములను అందరూ తప్పకుండా ఆచరించాలి. దీనికి ఎలాంటి మినహాయింపులు లేవు. అలుపు సొలుపు లేకుండా సంధ్యావందనములాచరించాలన్నదే సిద్ధపురుషులు వాక్కు. అంటే ఉదయం సూర్యోదయానికి ముందు (సూర్యుని చూడని సమయం) మధ్యాహ్నం మిట్టమధ్యాహ్నం (సూర్యకిరణాలు నేరుగా శిరస్సుపై పడే సమయం), సాయంత్రం సూర్యుడు కనిపించకుండా పోయే సమయం (సూర్యాస్తమయ సమయంల)లో సంధ్యావందనములాచరించాలి. సంధ్యావందనములాచరించే పద్ధతిని సద్గురువుల ద్వారా తెలుసుకోవడం మంచిది. సద్గురువులు లభించకపోతే ఈ 32 సంపుటాలు కలిగిన శ్రీఅగస్త్య దేవార తిరట్టు పాటలను పాడితే సంధ్యావందనముల వల్ల కలిగే ఫలితాలు పొందవచ్చు.
4. ఈ పన్నిరు తిరుమురై తిరట్టు (సేకరణ) పాటలను కార్యసిద్ధి కోసం కూడా వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు రోగంతో బాధపడుతున్న వేళ 'మంత్రమవునదే విభూతి...' అనే తిరుజ్ఞాన సంబంధమూర్తులవారి ప్రసాదిత తిరునీట్రుప్పదికంను పఠించి విభూతిని ధరిస్తే చాలు రోగం మటుమాయమవుతుంది. జ్వరం, తలనొప్పి వంటి రోగాల తీవ్రత తగ్గుతుంది. వివాహం, నివాసగృహం, భూమి వంటి న్యాయమైన అవసరాల కోసం, ఆదాయానికి మించిన వ్యయం, ఋణబాధ వంటి ఇడుములు తీరేందుకు 'వాసి తీరవే ...' అంటూ తిరుజ్ఞానసంబంధస్వామి ప్రసాదించిన దేవారపదికంను నిర్విరామంగా పఠించి సత్ఫలితాలు పొందవచ్చు.
5. ఒక్కో తిరుప్పదికం చివరన తిరుచిట్రంబళం, తిరుచిట్రంబళం, తిరుచిట్రంబళం అంటూ ముమ్మార్లు కీర్తించడం శ్రేయోదాయకం.
6. భగవన్నామ కీర్తనల జనిత క్షేత్రాలు, మంగళాశాసనం ప్రాప్తిత వైష్ణవ క్షేత్రాలు (దివ్యక్షేత్రాలు), స్వయంభుమూర్తి ప్రాప్తిత స్థలాలు, గంగా, కావేరి వంటి పుణ్యనదీ తీరాలు, తులసిపీఠం, గోశాల, తిరుఅణ్ణామలై, అయ్యర్మలై, పళనిపర్వతం గిరి ప్రదక్షిణ మార్గాలు, పర్వత ప్రాంతాలలో ఈ పదికాలను భక్తితో పఠిస్తే ఎన్నోరెట్లుగా సత్ఫలితాలు కలుగుతాయి. అయితే అపరిమితంగా లభించే ఈ ఫలితాలను స్వార్థానికి ఉపయోగించకుండా తుఫాను, కరవు, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలాను కాపాడేందుకు, సామాజిక సంక్షేమం కోసం, సమైక్యత కోసం అర్పణ చేయడం శుభదాయకం.
7. తమిళం, సంస్కృతం భాషలు భగవంతుడి ద్వినేత్రాలు అని సిద్ధపురుషులు చెబుతుంటారు. హోమం, యజ్ఞం, యాగాదుల సందర్భంలో దేవభాష (సంస్కృతం)లో ఉన్న మంత్రాలనే పఠించిన తర్వాతే ఆహూతిని సమర్పిస్తున్నాం. అయితే ఆ దేవభాష తెలియనివారు ఈ 32 పదిక్కములలో ఉన్న పాటలను పఠించి హోమం, యజ్ఞయాగాదులను నిర్వహించవచ్చు. సాధారణంగా తిరునావుక్కరసర్ స్వాములు ప్రసాదించిన తిరుతాండక పదిక్కములను హోమాల నిర్వహణకు పఠించడం లాభదాయకం.
9. మునుపటి జన్మలోని కర్మల ఫలితంగా మానవజన్మ లభిస్తోంది. నెరవేరని ఆశలు కర్మలు మానవజన్మ దారితీస్తుంది. సవ్యమైన ఆశలన్నింటినీ నెరవేరుస్తూ వస్తే ఏనాడైనా జన్మరాహిత్యం గురుకటాక్షం వల్ల ప్రాప్తించే అవకాశం ఉంటుంది. న్యాయమైన సుఖసంతోషాలు ఈ జన్మలోనో, వచ్చే జన్మలోనో మనం పొందటానికి దోహదపడేవే ఈ 32 తిరుపదకములు. ఆహారం, వస్త్రం, నివాసస్థలం, వాహనం, సంపద, భోగం అంటూ మానవుడు అనుభవించే సుఖాలు 32 రకాలుగా ఉంటాయి. ఈ 32 రకాల సుఖాలను ఓ మానవుడు పొందాలంటే అతడు ఈ 32 రకాల సత్కార్యాలను చేయాల్సి ఉంటుంది. అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం, జంతువులకు ఆహారం సమకూర్చడం, అనాథపిల్లల సంరక్షణ, ఉచిత వివాహాలు, వృద్ధుల సంరక్షణ అంటూ 32 రకాల సత్కార్యాలను చేసినవారికే 32 రకాల సుఖభోగాలు అనుభవించేందుకు అనువైన జన్మలు లభిస్తాయి. ఈ 32 రకాల సుఖాలను ఓ మానవుడు అనుభవించిన తర్వాతే ఆశలు లేని జన్మరాహిత్యమనే స్థితిని చేరుకోగలడు. ఆశలులేని స్థితికి చేరుకున్నవాడే మానవుడే తన మనస్సును సంపూర్ణంగా లగ్నం చేసి దైవారాధన చేసి దైవానుగ్రహం పొందగలుగుతాడు. అణువంతయిన ఆశ మిగిలివుంటే ఆ మానవుడు మరో జన్మను ఎత్తడానికి కారణమైపోతుంది. అంతేకాకుండా ఈ జన్మలో మరిన్ని కర్మలు చేసి జన్మల సంఖ్య పెంచుకుంటాడు. ఇక్కడ మీకందిస్తున్న 32 పదికములను నిర్విరామంగా పఠిస్తే 32 సత్కార్యాలను నిర్వహించడానికి సద్గురువు కృపాకటాక్షములు మెండుగా లభిస్తాయి.
9. దర్భలతో రూపొందించిన చాప, కంబళి వీటిపైన ఆశీనులై తిరుమురై పది కములను పఠించడం శ్రేయస్కరం.
10. తిరుమురైగల్ను గానం చేసేటప్పుడు అందరూ చేతులను పట్టుకుని వలయాకారంలో ఆశీనులై ప్రార్థిస్తే అందరూ ఏకాగ్రచిత్తులై భగవంతుడిపైనే వారి మనస్సులు లగ్నమవుతాయి. ధ్యానం సులువుగా సిద్ధిస్తుంది.
11. దేవభాషలో ఉన్న రుక్, యజుర్, సామ, అధర్వణ వేదాలనే నాలుగు వేదాలు పఠించడం వల్ల కలిగే ఫలితాలన్నీ ఈ 32 తిరుమురై కీర్తనలను పఠించడం వల్ల ప్రాప్తిస్తాయి. దేవభాష తెలియనివారికి కూడా వేదాలను పఠించడం వల్ల కలిగే ఫలితాలను ఈ తిరుమురై కీర్తనలను పఠించడం వల్ల లభిస్తాయి. ఉదాహరణకు 'మందిరమావదు నీరు' (మంత్రమవుతుంది విభూతి) అని ప్రారంభమయ్యే ఒక పదికము పాటలే నాలుగు వేదాల బీజాక్షర శక్తులను కలిగి, చతుర్వేదాల సత్ఫలితం లభిస్తుందనుకుంటే అన్ని పదికములను పఠిస్తే లభించే సత్ఫలితాలను గురించి మనం వర్ణించగలమా చెప్పండి.
11. చెవిపోగు, దీక్ష, రుద్రాక్షం, యజ్ఞోపవీతం, స్థిర కంకణ, వైభవ కంకణం వంటి సంరక్షణ సాధనాలు ధరించి తిరుమురైగల్ను పాడితే ఫలితాలు రెట్టింపులవుతాయి.
మరైయుడైయాయ్ | |
తోడుడయ చెవియన్ | |
పిత్తా పిరై చూడి | |
మందిరమావతు నీరు | |
తుంచలుం తుంచల్ | |
కాదలాగి కసింతు | |
సొట్రుణై వేదియన్ | |
మట్రు పట్రు | |
ఆరూర్ తిల్లై | |
తిల్లయ్ చిట్రంబలం | |
కాట్టూర్ కడలే | |
వరియ మరయార్ | |
వడివేరు తిరిశూలం | |
పొడియుడయ్ మార్బినర్ | |
అరవణయాన్ | |
పందుసేర్ విరలాల్ | |
వేచ్రాగి విణ్ణాగి | |
వేయురు తోలి పంగన్ | |
కులంపలం పావరు | |
తిల్లయ్ వాళ్ అందనర్ | |
వాసి తీరవే | |
వళైంతదు విల్లు | |
వట్టనయ్ మతిచూడియై | |
పట్టియేరు | |
ఇడరినుం తలరినుం | |
చున్నవెన్ చంతన | |
మాసిల్ వీణయుం | |
నింరు మలర్ తూవి | |
శూలపాణియై | |
చెప్ప నెంచే | |
ఆలందాన్ ఉగందు | |
మీలా అడిమై | |
కండుకొల్ అరియానై |
ఓం గురువే శరణం